కృష్ణ నుంచి గంగ దాకా

కృష్ణ నుంచి గంగ దాకా

————————

కృష్ణా నది ఒడ్డ్డునే వున్న విజయవాడకు 25 కిలోమీటర్ల దూరం లో ఉయ్యూరు వుంది .అక్కడినుంచి నేను నా భార్య ప్రభావతి ఈ నెల 18 వ తేది రాత్రి బయల్దేరి బస్సులో హైదరాబాద్ చేరాం .ముందు మా పెద్దబ్బాయింటికి వెళ్లి అక్కడినుంచి మా బావమరిది ఆనంద్ ఇంటికి మధ్యాహ్నం చేరాం .అక్కడ ప్రయాణానికి కావలసినవన్నీ తయారు చేసుకొని సిద్ధమైనాం.21 ఉదయం పాట్నా ఎక్ష్ప్రెస్స్ లో మా ప్రయాణం .మేమిద్దరం ,ఆనంద్ ,అతని భార్య ఇద్దరు పిల్లలు అతనీ అత్తగారు .ఇదీ మా బృందం .ఏడుగురు సభ్యులం .టికెట్స్ అన్నీ నెల రోజుల ముందే బుక్చేశాడు మా బావమరిది . కాబ్ లో అందరం ఉదయంతొమ్మిది న్నర గంటల కు సేకందరాబాద్ స్టేషన్ చేరాం .మారెసెర్వెద్ కం పార్ట్మెంట్ లో మా సీట్లలో కూచున్నాం .ట్రైన్ సరిగ్గా పదిగంటలకు బయల్దేరింది .పొద్దున్నే ఇంటిదగ్గర ఏడుగంటలకు అందరం వేడి అన్నం కూర పచ్చడి పెరుగు తో భోజనం చేసే బయల్దేరాం .రైల్ అయిదు గంటలు ఆంద్ర దేశం లోనే ప్రయాణం చేసింది .ఆంద్ర లో చివరి హాల్ట్ సిర్పూర్ .అక్కడినుంచి మహా రాష్ట్ర ప్రారంభం మా బృందం లో మూడు తరాల వాళ్ళం వున్నాం .మేమిద్దరం ఆనంద్ అత్త ఆంటే మా ఆవిడా అక్క గారు అరవై అయిదు పై వాళ్ళం .ఆనంద్,భార్య యాభై లోపు .వాళ్లపిల్లలు స్పందన వంశీ లు ఇరవైమూడు లోపు .అమ్మాయి బి teck పాస్స్ అయి వ్వుద్యోగం లో వుంటే తమ్ముడు బి teck మూడవ ఏడు . .నేను దీనితో నాల్గో సారి ,మా ఆవిడ మూడో సారి ఆనంద్ రెండో సారి రుక్మిణి పిల్లలు మొదటిసారి కాశీ యాత్ర . ఆ రోజూ టైమ్స్ అఫ్ ఇండియా పేపర్ కోని చదివాను .అందులో రెండు ముఖ్య విషయాలు చెప్తాను .ఒకటి అన్నా హజారే గారి గురించి .పూనా కు దగ్గరలో ఆయన గ్రామానికి చుట్టూ 2200 ఎకరాల భూమి వుంటే అందులో ఆయన కాలు పెట్టేసమయానికి 330 ఎకరాలు మాత్రమే సాగు భూమి .ఆయన మిలిటరీ లో రిటైర్ అయింతర్వాత వచ్చిన penshion డబ్బు తో వాటినితీర్చిదిద్దాలను కొన్నాడు .అందర్నీ సమీకరించి సాంద్ర వ్యవ సాయం చేసి ,చెక్ డాములు నిర్మంచి కొద్ది కాలంలో 1750 ఎకరాలలో పంటలు పండించే ఏర్పాటు చేశాడు .ఇదివిప్లవాత్మక మార్పు .దిగుబడి బాగా వచ్చి అప్పటి దాకా తలసరి ఆదాయం 250 రూపాయలనుంచి ,29000 రూపాయలకు పెరిగిందట .అందుకే ఆయన ను అంతా ఆదర్శం గా తీసుకున్నారు .