కొందరు మహోన్నతుల జ్ఞాపక శకలాలు
అగాతా క్రిస్టీ
అపరాధ అరిశోధన వాజ్మయానికి మకుటం లేని మహా రాణిగా చలామణి అయిన అగాతా క్రిస్టీ జన్మించి దాదాపు నూట ఇరవైయేళ్ళు దాటింది .ఆమె జయంతి వేడుకలను ప్రపంచం అంతా సెప్టెంబర్ 15 న జరుగు తుంది ..భీభాత్చ ,భయానక ,హిమ్సడులు లేకుండా మేధస్సుకు మాత్రమే పదును పెట్టె రచనలు ఆమె చేసింది .”అసంఖ్యాక మైన హత్యలు అమ్మిన నిరపకార మయిన రచయిత్రి ”అనే బిరుదు ఆమెకు లభించింది .110 పుస్తకాలలో ,66 detective నవలలే .”మాస్ ట్రాప్ ”అనే ఆమె దేటేక్టివే నాటకం ఇంగ్లాండ్ లో నేటికీ రోజూ ప్రదర్శింప బడుతూనే వుంది .అంత మోజు ఆమె రచనకు .ఆంటే దాదాపు 50 సంవత్చారలనుంచి ప్రదర్శిమ్పబడుతోందన్న మాట .ఇది ప్రపంచ రికార్డు అంటారు .ఆమెవి ఇరవై నవలలు సినిమాలుగా తీశారు .ఆశ్చర్యం ఏమిటంటే ఆమ్మెకు తుపాకి కాల్చటం కూడా రాదు .మంచికి జయం ,చెడుకు పరాజయం ఖాయం అనే విశ్వ జనీన సత్యం ఆమె రచనల్లో కన్పిస్తుంది .మెదడుకు పదును పెడుతూ ,మనసుకు హాయి నిచ్చే రచన ఆగాథా స్వంతం .
ఉషశ్రీ
పండిన విద్య తో పురాణాలను నోట పండించి ,యావదాన్ధ్రము ,పులకిత గాత్రమై వినే అదృష్టం కల్గించిన పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులే ఉషశ్రీ .వాచికం లో ,భావం పలికించటం లో ఒక ప్రత్యెక శైలి ఆయనది .కవి ,పండితుడు ,,మహాపండితుని కుమారుడు ఆంటే ప్రతిభతో తండ్రిని మించారు .మంచి పౌరాణికుడు కూడా .స్నేహ శీలి .ఆ వాగ్ధాటి అపూర్వం .అనితర సాధ్యం .భారత ,రామాయనాలతో ప్రతి ఇంటినీ ఒక నైమిశారణ్యం గా మార్చిన అపర వైశంపాయనుడు ,శుక మహర్షి ,వ్యాఖ్యాత ఉషశ్రీ .ఆకాశవాణిని అపర సరస్వతీ వాణిగా మార్చి ,నూతన ధార్మిక ఉషశ్రీ ని ఆవిష్కరించిన పండిన పురాణాల పంట ,,వెద శాస్త్ర ఇతిహాస ,పురాణ ,ఉపనిషత్ సూర్య ప్రకాశాన్ని అందించిన వెలుగు .దీక్షతో జన సామాన్యానికి ఆ పరమార్ధాన్ని యజ్ఞం గా భావించి యజ్న ఫలాన్ని అందజేసిన దీక్షితులు .
బీనా దేవి
ప్రముఖ రచయిత బి..నర్సింగరావు కాలం పేరే బిఇనా దేవి .ఆక్రమాలు ,అవినీతి ,అత్యాచారాలపై నిశితంగా రచనలు చేసి లక్ష్యాలను ఆలోచిమ్పజేశాడు .నిష్కాపత్యం ,ధైర్యం ,తెంపరి తనం వున్న రచయిత .స్వంత బాణీ ,కొత్త స్రూస్తే కళ వాడు .”పుణ్యభూమి కళ్ళు తేరు ,”హాంగ్ మే quick ”రాధమ్మ పెళ్లి ఆగిపోయింది ”కధలు రాసి తానేమిటో నిరూపించారు .రిబ్బను ముక్క కధ లో దారిద్రపు లక్ష్మణ రేఖ ను దర్శింప జేశ్హాడు .”A man with a true warm hearted and a soul and reverent ,very tender and modest ,has keen perspective power ”అని hedbeek రచయిత హెర్మన్ మేల్విల్లీ గురించి మిస్సెస్ హతారన్ చేసిన వర్ణన బీనా దేవి కి సరి అరిపోతుందని విమర్శకులఅభిప్రాయం .
హరదాస స్వామి
మహా గాయకుడు తాన్సేన్ అక్బర్ చక్రవర్తి కొలువులో సంగీతం పాడి మెప్పిస్తూ వుండే వాడు .”నీ లాగా పాడే వాళ్ళు మరెవ్వరు లేరా?అని అడిగాడు ఒక రోజూ అక్బర్ తాన్సేన్ను .”హరదాస స్వామి ఆశ్రమానికి రాజును తీసుకొని వెళ్ళాడు తాన్సేన్ .ఆయన పాట విన్నాడు చక్రవర్తి ..స్వామి అమితానందం లోభౌతిక విషయాలకు అతీతం గా ధ్యానం తో,పరవశం తో అలౌకికానందం తో పాడాడు ఎవరు వచ్చిందీ ఎవరు పోయిందీ ఆయనకేమి పట్టదు ..మైమరపు కల్గించాడు అందరికి .తిరిగి వస్తు అక్బర్అడిగాడు ”తాన్సేన్ నువ్వు అంత అద్భుతం గ ఎందుకు పాడలేవు ”?అని .దానికి తాన్సేన్ ”మీరు శలవిస్తే నే నేను పాడాలి –కానీ హరదాస స్వామి భగవంతుని శలవైతేనే గానం చేస్తారు ”అని వినమ్రం గా సమాధానం చెప్పాడు .ఆంటే స్వేచ్చా గానం యెంత మధురమో అనుభూతి పూర్వకమో దీనిని బట్టి తెలుస్తోంది .
అందుకే రవీంద్రుడు ”My song has put off her adornments ”అన్నాడు .ఆంటే భగవత్ సాన్నిధం లో నా కీర్తన నగ్న సుందరం గ వుంది అని భావం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-18 -06 -11