” ఎర్ర పొద్దు ”గుంకిందా?

                                       ”  ఎర్ర పొద్దు ”గుంకిందా?
         మే నెల పదమూడవ తేదీన  అయిదు రాష్ట్రాల ఎన్నిక ల ఫలితాలు చూడగానే  మనసు   ముప్ఫై అయిదు ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .అప్పుడు బెంగాల్ లో జరిగిన ఒక సంఘటన కళ్ళల్లో మెదిలింది .అజయ్ కుమార్ ముఖేర్జీ అనేపెద్దమనిషి నిష్కల్మషుడు ,త్యాగి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి గా వున్నాడు .అప్పుడు జ్యోతి బాసు మంత్రీ ,ఉప ముఖ్య మంత్రీ అని జ్ఞాపకం .బసు బాస్ లాగా పెత్తనం చెలాయించి ఆ పెద్దాయనను ఇబ్బంది పెట్టేవాడు .పాపం ఆ పెద్దమనిషి నోరు వాయి లేనివాడు .తన ప్రభుత్వం లో తన మాటకే విలువ లేక పోవటం తో కలకత్తా లో లో నిరాహార్క్ష చేసాడని జ్ఞాపకం .ఒక ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయటం అదే మొదలు .తర్వాత రాజకీయ సమీకరనాలేవో మారి బాసు ముఖ్య మంత్రి అయాడు .అప్పటినించి పాతికేళ్ళు పాలించాడు .తర్వాత బుద్ధదేవ్ పీఠం ఎక్కాడు మూడో సారి చతికిల పడ్డాడు   ఘోరం గా వామ సేన దెబ్బ తింది
                   ఇంకో సారి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్తున్నా.మా చిన్నప్పుడు ఆంటే 1950-౬౦ ప్రాంతం లో ఆంధ్ర రాష్ట్రం లో కమ్మూనిస్ట్ సభలు ఆంటే వెలిగి పోయేవి యెర్ర జండాలు పట్టుకొని  అభిమానులు రణదివే జిందా బాద్ అనీ ,జ్యోతి బస్ జిందాబాద్ అనీ .గోపాలనన్ జిందాబాద్ అనీ డాంగే జిందాబాద్ అనీ పుచ్చలపల్లి సుందరయ్య జిందాబాద్ ,అంటూ ,మాకినేనిబసవ పున్నయ్య జిందాబాద్ అంటూ చంద్ర రాజేశ్వర రావు జిందా బాద్ అంటూ పరవశం తో వీధుల్లో నడుస్తుంటే వాల్లెవరో తెలియక పోయినా ఆ రాధనా  భావానికి ఆశ్చర్యం కలిగేది .రెండెడ్ల బళ్ళు కట్టుకొని వేలాది జనం  కమ్యునిస్ట్ ల సభలకు  స్వ చ్చందం గా వచ్చే వారు .చద్ది బువ్వ మూట కట్టుకొని  రావటం గుర్తుంది .వుయ్యూరు లోసెంటర్ లోనో  వీరమ్మ గుడి దగ్గరో హిఘ్స్చూల్ గ్రౌండ్ లోనో సభలు జరిగేవి సభల్లో నాయకుల ప్రసంగాలకు ముందు నాజర్ బుర్రకధ ప్రజా నాట్య మండలి నాట కాలు జనాన్ని చైతన్యం చేసేవి .వుయ్యోరు నియోజక వర్గం లో కాకాని వెంకట రత్నం గారికి పోటీగా కమ్మూనిస్ట్ అభ్యర్ధి ద్రోణ వల్లి అనసూయ గారిని నిల బెట్టెవారు .ఆమె ఓడిపోయేది జి  వరలక్ష్మి అనే సినీ నటి ఉర్రూత లూగించే   పాటలతో మాటలతో సభా రంజనం చేసేది .ఒక పాట నాకు బాగా జ్ఞాపకం ”ముగురన్న దమ్ములు ,మోస గాళ్ళు ,దామ్బికు లు ”.కాడి ఎద్దులు ఎకరంనెల  ఇస్తామని కంమునిస్తులు వాగ్దానం చేసే వారు .తెల్ల వారే దాకా సభలు జరిగేవి డబ్బు తీసుకొని రావటం అప్పుడు అసలు లేదు ఇప్పుడు ఎవడు  చేతిలో డబ్బు పెద్తే జనం కదులున్ తున్నారు .అంత తేడా వచ్చింది పార్టీ ఆంటే ప్రేమ నాయకులంటే  ఆరాధన వోట్ ఆంటే  పవిత్రం అనుకునే  రోజులవి   .
                 వీటికి దీటుగా కాంగ్రెస్ పార్టీ సభలు వుయ్యూరు కాలేజీ గ్రౌండ్స్ లో జరిగేవి .దీన్నే ”చామలి ” అనే వాళ్ళం ఎత్తైన వేదిక నిర్మించే వారు .చుట్టుపక్కల అన్ని గ్రామాలనుంచి జనం రెండెడ్ల బళ్ళు కట్టుకొని భోజనాలతో సహా ఆడ మగా పిల్ల జెల్ల అంత వచ్చేవారు కాంగ్రెస్ జండాలతో ఊరంతా మూడు రంగులతో మారు మోగేది యెర్ర రంగు కంటే మూడు రంగులు సామాన్య జనాన్ని ఆకర్షించేవి ..మహా నాయకులు దేభార్ ,టాండన్ ఎస్.కే పాటిల్ ,    అతుల్యఘోష్ ,కృపలానీ సంజీవరెడ్డి బ్రహ్మయ్య ,కాకాని వంటి యోధాన యోధులు వచ్చే వారు ఎన్నికల ప్రచారానికి .అదొక తిరనాళ్లు గా జరిగేవి డబ్బు ప్రభావం లేదు అభిమానమే ధనం గా వున్న రోజులవి .తర్వాతంతా కాలం మారి పోచ్చి  .బెజవాడలో నెహ్రు మీటింగ్ ఆంటే లక్షలాది మంది వచ్చే వార్టూ ,ఎర్రగా కందిన ముఖం తో స్టేజి ఎక్కుతుంటే జనం పరవశించేవాళ్ళు ఉపన్యాసాన్ని ఆసాంతం వినేవారు .ప్రభావితులయ్యే వారు .ఆ నాయకుల త్యాగ గుణం సేవా భావం ప్రజా సంక్షేమం పై వారి శ్రద్ధ అటువంటివి .అందుకే ప్రజలకు వాళ్ళు ప్రత్యక్ష  దేవుళ్ళు అయారు .ఇప్పుడు అంతా సీన్  రేవేర్సు అయింది
               ముప్ఫై నాలుగేళ్ల యెర్ర సూర్యుడు బెంగాల్లో కనుమరుగైపోయాడు .ప్రజా వ్యతిరేకత ప్రజాభిప్రాయాని కనిపెట్ట లేని నాయకత్వం ,స్ఫూర్తి నివ్వ గలిగే అది నాయ కత్వం ,దిశా నిర్దేశనం చేయ లేని ప్రతిభా సున్యత వామచారుల్ని ముంచేసింది ఆషా జ్యోతి జ్యోతి బస్ మరణం తో  సున్యం ఏర్పడింది ఆయన మరణానంతరం కొద్ది కాలం ఆ కాంతి తో కొట్టుకోచ్చారు .అదీ చీకటి అయింది అధినాయకత్వం అచేతనమయింది చేపకు జబ్బు తలనుంచి మొదలవు తుందట .అట్లాగే కంమీలకు శీర్షం నుంచి పతనం  ప్రారంభం   అయింది ఇంకా దాని జబ్బు కుదర్చటం కష్టం .నిర్వీర్యత అటు ప్రభుత్వం లో పార్టీ లో నిలువెల్లా చేరింది . పార్లమెంట్ ఎన్నికలలో ,మునిసిపల్ ,పంచాయితీ ఎన్నికలలో జనం ఝలక్ ఇచ్చినా గుర్తించనిగుద్ది  నాయ కత్వం .ఎప్పుడు కమ్మీలు సరి అయిన నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు .భారత్ కు స్వతంత్రం అక్కర్లేదని న్చేప్పి తర్వాత లెంపలు వేసుకున్నారు గాంధీజిని వ్యతిరేకించి మళ్ళీ చెంపలు వాయిన్చుకున్నారు ఇందిరా yamarjency   ని సమర్ధించి ఇంకోసారి చెంపలు పగల కొట్టుకున్నారు ;మన్మోహన్ ని సమర్ధించి , అనవోప్పందపై మద్దతు ఉపసంహరించి తప్పుపై తప్పు చేసి ఏమి చెప్పాలో తెలియక తిక మక పడ్డారు నానో కార్ ఫ్యాక్టరీ విషయం లో ప్రజాభీష్టానికి వ్యతిరేకం గా ప్రవర్తించి చేతులు కాల్చుకున్నారు .