గంగా పుష్కరం
పుష్కర పురుషుడు అనే దేవత ఒక్కొక్క నదిలో ప్రవేశించినపుడు ఆ నదికి పుష్కరం వచ్చింది అంటారు .ఈ సంవత్చరం మే నెల ఎనిమిదవ తేదీన గురుడు ఆంటే బృహస్పతి మేష రాసి లో ప్రావేస్సిమచటం వల్ల గంగా నదికి పుష్కరాలు వచ్చాయి 19– వ తేదీవరకు ఆంటే పన్నెండు రోజులు గంగకు పుష్కర శోభ అన్న మాట .పుష్కర సమయం లో నదీ స్నానం సర్వ పాప హారం అని మన విశ్వాసం .అందులో పరమ పావని అయిన్క గంగా నది పుష్కరాలంటే ఒళ్ళంతా పులకరింతే .గంగా నది పుట్టిన గంగోత్రి నుండి సముద్రం లో కలిసే ఏ ప్రదేశం లో స్నానం చేసినా పుణ్యమే .అయితె కాశి .ప్రయాగ ,హరిద్వార్ ,ఋషీకేశ్ లలో గంగా స్నానం చేసి ముక్తి పొందాలని అందరు భావిస్తారు .పుష్కరుడు సంవత్చారంకాలం గంగా నదిలో ఉంటాడు .సంవత్చరం లో ఎప్పుడు చేసినా పుణ్యమే అయితె మొదటి పన్నెండు రోజులకు వున్న ప్రాధాన్యత మిగిలిన రోజుల్లో ఉండదని అనుకుంటారు . .ఈ సంవత్చర కాలం చివర పన్నెండు రోజులను అంత్య పుష్కరాలు అంటారు అవీ పవిత్ర మైనవే .మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవత లందరూ పుష్కర స్నానం చేయటానికి గంగా నదికి వస్తారట ఆ సమయం లో స్నానం చేస్తే ముక్తే ముక్తి అని మన వారి విశ్వాసం .
గంగా ను త్రిపద గామిని అంటారు ఆంటే స్వర్గ ,మర్త్య పాతాల లోకాలలో ప్రవహించేది .భగీరధుని ప్రయత్నం వల్ల ఆకాశం నుండి శివుని తలమీదకు అక్కడనుండి హిమాలయ పర్వతం మీదకు తర్వాత భూమి మీఅకు చేరి చివరకు పాతాల లోకం చేరింది .హిమాలయ పర్వతాల మీద గంగా మాత ఎన్ని వయ్యారాలు పోయిందో చూస్తే ముచ్చట వేస్తుంది .హిమాలయ సానువులలో పర్వతాలను ఒరుసుకొని ఒద్దనం లాగా మెరుస్తూ ,దుముకుతూ పోతుంది కొన్ని చోట్ల పిల్ల కాలవ లా కొన్ని చోట్ల ఉత్తుంగ తరంగాలతో మరికొన్ని చోట్ల భీకర గర్జనల తో సుళ్ళు తిరుగుతూ ప్ప్రవహిస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది .అవన్నీ దేవ భూములు అక్కడ పవిత్రత ప్రతి అంగుళం లోను కనిపిస్తుంది .కేదార్నాద్ దగ్గర మందాకినీ గా బదరీనాథ్ దగ్గర అలకనంద గా దేవ ప్రయాగ రుద్రా ప్రయాగాలలో సంగమ గంగగా వివిధ రూపాల్లో దర్సన మిస్తుంది ఎక్కడ గంగను చూసినా చేటు లెత్తి నమస్కరించా బుద్ధి కల్గుతుంది ఆ నది జీవనది ,మన నాగరకతకు సాక్షి .ఎన్నెన్నో క్షేత్రాలు అనడీమ తల్లి ఒడ్డున ఏర్పడి భక్తులను ఆకర్షిస్తూ దేశ అఖందతకు సాక్షి గా నిలిచింది .జీవన గంగా గా నీరాజనాలన్డుకోంది .రుశీ కేష్ దాక గంగా ప్రవాహ గమనం అంతా హిమాలయ పర్వతాల మీదనే .అందుకే అంత స్వచ్చత నిర్మలత కన్పిస్తుందిఋషులు తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేసాలెన్నో వున్నాయి . ఇక్కడి గాలిపీల్చి గంగా జలం తాగి అన్నం తినకుండా రోజులయినా ఉండాలనిపిస్తుంది అన్దోకే యోగులో మహర్షులు మునులు తపస్సుకు రుశీ కేష్ ను ఎన్నుకుంటారు అంత పవిత్రత ఆ గా ప్రదేశం లో వున్నాయి ఋషీకేశ్ లో గంగా స్నానం చేస్తే శరీరంలోకి తమాషా గా విద్యుత్తూ ప్రవహిన్చినట్లు వుంటుంది .కొత్త శక్తి వస్తుంది కలసత దూరమవుతుంది ఆ ఎత్తైన పర్వతాలు నిర్మల గంగా నదీ ప్రవాహం మానసిక ప్రసంతినిస్తాయి . అలాగే కేదార్నాథ్ దగ్గర మందాకినీ లో స్నానం చేయటం ఆంటే ఒళ్ళు జిన్తుంది గడ్డ కట్టే చలి .కాని తమాషా అక్కడ వుష్ణకుండం కూడా వుంది వెచ్చటి నీరు ఆ గుండం లో నిరంతరం వస్తుంటుంది దానిలో స్నానం చేస్తే కేదార్ నాధ్కు పోనీల మీద కాని నడిచి కాని 14 కిలోమీటర్లు గౌరికుండు నుంచి వెళ్ళిన కాళ్ళ నెప్పులు కీళ్ళ నెప్పులు మటుమాయం అవుతాయి దేవుడు నిజం గా ఉన్నదన్న నమ్మకం గాదం అవుతుంది కేదారేశ్వర దర్సనం మొక్క్షప్రడమే సందేహం లేదు గౌరి కుండ్ దగ్గర ఆకాశం అంత ఎత్తులో హిమాలయాలు వాటిపైనుంచి దేకే మందాకినీ నది ని చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తుంది పెద్దన కవి మను చరిత్రలో వర్ణించిన “”అటజని కంచె భూమిసురుడంబర చుంబి సిరస్సరజ్ఝారీ పతలధభంగా తరంగా మృదంగ నిస్స్వస్ఫుట ”అన్న పద్యం గుర్తుకొచ్చి ఇంత గొప్పగా అచ్చంగా ఇలా ఎలా చూడకుండా చెప్పాడా? అనిపిస్తుకవులు మనోనేత్రం తో దర్శిస్తారు
బదరీ దర్సనం శుభ ప్రదం ముక్తికరం అక్కడి అలకనందా నది లో స్నానం ఆంటే మంచుగడ్డలు మీద వేసుక్వటమే .ఇక్కడ వున్న వేడి నీతి కుందాం లో స్నానం పరమ అద్భుతం .నారా నారాయణ క్షేత్రం బదరి ..ఇక్కడ బ్రహ్మ కపాలం లో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తరిస్తారు .అంతా మన పధ్ధతి లోనే చేయటం ప్రత్యేకత .దిగి వస్తుంటే జ్యోతి మత వస్తుంది శ్రీ శంకరాచార్య ఇక్కడ పీఠం స్థాపించి హిందూ ధర్మ ఉద్ధరణకు ఆర్ష సంప్రదాయ పరి రక్షణకు ఎంతో కృషి చేసారు ఆయన ఈ ప్రదేశాలు తిరిగి ఉండక పొతే హిందూ ధర్మాన్ని ప్రక్కన వున్న చైనా పాకిస్తాన్లు ఎప్పుడో మింగేసేవి అందుకనే శంకరులు మనకూ చిరస్మరనీయులు
ఇప్పటి దాకా హిమాలయసోభను గంగామాయి పవిత్రతను ఒంపు సొంపుల నడకను చూసాం ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ప్రపంచం లో చాలన్నాయి కాని గంగా జలానికి ఉన్నంత స్వచ్చత ఏ నదీ జలానికి లేదు అందుకే గంగమ్మను చెంబుల్లో నింపుకొని సీల్ వేయించి తెచు కొటారు ఎన్ని ఈలలు అయినా ఆ నీరు చెడదు వాసన రాడుపురుగులు చేరావు అందుకే గంగా గంగా అని ఆరాధిస్తారు .ఇప్పటి దాకా హిమాలయాల పై దూకుతూ పరిగెత్తిన గంగా హరిద్వార్ వాడ భూమి మీఅకు ఆంటే మైదానం మీదకు చేరుతుంది .బహుళార్ధ సాధకం గా ఉపయోగ పడుతుంది హరి ద్వార్ ఆంటే హరి మందిరమైన బద్రీ నాథ్ కు దారి అనీ హర ద్వార్ ఆంటే హరుని మందిరమైన కేదారనాథ్ కు దారి అని రెండు అర్ధాలు .ఇక్కడి నుంచే ఆ రెండు మందిరాలకు వెళ్ళాలి రుద్రా ప్రయాగ వరకు ఇకటే దారి అక్కడ నుంచి చీలి చెరో వైపెల్లాలి హరిద్వార్ లో గంగా ప్రవాహం చాల వోద్ధ్రుతం గా వుంటుంది వెడల్పు కూడా ఎక్కువ చాల జాగ్రత్తగా స్నానం చేయాలి పట్టుకొని స్నానం చేసే ఏర్పాట్లు వుంటాయి .