అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్

     అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కునే స్థితి లో సైంటిస్ట్ హేబెర్
                           పదవ,తరగతి,ఆపైన చదివిన వారందరికీ గాలి లోని nitrogen ,hydrogen  లను ