పీయూష లహరి

   పీయూష లహరి
     ”విత్తం త్యాగ సమేతం ”–డబ్బు త్యాగంతో రాణిస్తుంది ,సార్ధకత్వం కల్గిస్తుంది .
”దానం  ప్రియవాక్య హితం —జ్ఞానం అగర్వం –క్షమాన్వితం శౌర్యం —విత్తం త్యాగ సమేతం –దుర్లభమే త చ్చతుర్భద్రం ”ఇవన్నీ కలిసినప్పుడు మనిషికి అసాధ్యమైనది లేదు
”ఓరి దేవుడా !నా పూర్వ జన్మలో ఒక్కసారి కూడా నీకు నమస్కారం చేయలేదు .తర్వాత జన్మలో కూడా చెయ్యను .నన్ను ఈ రెంటికీ క్షమించు ,.”అని ప్రార్ది౦చాడట ఒక భక్తుడు .దీని భావం గమనిద్దాం .పూర్వజన్మలో నమస్కారం చెయ్యలేదు కనుక నాకు ఈ జన్మ వచ్చింది .ఈ మానవ శరీరం లో వున్నాను .ఇప్పుడు నమస్కరిస్తున్నాను కనుక నాకు పునర్జన్మ లేదు .కనుక వచ్చే జన్మలో నమస్కారం చెయ్యను అని గొప్ప చమత్కారం చేస్తూ భక్తి గొప్ప తనాన్ని చాటి చెప్పాడు కవి..                                                            సదాశివ బ్రహ్మే౦దులు ఒక శ్లోకం లో  ”ప్రాకృత భోగ వాసరే తామ్యాసి చేతో మధు కుతో హెతొహ్ —-న్యాగ్రోధ బీజ ముప్త్యా శోచంనివ నామ్ర మస్యేతి”  మామిడి  టెంక పాతితే మామిడి చెట్టే వస్తుంది రావి గింజ పాతి మామిడి చెట్టు రావాలంటే రాదు .ఎన్నోపాపాలు   జన్మ జన్మల్లో చేసి దుఃఖ పడుతున్నాను అంటె ఏమి ఫలం ?ఏది చేస్తే దాని ఫలితమే లభిస్తుందని తెలుసుకో .
చేసే పనిలో సు +అనుస్తితం అంతే స్వనుష్టితం అంటే sincerity కావాలి  .
శృంగేరి పీఠాదిపతిశ్రీ శ్రీ అభినవ శివానంద భారతి స్వామి —సుందర కాండ పారాయణ చేసేటప్పుడు ఎదురుగా ఒక చెక్క కుర్చీని వేసి ఖాళీ గా ఉంచే వారట .ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని వింటాడని శ్రీ వారి ధృఢ విశ్వాసం .
”యదా సకల భూమండలాది పతిరపి –అయోధ్యా పథిహ్ ఇతి వ్యవహ్రియతే ”అంటారు శంకర భగవత్పాదులు .రాముడు సకల భువన పతి అయినా అయోధ్యాపతి   అనే అంటారంతా ..నిజంగా ఆయన సకల భువనాలకు అధిపతే కదా .
దేవుడు మన లాంటి వాడు కాదు .మనకు కాళ్ళు చేతులున్నాయి .వాటితో అన్ని పనులు  చేస్తాము .కాని ఆయనకు ఇవిలేకపోయినా   అన్ని పనులు చేయ గలడు .
”స్తానాభి లాస్షీ తపసి స్థితోహం త్వాం ప్రాప్యావాన్ దేవమునీంద్ర గుహ్యం –కాచన్ విచిన్వన్నపి దివ్య రంతం -స్వామిన్ –క్రుతార్దోస్మి వరం న యాచే ”  ఇవి ధ్రువుడు అన్న మాటలు .ఏదో కావాలని తపస్సు చేశా .నీ దర్శనం లభించింది .ఇంకేమి వరం కావాలి నాకు ?
