కట్ కట్ కట్ (రాంగ్ నంబర్ ) రచన గబ్బిట దుర్గా ప్రసాద్ 18 -02 – 91
హలో హలో —–నేన్సార్ -సుబ్బా రావు ని -హలో -మీ పీ ఏ సుబ్బారావు ని సర్ .ఎప్పుడొచ్చారు సర్ ?సాయంత్రమేనా? రేపు కదండి మీ schedule arrival పని అయిపోయిందా .success యేనా సార్ తవరు ఎల్తే సక్సెస్ కాకేమున్దండీ /అలిసి పోయారా? ఎక్కడ సార్ .ఓహో గెస్ట్ హుసే లోనా ?ఇంటికి వెళ్ళారా ?రేప్పోద్దునా ?సరే లెండి .engagement సంగతా ?ఈ రాత్రికి ఏమీ లేదు సార్ .మీరు ముందే వచ్చారుగా .ఏంటి సార్ అంత విసుగ్గా వున్నారు ?ఓహో అర్ధమైంది .సర్లెండి మజా ఏర్పాటు నే చూస్తాగా ..హలో హలో హలో .
హలో- హలో -హలో అయ్యా గారేనా ?బతికాన్సార్ .మధ్య లో ఏదో రాంగ్ నంబరు తగలిడిన్దండీ .ఈ ఫోన్లు ఇంతే కదండీ .ఎవరితోనో మాట్లాడు తుంటే ఎవడి తీగో తెగు తుంది దేన్తోనో లాక్కెళ్ళి పోతుంది .దామిట్ సార్ .ఈ డిపార్టుమెంటు వాళ్లకు మరీ బద్ధకం సార్ .ఇంక విసిగించను అన్నీ . చుస్తాన్లెండి .అమృతం కురుస్తుంది లెండి సార్ .గట్టి పార్టీ ఇవాళే తగిలింది సార్ .రేపటికి బుక్ చేసాను .మీరివాళే వచ్చేసారుగా అంతా ఇవాళే క్లోజు .విత్తాని దేముంది సార్ తమ చిత్తం బాగుండాలి కాని .కంట్రాక్టర్ కనకయ్య పొద్దున్నే శునక వేషం వెస్త్ తోక సరి చేసాను .బాగానే ఝాడించాడు లెండి మొత్తం మీకు అప్పగిస్తాను .ఇప్పుదోడ్డంతారా ?అదేంటి సార్ .రేపా .సర్లెండి అసలు విషయం తమకు తెలియని దేముంది పోలీసు riding .ఎక్కు వైంది పిట్టలు దొరకటం లేదు సార్ .ఇదివరకట్లాగా లేదండి పొజిషన్ .ఎట్లాగంటారా? నేనున్నాను కద్సార్ .మీ ఆనందమే మా ఆనందం .definitely చిన్న adjastment సార్ .ఎవరో ఎందు కండీ .మన guest house watchman కూతురుంది ”సుందరి ”నిన్ననే వచ్చిందండీ .అబ్బో పేరుకు తగ్గాట్టె లెండి మొగుడు పోయాట్ట ఆమధ్యన .ఈ ముసలాంని చూట్టానికి వచ్చింది ఫర్లేదు సార్ .ఎమనుకున్ట్టున్దండీ .విధవకు వసంతం వస్తుంటే .కవిత్వం కాద్సార్ .మీ సాహ చర్యం .తొందర పడ కండి .నేను అంతా planned గా చేస్తానని మీకు తెలుసు కదా .ఆ –ఆ -అంతేనండి .రాత్రి తొమ్మిది గంటలకు మీరు రెడీ గా వుండండి .మా కార త్రయంతో ,ద్వంద్వాతీతంగా ,త్వమేవాహం .పైత్యం కాద్సార్ .ఈ మధ్య మా బామ్మర్ది కవిత్వం రాసి చదివి వినిపిస్తుంటే —.అయితె నేను అక్కడికి రాను లెండి .మా లేడీస్ కు ఒంట్లో బాలేదు .రేపు కలుస్తాన్ సార్ .—-అయితె పదింటి దాకా ఇక్కడే వుంటాను .ఆఫీసు వర్క్ మిగిలి పోయింది అవసరం వస్తే మళ్ళీ ఫోన్ చెయ్యండి సార్ .వుంటాన్సార్
హలో -హలో -హలో ఎవరు? watchman ?భీమయ్య? వినపట్టం లేదు .గట్టిగా చెప్పు .అయ్య గారు చచ్చి పడున్నారా?యెట్లా ? తెలీదూ ?నువ్వు డ్యూటీ లో లేవా /ఏమిటీ మా కాంతాన్ని హాస్పిటల్ కు తీసికేల్లావా /నాకు చెప్ప లేదేం .అర్జంటా ?అదేంటి వణుకుతున్నావు ?నాకూ వణుకు వస్తోంది .ఏమిటి విషయం ?అరె .చెప్పు .పర్లేదు .ఈ సంగతి చెప్ప టానికి మా చెల్లి సుందరి గెస్ట్ హుసే కు వెళ్ళిందా /?తోమ్మిదిన్టికా ?ఏమైంది హలో -హలో- హలో-మళ్ళీ రాంగ్ నంబర్ ? ఇదే గొడవ హలో -హలో- హలో అయ్య గారు చూసారా ?ఆ .ఆ హలో హలో హలో అంతా అయి పోయిందా ?చెల్లి ఎక్కడ ?అయ్య గార్ని చంపి తానూ పొడుచుకుని చని పోయిందా ?అయ్యో అయ్యో అయ్యయ్యో .హాస్పటల్ లో కాంతం కూడానా ? హలో -హలో- హలో- కట్ -కట్ -కట్ .