తెలివైన వోటరు
నేడు దేశం లో వోటరు మహా తెలివి గలాడు
ఎవరేమి చెప్పిన ఓపికగా వింటాడు
ఎవరి సభల కైనా లారీల్లో వెళ్తాడు
ఎవరేమిచ్చ్చిన గుట్టుగా పుచ్చుకుంటాడు
ఎవరికి వోతేసేది మాత్రం బ్రహ్మ రహస్యం గా వుంచుతాడు
బరిలో ఎన్ని వందల మందున్నా
కంగారు పడని ధీరోదాత్తుడు
నిశ్చయంగా మనసు లోనిది గుద్ది
మరీ బుద్ధి చెబుతాడు
హవాలకు దివాలకు సెజ్ లకు పలకదు వులకడు
కరెంటు లేకున్నా ఎరువు కరువైన మాట్లాడాడు
పవర్ కట్ చేయటం లో
మహా మాంత్రికుడు మాయగాడు వోటరు
గబ్బిట దుర్గా ప్రసాద్
Manchi ga unnadi… inka ituvanti vishayalu…….. kavali