సంస్కృత ముక్తకాలు
”ముక్తకం”ఆంటే విడువబడినది అని అర్ధం .ఆంటే ఒక రాశి గా ,మాలగా కూర్చబడనిది అని భావం .అంతే కాక అందులోని భావమూ ,పాథకునికే వదిలి వేయబడింది అనే తాత్పర్యము వుంది .ఇవన్నీ కూర్చి ఒక చోట చేరిస్తే ”ముక్తక మాల ”అవుతుంది .ఇలాంటివి సంస్కృత సాహిత్యం లో కోకొల్లలు .ఆ ముత్యాలను ఏరుకొనే ఓపిక ఉండాలే కాని ,అనంతం గా సంస్కృత సాహితీ సింధువు లో లభిస్తాయి .వాటికి విలువ కట్టలేం .వెలలేని ఆ పద సంపద అనూచానం గా సాహిత్యం లో వచ్చిచేరుతూనే వుంది .”హాలుని గాదా సప్తశతి ”చాలా ప్రశిద్ధమైంది .దేనికి అదే ఒక అందమైన భావ కుసుమం .దేని అందం దానిదే .ఆఘ్రాణించి అందం అనుభవించే సంస్కారం వుంటే ఎన్నో జీవిత సత్యాలు తెలుస్తాయి .మరెన్నో శృంగార కధనాలు సరసంగా కవ్విస్తాయి .ఇంకెన్నో హాస్యపు చిరుజల్లులూ పన్నీరై చల్లబరుస్తాయి .నీతి బోధకాలుగా ,జ్ఞానబోధకాలుగా కూడా ముక్తకాలున్నాయి .మహారాజు నుంచి ,సామాన్యుని వరకు గల జనజీవితం అందులో ప్రతి ఫలిస్తుంది .అనంత వైవిధ్యమూ కన్పిస్తుంది .వాని కర్తల పేర్లు తెలియక పోయినా కవిత్వం లోని తీరు సొబగు ఆశ్చర్య పరుస్తాయి
సంస్కృతం లోనే కాక ప్రాకృత భాష లోను ముక్తకాలు రత్నాలు గా భాశించాయి ..పథితల హృదయాలను అలరించాయి .ఇంచుమించుగా ఇవి ఆ తర్వాత తెలుగు లో ”చాటువులు”గా చెల్లుబాటు లోకి వచ్చాయి .ఏదో ఒక చాటువు రాని తెలుగు వాడు లేడు .అట్లాగే సంస్కృత ముక్తకం రాని వాడూ ఆ నాడు వుండే వాడు కాదు .ముక్తకం ఆ నాటి సాంఘిక ,రాజకీయ పరిస్థితులనే గాక ,మనుషుల మధ్య మానవీయ సంబంధాలను ,చిలిపి తనాలను ,చిలక్కోట్టుల్లను ,మోసాలను ,ఆవేశ కావేషాలను సరస సంభాషణలను ,దాంపత్య వైభావాన్నే ,చాటు మాటు ప్రేమల్ని చాల చక్కగా వివరిస్తాయి . ”వాక్యం రసాత్మకం కావ్యం ”అన్నట్లుగా ”ముక్తకం రసాత్మకం కావ్యం ”గా భావించ వచ్చు .అల్పాక్షరాల్లో అనంతార్ధం ఉండి ,అత్యద్భుత కవితా శిల్పం నిక్షిప్తమై ,జాతి ముత్యం గా ప్రకాశించింది ముక్తకం .జాతి ముక్తకం అయింది .జీవితం లోని అలుపును ,అలసటను ,దూరం చేసి ఆ బాధలకు విముక్తి కల్గించి ఆనంద రాసామ్రుతం పంచేవి ముక్తకాలు .
ప్రాచీన కాలమ్ లో ఎందరో మహానుభావులు ,కవి పండితులు ,సంస్కృత భాషా వ్యాప్తికి జవ జీవాల నిచ్చి ,ప్రజల మధ్యకు సంస్కృతాన్ని తెచ్చారు .వారికి వందనాలు ..ఆధునిక కాలమ్ లో అమరావానికి నీరాజనం పట్టి ,సులువుగా నేర్చుకొనే దారి చూపి ,ఆ భాషోద్ధరణకు బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోదినులను రచించి జీవిత సర్వస్వం దేవభాషా సేవనం లో కరగించిన త్యాగధనుల్లో ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం గార్లు చిరస్మరనీయులు ,ప్రాతస్మరనీయులు .వారికి ప్రత్యెక నమో వాకాలు .
ఇప్పుడు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు వ్రాసిన కొని ముక్తకాలను మీకు పరిచయం చేస్తాను .వారు విజయ వాడ లో srr ,cvr కళాశాలలో సంస్కృత శాఖ ఆచార్యులు గా పని చేశారు .ఇవి ఈ నాటి సాంఘిక స్థితికి ,ధర్మ చ్యుతికి అద్దం పడతాయి .మన బాధ్యతనూ బాగా గుర్తు చేస్తాయి .చమత్కారం గానూ వుంటాయి .ముందుగా సంస్కృత భాషామతల్లికి వారి శ్లోకం తోనే వందనం చేస్తాను .
”సుధా స్రవంతీ సుర భాషి తాయా –సుచ్చానా సూక్తి సురత్న వార్ధిహ్—సుకావ్య సందోహ నిదిశ్చ వాణీ —సా సంస్క్రుతాఖ్యా ,సుకృతి కలాభ్యా ”
” మాతాహి భాష వితతెస్చ లోకే —మాతేవ రక్ష్య త్య పితాశ్రితాన్హి —నా మాత్రు భాషా భువి సంస్క్రు తాఖ్యా —వాచ్యః కదం మాత్రు పడేవ చాన్యాః /.”
