చివరికి మిగిలేది
నమస్తే శ్యాం నారాయణ్ గారు
ఈ నెల పదమూడవ తేది శుక్రవారం అనుకోకుండా మీ రైట్ angle కు వచ్చి మీ ఆతిధ్యం స్వీకరించి మీరిచ్చిన పుస్తకాలు కళ్ళ కద్దుకొని teesukoni ,మీరు పరిచయం చేసిన గీతాంజలి అనువాదకులు మూర్తి గారితో మాట్లాడి ,వారిచ్చిన గీతాంజలిని క్రుతజ్ఞాతాంజలి తో గ్రహించి ,మీరిచ్చిన ఫోన్ నెంబర్ తో నెల్లూరు లోని మధు మురళి రచయిత రమణయ్య గారిని పలకరించి ,మీ సాహిత్య సంగీత విశ్వ రూపాన్ని దిజ్మాత్రం గా దర్శించి ,నా పేరు తో వున్న కామెర మాన్ గారితో ఫోటోలు దిగి హాయిగా గంటకు పైగాకబుర్లతోబుర్రంతా నింపుకొని ఆనందం గా ఇంటికి వచ్చాను .గొప్ప అనుభూతి కలిగించి నందుకు ధన్య వాదాలు
ఇవాళ ఎందుకో మనసు ”చివరికి మిగిలింది ”మీదకు దూకింది .శివరాజు వెంకట సుబ్బారావు అనే బుచ్చి బాబు రాసిన ”చివరికి మిగిలేది”నవల గురించి కాదు .బహుశా 1960 లో విడుదలైన చివరకు మిగిలేది సినిమా గురించి .దాన్ని మచిలీపట్నం లో ముదటి సారి చూసాను .మళ్ళీ చూద్దామను కుంటే సెకండ్ రిలీజ్ అయినట్లు లేదు .గుత్తా రామినీడు దర్శకత్వం గుడిమెట్ల అశ్వథామ సంగీతం వహించిన సినిమా అది .డాక్టర్ ప్రభాకర రెడ్డి ని జయంతిని మొదటి సారి పరిచయం చేసిన సినిమా .సావిత్రి హీరోయిన్ ..మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి పాటలు,ఘంట సాల ,ఏం ఎస్ రామారావుల అద్భుత గానం ఆ సినిమాని వున్నత శిఖరాలమీద నిల్పింది .చాలా క్లాస్సికాల్ సినిమా అది .””సుధవోల్ సుహాసినీ మధువోల్ విలాసినీ ఓహో కామనీ ”పాట ఘంట సాల చాలా హున్టింగ్ గా పాడారు .”చెంగూన అలమీద మిడిసి పడతది మీను ” అని రామా రావు గారు పాడుతుంటే మనసు ఏదో లోకాలకు తేలి పోయేది తొలి పరిచయమే అయినారెడ్డి డాక్టర్ పాత్రను అద్భుతం గా పోషించి నట ప్రభాకరుడు అనిపించాడు ; జయంతి కూడా తన ప్రతిభ ని బాగా ప్రదర్శించింది .మహానటి సావిత్రి నట విశ్వరూపం చివరి ఘట్టం లో అద్భుతం కన్నీళ్లు కారి పోతాయి మనసు లాగి వేసే సందర్భం .న భూతో గా నటించింది .దర్స కత్వ ప్రతిభ సిఖరాయ మానం .సాహిత్యం ,సంగీతం గానం త్రివేణీ సంగమఅయిందిఅయింది నా ద్రుస్తిలో అంత గొప్ప సినిమా తెలుగు లో రాలేదనే .,ఈ సినిమా మీద ఎవరి తోనైనా మాట్లాడ దామంటే చాలా తక్కువ మంది చూసారు ఇంకా తక్కువ మంది దాన్ని గురించి విన్నారు .సెకండ్ రిలీజ్ వచ్చిన జ్ఞాపకం లేదు బందరు సినిమా లకు ఆసిడ్ టెస్టింగ్ place అక్కడ ఒక వారం ఆడితే దేశమంతా శత దినోత్స్చావమే .అక్కడ డబ్బా లేస్తే ఇంకా చూసే దిక్కుండదు . ఈ సినిమా కు మొదటి రోజే జనం లేరు .నేను మా తమ్ముడు పొట్టి రామ కృష్ణ బుద్ధిరాజు వితల్ చిల్లరిగె శ్రీనివాస్ ,ఇప్పటి లలిత సంగీత పాటల రచయిత కలగా కృష్ణ మోహన్ పండు అందరం రోజు secundshow కి వెళ్లి చూసే వాళ్ళం .మాటలు ,పాటలు నటన దర్సకత్వం మ్యూజిక్ గురించి గంటలకు గంటలు మాట్లాడుకొనే వాళ్ళం .అంత picchaga మళ్ళీ చూడలేదు మీ దగ్గర ఆ సినిమా కు ఆ మీ దగ్గర ఆ సినిమాకు నచ్చిన్ a సినిమా adi . mee దగ్గర దానికి సంబంధించిన స్క్రిప్ట్ కానీ ప్పాతల పుస్తకం కాని పాటల రికార్డు కాని వుంటే మెయిల్ లో పెట్టి నాతొ పాటు అందరికి ఆ సినిమా జ్ఞాపకాలు పంచి వినే లేక చూసే మహాద్భాగ్యాన్ని కల్గించండి శ్యాం గారు ప్లీజ్ .
మీ
మీ
దుర్గా ప్రసాద్