మనసులోనే ఆయనకు నమస్కరించాను .రెండో విషయం నాగ పూర్ సమీపం లో లో త్రవ్వ కాలలో 25000 ఏళ్ళ నాటి రాతి చిత్రాలు కనిపించాయట ఇదో అద్భుతం పిల్లలకు ఆ విషయంచెప్పి హుషారు చేశా.బలార్శ వచ్చింది .అది వేపచేట్లకు ప్రసిద్ధి .చాల ముదురు చేట్లున్తాయి timber డిపో . వాళ్ళు ఇకడికి వచ్చే కొనుక్కు వెళ్తారు .ఆంద్ర ప్రదేశ్లో అతి పెద్ద timberdipo హైదరా బాద్ లో వున్న అక్కినేని నాగేశ్వర రావుది రెండోది ఉయ్యూరు లోని సుదీర్ timbar డిపో .దాని యజమాని నూకల లింగమూర్తి ఇక్కడికి వచ్చే కలప కొంటాడు .అఆడవులు మనకు దారిలో కనిపించవు దూరం గావున్తాయేమో . గాంధి గారు వున్న సేవాగ్రామం స్టేషన్ లో బండి ఆగుతుంది రాత్రి ఏడు గంటలకు నాగపూర్ చేరాం .ఇది మహారాష్ట్ర కు సాంస్కృతికరాజా దాని అన వచ్చు .ఇక్కడ కాంగ్రెస్ సభలు జరిగి స్వాతంత్ర ఉద్యమం కోసం ముఖ్య తీర్మానాలు చేశారు .ఆర్ .ఎస్ .ఎస్ ,కు ఇది కేంద్ర బిందువు .దాని అధినేతలిక్కడే వుంటారు .కమలాలకు నాగపూర్ చాలా ప్రసిద్ధి .ఇప్పుడు season కాదు తోటలు నాగపూర్ దాటినా తర్వాత కన్పిస్తాయి .ఈ ప్రాంతం లో మన తెలుగు వాళ్ళు చాలా గణనీయ సంఖ్య లో వున్నారు .మనవైపు నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం కస్టపడి చేసి మంచిపంటలు పండిస్తున్నారు .ఈ ప్రాంతం రూపు రేఖలు మార్చిన వాళ్ళు మన వాళ్ళే .నాగపూర్ తెలుగు అసోసియేషన్ చాలా కాలమ్ నుంచి బాగా పనిచేస్తోంది .ఇవన్నీ పిల్లలకు చెప్పుతుంటే చెవులు రిక్కించి విన్నారు ..దారిలొఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ రాత్రికి చపాతి తిన్నాం.మన మంచిర్యాల్ కు ముందు గోదావరి నది దర్శనమిచ్చింది.దాని తర్వాత సిర్పోర్ కాగజ్ నగర్ వచ్చింది .అక్కడి తెల్ల కాగితాలు బాగుండేవి వెదురు చేట్లుకాగితంపై కన్పించేవి .ఏనుగు మార్కు పేపర్ కూడా మా చిన్నప్పుడు బాగా వాడే వాళ్ళం అదే నంబర్ one రాజమండ్రి లో ఆంద్ర పేపర్ తయారయేది.ఇవన్నేఒక్క సారి జ్ఞాపకంవచ్చాయి ;రాత్రి బెర్త్ ల పైపడుకోన్నాము ;.దారిలో ఎక్కడా పచ్చనిపోలాలు కనిపించవు చిన్న చెట్లు తుప్పలె.మోదుగ చెట్లు బాగా వున్నాయి .దాని ఆకులతో విస్తర్లు కుడతారు .అదే ఇక్కదిప్రజల జీవనాధారం .గొర్రెలు ,మేకల పెంపకం వుంది .బోరు బావులు తక్కువ .కరెంటు లేని గ్రామాలు కూడా వున్నాయనిపించింది .