ఫ్యాక్టరీ పోయింది ,పరువుపోయింది భస్మాసుర హస్తం వాళ్ళే పెట్టు కుంటే ఎవ్వరేం చేయగలరు ఇంతకూ మించి దేశాన్ని పరిపాలించే అరుదైన అదృష్టం జ్యోతి బాసు బుకు లభిస్త్న్తే యెర్ర కోట పై యెర్ర జెండా ఎగరేసే  అవకాసం వస్తే కదని వద్దని ఆయనకు లాకేత్వం దాకు కొమ్ము ఇచ్చిన అన్గుస్త మాత్రులు   అధినాయకులై చేతులారా అదృష్టాన్ని కాల దన్ను కుంటే ఎవరేమి చేస్తారు చారిత్రత్మక తప్పిదాలతో తమ చరిత్రనే మట్టి పాలు చేసుకున్నారు స్వంత పార్టీ ని కాడర్ను వదిలి ఇందిర పంచెనో సోనియా చెంతనో ,రామా రావు ,బాబు ల దగ్గర చేరితే వోట్ బాంక్  తగ్గి పోతుంటే ఎవరుకాపాడు తారు పార్టీ ని ?స్పీకర్ గా పనిచేసిన తమ పార్టీ పెద్దయన్నే అగౌరవిస్తే ఆ [పార్టీ మీద జనానికి నమ్మకం ఎలా మిగుల్తుంది? మమత యెంత పకడ్బందీగా వ్యూహ రచన చేస్తూ కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ కాదర్ ను ఉత్తేజితం చేస్తూ  ప్రతి ఎన్నికలోనూ ఎంతో కొంత ఆధిక్యం సాధిస్తూ ప్రజల్లో మమేకమై తిరుగుతూ అనుకున్నది సాధించింది యెర్ర కోట బద్ద లైంది .కాదు కాదు బద్దలు కొట్టుకున్నారు ,,కాదు కానే కాదు బద్దలు కొట్టారు నాయక మాత్రులు చరిస్మా లేని నాయకత్వం చేష్టలుడిగి క్రాస్ రోడ్స్ లో నిలబడి వుంది పాపం శాంతం .
                          ఇక కేరళ సంగతి .అత్య్తనందన్ వ్యక్తిత్వం కల నాయకుడు .ఆదిస్థానం వద్దన్నా నిలబడి మొదటి సారి అధికారం లోకి తెస్తే వెనక నించి గోతులు తవ్వతాన్ని సర్వ నాశనం చేయటానికే పనీ చేసింది పార్టీ కాని ఆయనకు ఏ కోశానా మద్దతు ఇవ్వలేదు .ఈ సారి టికెట్ ఇవ్వక పొతే ప్రజా మద్దతు తో సంపాదించి పార్టీని అధికారానికి తెచ్చే విశ్వ ప్రయత్నం చేసస్డు కొద్దిలో తప్పింది కాని లేకుంటే మళ్లి గద్దె నెక్కే వాడే వెన్నుపోtu పొడవటం నేర్చుకున్న పార్టీ వెన్నెముక గా నిలిస్తే పరువు దక్కి వుండేది వీళ్ళకు వ్యక్తిత్వాలు అక్కర్లేదు అనుసరించి ఉండటమే కావాకి తప్పు చేస్తే చెబితే సహించే గుణం లేదు ఇంకా పార్టీ బట్ట కట్టేది ఎలా?ఎంతకాలం ఎవర్నో ఒకర్ని అంతకాగి అధికారం సంపాదిస్తారు? అత్య్న్తానందన్ కుపోలిట్ బురో లో స  భ్యత్వం ఇవ్వరా?వీళ్ళ కంటే దేనిలో తీసిపోయాడు ఆయన ?స్వంత గొయ్యి తవ్వుకునే వారిని కూర్చున్న కొమ్మను నరుక్కునే వారిని ఎవరు కాపాడుతారు ? అందుకే పొడిచిన ఎర్రపొద్దు గుంకిపోతోండా   అనిపిస్తోంది .తప్పులు సవరించు కొని మళ్లి ప్రగతి మార్గం పట్టి ,ప్రజా సమస్యలను సీజన్లో కో సారి కాకుండా చేబట్టి ప్రజల విస్వాశాన్ని పొంది ప్రజల ఆశయాలకు అవలంబానం గా నిలవాలని వామ భావీయుల్ని కోరుతున్నాను ముందుగా అధినాయకత్వం మార్పుతో సంస్కరణ జరగాలి లేక పొతే ప్రయోజనం లేదు
