కృష్ణ నుంచి గంగ దాకా -03

    

    కృష్ణ నుంచి గంగ దాకా —౦౩
              మధ్యాహ్నం మూడు గంటలకు ఆటో కు మూడు వందల యాబై కి రెండు ఆటో లలో లక్ష్మణ శాస్త్రి గారింటినుంచి నగర సందర్శనకు బయల్దేరాం .ముందుగా రెండు కిలో మీటర్ల దూరం లో వున్న కాల భైరవ ఆలయం చేరాం .విశ్వనాధ దర్శనం తర్వాత ఇది చాలా ముఖ్యం .భైరవుడు ఆంటే శునకం ,ఈయన కాశీ క్షేత్ర పాలకుడు .నిరంతరం కాశీని రక్షిస్తుంటాడు .అక్కడ వుండే పూజారి ఈకల కుంచె తో నెత్తిమీద బాదుతూ కాశీతోరం కడతాడు .అది నల్లగా ఉంటుందని అందరికి తెలుసు .కొనుక్కొని ఇళ్ళకు తెచ్చి బంధువులందరికీ ఇస్తారు .అది కాల భైరవ రక్ష అన్న మాట .ఇక్కడ ఒక కధ తెలియ జేస్తాను .పూర్వం బ్రహ్మ దేవుడు అహంకారం తో బల గర్వం తో తానే పరబ్రహ్మ స్వరూపం అని విర్ర వీగి పరమేశ్వరుణ్ణి కూడా తూలనాడాడు .శివుడికి కోపం వచ్చి తన తేజం నుంచి కాలభైరవున్ని ఉద్భవి౦పజేశాడు .ఆయన వీర ఆవేశం తో బ్రహ్మ వెంట పడి ఆయనకున్న అయిదవ శిరస్సును గోళ్ళతో పీకేశాడు .ఆ తల ఆయన చేతికే అంటుకు పోయింది .దాన్ని వదిలించుకోవటానికి కాలభైరవుడు లోకాలన్నీ తిరిగాడు చివరికి కాశీ క్షేత్రం చేరా గానీ ,ఆయన బ్రహ్మ హత్యా పాతకం పోయి ,బ్రహ్మ కపాలం ఊడి కింద పడి పోయింది .అంతటి బ్రహ్మ హత్యను కూడా పోగొట్టే మహిమాన్విత క్షేత్రం కాశీ .ఆది శంకరాచార్యుల వారు  ”కాశికా పురాదినాద కాల భైరవం భజే ”అనే మకుటం తో అష్టకం రాశారు .అది మనసులో చదువుకున్నాను .దాన్ని పఠిస్తే  మంచి ఫలితం లభిస్తుంది 
                             తర్వాత గవ్వల గౌరి మందిరంచేరాం .అక్కడ అయిదు గవ్వలను చిన్న మట్టి ప్రమిదలో పెట్టి అయిదు రూపాయలకు అమ్ముతారు .మహిళలు కోని అమ్మ వారి ముందు నిలిచి పూజారి చెప్పినట్లుగా ”కాశీ ఫలం మాకు ,గవ్వల ఫలితం నీకు ”అని చెప్పి ఆమె పై విసరాలి .అందరు తప్పక దర్శిస్తారు .ఆమె దర్శనం ఫల ప్రదం .దీనికి దగ్గరలో దుర్గా దేవి మందిరం దర్శిస్తారు .