సాయంత్రం ఏడు గంటలకు గంగా దేవికి అందరు భక్తిశ్రద్ధలతో హారతి ఇస్తారు తప్పక చూడ తగిన ది భక్తీ తో పూల కిన్తకల్గుతుంది మన ధర్మాన్ని సంస్కృతిని ఆర్ష విజ్ఞ్ట్లకు తాగునీటిని సాగు నీటిని అందిస్తూ తన మానాన తాను పోతూ మనల్ని తరిమ్పజేస్తోంది గంగా అందుకే అట భక్తీ శ్రద్ధలు మన.జీవన వాహిని అన్నాడు వేటూరి .ఇక్కడినుంచి ఎన్నో ప్రదేశాలకు ప్రవహిస్తూ జన జీవ్తాని ఉద్ధరిస్తు సముద్ర భర్తనూ చేరుకుంటుంది
యాత్రికులు గంగోత్రి యమునోత్రి చార్ ధం యాత్ర మానస సరోవర్ యత్ర ప్రయాగ యత్ర చేసి ఆ క్షేతా స్వాములను సందర్శించి జన్మ చరితార్ధం చేసుకుంటారు ఇంకా కాసి గురించి చెప్పాల్సిన పనే లేదు కాస్యంతు మరణం ముక్తి అని కసి మరణిస్తే మోక్షమే నని నమ్మకం అన్న పూర్ణ విశాలాక్షి విశ్వేశ్వర దర్సనం జీవత సాఫల్యాన్ని ఇస్తాయి ఇక్కడి మణికర్ణిక దసాస్వమేద ఘాట్ లలో స్నానం మరచిపోలేని అనుభవం .మహా స్మశానం అని కాశికిపేరు డుంతి వినాయకుడు ,కాలభైరవుడు అన్న పూర్ణ దేవి అనుగ్రహం పొందితేనే విస్వనాదునికి తృప్తి “”భిక్షాం దేహి కృపాకరీ సుభాకరీ నిత్యాన్న పూర్నేస్వరి ”అని అన్న పూర్నా దేవిని స్మరిస్తే అన్న వుదకాలకు కొదవ వుండదు తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉన్నట్లే కాశి లో తొమ్మిది రోజులు వుండాలని శాస్త్రం .అన్ని కులాల వారికి ధర్మ సత్రాలు ఉచిత భోజన ఎయికనుక వుందా టానికి ఇబ్బంది వుండదు మనసు వుండాలి అంతే .ఎంతో మంది మహారాజులు చక్రవ్లు మహనీయులు నడచిన నెల ఒక సారి ఆ మట్టిని ముత్తు కుంటే జన్మ తరిస్తుంది
ఇక ప్రయాగ తీర్దానికి చేరుదాం గంగా యమునా అంతర్వాహిని గా సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రమే అలహా బాద్ లోని ప్రయాగ .ప్రకృష్టమైన యాగం కలది అని అర్ధం ఇక్కడి త్రివేణి సంగమం లో స్నానమ్ చేసి పితృదేవతలకు తర్పణాలు వదలి పిండాలు సమర్పించి జన్మ ఋణం తీర్చుకుంటారు భరద్వాజ ఆశ్రమం ,నెహ్రు గారి భవనం ,తరతరాలుగా vardhillo టు వచ్చిన అశ్వత వృక్షం చూడ తగిన ప్రదేశాలు ఇక్కడ హరి ఇంటి పేరు తో వున్న పురోహితుడు చాల ప్రసిద్ధి అనే శాస్త్రోక్తం గా చేయిస్తారుపునిస్త్రీ మహిళలు భర్తతో కలిసి వేణీ పూజ చేయించుకుంటారు ఇది ఇక్కడి ప్రత్యేకత ఇలా భారత జాతి జీవనం లో మమైక్యం గా వుంటూ మనల్ని ఉద్ధరిస్తు ఉత్తమ గతులు కల్పిస్తూ సర్వ శుభాదాయిని అయిన గంగా మాటను ఈ పుష్కర సమయంలో దర్శించి స్నానించి జపించి తపించి పూజించి జన్మ ను చరితార్ధం చేసుకుందాము .శుభం భూయాత్ .
గంగా పుష్కరాల సందర్భం గా ఆ పావన గంగా మాతను స్మరించే మహద్భాగ్యం కల్గినందుకు సంతోషిస్తూ
మీ దుర్గా ప్రసాద్
information is not correct and there is not in detail
What is the mantra we have to chat while doing holibath. From begining and ending