సువర్చలాన్జనేయం
శ్రీ ఆంజనేయుడు అంజనా దేవి కి ,కేసరి కి
శ్రీ ఆంజనేయుడు అంజనా దేవి కి ,కేసరి కి
జన్మించిన కుమారుడు .బుద్ధిమంతుడు ,బలవంతుడు ,ప్రతాపశాలి .ఆయనకు చిన్న తనం లోనే వ్యాకరణం నేర్చుకోవాలని కోరిక కలిగింది .వ్యాకరణం ఆంటే ఒక్కటే కాదు .నవ విధ వ్యాకరనాలున్నాయి అవి పాణినీయం ,కలాపము ,సుపద్మము ,సారస్వతము ,ప్రాతి శాఖ్యము ,కుమారవ్యాకరణము ,ఇంద్రము వ్యాఘ్రభౌతికము శాకటాయనము .ఇవన్నీ నేర్చుకున్న వాడిని నవ వ్యాకరణ పండితుడు అంటారు .వీటిని పూర్తి అధ్యనము చేసి అధ్యాపనం (నేర్చుకోవటం ,బోధించటం )చేయగల నేర్పు వున్న వాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ..హనుమంతుడు సూర్యుని దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాలు బోధించ మని వేఉకున్నాడు .సూర్యుడు ”నేను ఉదయము నుంచి ,సాయంత్రం దాకా తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తూంటాను .నిలకడ గా ఒక చోట ఉండను .నీకు నేర్పటం ఎలా సాధ్యం ?”అన్నాడు .దానికి మహా మతిమంతుడైన హనుమాన్ “”స్వామీ !నేను ఒక కాలు తూర్పుకొండ మీద ,రెందోకాలు పడమటి కొండ మీద వుంచి మీతోనే వుంటాను .కనుక నేర్పండి “‘అన్నాడు .సరే నని అయిదు వ్యాకరణాలు నేర్పాడు ఆ విధం గానే .మిగిలినవి కూడా మో నేర్పమని అడిగాడు .మారుతి .మిగిలినవి వివాహం అయిన వారికే నేర్పాలి అన్ననియమం వుంది అన్నాడు గురువు ..నేను బ్రహ్మ చారిని కదా ఎలా సాధ్యం అని అడిగాడు వాయుసుతుడు ..అయితే దీనికి ఒక పరిష్కారం వుంది ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అప్పుడు మిగిలిన వ్యాకరణా అన్నాడు రవి.
ఇంతకీ సూర్యుని కుమార్తె ఎవరు ఎలా పుట్టింది అని అనుమానం వచ్చింది హనుమకు .అప్పుడు సూర్యుడే సందేహ నివృత్తి చేశాడు .తాను చాలా తీవ్ర తేజంతో జ్వలిస్తుంటే తన భార్య చాయా దేవి భరించలేక పోయిందని ఆమె తండ్రి ,తన మామ గారు మయుడు తనను సాన పట్టాడని తీవ్రత తగ్గిందని ,సాన పట్టగా వచ్చిన రజను ఒక రాశి గా ఏర్పడిందని దేవతల వర ప్రభావం తో ఆ రాశి నుంచి మంచి వర్చసు దేహకాంతి తేజస్సు కల అపురూప సౌందర్య రాశి ఆవిర్భవించిందని ,ఆమెయే తమ కుమార్తె సువర్చల అని వివరం గా చెప్పాడు సూర్యుడు .మంచి వర్చస్సు వుండటం చేత సువర్చల గా నామ కారణం చేసామని చెప్పాడు ఆమె ను వివాహం చేసుకోమని కోరాడు సరే నని ఒక షరతు పెట్టాడు హనుమ .తాను వివాహం అయినా బ్రహ్మ చారి గానే ఉంటానని దాంపత్య సౌఖ్యం ఉండదని తనకుమార్తెకు ఈ విషయం చెప్పి ఆమె అంగీకరిస్తే తాను వివాహం చేసుకుంటానని నిర్మొహమాటం గా చెప్పాడు .సువర్చలకు. ,బలశాలి ,మతి మంతుడుబుద్ధిమంతుడు తనకు భర్తగా లభించటం తన అదృష్టమని దాంపత్య సౌఖ్యం లేక పోయినా తనకు అమ్గీకారమే నని ఆమె బదులు చెప్పింది .అందరు ఆనందించారు వారి వివాహం వైభవం గా జరిగింది అప్పటినుంచి ఆంజనేయుడు సువర్చలాన్జనేయుడు
అయ్యాడు . వచ్చే మన్వంతరం లో హనుమ బ్రహ్మ దేవుడవుతాడు అందుకే ఆయన సహస్రనామం లో ”భవిష్యత్ బ్రహ్మనేనమః”అని వుంది సూర్యుడు తన అల్లుడైన హనుమంతునికి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పాడు .గురువుకు తగిన శిష్యుడని పించు కున్నాడు ..ఇదే అందుకే ఆయన్ను ”నవ వ్యాకరణ పండితుడు ”అంటారు సువర్చలాన్జనేయం .