బాగా వెనక పడిన ప్రాంతాలే ఇవి .మంచి ఇల్లుకూడా లేవు .నాగ పూర్ నుంచి వర్షం ప్రారంభం అయి దాదాపు 1000 .కిలో మేటేర్లదూరం వరకు వర్షం మాతోనే వచ్చింది .కానుగ చెట్లు బాగా కనిపించాయి .అక్కడక్కడ నల్ల రేగడి భూమి అరుదు గా కన్పించింది .రాత్రి నిద్ర పోయాము .ఉదయం కాఫీలు తాగాము .ఇటార్శి అర్ధరాత్రే వచ్చినట్లుంది మధ్య ప్రదేశ్ లో కి ప్రవేశిస్తాము .మధ్యాహ్నం పదకొండు గంటలకు అలహాబాద్ చేరాం .ఇక్కడ హిందీ లో ఇలాహాబాద్ అని రాస్తారు .ఇదిఉత్తరప్రదేశ్ లో వుందని మనకు తెలుసు .ఆంద్ర ,,మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్ చేరాంఅన్న మాట . యు.పీ tourism వాళ్ల తో మాట్లాడి కాంతెస్సా కార్ మాట్లాడుకొని స్టేషన్ నుంచి state బ్యాంకు వాళ్ల హాలిడే హోమేచేరాం ఆనంద్ స్టేట్ బాంక్ లో ఆఫీసర్ కనుక మున్దేబోక్ చేశాడు ,విశాల మైన రూం. డబల్ కాట్ బెడ్ .సోఫాలు వున్న పెద్ద హాలు ,టి.వి .వేడి నీళ్ళు ,ఫ్రిట్జ్ అన్ని సౌకర్యాలు వున్నాయి .రోజుకు పది.. రూపాయలే అద్దె బ్యాంకు వాళ్ళకే ఇస్తారు .అక్కడ సామాను దించి ప్రయాగ లో స్నానానికి కావలిసినవి విడి గా సద్దుకొని వెంటనే బయల్దేరం స్నానం sight సీఇంగ్ అన్నీ కలిపి ఒక్కొక్కల్లకి 400 రోపాయలు .అప్పటికే మధ్యాహ్నం పన్నెండు దాటింది .రాయల్రెస్టారెంట్ లో దక్షినాది టిఫిన్లు దొరుకు తాయని తెలిసి అక్కడికివేల్లాం .రెట్లు వింటే గుండె గుభేలే .కాఫీ నలభై రూపాయలు .ఇడ్లి అరవై అయిదు .ప్లాట్ పెరుగు వడ డెబ్భై .ఇదే అందరం తిని ,మూడు కాఫీలు అందరం సర్దుకున్నాం .ఆ రోజూ నాపుట్టిన రోజూ అని టిఫిన్లు అయిన తర్వాత తెలియ జేసి బిల్లు 610 నేనే చెల్లించాను చిన్న పార్టీ ఇచ్చినట్లు .అంతా ఆశ్చర్యపడ్డారు ఒక్క మాట కూడా ముందుగా చెప్పనందుకు . త్రివేణి సంగమం చేరాం కారులో అక్కడినుంచి టూరిసం వాళ్ళు ఏర్పాటు చేసినబోటు లో బ సంగమ స్థలం చేరాం .అప్పటికి సుమారు ఒకటిన్నర .నేనే అందరికి స్నాన సంకల్పం చెప్పాను .పడవ వాడు దారిలో ఒక చోట 140 అడుగుల లోతున నీళ్ళు వున్నాయని చెప్పాడు .అంతా కంగారుపద్దాం..కాని సంగమ స్థానం లో కేవలం నాలుగు అడుగులలోతు నీళ్ళ l దగ్గర బోటు ఆపాడు .అందులోంచి దానికి ఆనుకున్న లంగరు వెయ బడ్డ ఇంకోబోఅట్ లోకి మారాం .దాన్ని పట్టుకొని స్నానం చెయ్యాలి .గంగ నీరు తెల్లగా ,యమునా నీరు నల్లగా కనిపిస్తాయి .