కాశీ హిందూ విశ్వ విద్యాలయం శంకుస్థాపనకు మదన మోహన మాలవ్యా శృంగేరి పీతాదిపతి శ్రీ శ్రీ శివానంద నరుసింహ భారతీ తీర్ధ స్వామిని ఆహ్వానించారు .అందుకు శ్రీ వారికి తగిన సమయం లేక పోయింది .రాలేనని చెప్పారు .వస్తే తప్ప కదలను అని భీష్మించాడు మాలవ్యా .ఇద్దరు ఉద్దండులె .చివరికి గురు పాదుకలు ఇచ్చి పంపారు స్వామీజీ .వాటిని పూజనీయ స్థానం లో వుంచి కార్యక్రమాన్ని నిర్వహించారు మాలవ్యాజీ .
”గీతలో రోజూ కనేసం ఒక శ్లోక మైనా చదువు .విష్ణు సహస్ర నామాలలో ఒక్క నామ మైనా పలుకు దేవునిపై ధ్యాస ఉంచు అనవసర విషయాలపై దృష్టి మరల్చకు ”అని హితవు చెప్పారు శ్రీ శంకరులు.ఇది అందరు పాటించాల్సిన విధానమే .
”భక్త్యా పుండరీకాక్షం స్తవేరార్చన్నరః-సదా ”అన్నాడు భీష్ముడు భగవంతుని భక్తి తో సేవిస్తే అదే గొప్ప పని అని భావం .
ఒక భక్తుడు గోపికను ఇలా వర్ణి౦చాడట”విక్రేతు కామాఖిల గోపబాలా — మురారి పాదార్చిత చిత్త వ్రుత్తిహి—దధ్యాధికం మొహవశాదవేచ –గోవింద దామోదర మాధవేతి ”   దీని అర్ధం –ఒక గోపిక పాలు ,పెరుగు అమ్మటానికి వెళ్లి శ్రీ కృష్ణ ధ్యానం లో పాలోయమ్మ పాలు ,పెరుగోయమ్మ పెరుగు అనకుండా గోవిందా ,దామోదరా మాధవా అంటోందట .అది భక్తీ తన్మయం .
శంకరాచార్యులే స్వయం గా ”నారాయణ ,కరుణామయ ,శరణం కరవాణి తావకో చరణౌ –ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు”అని ప్రార్ధించారు .నీ పాదాలే నాకు శరణు .నా నాలుక ఎప్పుడు నారాయణ ,కరుణామయ ,శరణం ,కరవాణి ,తావకో చరణౌ ”అనే ఆరు మాటలే పలకాలి
గుడీ ,గోపురం ఎత్తు గా ఉండ  ”టానికి కారణం మనిషి అల్పత్వాన్ని తెలియ జేయ టానికే .
”అహమేవ మాతో మహీపతే రితి సర్వః –ప్రక్రుతిరిష్వ  చింతయేత్ ”.అన్నాడు కాళిదాసు  రాజు దగరకు వచ్చిన ప్రతి వాడు రాజు తనను బాగా చూశాడు అనుకు౦టాడట –ఇది దిలీప మహారాజు విషయం లో చెప్పిన మాట .
దిలీప మహారాజు అనే వాడట ”ఈ మనిషి మంచి వాడా కాదా అని నాకు అవసరం లేదు .అతను తగిన వాడితే అతను నాకిష్టుడే .మందు చేదైనా జబ్బు నివారిస్తే మంచిదేగా ”
పక్షుల ,జలచరాల పాద చిహ్నాలను గుర్తించ లేనట్లే జ్ఞానుల గమనమూ తెలుసుకో లేము .
విశ్వం అంతా ధర్మం మీదే నడుస్తోంది ”ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టాః ”.అన్నది వేదం .
దేవుడి దయ అంటె చేతిలో కర్ర పట్టుకొని గొర్రేపిల్లాడిగా కాపలా కాయటం కాదు .మనం చేసే పనికి ఫలితాన్నిచ్చేవాడు అని భావించాలి .
                  మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -07 -11 .క్యాంపు –బెంగళూర్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.