                      తర్వాత తులసీ మానస మందిరం చూశాం .పూర్తి పాల రాతితో కట్టిన రెండస్తుల భవనం .గోస్వామి తులశీదాస్ కాశీ నివాసి .ఇక్కడే ఆయన శ్రీ రామ చరిత మానస్ అనే రామాయణాన్ని హిందీ లో రాశారు .మహాభక్తుడు .దీన్నే తులసీ రామాయణం అంటారు .ఉతరాది వారికి వాల్మీకం తర్వాత ఇదే అత్యంత ప్రీతి పాత్రం .ఇందులోనే హనుమాన్ చాలీసా వుంది .అందరు దీన్ని పారాయణ చేసి మంచి ఫలితం పొందుతారు మదిరం గోడల మీద తులసీ రామాయణం అంతా చెక్కారు .ముఖ్య సంఘటనల chitraalu కూడా గోడలపై కను విందు చేసేంత మనోహరం గా వుంటాయి దీన్ని 1964 లోసేత్ రతన్లాల్ నిర్మించాడు .ఇక్కడ పాలరాతి పంచ పట్టాభిరామ స్వామి మందిరం ,తులసీ దాసు మందిరం చూడ తగినవి  కుడివైపు  కైలాస పర్వతం ,ఎడమ వైపు రామేశ్వరం నిర్మించారు  
                      తర్వాత శ్రీ మదన మోహన మాలవ్యా గారు నిర్మించిన ”కాశీ విశ్వ విద్యాలయం ”సందర్సి౦చాము .వందలాది ఎకరాలలో ,దాదాపు అన్ని ఫాకల్టీ లతో వున్నది .పూర్వం ఇక్కడ చదవటం ఒక వరం .బెనారస్ డిగ్రీ కి చాలా విలువ వుంది .మాలవ్యాజీ దేశమంతా తిరిగి చందాలు పోగుచేసి ఎంతో శ్రమ అవమానం భరించి దీన్ని నిర్మించారు .అవసరమైతే రైల్వే కూలీగా పనిచేసి సామాన్లు మోసి డబ్బు కూడా బెట్టిన మహాను భావుడాయన .శ్రీ శృంగేరి పీఠాధిపతులను ఆహ్వానించి ఆరంభం వారి చేతుల మీదుగా జరిపించారు .లోపల బ్రహ్మాండమైన విశ్వేశ్వరాలయం రెండతస్తులతో వుంది. పాలరాతి కట్టడం .నిత్యం అభిషేకం చేస్తారు .పీడా శిఖరం చాలా ముచ్చటగా వుంటు౦ది. మాననీయ మాలవ్యా విగ్రహం లోపల ఆకర్షణీయం గా వుంటుంది .ఆ మహాను భావుని కృషికి ,పట్టుదలకు దీక్షకు ,విద్యాభిమానానికి ,మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాను .ఆయన విద్యా సేవ గురించి కధలు ,గాధలు గా చెప్పుకొనే వారు నా చిన్నప్పుడు .పాఠ్యాంశాలుగా కూడా చదువు కున్నాం .ఎందరు తెలుగు వారిక్కడ చదువుకొని డిగ్రీలు పొందారు .విశ్వనాధ సత్య నారాయణ గారిని ఆహ్వానించి రామాయణ కల్ప వృక్ష పద్యాల్ని ఆయన నోటితో విని ఘన సన్మానం చేశారిక్కడ .
                         తిరిగి వస్తు దారిలో ”సంకట మోచన హనుమాన్”ను దర్శి౦చాము .చాల శోభగా ,గొప్ప అలంకారం తో ,దివ్య సుందర మూర్తి గా కనిపిస్తారు .మంగళ ,శని వారాల్లో ఇసక వేస్తె రాలనంత జనం .వివిధ రకాలైన స్వీట్లు ప్రసాదం గా అమ్ముతారు .ఇక్కడ ఏ దేవాలయం లోను ,కొబ్బరికాయ కొట్టరు .ప్రసాదం నైవేద్యం పెట్టరు .మనమే నైవేద్యం పెట్టుకొని తీసుకు వెళ్ళాలి సెక్యూరిటీ బాగా వుంటుంది .కెమెరాలు సెల్ ఫోన్లు నిషిద్ధం 
                      200 ఏళ్ళ క్రితం ఏర్పడిన సంస్కృత కళాశాల వుంది దేశం లోని. అన్ని ప్రాంతాలనుండి విద్యార్ధులు వచ్చి చదువు కొంటారు .వారణాశి కంటోన్మెంట్ దగ్గర భారత మాత మందిరం వుంది .దేశాన్ని అంతా సిమెంట్ తో చక్కగా నిర్మించారు .పర్వతాలు ,నదులు ,సముద్రాలు ,ముఖ్య ప్రదేశాలు చాలా స్వభావ సిద్ధం గా కనిపించి ,సంభ్రమాన్ని కల్గిస్తాయి .హం సబ్ ఏక్ హాయ్ అనే భావం కలుగుతుంది .సుందర భారత మాట దర్శనం తో మనసంతా దేశ భక్తీ కలిగి పులకిస్తాం .
