ఆలోచనా లోచనం దేవుడి సొత్తు తింటే విపత్తే

—                                                         ఆలోచనా లోచనం
దేవుడి సొత్తు తింటే విపత్తే

దేవుని ఇల్లునే దేవాలయం అంటాం దేవాలయాలు సమాజం అనే ఆత్మకు స్థానం .జన జీవన విధానానికి కేంద్ర బిందువు .సంస్కృతీ వైభవానికి ప్రతీక .కళలకు పుట్టినిల్లు .దేవాలయం విశ్వ విద్యాలయ భావనతో పవిత్రం గా చూడాలి .న్యాయానికి ధర్మానికి ఆలయాలు ఆటపట్టు .అందుకే రాజులూ ,దాతలు తమ ధనాన్ని ఆలయ నిర్మాణానికి అధికం గా వెచ్చించారు .వాటి నిర్వహణకు భూములు దానం చేసారు వాటిని నిర్వహించే వారు కూడా అంతా పవిత్రం గా భావించి పని చేయాలి .దేవుడు చూడదు కదా అని ఆలయ ధనాన్నిస్వార్ధం  స్వ్ర్ధం కోసం వాడుకున్నవారు పాప ఫలం అనుభ విన్చాల్సిందే .దైవ ద్రోహం చాల పెద్ద నేరం .అలాంటి ఒక దేవాలయం లో కాపలా వుద్యోగం చేస్తూ ఆలయం సొమ్మునే అపహరించిన వాడు కుక్కగా పుట్టిన కధ ఉత్తర రామాయణం లో వుంది ఆ కుక్క పేరు భిక్షు తాడిత .ఇక కధలోకి వెళ్దాం
అవి శ్రీరాముడు రావణ వధ తర్వాత అయోధ్యలో పట్టాభి షిక్తుడై జనరంజకం గా పాలిస్తున్న రోజులు .ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారు .రామరాజ్యం అని ప్రజలంతా ఆనందాన్ని అనుభ విస్తున్న రోజులవి .రాముడు కొలువై వున్నప్పుడు ప్రజలేవరైనా ఏవైనా ఇబ్బందులు పడుతుంటే వచ్చి చెప్పు కోవటానికి వీలు కల్పించాడు .బయట ద్వారం వద్ద తమ్ముడు లక్ష్మణున్ని కాపలా గా ఉంచాడు .ఫిర్యాది వస్తే ముందుగ వివరం తెలుసు కొని రాముని వద్దకు పంపటం అతని కర్తవ్యమ్ .ఒక రోజున ఒక బిచ్చగాడు తనకు దారిలోఆ  డ్డం గా వచ్చిందని ఒక కుక్కను విపరీతం గా కొట్టాడు .దాని తల పగిలి రక్తం కారి పోతోంది తనకు న్యాయం చేయ గల వాడు రాజైన రామచంద్రుడోక్కడే నని భావించి కొలువు వాకిట చేరి నిలబడింది .దాని దీనావస్థ చూసినా లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్లి ”గాయంతో రక్తం కారుతూ న్న శునకం మీ దర్సనానికి వచ్చింది దాని బాధ ఏమిటో తెలుసుకని న్యాయం చేయ మని దాని ఉద్దేశ్యం ల వుంది ”అని విన్న వించాడు .రాముడు క్షణం కూడా ఆలస్యం చేయ కుండా కుక్కను రాజాస్థానం లోకి ప్రవేశ పెట్టించ మన్నాడు .రక్తం కారుతూ వున్న కుక్కకు మర్యాద ,మన్నన తెలుసు అందు వల్ల ”నాయనా లక్ష్మణా రాజులూ ,మునులు ,సజ్జనులు వుండే సభా ప్రాంగణానికి నా బోటి క్షుద్ర జంతువులూ ప్రవేశించటం తగని పని .భూత దయ గల రాజా రాముడు నన్ను రమ్మన్నా నేనూ రావటం అభిలషణీయం కాదు ”అంది మర్యాదగా .లక్ష్మణుడు వెంటనే ఈ విషయం రాముడికి చెప్పాడు .