అద్భుత శాంతి ( amazing peace)

కవి పరిచయం

 

మాయ ఏంజెలో అమెరికా లోని అర్కంసన్ లోని స్టంప్స్ లో జన్మించింది ఆమె కవయిత్రి ,రచయిత్రి , టీచర్, డైరెక్టర్, performer.  ఇప్పుడు సాన ఫ్రాన్సిస్కో లో వుంది.  తన జీవిత చరిత్ర రాసుకుంది.  “I .know why the caged bird sings” వంటి అయిదు కవితా సంపుటాలు వెలువరించింది. .బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా పదవి ప్రమాణం చేసినపుడు ఆమెను ఆహ్వానించి కవితా సందేసం నిప్పించాడు.  అప్పుడామె  on the pulse of the morning కవిత రాసి జాతికి సందేసమిచ్చ్చింది ఆమె ప్రపంచ శాంతి కోసం రాస్తుంది అన్ని మతాల వాళ్ళు ఆమె కవిత్వాన్ని చదివి ఆనందిస్తారు సకల మానవాళికి ఆమె కవిత్వం ఆదర్శం.  అద్భుత శాంతి అనే ఆమె కవిత మీ కోసం  :

 

 

మనం ఆనందంగా  వున్నా వేళ  –ఒక చిన్న గుస గుస విని పిస్తుంది

మొదట్లో అది చాల మెల్లగా నేమ్మదిగావుంది –తర్వాత సగం వినిపిస్తుంది.

దాని బలం పెరిగిన కొలడి ఇంకా జాగ్రత్తగా వినాలని పిస్తుంది

అందులో  అద్భుతం మాధుర్యం విన్పిస్తుంది –శాంతి అనే మాట చేరితే

ఇప్పుడది బిగ్గరగా విన్పిస్తుంది –బాంబుల విస్ఫోటనం కంటే పెద్దది గ అనిపిస్తుంది

 

 

ఆ శబ్దానికి కంపించి పోతం –దాని సాక్షాత్కారానికి నిస్చేస్తుల మవుతం

అదే మనం ఇన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూసేది –దానికే అర్రులు చాస్తున్నాం

యుద్ధం కనుమరుగావటం మాత్రమె  చాలదు –సంపూర్ణ శాంతి కావాలి

ఆధ్యాత్మిక సమభావం రావాలి –మన్నన మర్యాద కలిసిన సౌఖ్యం కావాలి

మన భవిష్యత్తరాలకు –వారి ఆత్మీయులకు సంపూర్ణ రక్షణ కావాలి

 

ఇది క్రిస్మస్ వేళ –పగ ప్రతీకారం స్వస్తి పలికే సమయం

ఈ శాంతి వేదిక పైన –మనం కొట్టగా ఒక భాషనే సృష్టించాలి

మనం మనకోసమే కాకా –ఒకరికొకరి కోసం మార్పు చెందాలి

ఈ పవిత్ర సమయం లో –పావన  జీసెస్ జన్మ దిన వేడుకల్లో

శాంతి వాగ్దానోత్శావవేడుకలను –అప్యాయం గ ఆనందం గ జరుపు కొనే వేళ

భూమి పైన వున్నా సకల జాతులు –వాటి సహజ భాషలను గొంతులను వదులు కోవాలి.

 

ఆంగ్లమూలము :  Maya angelo

తెలుగు అనువాదం : గబ్బిట దుర్గా ప్రసాద్

అనువదించిన తేది : 11-04-2008

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.