శ్రీ అరవిందులు

శ్రీ అరవిందులు
అరవిందం ఆంటే పద్మం .భారతీయ సాహిత్యం లో అర్విన్దానికి ఒక ప్రత్యేకత వుంది .అది వికసనానికి చిహ్నం .మనసు పరిపక్వ మైతే హృదయపద్మం వికసించింది అంటాం .వికసించటం వల్ల దానిలోని  తేజస్సు ప్రపంచానికి తెలుస్తుంది .వికసిత పద్మం చూడటానికి ఎంతో ఆకర్షనీయం గా వుంటుంది .అందులోనుండి కమ్మని వాసనలు వెలువడతాయి అవి ఘ్రాణ ఇంద్రియాలక్ను మత్తెక్కిస్తాయి .మకరందం వుంటుంది పద్మం లో దానికోసం తుమ్మెదలు చేరతాయి ఆంటే ఒకరకమయిన ఆకర్షణ  శక్తి అందులో ఉందన్న మాట.ఆ ఆకర్షణకు సంమొహితులమవుతం   మకరంద సదృశ ఆనందమే సచ్చ్చిదానందం .దాని ప్రభావం మానవ మానసాన్ని తన వైపు కు లాగేస్తుంది .అంతటి ప్రభావం పద్మానికి వుంది .మనసనే పద్మం మొగ్గగా వుంటే క్రిందికి తిరిగి వుంటుంది ఆ.అది వికసించితే వూర్ధ్వ ముఖం అవుతుంది .మనసు చీకటి నుంచి వెలుగు లోకి ప్రస్థానం చేస్తోంది ఇదే ఏ జీవి అయినా కోరుకునేది
కళ్ళను పద్మానికున్న. రేకులతో పోలుస్తారు .అందులోని రేకులు అనేకం విజ్ఞానం కూడా సహస్రదల పద్మం ల వికసించాలి .అప్పుడే దాని ఉనికి ,వ్యాప్తి తెలుస్తుంది .శ్రీ లక్ష్మి ,సరస్వతులు పద్మాసనం లో వుంటారు .జేవితం లో ప్రేయసులు పద్మపరాగం లాగా వ్యాపిస్తాయి ప్రేయస్సు నుంచి శ్రేయస్సుకు మానవ ప్రయాణం .సృష్టి చేసే బ్రహ్మ కూడా పద్మ సంభావుడే .నారాయణ స్వరూపుడైన పరమాత్మా నభిలో పద్మం వుంది అందుకే పద్మానికి అంత పవ్త్రత ,ప్రాధాన్యం .ఆంటే కాదు పద్మాన్ని ఆవరించి వుండే ఆకులు ఇవేవి తనకు పట్టనట్లు ,ఈ విషయ వాంఛ లేవి తనకు సోకనట్లు దేనినీ అంటూ కోడు .తామరాకుపై నీటిబొట్టు అందుకే అంత స్వచ్చ్చం గా ముత్యం ల ప్రకాశిస్తుంది .తామరతూడు లోని రంధ్రాలు నవనడుల్ల అనిపిస్తాయి .అందుకే ఈ జీవితం మనం జీవిస్తున్న ,మనకు ఏ వాసన లేకుండా లేకుండా జీవించాలని పద్మం మనకిస్తున్న సందేఅసం .తాను బురదలో వున్న పైకి పెరిగి దానితో సంబంధం లేకుండా వూర్ధ్వ ముఖం గా ప్రయాణిస్తుంది పద్మం మనం కూడా అలా వుండాలని అలా స్పందించాలని పద్మ సందేశం అదే అరవింద సందేశం .
—                 తెలిసి పెట్టారో ,తెలియక పెట్టారో కానీ శ్రీ అరవిన్డులకు తలిదండ్రులు అరవింద నామం చక్కగా కుదిరింది .అంతకు పూర్వం చరిత్రలో ఎవరికి అరవింద నామం వున్నట్లు కనిపించదు .అరవిన్డానికి ఇప్పటి దాక మనం చెప్పు కున్న లక్షణాలు వున్న మనీషి అరవిందులు మాటలో విందులు భావనలో విందులు నడకలో నడతలో అన్నీ విన్దులే ఆనందపు చిందులే .అందుకే మహర్షి ,యోగి అయారు .తాను వికసించి తన వికసనాన్ని ప్రకృతికి పులకింత గా చేసారు .ప్రకృతి లోని జీవ చైతన్యాన్ని తన వైపుకు ఆకర్షించారు .తన భావ వ్యాప్తికి చిహ్నం గా నీటి పై తేలే పద్మాన్నే ఎంచుకున్నారు .అంతటి అవినాభావ సంబంధం ఏర్పడింది అరవిన్దునికి ,అరవిన్దానికి .తత్వ బోధ చేసారు తాను తరించి లోకాన్ని తరింప జేస్తున్నారు
ఇప్పుడు శ్రీ అరవిందుల భావనా మకరందాన్నిగ్రోలుదం సచ్చ్చిదానంద మైన ఒక తత్త్వం విజ్ఞానం గా మనస్సు గా ప్రాణం గా జడం గా అవతరించింది మళ్లి ఆ జడం నుంచి ప్రాణానికి ప్రాణం నంచి మనస్సుకు ఆరోహించి అక్కడే ఆగిపోయింది .అదే ఇప్పుడు మనకు కనిపించే ప్రపంచం ఆ  మనోమయ లోకం నుంచి విజ్ఞానం గా వికసించ టానికి ఆ తత్త్వం నిరంతరం గా పని చేస్తోంది .ఈ విజ్ఞానన్నే అరవిందులు supermind  అన్నారు అరవిందుల ఈ దర్సనం వల్ల బ్రహ్మకు ,బ్రహ్మాండానికి ప్రయోజనం కలుగుతుంది .
