పద్య మంద హాసం
————————–
తెలుగు పద్యాలు కొన్ని విన్నవి గానే వుంటాయి .కాని అందులోని భావం తెలుసు కోవాలంటే బుర్ర బద్దలు కొట్టు కోవాల్సిందే. అలాంటి తెలుగు పద్యాలు ,అందు లో నిక్షిప్త మైన భావ ధారను తెలుసు కోని తెలుగు పద్య వైభవానికి జే జే లు పలుకుదాం శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానం లో అష్ట దిగ్గజ మహా కవులున్నారని మనకు తెలుసు .స్వయం గా రాయలే మహా కవి .ఎప్పుడు ఇతర దేశ కవులు రావటం ,తమ పాండిత్య ప్రకర్ష చూపి బహుమతులందు కోవటం పరి పాటే .రోజు కవితా గోష్టి ,రాయల భుజ శౌర్య దాన ధర్మాల మీదా కవితా పాండిత్యం మీద కవులు ప్రశంసల వర్షం కురిపిస్తూనే వుంటారు .కొన్ని సామాన్యులకు అర్ధమవుతాయి కొన్ని ఆ కవే విప్పి అర్ధం చెబితే కాని తెలియని సందర్భాలు వుంటాయి ఒక రోజు అల్లా సాని పెద్దన గారు రాయలను కీర్తిస్తూ చెప్పిన పద్యాన్ని తెనాలి రామ లింగ వికట కవి స౦దర్భ శుద్ధి గా లేదు అన్నాడు .పెద్దన నొచ్చు కున్నాడు .రాయలకు ఆంతర్యం తెలుసు కనుక నువ్వో పద్యం చెప్పు అన్నారు. మంచి సమయం .తన ప్రతిభ బయట పడేఆలోచించి సందర్భం .తన ఊహకు పదును .అని చిన్న పద్యమే పెద్ద భావం ఇమిడే లా చెప్పాడు .ఆ పద్యం అందరికి తెలిసిందే .వినటానికి సరదా గా వుంటుంది .అయితె బావం అంత తేలిగ్గా అందదు తనే ఆ భావావిష్కరణ చేసి అందర్నీ ,ఆశ్చర్య పడేట్లు చేశాడు . ”నర సింహ కృష్ణ రాయని –కరమరుదగు కీర్తి యొప్పె –కరిభిద్గరిభిత్కారి కరి కరిభిద్ –త్కరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై ..” రాయల కేర్తి కరిభిత్ –గజాసురున్ని సంహరించిన శివునిలా ,గిరిభిత్కరి –ఇంద్రుని ఐరావతం లా ,కరిభిద్గిరి –కైలాస పర్వతం లా ,గిరిభిత్ –వజ్రాయుధం లా ,కరిభిద్గిరిభిత్తురంగ –శివుని ఇంద్రుని వాహనాలైన నంది ,వుచ్చైశ్వరం లా అండం గా అతి స్వచ్చంగా అతి తెల్లగా వుందని అర్ధం .ఆయన కీర్తి అంత స్వచ్చం గా వుందని భావం . రెండో పద్యం శ్రీ హను మంతుని గురించిన ది ఎవరు రాశారో తెలీదు కాని చమత్కారం గా వుంది నర్మ గర్భం గా వుండటం దీని ప్రత్యేకత ”అంచిత చతుర్ధ జాతుడు —పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్ —గాంచి తృతీయం బక్కట —-నుంచి ద్వితీయంబు దాటి యొప్పగా వచ్చెన్ పంచ భూతాలు ఆంటే మొదటిది భూమి ,రెండు నీరు మూడు అగ్ని ,నాలుగు వాయువు అయిదు ఆకాశం .దీన్ని బట్టి అన్వయం చేసుకోవాలి చతుర్ధ జాతుడు ఆంటే నాల్గవది అయిన వాయువు కు జన్మించిన వాడు ఆంజనేయుడు .పంచమ మార్గామమున ఆంటే అయిదవది అయిన ఆకాశ మార్గం లో ,ప్రధమ తనూజ ఆంటే మొదటిది అయిన భూమి కుమార్తెను ఆంటే సీతా దేవిని ,త్రుతీయంబక్కత నిల్పి అనగా మూడవదైన అగ్నిని అక్కడ అంటించి ,ద్వితీయంబు దాటి ఆంటే నీటిని ఆంటే సముద్రాన్ని దాటి ,వచ్చాడు .అని భావం మూడవదైన ముచ్చటైన పద్యం ”నలుగురు పలికిరి సరియని —నలుగురు బలికిరి సురూప ,నయన ,దాన ,ధారా—వలయ ధారా చరణోన్నతి —పొలుపుగ గద్వాల సోమ భూపాలునకున్ ” గద్వాల ప్రభువు సోమ రాజు గారిని పొగిడిన పద్యం ఇది .గద్వాల రాజు గారు సురూప ఆంటే అందం లో నలుడు .నయ -బుద్ధిలో –గురుడుంటే బృహస్పతి –దానం లో బలి చక్ర వర్తి –భూమిని మోయటం లో -కిరి వరాహ అవతారం ఆంటే ఆది వరాహమైన విష్ణు మూర్తి –సరి యని ఆంటే ఒప్పుకొని -నలు-గురూ-బలి–కిరి .అందరు పలికారని ,చెప్పిన మాటలనే వేరే అర్ధం లో అద్భుతం గా చెప్పి తమాషా గా ఆయన కీర్తిని ఆవిష్కరించాడు ఆ కవి . సంస్కృత శ్లోక వైభోగం ఒకటి చూడండి ”శతేషు జాయతే శూరః –సహస్రేషు చ పండితః -వక్తా దశ సహస్రేషు —దాతా భవతి వానవా ” వందలో ఒకడు శూరుడు అవుతాడు .వెయ్యిమందిలో ఒకడు పండితుడవు తాడు .పది వేలలో ఒక్కడు మహా వక్త కా వచ్చు .కానీ దాత అనే వాడు ఉంటాడో ఉండడో ?అని సందేహం దాత అవటం చాల కష్టం అని భావం . ఇలాంటి అద్భుత పద్యాలను చాలా గొప్పగా ఆవిష్కరించారు స్వర్గీయ ఆచార్య తిరుమల సేకరణ —గబ్బిట దుర్గా ప్రసాద్ ——11 -06 -11 .
good sir,thank you.kani konni akshara doshalu unnayi,bahusha speed typing valla kavachu. A.jayakrishna(H.O.D,telugu in A.S.Raonagar,Bhashyam)