ఆరుద్ర సినీ ముద్ర
ఆరుద్ర అని పిలవబడే భాగవతుల శంకర శాస్త్రి దాదాపు 500 సినిమా లకు 5000 పైగా పాటలు రాసాడు ఇంకెవరు అధిగమించ లేని లక్ష్యం గా చేసాడు .డబ్బింగ్ సినిమా లకు శ్రీశ్రీ praanapratista చేస్తే ఆరుద్ర జవం ,జీవం కల్పించ్చి పుస్టినిచ్చాడు ఆన్ అనే హిందీ చిత్రాన్ని ప్రేమలేఖలు గా డబ్ చేసి అందులో ”పందిట్లో పెల్లవుతున్నది కను విందౌ తున్నది”అనేపాట రాసి ఆ రోజుల్లో ప్రతి పెళ్లి పందిట్లో ఆ పాట ను పెట్టు కొనే టట్లు popularise చేసాడు .ట్యూన్ బట్టి అద్భుతం గా పాట రాసే వాడు బావ మరదళ్ళు లో”నీలిమేఘాలలో గాలి కెరటాలలో”పాట mla సినిమా లో ”నీ ఆస అది యాస లంబాడోళ్ళ రామ దాసా ”గుండెల్లో గునపాలు గుచ్చ్చారే నీ వాళ్ళు ”అని రాసి అందర్నీ ఏడ్పించాడు గుండెల్లో గునపం అప్పటికి కొత్త మాట .అత్తా ఒక ఇంటి కోడలే లో ”జోడు గుళ్ల పిస్తోలు ఠానేనూ ఆడి తప్పని వాణ్ణి జీహ ”బావామరదళ్ళు లోనే ”ఇండియాకు రాజధాని దిల్లి నా గుండెల్లో ప్రేమరాణి లిల్లి”ఆంధ్ర కేసరి లో ”వేదం ల ప్రవహించే గోదావరి అమర ధామం ల భాసించే రాజ మహేన్ద్రి ”అనగల సంస్కారం వున్న వాడు .చెంచులక్ష్మి ,బాలభారతం ,సంపూర్ణ రామాయణం లాంటి పౌరనికాలలోను అద్భుత మయిన పాటలు రాసి ఏ పాట అయిన హిట్ చేసాడు పెంకి పెళ్ళాం లో ”పడుచు దనం రైలు బండి పోతున్నది వయసు వారి కందులో చోటున్నది ”అని కుర్ర కారుకు హుషా రెక్కించాడు .అందాల రాముడు లో ”ఎదగ danikenduku ర తొందర ఎదర బతుకంతా చిందర వందర ”అన్న జీవిత సత్యాన్ని ఆవిష్కరించాడు ఈ పాటలన్నీ ”కొండ గాలి తిరిగింది”అనే పేరుతొ సంకలనం గా వచ్చ్చాయి .పూర్వం పౌరాణికాలలో సంస్కృతం లో పాటలు పాడించే వాళ్ళు చెంచు లక్ష్మి లో ”కరుణాల వాల ఇది నీదు లీల ”అని కొత్త తరహ పాట రాసి కధ విధానక్న్ని అందులో పోదిగాడు ఈ రక మయిన పాటలకు బోణీ చేసాడు .ఇంద్రుణ్ణి ”పర స్త్రీ లను లోబరచుకొనే పశువు ”అన గల చేవ గలవాడు ఆరుద్ర .విష్ణువుకు లక్ష్మి దేవికి అతి సుందర మయిన పాట ను యుగళ గీతం గా రాసి ఔచిత్యాన్ని సంస్కారాన్ని చాటాడు ఇల్లరికం సినిమా లో హాస్యపు జల్లు అంతా ఆరుద్ర చిలక రించిందే .వీరకంకణం సినిమా లో దేసాడ్రోహి అయిన జగ్గయ్యను అతని భార్య జమున చేత చంపించి దేశ భక్తిని పెంపొందించాడు ఇందులో ప్రతి మాట పాట అణిముత్యమే ”.ఖుషి ఖుషీ” నవ్వించే మంత్రగాడు ఈ గడ్డాల బాబాయి .”ధనమేర అనితికి మూలం”,జోరుగా హుషారుగా అ’ న్న ”టాటా వీడికోలు ””హైలెస హైలెస అన్న ””రాయి నయినా కాక పోతిని ఆ”అన్నా ఆరుద్రే అనగలాడు న్న
ప్రాసకు ,అంత్యప్రాసకు అన్న ప్రాసన చేయటమే కాదు శాద్రసోపేతమయిన సహితీ భోజనం అందించిన పాటల వంట మేస్త్రి ఆరుద్ర .అనుపమ త్రయం లో ఆరుద్ర ,పెండ్యాల కే .బి తిలక్ అందించినవి ఆణిముత్యాలు .నిజంగానే ఉపమానం లేని అనుపమానమయినవి .ఆరుద్ర రమణ బాపు మామ మహదేవన్ లు సుప్రసిద్ధ సినీ ఇష్ట చతుష్టయం .చాల గొప్ప చిత్రాలు తీసి ప్రేక్షకులకు ఆరాధ్యు లాయరు .”ఆ ర బా మా ”అంతే బాగుంటుందని పించింది ఈ టి వి వారు తీసిన భాగవతం సీరియల్ లో సుందరకాండ పై చివరి పాట రాసారట
పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ,కళా ప్రపూర్ణ బిరుదు పొందారు ఆరుద్ర రాజ మండ్రి సంస్కృతీ సంప్రదాయాలకు పులకించి పోయేవాడు అందుకే ఆయన 70 వ జన్మ దినాన్ని రాజమండ్రి లోని సాహితీ సంఘాలన్నీ కలిసి 15 రోజుల పాటు ఘనం గా నిర్వహంచి ఆ సాహితీ విరాన్ముర్తికి ఋణం తీర్చుకుంది ఆంధ్ర దేశం అయిన ఆరుద్రకు ఇవ్వాల్సినంత గౌరవం ,స్థాయి ఇవ్వలేదన్నది కా danarani సత్యం
ఆరుద్ర భావాలు
”ఎప్పటికయినా మానవ పదికుడు చేరుకునే విశ్రాంత మందిరం కవిత ”.కల నిజ పరచటం కాదు kavitvam నిజాన్ని కలగనటమే దాని తత్త్వం ””మంచిరచన చదివాకా బా ga భోంచేసి నట్లుండాలి కొంచెం బాధ పడాలి మనసుకు జ్వరం రావాలి ఒళ్ళు తిరగాలి ఈ బాధ లోంచి తేరుకొని బాగు a పడాలి ””నీవు యెక్క దలచుకున్న రైలు ఆ జీవిత కాలం latu ”కవి ta iకోసంపుట్టాను కాంతి కోసం కలం పట్టాను ””జీవితం radio సెట్టుకు భర్త ఏరియల్ భార్య ఎర్తు.”మన స్వతంత్రం మేడి పండు మన చరిత్ర రాచ పుండు ”రాసిందేమో రాసాము తీసికొనుము తోచినంత తీపో చేదో ””తరానికో వంద కవులు తయారవుతరెప్పుడు వంద లోను మంద లోను మిగిలేది ఒక్కడే ”ఆఖరికి నరుడు వాక్యమై నిండును ఆమెన్ ”అని మనిషి చిరంజీవి అంటాడుమృత్యువు చిరంజీవి మానవుడు ఒక్కరే అదే త్వమేవాహం ”
గబ్బిట దుర్గా ప్రసాద్
దుర్గా ప్రసాద్ గారికి
ఆరుద్ర గారిపై మీ వ్యాసం ” ఆరుద్ర సినీముద్ర” చదివాను నా దృష్టికి వచ్చిన కొన్నిటిని మీముందుకు తీసుకొస్తున్నాను.
అన్యధా భావించరని తలుస్తాను.
“ఇండియాకు రాజధాని డిల్లీ నా గుండెల్లో ప్రేమ రాణి లిల్లీ “పాట “బావా మరదళ్ళు” లోనిది కాదు. “అక్కా చెల్లెళ్ళు” లో వుందా పాట.
ఇక “చెంచులక్ష్మి” లో ఇంద్రుడి గురించి ఆరుద్ర రాసిన వాక్యాలు ఇలా వుంటాయి.
” పరసతులను పీడించే అంధుడూ
అతడా సురలోకము పాలించే ఇంద్రుడూ
పదవి మీద ఆశ చేత ప్రభువాయెను పశువూ
పాపము తననేమి చేసె కడుపులోని శిశువూ ”
“వీరకంకణం” సినిమాలో దేశద్రోహి అయిన జగయ్యని అతని భార్య జమున చేత చంపించడంలో అరుద్ర ప్రమేయం ఏమీ లేదు. ఆ చిత్రం తమిళ చిత్రం “మంత్రి కుమారి” ఆధారంగా యధాతధంగా రూపొందించబడింది. పాటల సంగీతమూ, సాహిత్యమూ “మంత్రికుమారి” సినిమాలోని పాటల ఆధారంగా రూపొందినవే.
అరుద్ర ని ఖుషీ ఖుషీ మంత్రగాడు అంటూ ఖుషీ ఖుషీ ని కోట్స్ లో పెట్టారు. “ఖుషీ ఖుషీగా నవ్వుతూ” పాట ఆరుద్ర రాశారన్న అభిప్రాయంతో ఆ కోట్స్ పెడితే అది తప్పు. ఆ పాటని రాసింది దాశరథి.
చివరగా … కొన్ని పాటలను వుదహరిస్తూ జోరుగా హుషారుగా అని ఆరుద్రే అనగలడు అన్నారు. ఆ పాటని రాసింది ఆరుద్ర కాదు. శ్రీ శ్రీ .
వ్యాసం మాత్రం చాలా హృద్యంగా వుంది. ఆరుద్ర గారిపై మీకున్న ఆరాధ్య భావం,గౌరవం వ్యాసం అంతా తొణికిసలాడుతూ కనిపించింది. చాలా బావుంది.
రాజా (మ్యూజికాలజిస్ట్)
raja.musicologist@gmail.com