అనంతత్వం (Infinity)
అనంతత్వం అనేది గణితం లో ఒక రేఖ చిత్రం ఆంటే కర్వ్ అంటారు .దీనికి ఇంకో పేరు lemniscate .ఇన్ఫినిటీ ఒక ప్రత్యెక గుర్తుందని మన అందరికి తెలుసు . ఈ ఈ గుర్తును మొదట Mathematical infinitorium అనే పుస్తకం లో జాన్ walls వాడాడు .తర్వాత అందరు ఉపయోగించటం ప్రారంభించారు .శాస్త్రవేత్తలు ,గణిత శాస్త్రజ్ఞులు అంతా దీన్ని వాడుక లోకి తెచ్చారు .

గ్రీకు భాషలో ఇన్ఫినిటీ ని Apeiron ”అనటం అలవాటు .దీనికి అర్ధం సరిహద్దులు ఆంటే ఎల్లలు లేని అని .అయితె వ్యత్రేకార్ధం లో ఎక్కువ గా వాడె వాళ్ళు .పూర్తిగా విసర్జించ బడింది అని కూడా అర్ధం . ఒక విపత్కర గందర గోళ పరిస్థితి నుంచి ప్రపంచం ఆవిర్భవించింది అన్న దానికి ఉదాహరణ గా దీన్ని వాడే వారు .వంకర గీతకు గుర్తు గానూ వాడటం వుంది .
aristotle సిద్ధాంతం ప్రకారం ఇన్ఫినిటీ ఆంటే ”a privatation not a perfection ”ఇతని దృష్తి లో pythagaras ప్లేటో భావనలో ఇన్ఫినిటీ కి చోటు లేదు . , ప్రపంచం లో చాలా వస్తువులు అనంతం అనిపిస్తాయి అంతరిక్షం ,కాలం అలా ఒక రేఖలో సాగుతూనే వుంటాయి.ఆ రేఖ మీద అనంత బిందు సముదాయం వుంటుంది కనుక నిజం గా ఇన్ఫినిటీ అనేది లేదు అని సిద్ధాంతీకరించాడు aristotle ..Potentially infinite సిద్ధాంతం చెప్పాడు .అంతరిక్ష గోళాల అవతల అనంతత్వం లేదు అన్నాడు .
జెనో అనే శాస్త్రజ్ఞుడు కూడా ఇన్ఫినిటీ అనేది ఒక సమస్యాత్మక విషయం అన్నాడు .ఇతనే మొట్ట మొదట ఈ విశ్వం లోని సమస్యాత్మిక స్వభావాన్ని గురించి చెప్పింది .సహజ జ్ఞానం ఆంటే కామన్ సెన్స్ తో చూసే ప్రతిదీ సత్యమైన రూపం కాదు అన్నాడు జెనో .
ఇంకాస్త ముందుకు వెళ్తే bigbang సిద్ధాంతం ప్రకారం ఒక సారి జరిగింది ఆ ఒక్క సారి మాత్రమే జరిగినందు వల్ల కాదు అదిఅనంతంగా జరిగినందు వల్లనే అంటుంది . దీని గురించి పాస్కాల్ నమ్మకం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన పధ్ధతి ప్రకారం “”ఈ అనంత విస్వాన్తరాలాల నిశ్శబ్దం నన్ను భయ పెడ్తోంది ”అని చెప్పి వూరు కున్నాడు .ఇప్పుడు అందర్నీ వేధించే ప్రశ్న ”ఏమీ లేకుండా ఏదో ఒకటి ఎందుకు వుంది ?మనం ఎందుకు ఇక్కడ వున్నాం ?” ఇది నిజంగా అనంత కాలం గా వస్తున్న ప్రశ్నే .దీనికి బదులేది? చివరికి మిగిలేదేమిటి ?.స్వస్తి
మీ
దుర్గా ప్రసాద్