కరుణశ్రీ కి కవితాంజలి

కరుణశ్రీ కి కవితాంజలి 
 01 -వాగను శాసనుండైన నన్నయ కవితా కలితార్ధ యుక్తి లో నారసి
       తిక్క యజ్వ సజీవ పద ప్రయోగ గరువ తనంబు దాల్చి
      శ్రీ నాద కవి సార్వ భౌము సీసాల  (సి-saw )ల్క ఉయ్యాల లూగి
      సహజ పాండితీ విభావుండు బమ్మెర పోతన మందార మకరంద మాధుర్యమును గ్రోలి
     దాక్షిణాత్య కవి బృందారకుల తెనుంగు పలుకు బడుల పెట్టు బడుల గూడి
    తెలుఉగు తల్లికి అక్షర నీరాజనాల నందించి నీవు
    ధన్యత నోన్దినావు పాపాయ శాస్త్రి సత్కవీ
02 – భాగవతంబు రచియించిన పట్టున పోతన పంచదార లో నద్దె ఘంటంబంచు పల్కితివి
       మరి నీకీ అమ్రుతోపమా మధుర భక్తీ రసప్రవాహములేచాటి నుండి లభించేనో
       నీ ఊట కలమ్ము లో ద్రాక్షా పానకా ఖండ శర్కరాల రసప్రవాహంమే కలదో
       నీ పెరటి లోన తేనెల సోన లున్నవో -కలకండ కొండ లున్నవో
       ఇక్షు రాశా ధారలున్నవో -కపురంపు గానులున్నవో
       అమృతంపు ఝారులున్నవో
      ధవళ స్వత్చ్చ గంగా సీకరంములే కలవో ఆశ్చర్య మయ్యెడిన్
 03 – జాతీయ భావ లహరీ శీతల గంధ వాహముల భారత భారతిని సేద దీర్చి
        రస నిష్యంద మహోన్నత స్ఫూర్తి నిండార ఎద యెదలో రాష్ట్ర ,భాషాభిమానమ్ము కల్గించి
        చిర యశస్కు లైనట్టి ”మైధిలీ శరనుండు ”,”సుమిత్ర నందనుడు” ”దినకరుల”
        చెంత నీ వున్న తాశనమ్ము పాపాయ కవి చంద్రా -సాంద్ర కీర్తీశ్వరా
04 – అస్తావదాన శతావధాన ఘాతంములచే -చేవ జచ్చి గుద్ది పద్యాల పూలు పూయుచు
        త్రపా తప్త ఆంద్ర మాగాణమును ,నీ కమనీయ కవితా మకరంద వృష్టి తనియించి
        నూత్న భావనా ప్రవాహంముల గూర్చి ,కరుణా రస వృష్టి   తోడ
       పూయించి నావు పరిమళ మెసగ ”నవ చంపకోత్పలంముల్”
05 -నీ పదలాలిత్యము ,శౌకుమార్యము ,శైలీ విన్యాసమ్ము
       సందర్భోచిత పద ప్రయోగ దక్షతయు ,నీ పద్యాలకున్
      లావణ్య శ్రీ కద మేలి ముసుంగు లో తొంగి చూచెడి
     ఎలా రాచ కన్నెలు కదా నీ పద్య కన్యామనుల్
06 -”ఉదయశ్రీ”కి అంజలి ఘటించి ”సాంధ్యశ్రీ ”సొగసుల కేతాములెత్తి
       ”కరుణశ్రీ ”శాక్య ముని చంద్రుని పావనోదార చారితమ్ము
        కరుణ చిప్పిల శాంత్యహిమ్సలకు పట్టమ్ము గట్టి
       ”క్రిప్సు రాయబారమునకు ”యేవగించి  ,జాతీయ భావ గరిమ తోడ
       ” నవ భారత స్వాతంత్రోదయశ్రీ ”ప్రభాత కాంతుల చూడ నువ్విల్లురా
        రచియించి నావు ”విజయశ్రీ” సంక్రాన్తికిన్ ,సందేశ ప్రభా వంతమై
        సార్ధకత చెందే నీ నామము ”కరుణశ్రీ ”ధన్యు రాలు గద నీ ”మాతృశ్రీ ”
07 -తెరచి యున్చితివి నీ హృదయ కుటీరమ్ము తలుపు లు అలసిపోయిన దేవాది దేవునకు
      సర్వ సమతా సుమ కోమల ,మానవాన్తరంగంముల ప్రేమ సూత్రమ్ము గట్టి నావు
      కరుణామయి రాధ మానసమ్ములో ప్రఫుల్ల మురళీ రావాలీ రమణీయ భావనలు నిల్పినావు
 బ్రహ్మాన్దమేల్ల అద్భుత మఖండ మవ్యక్త ప్రేమ మయ మని ఎరింగి
   కవితా కాళిందిలో నవ్య జీవన బృందావన మందు అద్విత ప్రణయ సుందరి
   కోమల బాహు బంధముల కోటి స్వర్గాలు రుచి చూచి నావు
08 -నిద్రనామ్మగు జాతికిన్ నవ నవొంమేశంము చేకూర్చి
      నిర్నిద్ర స్ఫూర్తి స్వతంత్ర భారత పునర్నిమానా శక్తి తో
      జెండా జాతికి జీవ గర్ర ,సమతా చిహ్నంమంచు
      అమ్మ పరాయి పంచ బడి అశ్రువు లూడ్చు చుండ -బిడ్డ చిత్తమ్మడి ఆరవ గలదాయంచు
     అర్జునునకు నవ భారత శందేశంము విన్పించి నావు
 09 –  అభిరామాక్రుతులైన నీక్రుతులు నవ్యత్వాభి రామంములై
         ప్రభుతంగాన్నవి యావదాంధ్ర హ్రుత్పద్మమ్ములన్
         భాను సన్నిభ యుష్మత్కావితారున ప్రభలు నిండెన్ గేహ గేహాల
        మా అభి వాదమ్ములు బాష్ప శ్రీ లం గైకొమ్ము
        పాపాయ కవీంద్రా -కరుణ యోగీశ్వరా .
                                                                      రచన
                                                                  గబ్బిట దుర్గా ప్రసాద్
                                                 05 -o7 -92  న కరుణశ్రీ కి శ్రద్ధాంజలి ఘ్హటించిన సందర్భం లో రాసిన పద్యాల్లాంటి వచనాలు .ఇందులో ఛందస్సుండదు .యతి ప్రాసలకు పాకు లాడే పని అసలే లేదని మనవి .ఆయన మాటలతోనే ఆయన కీర్తి తోరణం కట్టాను అంతే

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.