గణిత అష్టావధానం
——————————————
ఉయ్యూరు లో సాహితీ మండలి ఆధ్వర్యం లో 15 -04 -97 ఉగాది పర్వ దిన సందర్భం గా మా డ్రాయింగ్ మేస్టారు శ్రీ తాడినాడ శేషగిరి రావు గారి కుమారుడు ,,నా శిష్యుడు ,లెక్కల మేస్టారు అయిన ఛి .తాడినాడ ఫణి రాజ మోహన్ చేసిన గణిత అష్టావధానం సందర్భం గా నేను చేసినఅధ్యక్ష ఉపన్యాసం
ప్రాచీన గనితాచార్యులు ఆర్య భటున్నీ (476ad ,బ్రహ్మ గుపటున్నీ (1108ad )లను స్మరిస్తూ ,ఆధునిక గనితాచార్యుడు ,మహామేధావి ,ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో తన అమోఘ మేధా సంపదను ,కీర్తి చంద్రికలను వ్యాపింపజేసిన శ్రీనివాస రామానుజం ను సంస్మరిస్తూ వారికి అంకితం గా ఈ గనితవదాన ప్రక్రియను ప్రారంభిస్తున్నాము
బీజ గణితాన్ని ఆర్యభాటుడు ,వర్గ సమీకరణాన్ని బ్రహ్మ గుప్తుడు ,అంక గణితాన్ని భాస్కరా చార్యుడు ప్రతి పాడించారు .square root ,cube root ,,mensuration ,interminate eqations ,continued fractions ఇవి అన్నీ ఆ భాస్కరుని విజ్ఞాన కిరణాలే .భాస్కరుడు గణించిన గణితమే ”లీలావతి గణితం ”.లాలిత్య లీలావతీం అని ముద్దుగా దాన్ని పిలుస్తారు .లాలిత్యం దాని అంతర్భాగం అని భావం .ఆయన చెప్పిన మొదటి శ్లోకం ఒక సారి గుర్తు చేసుకుందాము ఇది మనందరికీ ప్రార్ధనా శ్లోకమే . .
”ప్రీతిం భక్త జనస్య యో ,జనయతే ,విఘ్నం ,వినిఘ్న న్స్మత
.స్టం ,బృందారక బృంద వందిత పదం ,నత్వా మతంగాననం
పాటీం సద్గానితస్య ,వచ్మి చతుర ప్రీతి పదాం ప్రస్ఫుటాం
సంక్షిప్తాక్షర కొమలామల పదైర్లాలిత్య లీలావతీం ”
దీని లాగానే ఈ అవధానముకూడా లీలగా ,వినోదం గా లలితం గా వేగం గా ఆసక్తి భరితం గా జరగాలని కోరు తున్నానాను .
భాస్కరుడు లీలావతి ని శ్లోకాలలో రచిస్తే పావులూరి మల్లన కవి గణితాన్ని పద్య కావ్యం గా రాశాడు .గణితం తో సంబంధం లేకుండా ఛందస్సు లేదు .ఆంటే గనితానికీ ,అన్ని శాస్త్రాలకూ మంచి సంబంధం వుంది .మా సాహితీ మండలి కార్య క్రమం లో భాగం గా గణితానికి ప్రాధాన్యత నిస్తూ ఈనాటి ఉగాది కవి సమ్మేళనానికి ముందే గనితావదానాన్ని జరుపుతున్నాం
”That deeply emotional convictio of the presence of a superior reasoning power which revealed in the comprehensive universe forms my idea of God .”అంటాడు ప్రఖ్యాత శాస్త్ర వేత్త einstein .బుద్ధికి కనిపించని ,విశ్వం లో కనిపించేది అయిన ఉత్కృష్ట ప్రజ్ఞా శక్తిని గూర్చిన హృదయ పూర్వక గాఢ విశ్వాషమే నాకు ఈశ్వర భావాన్ని కల్గిస్తోంది అని ఆ మహా మహుని భావం .”పూర్ణ మదః ,పూర్ణ మిదం ,పూర్ణాత్ పూర్ణ ముడుచ్యతే -పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్నమేవావ శిష్యతే ”ఆంటే బ్రహ్మం పూర్ణం .ప్రపంచమూ పూర్నమే .ఆ పూర్ణం నుంచే ఈ సంపూర్ణ జగత్తు ఏర్పడు తోంది .ఆ పూర్ణత తో ఈ పూర్ణతఏర్పడగా అసలు పూర్ణ పదార్దానికేమి కొరత ఏర్పడదు .అదెప్పుడు పరి పూర్ణం గానే వుంటుంది .ఈ భావాన్ని ప్రపంచానికి చాటింది భారతీయ మహర్షులే .సున్నా కు అస్తిత్వాన్ని సాధించింది మన వాళ్ళే .