సరస్వతి అంతర్వాహిని .ఈ మూడు కలిసే చోటే త్రివేణీ సంగమం .చాలావిత్ర మైనది .ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే ఇక్కడ స్నానం చేయ గలుగు తాం అందరికి విషయాలన్నీ చెప్పాము నేను ఆనంద్ .ఒళ్ళు పులకించిపోయింది స్నానానికి ఒక్కొక్కరం దిగాం.ముందుగా నా కంటే పెద్ద మా ఒదిన గారిని ఆంటే మా ఆవిడ అక్క గారిని ఆంటే ఆనన్ద అత్తగారిని నీళ్ళలోకి దిమ్పాము .ఆవిడ చాలా భయ పడింది .భయం ఒదిలించాం .దిగిన్తర్వాట కేకే .భలెఆనన్దమ్ సంతృప్తిగా స్నానం చేసింది తర్వాత మా దంపతులు మేనల్లుడు మేన కోడలు దిగి స్నానం చేశాం .తర్వాత ఆనంద్ దంపతులు.నేను కాసేపు నీళ్ళలో ఈదాను .ఫోటోలు తీశారు . ప్రవాహం తక్కువ లోతు తక్కువ గా వుంది ఇదివరకు మూడు సార్లు వచ్చినప్పుడు కాళ్ళు నెల మీద ఆనేవి కాదు .విపరీతమైన వేగం .ఇసుక కోసుకుపోతుండేది .ఈ సారి నిలకడ గా వుండటం అందరి అదృష్టం .గంటపైగా స్నానం చేశాము .అందరం భూతల స్వర్గం లోవున్నట్లు భావించాం .ఆ అనుభవం మాటలతో చెప్ప లేనిది .ఈ క్షేత్రానికి అంతా పవిత్రత వుంది శంకరాచార్యులు నడయాడిన నెల ,మండన మిశ్రుని ఓడించి శిష్యున్నిగా చేసు కొన్న ప్రదేశం ,ఎన్ని యుగాల నుండో ఈ వాహ్హిని ఎన్ని కోట్లమందినికిముక్తినిచ్చినోఅవన్నీ తలుచుకుంటే ఆనందం అర్ణవం అవుతుంది జన్మ తరించిందని పిస్తుంది .కంఠం గద్గదిక మవుతోంది .మాటలు రావు .ఎందరు మహర్షులు వ్యాసాదిమునులు వాల్మీకాది మహర్షులు కాలు మోపి న పుణ్య భూమి . నీటితో మా పితృదేవతలకు ,తెలిసిన బంధు మిత్రాడులకు ,మరిచి పోయిన మహాను భావులకు పేరుపేరునా జ్ఞాపకం చేసుకొని తర్పణం జలం తో ఇచ్చి నా , విధి నేర వేర్చాను సాయం సంధ్య వార్చాను . ఆ నదీమ తల్లులకు మనసారా నమస్సులన్దిన్చాము .ఆ నదుల వల్లనే వల్లనే ఇక్కడ అద్భత మైన నాగరకత వర్ధిల్లింది .సుక్షేత్రాలైనాయిపోలాలు పాడి పంట వెద శాస్త్ర విజ్ఞానం వికశించి ప్రపంచం లో భారత దేశం సాంసృతిక విషయాలలో ముందుంది . .గంగా పుష్కరాలు వెళ్లి సరిగ్గ నెల అయింది .ఈ సంవత్చరం అంతా పుష్కరమే .కనుకుపుష్కర స్నాన ఫలం దక్కింది ,మధ్యాహ్నం 12 -.01 మధ్య పుష్కరుడు ఉంటాడట అప్పుడే కొట్లాదిదేవతలు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారట .అలాంటి సమయం లో చేసే అరుదైన అదృష్టం కల్గింది కొంతాలస్య అయినా .