                 తమిళనాడులో గుడ్డీ  కళ్ళు తెరిచేసరికి అంతా అయి పోయింది ఇదివరకు సన్ స్త్రోకే నే చూసాం ఇప్పుడు daughter స్త్రోకే ను చూసాం మండుటెండల్లో .పుత్ర పుత్రికా ప్రేమ హద్దు మీరి తే ఇలాగె జరుగుతుంది .టు .జి లు త్రీ జి లు కరుణ కొంప ముంచాయి .మేనల్లుడు /నిర్వాకం రాజాలు స్వంత లక్క ఇల్లునే కాల్చుకున్నారు .కేంద్రాన్ని సాశించి పనిచేసుకోవతంతెలిసిన పెద్దమనిషికి స్వంత ఇల్లు తగల పడటం కనిపించలేదు వాగ్దానాలకు వోట్ల వర్షం ఎప్పుడు కురవదు దానికీ ఒక సీజన్లో ఉంటుందని ముసలాయన మరచిపోయాడు పాపం .ఇది జయకు  వరం అయింది పదేళ్ళ నిరీక్షణ ఫలించింది  కోర్టుల చుట్టూ  తిరగటం తగ్గి జనాల కుచేరువయి ఫాలితం  సాధించింది అయితె ప్రతీకార ఇచ్చతో రగిలి పోవద్దని అందరి సూచనను పాటిస్తుందని భావిద్దాం .కంచి స్వామినిని పరాభావించాలని చేసిన ప్రయత్నం boomerang అయి  అధికారానికి దశాబ్దం దూరం చేసింది .ఏదో ఒక ఫ్రంట్ లో చేరి స్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని అవినీతి రహిత ప్రభుత్వం రావటానికి ఆమె కృషి చేయాలి .జయ పై జనానికి చాలా ఆసలున్నాయి నెరవేరుస్తుందని ఆశిద్దాం .
                        అస్సాం లో పాతపాటే పాడారు ఓటర్లు .పాండీ చేరి లోరంగ స్వామ్యం వచ్చింది .ఆంటే అయిదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలుకూలి  కొత్తవి వచ్చాయి ఇది శుభ సూచకం .వోటరు ఎప్పుడు నాడి గమనిస్తూనే ఉంటాడని నాయకులు మరవరాదు.మనరాస్త్రంలోని ఉప ఎన్నికలలో గెలవాల్సిన వారే గెల్చారు
                ఎన్నికలే ప్రాధాన్యం కాదు ప్రజల బాగోగులు ముఖ్యం డబ్బుతో అన్ని ఎన్నికల లోను గెలుపు రాదనీ గ్రహించాలి .దీర్ఘ కాలం పెండింగ్ లో వున్న సమస్యల్ని పరిష్క రించి ప్రజా విశ్వాసాన్ని ప్రభుత్వాలు పొందాలి ప్రజాసేవే పరమావధి అవాలి ప్రజా స్వామ్యం అఖండం గా వర్ధిల్లాలి .
                                                               గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in కవితలు, రాజకీయం. Bookmark the permalink.

2 Responses to ” ఎర్ర పొద్దు ”గుంకిందా?

  1. chavakiran అంటున్నారు:

    కొంచెం అచ్చు తప్పులు చూడగలరు, చదవటం కష్టంగా ఉంది.

  2. శివరామప్రసాద్ కప్పగంతు అంటున్నారు:

    గురువు గారూ, నమస్తే.

    మీరు వ్రాసే విషయాలు ఆసక్తి కరంగా ఉన్నప్పటికీ, వ్రాతలలో ముద్రా రాక్షసం (అచ్చు తప్పులు) బాగా ఎక్కువగా ఉంటున్నాయి. మీరు తెలుగులో వ్రాయటానికి ఏ ఉపకరణం వాడుతున్నారో తెలియదు. లేఖిని వాడితే తప్పులు రావు. వ్రాసినది మరొకసారి చూసుకుని ఆపైన ప్రచురిస్తే ఈ తప్పులు పడకుండా చూడవచ్చు. కొన్ని కొన్ని పేర్లు అచ్చు తప్పుల వల్ల ఎవరో తెలియటం లేదు. దయచేసి గమనించి మున్ముందు వ్యాసాలలో తగిన జాగ్రత్త తీసుకోగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.