హనుమ చిరంజీవి అని మనకు.ఆయన వైశాఖ మాసం లో కృష్ణ పక్షం లో దశమి నాడు జన్మించాడు “”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ”అని దీని వివరణ ఆ రోజునే శ్రీ హనుమజ్జయంతి దేశ మంతటా చేస్తారు ..ఆయన పుట్టిన వారం శని వారం .శనివారం మంగళ వారం హనుమకు ప్రీతి కరమైనవి .ఆ రోజుల్లో విశేషం గా స్వామిని అర్చించి తరిస్తారు .సువర్చలాన్జనేయ కల్యాణాన్ని వైశాఖ బహుళ దశమి నాడు ఆంటే హనుమజ్జయంతి నాడు జరపటం ఆచారం .తమల పాకులపూజ (నాగవల్లి )ఆయనకు ప్రీతికరం ..అప్పాలు నైవేద్యానికి శ్రేష్టం ..పానకం ఇష్టం .లడ్డూలు మరీ ఇష్టం ఆంజనేయుడు లంకను దాటి సీతా మాత ను దర్శించి స్వామి కార్య దురీనుదయాడు .రామ భక్త హనుమాన్ గా వీర హనుమాన్ గా దాసాంజనేయ స్వామిగా ,వీర ధీర హనుమాన్ గా సంజీవి పర్వతోద్ధారణ హనుమాన్ గా ,పంచముఖ అన్జనేయునిగా భక్తులచేత పూజలు అందుకుంటున్నాడు .ఆయన్ని సేవించితే భయాలు ఉండవు ,పాపాలు అంటవు . దుస్వప్నాలు రావు శత్రువుని జయించే కోరిక తీరుతుంది . అందుకే ఆయనకు ఊరూరా వీధి వీధినా దేవాలయాలు కత్తి భక్తీ శ్రద్ధలతో పూజించి సేవించి తరిస్తారు
ఆంజనేయ స్వామి ప్రవర తెలుసు కుందాము ఆయనది కౌన్డిన్యస గోత్రం ..వసిష్ఠ ,మైత్రావరణ కౌన్డిన్యస మహర్షులు ఆ గోత్ర ఋషులు .హనుమంతుని ముత్తాత గారి పేరు హేమగార్భ శర్మ ,తాత గారు పింగాక్ష శర్మ ,తండ్రి గారు కేసరి శర్మ .
సువర్చలా దేవి ప్రవర వినండి ఆమె గోత్రం కాస్యపస గోత్రం కాశ్యప ,వత్చార ,నైద్రువ అనే ముగ్గురు మహర్షులు ఆ గోత్రం లోని ఋషులు .ఆమె ముత్తాత గారు చతుర్ముఖ బ్రహ్మ .తాత గారు కశ్యపబ్రహ్మ .తండ్రి వివస్వత బ్రహ్మ అనే సూర్యభగవానుడు .
శ్రీ సువర్చలాదిస్గ్తిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం
భాను ప్రభం రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం శ్రీ హనూమంత మీడే .
. శ్రీ హనుమజ్జయంతి 27 05 -11 సందర్భం గా అందరికి శుభాకాంక్షలు .శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల కృపా కటాక్ష సిద్ధి రస్తు.
మీ
దుర్గా ప్రసాద్

మా కొత్త బ్లాగ్ అదే రోజు ప్రారంభం