                         ఒక సిల్క్ స్టోర్స్ ఆడ వాళ్ళు షాప్పింగ్ చేసిన తర్వాత అందరం .మళ్ళీ శాస్త్రి గారింటికి చేరాం అక్కడినుంచి రిక్షాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర మందిరం చేరాం .విశ్వేశ్వర లింగాన్ని చేతితో తాకి స్వయం గా గంగా జలం తో అభిషేకం చేసే అరుదైన ,అద్భుతమైన అవకాశం ఇక్కడ లభిస్తుంది భక్తులకు .దేనికే డబ్బులు లేవు .ఉచిత దర్శనమే .పూజార్లు అడుగు తారు .విశ్వేశ్వర దర్శనం ముక్తినిస్తుంది .చూసి ,తాకి ,పులకి౦చామ్ .రాత్రి ఎనిమిది గంటలకు రోజూ రెండు గంటల పాటు అభిషేకం జరుగు తుంది .తప్పక చూడ తగినది .అప్పుడు లింగాన్ని ముట్టుకో నివ్వరు .దూరం నుండే దర్శనం .ఉదయం పదకొండు గంటలకు కూడా అభిషేకం చేస్తారు .స్వామి దర్శనం తో ఒళ్ళు పులకిస్తుంది ,శివ స్తుతి చదువు కుంటు దర్శనం చేస్తారు భక్తులు .ఆనందం తో హరహర మహాదేవ శ౦భో అని నినాదాలు చేస్తూ దర్శిస్తారు .అభిషేకం బాగుంటుంది ఘంటా నినాదాలు ,ఓంకార ధ్వని ,శంఖ నాదం తో ఆలయం అభిషేక సమయం లో మార్మోగుతుంది .కైలాసం లో వున్న అనుభూతి కలుగు తుంది .భూకైలాసం అనిపిస్తుంది ముకుళిత హస్తాలతో జనం ఒళ్ళు మరిచిపోయి అమందానందం తో తనువు ,మనసు ఎకమైపోతాయి .ఇక్కడ పార్వతీ దేవి ఆలయం వుంది .ఆమెను సందర్శించి మొక్కు కున్నాము .ఇక్కడ శివుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తారు .ఆ పూల దండలు శివునికి నివేదిస్తారు .ఆవు పాలు గ్లాసులతో అమ్ముతారు .వాటినీ స్వయం గా అభిషేకం చేసుకో వచ్చు .స్వీట్లే ఇక్కడి నైవేద్యం .రక రకాల స్వీట్లు అమ్ముతారు .పాలను బాగా మరిగించి ,పైన తేట  ఆంటే మీగడ విడిగా తీసి పంచ దార వేసి అమ్ముతారు ..దీన్ని మలాయి అంటారు .అంతా దీన్ని ఇష్టం గా తింటారు .మేము తిన్న్నాము .
                      ఇక్కాడ వ్విశ్వ నాద మందిరం గురించి కొన్ని వివరాలు .మహమ్మదీయుల దండయాత్రలో ఈ ఆలయం అనేక సార్లు ద్వంస౦ అయింది .మళ్ళీ పునర్నిర్మించబడింది .దీని పక్కనే మసీదు కూడా వుంది కాశీ లో హిందూ ,ముస్లిం ,జైన బౌద్ధ ,christavululu మత సహనం తో నివశించటం విశేషం . 