ఆనందం తో కల్లుకళ్ళు మూసుకు పోతున్నాయి .పిల్లలు మరుపు రాని అనుభూతిపొంది నట్లు చెప్పారు .ఇదివరకు ఇక్కడికి పెంగ్విన్లు సైబీరియా నుంచి వలస పక్షులువచ్చాయి.ఇప్పుడవి కనిపించ లేదు season కాదేమో .ఇంతా ఆనందాన్ని మూట కట్టుకొని సంగమ జలాన్నిబాటిళ్ళలో కావలిసి నంత పట్టుకొని నెమ్మదిగా మళ్ళీ మా బోటు చేరి బట్టలు మార్చుకోన్నాం .ఉయ్యూరు లో మా ఆవిడ నా కిష్టమైన మైసూర్ పాక్ చేసి తెచ్చింది .నాపుట్టినరోజు ఆంటే మైసూరు పాక్ ఉండాల్సిందే .మా అమ్మ ఎప్పుడు చేసి పెట్టేది .తర్వాత ప్రభావతి .అందరికి పుట్టిన రోజూ స్వీటు తినిపించాం అంతా శుభా కాంక్షలు చెప్పారు .త్రివేనికి నెమ్మదిగా వీడ్కోలు పలుకుతూ కృతజ్ఞత చాటుతూ ,మానసిక వుల్లాసాన్నిపొందుతూ ఒడ్డుకు చేరాం .నదీస్నానం చాలా యోగ్యమైనది కరెంటు ఆంటే ప్రవాహం మరియు విద్యుత్తూ అనిఅర్ధం .ఇలాంటి పవిత్ర నదీ జలాలలో స్నానం చేస్తే ఒంటికి శక్తి ప్రవాహం చేరుతుంది .శరీరానికి మనస్సుకు ఉల్లాసం కలుగు తుంది .ఆధ్యాత్మిక భావ లహరి మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తుంది .మోకాళ్ళ నేప్పులతో అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితి లో వున్న నా భార్య త్రివేణీ సంగమ స్నానం చేసినతర్వాత తనకు కొత్త శక్తి వచ్చిందని హాయిగా నడవ గలుగు తున్నానని చెప్పి ,మాతో పాటు నడిచి అన్దర్నేఆశ్చర్య పరిచింది .అదీ దాని ఫలితం .కొత్త శక్తిని నింపుకొని ,మనసంతా ఆనందాన్ని నింపుకొని ,అంతకు ముందు లేని వింత అనుభూతిని పంచుకొని అందరం ఆ త్రివేణీ మాతకు హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు చేతులు జోడించి చెప్పి గాలిలో తేలి పోయేట్లు పొంగిన మనసులతోనిండిన సంత్రుప్తి తో నెమ్మది గా ఒడ్డుకు చేరాం .ఇక్కడి వాళ్ళు ఈప్రదేశాన్ని సంగం అంటారు .రాజా కపూర్ ఆ పేరుతో సినిమాకూడా తీశాడు .ఒడ్డున పూర్వపు రాజుల కోట వుంది చాలా పెద్దది .ఇదివరకు అందర్నీ లోపలికివెల్లి చూడ నిచ్చే వారు .ఇప్పుడు అవకాశం లేదు మళ్ళీ కారు ఎక్కి sight సీఇంగ్ కు బయల్దేరాం .దగ్గరలో బడే హనుమాన్ గుడిని చూశాం .నా పుట్టిన రోజున మా ఇలవేలుపు దర్శనం శుభదాయకం .ఎక్కడో లోతులో వున్తాడుస్వామి .పైనించి కటకటాల ద్వారా చూడాలి .ఆనంద్ భవన్ అయిదు దాటితే మూసేస్తారు .అక్కడికి ఇంకో పావు గంట ఉందనగా చేరాం .