బ్లూ వేల్స్ (blue whales )
బ్లూ వేలుకు పెద్ద గుండె వుంటుంది .గుండె బరువు ఏడు టన్నుల పైనే .మన ఇంట్లో పెద్ద గది అంతాన్న మాట .దానికి నాలుగు చిన్న గడులుంటాయి .చిన్న పిల్లలు తల నిటారుగా వుంచుకొని హాయిగా అందులో నడవ వచ్చు .వాల్వేస్ లోంచి రావా టానికి మాత్రం తల వంచాలి .వాటి కవాటాలు
స్వింగింగ్ డోర్స్ అంతా పెద్దవి .ఇది వందల అడుగులున్తుంది గుండె వంద .చిన్నది పుట్ట గానే ఇరవై అడుగుల పొడవుంటుంది .నాలుగు టన్నుల బరువుంటుంది .మామూలు గా మనం నడిపే కార్ కంటే పెద్దది అన్న మాట .రోజూ తల్లి దగ్గర వంద గాలన్ల పాలు తాగు తుంది .రోజుకు రెండు వందల పౌన్ల బరువు పెరుగు తుంది .సుమారుగా ఏడు లేక ఎనిమిది ఏళ్ళు వచ్చే సరికి పుష్పవతి అవుతుంది .మేటింగ్ కోసం ఎవరికీ కనపడ కుండా వెళ్లి పోతుంది .మేటింగ్ ఎలా జరుగు తుందో ,ఆ సమయం లో దాని తిండి ఏమిటో ,ప్రవర్తన ఎలా వుంటుందో ఎవరికీ ఇంకా తెలీదు .ప్రపంచం లో 10 ,000 బ్లూ వేల్సులున్నాయని అంచనా. ఇంత పెద్ద జలచరం ఇంతవరకు ఏదీ లేదు .భారీ కాయంతో భారీ గుండెతో ఇవి జంటలు జంటలుగా ప్రయాణం చేస్తాయి .చొచ్చుకుంటూ పోతూ చేసే అరుపులు వాటి తెరచుకున్న నోటి ధ్వని ని నీళ్ళ అడుగున మైళ్ళ కొద్దీ దూరం నుంచి విని పిస్తుంది
నేను తెలుసుకున్న విషయాలు మీకు తెలిపాను .ఇంకా దీని గురించి సమాచారం వుంటే తెలియ జేయండి కలుపుతాను
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —o6 –07 -11 .—క్యాంపు —-బెంగళూర్