శామ్యుల్ బెకెట్

samuel బెకెట్ 
ఫ్రాన్సు దేశానికి చెందిన samuel బెకెట్ గొప్ప నాటక రచయిత .ఎన్నో ప్రయోగాలు చేశాడు .వైవిధ్య మైన పాత్రలను సృష్టించాడు .అతని రంగస్థల ఎన్ని కే తమాషా గా వుంటుంది .అన్నీ ప్రయోగాలే .అతని గురించి చాలా వుంది చెప్పా టానికి .ఇప్పుడు మాత్రం సంగ్రహం గానే పరిచయం చేస్తాను .
                       ఫ్రాన్సు లో 1906 లో ఏప్రిల్ 13 గుడ్ ఫ్రైడే నాడు జన్మించాడు .ఒకడు డబ్బు ఇవ్వ మని అడిగితె ఇవ్వనందుకు వాడు కత్తితో పొడిస్తే తీవ్ర గాయం అయింది .నాజీలకు వ్యతిరేకం గా పనిచేసాడు .చాలా సార్లు త్రుటి లో  అర్రెస్ట్ కాకుండా తప్పించ్కున్నాడు .దేశ దిమ్మరి గా గ్రామాల్లో పని పాట లేకుండా తెగ తిరిగాడు .అది అతనికి గొప్ప వరం అయింది .మనుష్యుల్ని వారి మనస్తత్వాలను పరిశీలించే గొప్ప ఆవ కాశం కల్గింది . సమయాలను బట్టి మనుష్యులు ఏ విధం గా ప్రవర్తిస్తారో కాచి వడ పోసాడు .తన ఒంటరి జీవితం కుడా అతనికి పాఠాలు నేర్పింది .ఏకాకి జీవితం నాది అన్న భావం బలం గా ఎముకలకు పట్టింది అందుకే అతని పాత్రలు ఒంటరి ఏకాంతపు భావం తో కనిపిస్తాయి .తమ అస్తిత్వ నిరూపణ కోసం జీవన పోరాటాన్ని మాటి మాటికి చేస్తూ ,విఫలమయ్యే వ్యధా భరిత వ్యక్తుల్ని పాత్రలు గా సృస్తించాడు .ప్రపంచ వ్యాప్తం గా మహా ప్రతిభా శాలి అయిన సృజనాత్మక నాటక రచయిత గా గొప్ప పేరు సంపాదించాడు .నాటక రచనకు అతను చిరునామా గా మిగిలిపోయాడు .అందుకే బెకెట్ ను “”ది బెకెట్ అఫ్ ది డ్రామా ”అని మురిసి పోతారు .ప్రయోగాతమక  నాటకాలు రాసే అన్ని దేశాల నాటక రచయితలకు బెకెట్ ఆదర్శం అయాడు .
.                           అతని ప్రతిభ ,వ్యుత్పత్తి ప్రయోగం  లకు ముగ్ధులై  shakespeare ,Moliere  రాసిన్ ,ఇస్బెన్  మొదలైన    ప్రపంచ ప్రసిద్ధ నాటక రచయితల నాటకాలు బతివున్నంత కాలం బెకెట్ నాటకాలు సజీవం గా ఉంటాయని  విమర్శకులు ,విశ్లేష కులు భావిస్తారు .వాళ్ల కేమాత్రం తీసిపోడు అని కదా అర్ధం .                         
                          అతని ప్రతిభ సహస్ర దళ పద్మం గా వికసించి విశ్వ వ్యాప్తం గా పరిమళం తో ఆకర్షణ తో శోభిస్తోంది .ఆర్డిన ఎన్నో అవార్డులు ,రివార్డులు వచ్చి మీద పడ్డాయి .వీటికి అన్నిటికి మించింది ఉదైన కౌ కొనేది రచనా జీవన సాఫల్యం గా భావించేది అయిన నోబెల్ పురస్కారం బెకెట్ కు 1969 లో వరించింది .నాటక రచన కు మొట్ట మొదటి సారిగా అమెరి కాకు  చెందిన  వో.   neil  కు 1936 లో నోబెల్ పురస్కారం లభించింది .దాన్ని ప్రతిష్టాత్మకం గా అంతా భావించారు అయితె చాలా హుందాగా అంతగా మనసుకు ఇష్టం లేక పోయినా దాన్ని స్వీకరించి దాని గౌరవాన్ని పెంచ్చాడు .బెకెట్ 1989  డిసెంబర్ 22 న మరణించాడు .అతని వర్ధంతి జయన్తులను ప్రపంచ వ్యాప్తం గా నాటక అభిమానులు జరిపీ ఘన నివాళులు అర్పిస్తూనే వున్నారు. అతన్ని చిరస్మరనీయుని గా భావిస్తారు ..
                  తన నాటకాలలో వస్తువు వెనక ఒక గొప్ప ఆస్కార్యం భయం విభ్రమం ఉంటుందని వస్తువు లో కాదని బెకెట్ అంటాడు .తన పని అంతా ,ఈ ప్రపంచం యొక్క అసం పూర్తిని  కని పెట్ట టానికే.అతనికి చాల ఇష్ట మైన మాట ఒకటి వుంది ,దాన్ని పదే పదే చెప్పటం అతని అలవాటు అతని మాటల్లోనే అది వింటే బాగుంటుంది .”   II donot know-” ఇంత సంక్షిప్తం గా మానవ ద్వంద్వ భావాలను గురించి ,పూర్వం నుంచి వస్తున్న వాటిని అందులోని విషయాలు నిర్మించ బడిన వైనాన్ని గురించి అతను చెప్పే ఒక్క మాటే అది .అలాగే తన నాటక పాత్రల ద్వారా జీవిత సత్యాలను తన సిద్ధాంతాలను చెప్పించటం అతని పద్ధతి . అతని నాటకం ”End game లో ”
”Nothing is funnier than unhappiness ” అని అనిపిస్తాడు nell అనే పాత్ర ద్వార్ aa .   బెకెట్ అంటాడు ”అర్ధం అనే  దానిపై ఆశ  వదిలించుకొన్న తర్వాతే తన అసలైన సృజనాత్మక రచనలు రాయటం ప్రారంభమైంది అని .నిరాశ పనికి రాదనీ అతని అన్ని రచనల సారాంశం .అందరు పట్టించు కొని అతి చిన్న విషయాలపైనే తనకు రాయటం ఇష్టం అన్నాడు .
                  విశ్లేషకులు బెకెట్ గురించి ”he is a set of meta -writer who even as he wrote transcended the art of writing ”  అన్న మాట యదార్ధమే నని అందరి అభిప్రాయం .”రాస్తేనా?రాయకుండా vuntenaa ? మీకు ఏది బాధాకరం ?”అని అడిగితె రెండూ బాదాకరమైనవే నని అయితె బాధల్లో మాత్రం తేడా ఉంటుందని చెప్పి బాధ కల్గించే మహా నాటక కర్త బెకెట్ .అతనికి bucket  ల నిండా అభినందన bouque లు అందిద్దాం
                                                                                               మీ
                                                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.