సుధా సింధు
అహంకారాలు మూడు ఒకటి అహం బ్రహ్మాస్మి రెండు మిధ్యాహంకారం మూడవది గౌణ.”పుత్రే పుష్టి అహం పుష్టి –పుత్రే నష్టే అహం నాస్తి ”పుత్రుడు బాగుంటే నేను బాగుంటాను .ఇది గౌణ అహం .చివరిది రెండోది పోతే మొదటిది లభిస్తుందని విద్యారణ్య వచనానికి శంకర భాష్యం .
అహంకారం లో కారం పోవాలంటే రజోగుణం ,దానికి కారణ మైన కోరికలు వాసన ,మనస్చాన్చాల్యం పోవాలి అప్పుడే అహం కలుగుతుంది .
paul brinton అనే పాశ్చాత్యుడు శ్రీ రామనులను సందర్శించి అడిగిన ప్రశ్నకు ”who am I ”అని ఆలోచించ మన్నారు మహర్షి
నీళ్ళమీద నడిచే శక్తి పొందాను అని ఒకాయన శ్రీ రామ కృష్ణ పరమహంస దగ్గర గొప్పగా చెప్పాడట .”పావలా ఇచ్చి నదిని దాటటానికి నీ జీవితం అంతా వృధా చేసుకున్నావు నాయనా ”అన్నారట పరమహంస .
ఒకసారి దుర్యోధనుడిని అడిగారట ఎవరో ”అన్ని శాస్త్రాలు చదివావు కదా .ఎందుకు చేదుగా ప్రవర్తిస్తున్నావు ? ” దానికి అతని సమాధానం ”జానామి ధర్మం నచ మే ప్రవ్రుత్తిహ్ -జానామి అధర్మం నచ మే నివ్రుత్తిహ్ ”దాని అర్ధం –ధర్మమేదో నాకు తెలుసు అయితె దాని వైపు నా మనసు పోవటం లేదు .అధర్మం బాగా తెలుసు నా మనస్సు అటే లాగుతుంది .అందుకే పాపాలు చేస్తున్నాయి .నేనేమి చేయను ?
ఒకసారి అరునునుడు కృష్ణునితో ”నువ్వు చెప్పేవన్నీ తెలుస్తున్నాయి బావా .కానీ లోకం లో మానవులు విరుద్ధం గా ప్రవర్తిస్తున్నారు కారణం ఏమిటో తెలియటం లేదు ”అన్నాడు /.ఆపుడు కన్నయ్య ”కోరికలు ,కోపం వారిని అలా ప్రవర్తిన్చేట్లు చేస్తాయి .అన్నాడని మనకు గీత తెలియ జేస్తోంది .
పూర్వం గురుకులాల్లో శిష్యుడు తప్పు చేస్తే చన్నీటి తో స్నానం చేయించే వారట .అంతే రోజూ శిష్యుడికి వేడి నీటి స్నానమే ఉండేదని తెలుస్తోంది
”తస్మాత్ యత్ పురుషో మనసాదిగాచ్చతి –తద్వాచా వదతి తత్కర్మనా కరోతి ”అని వేదం అన్నది .అంటే మానవుడు ఏది ఆలోచిస్తాడో ,చెప్తాడో ,అదే చేస్తాడు . ”మనసా నిష్ట చింతనం ”మనసు లో చెడు ఆలోచన వస్తే అది పాపమే .
”నీ ఉనికి కోసం చాలా ప్రయత్నాలు చేశా. నిన్ను నిరూపించటానికి ఎన్నో వాదాలు చేశా .ఇంకా కొంతమంది రాతి హృదయం వున్న వాళ్ళున్నారు .వాళ్లకు నమ్మకం కలగటం లేదు .అయినా వారిపై నాకు జాలి వుంది .వారినీ క్షమించు .యందు కంటే వారంతా ఎప్పుడు నీ స్మరణే చేస్తున్నారు ..ఈశ్వరుడు లేదని వాదిస్తూ ,నీ నామమే వాళ్ళు సదా జపిస్తుంచే మూడులు వారు .వారిమీద అపార నీ కరునామ్రుతం కురిపించు ”అని దీనులు ,మూధుల పై సానుభూతి చూపించాడు ప్రహ్లాదుడు . ”వితదాభి నివేశః ” wasteful attachment పనికి రాదు అని భావం
వచనేకా దరిద్రతా ”మాటలో పారుష్యం పనికి రాదు అది పాపమే .”అనృతం చైవ ”అబద్ధమూ పాపమే .”పైశూన్యం చాపి సర్వశః ”–చాడీలు చెప్పటం నేరం .”అసం బద్ధ ప్రలాపం నేరం ”అనవసరం గా మాట్లాడటము నేరమే .ఇవన్నే పడి పాపాలు .మూడు బుద్ధికి ,నాలుగు నాలుకకు ,మూడు శరీరం తో చేసే పాపాలివి .
ఉపదేశ పంచకం లో శంకర భగవత్పాదులు ”జన కృపా నైస్తార్య ముత్చ్రుజ్యతే ”అన్నారు అంటే ఇతరుల సానుభూతి కోరరాదు .వారి కోపం కూడా పనికి రాదు .పెద్దల దారిలో నడవాలి .
వాసనలు మూడు .మొదటిది శాస్త్ర వాసన ఇది మూడు రకాలు .పాత ,శాస్త్ర ,అనుష్టాన వ్యసనాలు .పాత వ్యసనం అంటే నేర్చుకోవాలనే తపన .భరద్వాజ మహర్షి జీవిత కాల మంతా ఏదో ఒకటి నేర్చు కున్తూనే జీవించాడు .ఇంద్రుణ్ణి ప్రార్ధించాడు .ఆయన మహర్షితో ”నువ్వు నేర్చింది పర్వతం లో అణు మాత్రమే .ఎన్ని జన్మ లైనా
నేర్చుకోవటానికి ఇంకా మిగిలే వుంటుంది .సాగునో పాసన తో జీవితం ధాన్యం చేసుకో ”అని చెప్పాడట .పతన వ్యసనానికి భరద్వాజుడు ఉదారణ .
రెండోది శాస్త్ర వ్యసనం .శాస్త్రాలన్నీ నేర్వాలనే కోరిక .ఒక సారి నారదుడు తనకు శాస్త్రాలన్నే తెలుసు అన్నాట్ట సనత్కుమారునితో .”ఆత్మ విద్య వచ్చా ”అని అడిగాడాయన .రాదనీ చెప్పాడు నారదుడు .ముందు దాన్ని సాధన చెయ్యమని సలహా ఇచ్చాడు .
దూర్వాసుడు చదివిన శాష్ట్రాలన్నే బాలలకు ఎత్తుకొని వెళ్లి శివుడికి చూపించాడట .అక్కడున్న ఒక జ్ఞాని ‘నీ పరిస్థితి గాడిదమీద వున్న బట్టల మూట లా వుంది .దానికి ఆ బరువే తెల్సు .అందులో ఏముందో తెలీదు .నీ పరిస్థితీ అదే .అందులోని సారం గ్రహించు ”అని బుద్ధి చెప్పాడు
”భుక్తయే నతు ముక్తయే ”శాస్త్ర జ్ఞానం భుక్తికే కాని ముక్తికి కాదు .
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -07 -11 క్యాంపు –బెంగళూర్ –