అరవిన్డ్ని భావనలో జడం కూడా సత్యమే.అది ఏక కాలం లో నానాత్వాన్ని ,నానాత్వం లో ఏకత్వాన్ని ఏక కాలం లో చూస్తుంది .ఆంటే ఈ ప్రపంచం లో ఈసవరున్ని ఏకకాల అవిచ్చ్చేదం గా చూస్తుందని అర్ధం .దీనికి యోగ ఉత్పత్తి క్రమం లో వివరణ వుంది చిత్ ,జీవులు వేరు కానట్లే జీవ ,చిత్ లు వేరు కావు .జీవుడు ,చిత్తం వేరు కానట్లే దేహ కర్మలకు వేరు అవటం వుండదు .జీవుడే ఈశ్వరుడు .చిట్ అనేది ఆత్మయే .ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే శివుడే .
భగవద్గీత జ్ఞానాన్ని అలవారుచుకోమని చెప్తుంది .జ్ఞానం ద్వారా బ్రహ్మత్వం పొందచ్చ్చు .అయితె అది అందరికి సాధ్యమా ?ఆ స్థితి వచ్చ్చే దాక కర్మలు చేస్తుండు అనిచేప్పేవారు ,భక్తీ యోగమే గొప్పదని చెప్పే వారు వున్నారు .ఈ విషయం లో శ్రీ అరవిందుల భావన ఇలా వుంది .జగత్తు అపర ప్రకృతి చేసింది కాదు అది ఒక జడ యంత్రం.దేనికి పునాది పర ప్రకృతి అదే సచ్చ్చిదనందమయిన చిచ్చ్చక్తి ..కానుక జగత్తు జడం కాదు ఆనంద మయమే .ఆనందం చేతనే సృష్టి జరుగు తుంది ఆనందం నుంచి ఆనందం లోకి దీని నడక .అపర ప్రకృతి మనలోని భగవంతున్ని ఆవరించి వుంటుంది .ఈ అపర ప్రకృతి పొరను తొలగించు కొని పర ప్రకృతిలో ఆనంద మయ జీవితాన్ని పొందటమే మానవుని లక్ష్యం .ఆంటే జీవ ,పరప్రక్రుతులు ఒక్కటే .గీత ప్రకారం పర ప్రకృతి జీవాభుతమే జీవాత్మ కాదు .అరవిందుని ఆలోచనా ప్రకారం పర ప్రకృతియే జీవులందరి స్వభావం .ఇది అనంత మైంది ,అదే ఈ జగతికి మూలం .అదే జగన్మాత .లేక ఆద్యాసక్తి .అంతే కాదు పర ప్రకృతి పురుషుడు ఒక్కటే .అతని అంశ కూడా .””మమైవంసః”  .జగత్తంత అతని లోని అంశమే జీవులంతా భగవంతుని బహు రూపాలే .జీవుడు తన లోని మూల సత్ చత దేవుడు ప్రకృతి చేత భగవంతుని పర ప్రకృతిలో అంశం .
ఇలా ఉన్నప్పటికీ మానవుడు ఇంక తనకంటే తక్కువ అయినా ప్రకృతి స్థితి లోనే వున్నాడు .కనుక ప్రతి మానవుడు తనస్వరుపాన్ని వికసింప జేసుకుని తన భగవత్ ధర్మాన్ని divinelife
ను ఆంటే భాగవత ప్రకృతిని పొందాలి ఈ ప్రపంచం లోనే దివ్య జన్మను పొంది దివ్యమైన పనులు చేసి అపరిపుర్ణతను దాటి ఈ విస్వలీలలో అనంతమైన ఆనందాన్ని పొందాలని అరవింద హర్దయం .సుఖ దుఖలనే ద్వంద్వాలను దాటి అన్న ,ప్రాణ ,మన,కొసలకు వికాసం కలిగించుకొని పరప్రక్రుతి నుంచి జీవ లాభం పొందాలి .ఈసా వాస్య వుపనిసట్ లో ”అవిద్యాయ మృత్యుం తీర్త్వా విద్యాయ అమృత మస్నుటే ”అని చెప్పా బడింది .
చివరగా ఈ ప్రపంచం ఏర్పడటానికి theory   అఫ్ ఛాన్స్ రెండు theory అఫ్  mechanical  necessity  కారణాలు అని చెప్తారు .కానీ వీటికి మించి ఈ విశ్వం వెనుక అనంతమయిన అచేతనం nescience  వుంది .శాస్తవేత్తలు కూడా జడం ఇక జడం కాదు అదీ చేతనా స్వరూపమే అంటున్నారు ”all phenomina  behaves  under  similarly under similar circumstances అనేది జడత్వానికి పునాది ఇవాళ అది మారి పోయింది జడం సుప్తమయిన చైతన్యమే ”అని ఒప్పుకున్నారు దీనినే ”conceiled  ”consciousness ” అన్నారు .ఆంటే పదార్ధం జడం గా కనిపించినా అందులో చైతన్యం సుప్తం గా వుంటుంది .ఆంటే ఇప్పుడు జడం చేతనా ఒక్కటే అన్నది నిర్ధారిత మయింది .ఈ విషయాన్నీ మన మహర్షులు ఏ నాదో మనసుతో కను గోన్నారు కానుక శాస్త్రీయ దృక్పధాన్ని ఆలోచనా పరిధి దాటి వేరొక మార్గం లో ఆంటే ఆత్మ శక్తి తో ఈ విషయాలు నిరూపించా టానికి ఎక్కువగా వీలుందని తెలుస్తోంది .సాస్తాజ్ఞుల హద్దులు ,గీతలు ఇంక పనికి రావు

మీ దుర్గాప్రసాద్

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.