శ్రీ బెజవాడ గోపాలరెడ్డి చాలా చిన్న వయసు లోనే వుమ్మడి మద్రాసు రాష్ట్ర మంత్రి అయారు .శ్రీ విశ్వనాధ సత్య నారాయణ రెడ్డి గారిని ”ద్రావిడావనీ బాల మంత్రీ”అని సంబోధించారు .అలాగే ఈ నాటి ఈ కుర్ర అవధానిని ”వుర్వరాపురీ బాల గణితావ దానీ ‘అని ఆంటే సముచితం గా వుంటుంది .ఇది ఇతని మొదటి సభా రంగ ప్రవేశం .ఆంటే అరంగేట్రం అన్న మాట..”గణిత అరంగేట్రం ”అందాం సరదాగా .ఇక్కడ తోడ గొట్టి గెలిచిన వాడు ఎక్కడైనా ,ఏ సవాలు నైనా ఎదుర్కొని నిలిచి ,ప్రజ్ఞా పాటవాలు చూపి ,మన్ననలు పొందు తాడు .అందుకే అతనికి ఈ వేదిక నిచ్చాం .అతను సంపాదించే కీర్తిచంద్రికలు మనందరివీ .
లెక్కలు ఆంటే భయ పడే వాళ్లకు ఈ అవధానం చూస్తె తేలికగా లెక్కలు నేర్చు కో గలం అనిపిస్తుంది .easiness అలవడి interest పెరుగు తుంది .అదీ దీని మహిమ .ప్రజ్న పాటవం ,ధారణా ,మననం ,సంక్షిప్తత ,ఆశువుగా మాట్లాదటటం ,సరస సంభాషనంతో మెప్పు పొందటమే అవధాన కళ
ఎనిమిది మంది పృచ్చకులు వృస్చికాల్లాగా ఆంటే తేళ్ళు లాగా ప్రశ్నలతో కుట్టి బాధిస్తుంటే ఆ విషాని హరించు కుంటూ ,ఆ బాధను తట్టు కుంటూ ,అమ్రుతోపమన మైన జవాబులు ఇస్తూ ,నవ్విస్తూ ,అవసరమైతే రెట్టిస్తూ ,వాళ్ల ఎత్తులు జిత్తులను చిత్తూ చేస్తూ పైఎత్తులు వేస్తూ ,వారి వలలో పడకుండా దాటి పోతూ మెప్పించతమే అష్టావధానం -కష్టావధానం -అందరికి ఇస్టావధానం చివరికి అందరికి మ్రుష్టావధానం .కోరి తెచ్చుకున్న తలబరువు .అయితె ఆ బరువు అంతా యిట్టె దిగి పోతుంది .ఇదొక కండూతి .ఆంటే దురద .”మాడు గుల పెడితే కవిత్వం తో అస్తావధానం ”.మేధ గుల పెడితే ”గనితాస్తావధానం ”.మేధమే ట్రిక్స్ -mathematics .మేధమే sticks కాకూడదు .mathematrix అయితె మహదానందం
ఈ ఆనందం లో పాలు పంచుకోవటానికి వచ్చిన రసజ్ఞులకు ,విద్యార్ధినే విద్యార్ధులకు గణితాభిమానులకు ప్రుచ్చకులకు అందరికి సహృదయ ఆహ్వానం .గణితాన్ని పోషిస్తే అది మనల్ని పోషిస్తుంది ”గణితో రక్షతి రక్షితః ”
సావదానం గా ఈ అవధానాన్ని అవధరించండి .అవధాని ప్రజ్ఞా విశేషాలు పరికించండి .సహృదయత తో అభినందించి ప్రోత్చహిమ్చండి అవధాని గారి ఈ దెబ్బ ”గోల్కొండ లో అబ్బా” అవాలి ..”గణిత మొరబ్బా ”అవాలి .అతని కీర్తి కిరీటం లో ఇది కలికి తురాయి అవాలి అతని ధీశక్తి ప్రతిభ” geometric progression ”లో వృద్ధి చెందాలి .మరిన్ని అవధానాలు చేసి మళ్ళీ ఇక్కడే ఘన సన్మానం అందు కోవాలి .”ఈ మచ్చిష్యుడు -వర్దిష్ణుడు ”గా వెలగాలి ” గణిత ఫణి రాజాన్ని ” మోహనం ”గా గణిత నాట్యావధానం చేసి అందర్నీ అలరించమని ఆశీర్వదిస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్