ప్రజా రంజకుడు ,ధర్మ పక్ష పాతి అయిన రాముడు వెంటనే తనే బయటకు వచ్చాడు ”ఎవరు నువ్వు ?:ఎందుకు వచ్చావు ?వంటినిండా రక్తం ఏమిటి ఎవరైనా నిన్ను కొట్టార?కొట్టిన వాడెవడో చెప్పు ”అని అడిగాడు దానికి ఆ శునకం అక్కడే వున్న భిక్ష గాన్ని చూపి అతడే తనను అనవసరం గా కొట్టాడని విన్నవించింది భిక్ష గాన్ని పిలిపించి ”ఎందుకు కుక్కను కొట్టావు ?”అని అడిగాడు /దానికి వాడు ”మహా రాజ నేనూ భిక్షాటన చేసి పోట్టపోసుకున్తున్నాను నేనూ తెచ్చుకున్న దాన్ని ఈ పాడు కుక్క దారి కి అడ్డం
గా నిలబడి నన్ను భయ పెట్టి నా ద్రవ్యాన్ని అపహరిస్తోంది నాకు కోపం వచ్చి కొట్టాను నేనూ తప్పు చేస్తే నన్ను దండించండి ”అని మనవి చేసాడు
శ్రీరామునికి గొప్పచిక్కే  e వచ్చింది ఎవరిని ఎలా దండిఇంచాలోతేలి  యటం లేదు దీర్ఘం గా ఆలోచిస్తున్నాడున్యాయబద్ధం గా తీర్పు ఇవ్వటానికి .ఇంతలో ఆ sunakame కల్పించు కొని ”ధర్మ ప్రభువులు మీకు తెలియని న్యాయం లేదు .ఇలాంటి వాడికి తగిన శిక్ష ఒకటి వుంది చెప్తాను వినండి .కాలన్జనం అనే కొండ వుంది దానిమీద ఒక దేవాలయం వుంది దాన్ని పాలించటానికి నన్ను కొట్టిన ఈ భిక్షువును పంపండి .అంతకు మించిన శిక్ష లేదు ”అని అతి వినయం గా ధర్మసూక్ష్మం గా చెప్పింది .రాముడికి ఆశ్చర్యం కల్గింది .తప్పు చేసిన వాడికి దేవాలయాన్ని పాలించే అధికారిగా చేయటమా అని వితర్కిస్తున్నాడు .”ఇది తగిన శిక్షే అని నువ్వు నమ్ముతున్నావా ?”అని సందేహ నివృత్తి కోసం ఆ కుక్కనే అడిగాడు .అప్పుడా కుక్క ”రాజా నేను పూర్వ జన్మలో ఆ దేవాలయం కు కాపలా కాస్తూ దేవ బ్రాహ్మణులధనాన్నిన్ని అపహరించాను .అందుకే నాకు ఈ కుక్క జన్మ వచ్చింది ఇంతకంటే భిక్ష గాడికి గొప్ప శిక్ష ఏమి లేదు ప్రభూ ”అంది .రాజారాముడు నవ్వి అది చెప్పినట్లే భిక్ష గాడికి శిక్ష విధించాడు .కనుక దైవ ధనం అపహరిస్తే ,వాడుకుంటే ,మింగేస్తే ఎలాంటి జన్మ వస్తుందో భిక్షుతాడిత అనే కుక్క కధ వింటే తెలుస్తోంది కదా /కనుక ఆలయ పాలకులు ఈ ధర్మాన్ని గ్రహించి ఆలయ నిర్వహణలో జాగ్రత్తగా వుంటూ దైవధనాని పవిత్రం గా కాపాడాలి అప్పుడే ఆలయాలు నిజమయిన కోవెలలు అవుతాయి
ఆలోచనా లోచనం శీర్షికలో 29 -౩  -11 నా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయింది
గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

1 Response to ఆలోచనా లోచనం దేవుడి సొత్తు తింటే విపత్తే

  1. pullarao tamiri అంటున్నారు:

    chaalaa baagaa cheppaaru.. Dhanyavaadaalu…
    –tprao

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.