01 -అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేస్తుందట భారత దేశం .ఆమె ఉదాత్త బుద్ధి ,ఎత్తైన హిమాలయ శిఖరమనే శిరస్సు వల్లనే తెలిసి పోతుందట
”పున్యావనే ,ద్రోహమతీ న్విదేశ్యం ——సద్గర్భ నిష్టాన్ ,ఖలుసే హిషే ,త్వం —వుచ్చైస్శిరత్వం ,తవ శూచితం ,హి —హిమాద్రి శ్రుమ్గేన మహోన్నతేన ”
02 – ఆ పరబ్రహ్మను ప్రత్యక్షం గా చూసిన రమణ మహర్షి ,శ్రీ రామ కృష్ణ పరమహంస మున్నగు మహర్షులు ఈ భూమి మీద నే ఎందుకు పుట్టారు?అని ప్రశ్నించే వారికి సమాధానం ”నక్షత్రాలు ఆకాశం లోనే పుట్టి ఎందుకు ప్రకాశిస్తున్నాయి?”
”నాన్యస్య భూమే ర్భారతాస్య జాతాః -శ్రీ రామ కృష్ణో రమణాదయశ్చ –అత్రైవకిం ,బ్రహ్మవిదాం ,సుజన్మ –తారోదయః కిం గగనే న భూమౌ .”
03 – లోకం లో అందమైన వాటిని చూసి మానవుడు తృప్తి చెందుతాడు .కానే స్త్రీ ని చూసి వికారం చెందటం వాడి దౌర్భాగ్యం
”ద్రుస్తాహి శోభాం ,గగనే మలే తాం —-తార గానశ్యామ్భాసి పద్మ పన్క్తిహ్ –తుస్తో జనః స్కాత్కిమ భాగ్యమస్య —–స్త్రీ రత్న మాలోక్య వికార మేగతి ”
04 – కొత్తగా కాపురానికి వచ్చి నట్టింట్లో ఎప్పుడు తిరుగుతుందా అని వువ్విల్లూరిన అత్తా గారు –కోడలు రాగానే ఆమె వ్యక్తిత్వాన్ని సాహిన్చలేదట ఇది లోక సహజం ‘
”కదా స్నుశామే గృహవర్తినేశ్యాత్ -కదాను పుత్రస్య తయా శుఖం స్యాత్ –స్వశ్రూర్వి లపైవ మనల్ప కాలమ్ —సమాగాతాం న సహేత చిత్రం ”
05 – -భార్య అంతే ఎవరో కాదట .ధర్మం అనే గంగా ,కామం అనే యమునా ,అంతర్వాహిని గా దామ్పత్యమనే సరస్వతి తో కలిసే ప్రయాగ త్రివేణీ సంగమమే నట
”గంగా సమానః ఖాలు శుద్ధ ధర్మః–సత్కామ ఏవం యమునోపమస్చ –తన్మేలనం యత్ర తదేవ పూతం —క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి .
06 – స్త్రీ కి గౌరవం ఇవ్వాలి అనే ప్రబుద్ధుడు తన కుమార్తె వంటత చేయటానికి ఒప్పు కోడు .కానీ వంటలక్క తో వండించుకొని తృప్తిగా తింటాడు .ఆమె కూడా స్త్రీ అన్న స్మృతి వాడికి వుండదు ఇదీ లోక రీతి
”చిత్రోహి వా దోస్తీ మదీయ కన్యా –మహానసే నైవ నియోజ నీయా –పూజ్యా శ్రియః స్థార్హి కధన్ను భుక్తి –ర్భ్రుత్యాహి పక్త్రీ ;వడకిం న సా స్త్రీ ;”
07 – ఈ రోజు మెడలోపోల దండ వేసి ,హారతు లిచ్చి ,గౌరవించి మెచ్చి మేక తోలు కప్పు తారు .రేపే ఏదో నెపం మోపి ఆ కన్తాన్నే నరికేస్తారు .అందుకని కీర్తిని నమ్మ రాదు
”కన్చిత్ప్రజానే ,త్రుపదేని వేశ్య –స్వదేశ విద్రోహిని ,మా మానమతి –కన్తేద్య నిక్షిప్యచ ,పుష్ప మాలాం —శ్వస్తీ ప్రదండం పరికల్ప ఏరన్ ”
08 -మానవుడు చిత్ర స్వభావుడు .తన కొడుకు చేసే దోషాలు తెలుసు కోడు .వాడిలో లేని మంచిగునాలన్నీ వున్నాయని భావిస్తాడు .వాడి కోసం ఎన్నో తప్పులు చసి లోకాప వాదం పొందుతాడు .పుత్ర ప్రేమ
గుడ్డిది .గుడ్డి రాజు ద్రుత రాష్ట్రుడు దీనికి మంచి ఉదాహరణ .
”జనో న జానాతి ,హి పుత్ర దోషాన్ —గునామ్స్చ తస్మిన్న సతోపి పశ్యేత్ –పాపం తదర్ధం i ,బహుదా కరోతి —బలీహి ,లోకే సుత మూల మోహః
మీ
దుర్గా ప్రసాద్
ఇది 30 -07 -1998 లో చేసిన ప్రసంగం