                 మణికర్ణికా ఘట్టం నుంచి నాలుగు ఫర్లాంగుల దూరం లో నే విశ్వేశ్వర ఆలయం వుంది. దీని గోపురం 22 మణుగుల బంగారం రేకులతో నిర్మించబడింది ఈ బంగారాన్ని రంజిత్ సింగ్ మహారాజు సమర్పించారు ఇప్పుడున్న మందిరం 1785 లో రాని అహల్యాబాయి నిర్మించారు. తెల్లవారు ఝామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఆలయం తెరచి వుంటుంది .ఆంటే nonstop దర్శనం అన్న మాట. అక్కడినుంచి రెండు కిలో మీటర్ల దూరం లో విశాలాక్షి మందిరానికి బయల్దేరాం .దారి ఇరుకు .కరెంటు లేదు .మధ్యలో నల్లటి ఆవులు మనల్ని రాసుకుంటూ పోతాయి .వర్షం తో కాళ్ళు జారుతున్నాయి .చాలా భయంకరంగా వుంది నడక సాగాడు జారి పడి పోతామేమో నని భయం .ఈ దారి ఏమిటీ అని మా ముసలాళ్ళ గోల. మధ్య చాల కస్టపడి విశాలాక్షి ని దర్షించాము .ముందున్న విగ్రహం వెనుక అసలైన విగ్రహం వుంది .దాని ప్రభావం కాపాడటానికి ముందు విగ్రహం వుంది . పూజారి చేతిలో ఇరవై పెడితే అమ్మ వారి ఫోటో ,గాజులు ,కుంకుం పొట్లం కట్టి ఇస్తారు .అది తీసుకొని శాస్త్రి గారింటికీ అక్కడ అప్పటికే కరివేన వారి సత్రం నుంచిన ఫలహారపు పోట్లాలతో హాలిడే హోం చేరాం .రాత్రి పన్నెండు గంటలకు కాని కరెంటు రాలేదు .తెచ్చిన టిఫిన్ అతుకుల పులిహోర బాగా ఇష్ట పడి తిన్నాం నిద్ర పోయాం 
              రోజూ రాత్రి పూట గంగా దేవికి ఏడు గంటలకు అన్ని ఘాటుల లోను హారతి ఇవ్వటం సంప్రదాయం .నయనానందకరం .దొప్పలలో దీపం ఆవు నెయ్యితో కలిపింది వెలిగించి మహిళలందరూ గంగలో వదులు తారు .మనోహరమయిన సన్నివేశం .గంగలో ఆ దీపాలు కదిలి అలలకు ఊగుతుంటే అద్భుతం గా వుంటుంది .మేల తాళాలు కూడా వాయించి శోభ కల్గిస్తారు .ఈ గంగా హారతి హరిద్వారం లో చాలా చాలా హృదయాహ్లాదం గా వుంటుంది .అనురాధా పోడ్వాల్ చాల గొప్ప పాట పాడారు .ఆ రికార్డు పెట్టి దీపాలు సమర్పించటం రివాజు 
                      ఇవాళ అన్న పూర్ణ దర్శనం చేయ లేక పోయాం .టైం చాలక .మర్నాడు చేద్దామని భావించాము .వర్షం మూలం గా గంగ హారతికి వెళ్ళ లేక పోయాం .
            ఉత్తర భారత దేశం లో పూజారులను ”పండాలు””అంటారు .పండితులు అని అర్ధం .పండితుడే పండా గా మారాడు .వీళ్ళదే హవా. ఇక్కడ జోషీ అనే ఆయనకు చాలా భవనాలు ,ఎంతోమంది అనుచరులు వున్నారు .domination ఆయనదే .తర్వాత మన తెలుగు వాళ్ళు వచ్చి బాగా స్థిరపడ్డారు పౌరోహిత్యం లో .ఇక్కడ రాజా కీయాన్ని ప్రభావితం చేసేది పండాలె .అందుకే చెన్న రెడ్డి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా వున్నప్పుడు ఈ పండా వ్యవస్థ రద్దు చేయ టానికి విశ్వ ప్రయత్నం చేశాడు .ఆయన వల్ల కాలేదు .చివరికి ఆయన్ను తమిళ నాడు కు మార్చారు తప్ప ఏమీ జరగలేదు 
                     మిగిలిన విషయాలు తరువాత అందిస్తాను ….ఇప్పటికి సెలవ్ ——–మీ —గబ్బిట .దుర్గా ప్రసాద్ –02 o7 -11 క్యాంపు –బెంగళూర్ .
                           
                 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.