ముసలి వాళ్ళు కార్లోనే వున్నారు .పిల్లలకు అన్నీ వివరిస్తూ ,వీలయితే ఫోటోలు తీస్తూ తీరిగ్గా చూపించాం .మోతీలాల్ ఇక్కడే లా ప్రాక్టీసు చేశాడు .రాజకీయాలలో చేరి గొప్ప నాయకుడైనాడు .ఆయన గదులు ,పుస్తకాలు వాడిన వస్తువులు చూశాం .తర్వాత నెహ్రు గారి వైభవం .ఆఅర్వాతైన్దిరా గాంధి వైభవం .నెహ్రు ఒడుగు చేసు కున్న ఫోటో వుంది .శీర్షాసనం వేస్తున్నాదీ వుంది చరక ,గుర్రపు సార్టు వున్నాయి గాంధి గారు తరచుగా ఇకడికి వచ్చిమోతీలాల్ జవహర్లాల్ ల తో సంభాషణ చేసే వారు .ఆయనకు ఒక ప్రత్యెక మైన గది వుంది ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఆనంద భవన్ లోనే జరిగేవి .అందుకే దానికంట ప్రాముఖ్యం .మంచి లాన్లుపచ్చగా మనసు హాయినిస్తాయి.కొన్ని కోట్లు ఖరీదైన ఆస్తులివి .దేశానికి రాసిఇచ్చి మహా త్యాగులని పించుకున్నారు .అందుకే ప్రజలు ఆ కుటుంబానికి బ్రహ్మ రధం పడతారు .దానికి తగ్గట్టే మొతెలాల్ ,జవహర్లాల్ ఇందిరా ,రాజీవ్ ,సోనియా లు దేశ రాజా కీయం కీలక పాత్ర పోషించారు దీనికి దగ్గరే గంగ ఒడ్డున భరద్వాజ మహర్షి ఆశ్రమం వుంది .శ్రీ రాముడికి ఆ తర్వాత భరతుడికి ఆ ముని అతిధి మర్యాదలు చేసి మార్గ దర్శనం చేశాడు .అక్కడి నుంచి పార్కు musiam వేణీ మాధవ్ దర్శనమ్చేశాం .ఇక్కడ పెరుగు అలిపిన మజ్జిగలో పంచదార వేసి ఇస్తారు చాలా బాగుంటుంది .లస్సి అంటారు .తాగని వాళ్ళు ఇస్సీ అనాల్సిందే .స్వీట్లు ఎక్కువ తింటారు .ఇక్కడ ,కాశీ లో బిల్దిన్గులకు బయట సిమెంట్ ప్లాస్తింగ్ చెయ్యరు .టీ ని మట్టి కప్పులతో తాగాటమిక్కడి పద్ధతి .ఎంగిలి వుండదు .తాగ గానే పగలకొట్టేస్తారు అంతా అయింతర్వాత పొద్దున్న టిఫిన్ చేసిన హోటల్కే వెళ్లి భోజనం చేశాం .ఒక్కొక్కరికి 135 రస్.చాల బాగా వుంది భోజనం .ఇష్టపడి తిన్నాం .అలసట మూడు వంతులు సంగమ స్నానం తోమిగిలిందిభోజనం తో తీరింది . హాలిడే హోం చేరాం .అందరికి పక్కలు ఏర్పాటు చేశారు . పడుకున్నాం కాని .దోమల వల్ల నిద్ర బాగా పట్టలేదు .తెల్ల వారు ఝామున మూడింటికి కార్ లో బయల్దేరి 125 కిలోమీటర్ల దూరంలో వున్న వారణాశి అనే కాశీకి ప్రయాణం పెట్టుకున్నాం .ఆ వివరాలు తరవాత మనవి చేస్తాను మా యాత్రలో పాలు పంచుకున్న మీకు ధన్య వాదాలతో మీ .గబ్బిట దుర్గా ప్రసాద్ —30 -06 -11 —-క్యాంపు —హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.