సాహిత్య సమోసాలు
01 -అపర విశ్వామిత్రుడు అని పేరు పొందిన శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి గారు కొద్దికాలం శ్రీ కల్లూరి వెంకట రామ శాస్త్రి గారి వద్ద చదువుకున్నారు .ఆ తర్వాత గురు సిష్యులిద్దరికి శాశ్తాస్టకం (పోట్లాట)అయింది .శిష్యుడైన శ్రీ పద మీద కల్లూరి వారు ”హాస్య కుముదాకరం ”అనే అన్యాపదేశ(satire )గ్రంధం రాసారు .అప్పటికి అదే పూర్తీ satire రచన
02 -యుద్ధమల్లుని బెజవాడ ససనం మొదట బయట పెట్టిన గ్రాంధిక భాషాభి మని జయంతి రామయ్య బరంపురం లో పెద్ద lawer ..శాసన ప్రతులను మాములు పుస్తకం చదివినంత తేలిగ్గా చదివేసే వారట .రామయ్య 1200 శాసనాలను పరిష్కరించి ప్రకటించారట.
03 -జయంతి రామయ్య ఆంధ్ర సారస్వత పరిషద్ అద్యక్షు లైనపుడు కవి కానీ రామయ్య అధ్యక్షులేమిటి అని అని కొందరు గునిసారట.అధ్యక్షా పదవి వెంటనే త్యజించి కవిత్వం నేర్చి ఉత్తర రామ చరిత్ర ,ఆంధ్ర చంపు రామాయణం ,అమరుకం మొదలైన కావ్య ,నాటకాలు రాసి శభాష్ రామయ్య అనిపించుకున్నారు .ఆయన ఇంటిపేరు లోనే” జయం ”వున్దిక్కద.చెళ్ళపిళ్ళ వారు తమ ”జయంతి ”గ్రంధాన్ని జయంతి వారికి అన్కితమివ్వటం కొసమెరుపు
04 -వ్యవహారిక బ్భాశోద్యమ శరధి గిడుగు రామ మూర్తి గారికి భాష ప్రయోగాలను అందజేసిన పండితుడు అరసవిల్లి (సూర్యదేవాలయం )నివాసి గోదా నరసయ్య గారు .నరసయ్య గారికి కావ్యాలన్నీ కంటస్తం .ఒకే రకమైన వర్ణనలను వివిధ గ్రంధాలలో నుంచి అలవోకగా అప్పజెప్పే సామర్ధ్యం ఉండేదట. టన్నులకొద్దీ భాష ప్రయోగాలూ వున్న కాగితాలను గిడుక్కి పంపితే ఆయన ఉపయోగించు కున్నట్లు గిడుగే చెప్పుకున్నారు .
05 – గిడుగు వారికి చెవుడు వచ్చింది దానికి కారణం సవర భాష కోసం మన్నెం అడవుల్లో విశ్రాంతి లేకుండా తిరుగుతూ మలేరియ రాకుండా క్వినైన్ ఎక్కువగా వాడటమే .
06 -కసిభాట్టు బ్రహ్మయ్య శాస్త్రి ”తిక్కన్క కవి తిక్కలు”అనే వ్యాసం రాసి సారస్వత సర్వస్వం(1924 )పత్రికలో ప్రచురించారట .
07 – బ్రహ్మయ్య శాస్త్రి చనిపోయినట్లు 1930 సెప్టెంబర్ లో ఒక పుకారు పుట్టింది పత్రికల్లో సంపాదకీయాలు వచ్చేసాయి సానుభూతి సభలు ,సంతాప తీర్మానాలు చేసేసారు .ఇదంతా తెలిసి శాస్త్రి గారే ”ఒరేయ్ ! నేను బతికే వున్నాన్ర బాబోయ్ ”అని పత్రిక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చిందట .అయితె తన కోసం లోకం యెంత పరితపించిదో కళ్లారా చెవులారా చూసి ,విన్న అదృష్టం మాత్రం దక్కింది పాపం ఆయనకు .
08 – శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు హరికధా పితమహులే కాక గొప్ప దేశ భక్తులు అన్న సంగతి చాల మందికి తెలియదు .కాంగ్రెస్ పుట్టిన మొదటి సంవత్స్చారం లోనే ”స్వరాజ్య మిచ్చిన గాని మనకూ పౌరుషజ్ఞానకీర్తులు కలుగ నేరవు -శిరస్సు లేని మొండెము నభ్యంగన (తలంటి)మొనర్చినట్లు స్వాతంత్ర్యము లేని దేశమున సోషల్ కాంఫెరెంసులేల”అని స్వాతంత్ర్ ఇచ్చను ప్రకటించిన జాతీయ కవి .
09 -మానవల్లి రామ కృష్ణ కవి తాను రాసి ప్రచురించు కున్న ”కుమార సంభవం ”ప్రతులను 06 మాత్రమే అమ్ముకోగాలిగారని ఆయనే వాపోతూ రాసుకున్నారు .
10 -శ్రీ చిలకమర్తి గారి గయోపాఖ్యానం నాటకం లక్ష ప్రతులకు పైగా అమ్ముడయాయి చిలక మార్టిని గురజాడ వారు ”హల్కీ కవి”అనే వ్రత అంతే తగినంత పాండిత్యం లేదు అని అర్ధమట .
సేకరణ
గబ్బిట దుర్గాప్రసాద్