పద్య విత్తనంలో దాగివున్న భావ వృక్షం

           పద్య  విత్తనంలో దాగివున్న భావ వృక్షం
             ”తన జనకుడగు స్థాణువు
              జనని అపర్నాఖ్య ,డా ,విసాఖున్దనగా
             దనరియు ,నభిమత ఫలముల
             జనులకు ,దయ నొసగు చుండు షణ్ముఖు గొలుతున్ ”
                          విత్తనంబున మర్రి వ్రుక్షమ్ము దాగదా  అన్నాడు జన కవి వేమన .అలాగే చిన్న కంద పద్యంఇది   నన్నే చోడ మహారాజ కవి రచించిన కుమార సంభవం కావ్యం లోని పద్యం ఇది .ఆయన కన్నడ దేశ సరిహద్దులో వున్న ఒరయురుకు అధిపతి అయిన రాజు .1160 ప్రాంతపు వాడు .ఆయనకు తెన్కనాదిత్యుడు ,వివేక బ్రహ్మ బిరుదులున్నాయి . సుర్యవంస రాజు .గురువు జంగమ మల్లికార్జునుడు .ఈ కావ్యాన్ని గురువుకే అంకితం చేసాడు .ఇష్ట దేవతాస్తుతి ,కుకవి నిందా ,shashtyantaalu ఆశ్వాసం చివర పద్యాలు ,గద్యాలు మొట్ట మొదటగా ప్రవేశ పెట్టిన కవి .వరేన్యుడు ప్రబంధ రచనకు ఇవి మార్గం చూపటం వల్ల ప్రబంధ రచనకు మార్గ దర్శిఅయాడు   .ఆయన్ను ట్రెండ్ సెట్టర్ అనవచ్చు .నవ రసాలు ,దశ కావ్య గుణాలు ,ashtaadasa  వర్ణనలు ఈ కావ్యం లో వున్నాయి కాళిదాస మహాకవి రాసిన కుమార సంభవం కావ్యం ,వుద్భాటుని కుమార సంభవం ఆధారంగా రాసిన కావ్యమే నన్నే చోడుని కుమార సంభవం ఇష్టదేవతా స్తుతిలో మన్మధుడిని స్తుతి చేసిన మొదటి కవి తర్వాత కేతన దశకుమార చరిత్రలో చేసాడు .చిత్రబంధ కవిత్వం ,మొదటి సారిగా ప్రవేశ పెట్టిన వాడు .గజ ,ధను ,సంగీత ,చిత్రకళల్లో గొప్ప జ్ఞాని .తెలుగులో నన్నే చోడుని కుమార సంభవమే మొదటి ప్రబంధం ఒకరకంగా ప్రబంధ పరమేశ్వరుడు..జాను తెనుగు కవిత్వానికి  ఆద్యుడు .మార్గ దేశి కవిత్వాలలో సవ్య సాచి .తిక్కన కవి పై నన్నే చోడుని ప్రభావం చాలా ఎక్కువ .పాల్కురికి సోమనాధుడు నాన్నే చోడుని అనుసరించాడు .చోదకవి రాజు కన్నడ ,తమిళ సాంప్రదాయాలను తెలుగు కవిత్వం లో ప్రవేశ పెట్టిన ఘనుడు .అన్నిటికి  ఆద్యుడు నన్నే కవి
                     ఇప్పుడు అసలు పద్యం లో ప్రవేశించి స్వారస్యాన్ని జుర్రుకున్దాము ..ఇది కుమార స్వామిని వర్ణించే పద్యం .ఆయన్ను స్కందుడు అనీ  అంటారు స్కంద కు వికృతి కంద .అందుకే కంద పద్యం లో స్కందున్ని వర్ణించి ఔచిత్య ప్రదర్సన చేసాడు .తండ్రి శివుడు స్థాణువు .ఆంటే మోడు వారిన చెట్టు అని కుడా అర్ధం .తల్లి పార్వతి అపర్ణ ఆంటే ఆకులు లేనిది .అయితె  కుమార స్వామి మాత్రం విశాఖుడు .
ఆంటే కొమ్మలు లేనివాడు .అయినా ఫలాలను ఇస్తాడట కుమార స్వామి .మ్రోడై ఆకులు ,శాఖలు లేని చెట్టు ఫలాలను ఇవ్వటం ఏమిటి ?అని మనకు అనుమానం కదా అదే కవి చమత్కారం .శబ్ద శ్లేష తో శివ పార్వతులకు ,కుమార స్వామికి వున్న సహజ మైన పేర్లతో చమత్కరించాడు .
               కొంచెం లోతుగా పరిశీలిద్దాం .స్థాణువు ఆంటే ప్రళయ కాలం లో కూడా చలించ కుండా నిలిచి వుండే వాడు ఆంటే కాలాతీతుడు,కాలమే తాను అయిన మహా శివుడు అని అర్ధం .అపర్ణ ఆంటే ఆకులు కుడా తినకుండా శివుని కోసం ఘోర తపస్సు చేసిన పార్వతి దేవి .విశాఖుడు ఆంటే విశాఖా నక్షత్రం లో పుట్టిన వాడు శన్ముఖుడైన కుమార స్వామి ..విశాఖ ఆంటే నెమలి వాహనం గల వాడు అనీ అర్ధం అనేక చేతులు ఆంటే పన్నెండు చేతులున్న వాడు అనీ ఇంకో అర్ధం ఇంకా లోతుగా విచారిస్తే వేద శాఖలు తెలిసిన వాడుఅని  విశేషార్ధం .ఇన్ని విశిష్ట లక్షణాలు వున్న కుమార స్వామినే స్ఖంధుడు అంటారు .పద్యాన్ని i కందం  లో చెప్పటం అందం గా వుంది ,అర్ధవంతం గాను ఔచిత్యం గాను వుంది .కవి కోరిక తీరింది అభీప్సిత ఫలము లభించింది అందుకే నన్నే చోడ కవి రాజుని ”కవిరాజ శిఖామణి ”అనారు నిజాం గా తగిన పేరు .స్కంధం క్యనేది ప్రాకృత కవిత్వపు ఛందస్సు లో వుంది దాని లోంచి వచ్చిందే తెలుగు కంద పద్యం .చెప్పే విషయము ,దాని చెప్పా తకనికి ఎంచు కున్న పద్యము ఒకటే అయితె ”ముద్ర”అలంకారం అంటారు .దీన్నీ మొదట ప్రవేశ పెట్టిన వాడు కుడా నన్నే చోడ కవి రాజే నంటే అమితాస్చర్యం గా వుంటుంది .ఈ కావ్యం ఇంకో గొప్ప తనం వుంది కుమారస్వామి పుట్టకకు ముందు ,ఆయన అన్నా గారైన వినాయక జననము రాసి అగ్రజునికి అగ్రతామ్బులం  ఇవ్వటం విశేషం సంస్కృతం లో కాళిదాసు కానీ ఉద్భటుడు కాని ఆ జోలికి పోలేదు . .చిన్న పద్యం లో ఎన్ని మనోహర భావాలు నిఖిప్తం చేసాడో మహాకవి అందుకే దీన్ని పద్య విత్తనం లో దాగిన భావ వృక్షం అన్నాను .ఇలాంటి హృద్య మైన పద్యాల్ని అప్పుడప్పుడు ఆస్వాదిద్దాం ఆ మహా కవులను స్మరించి ఋణం తీర్చుకుందాం
                                             గబ్బిట దుర్గా ప్రసాద్
                              ఎందరో మహాను భావులు చెప్పిన భావావిష్కరణమే దీనికి ఆధారం .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.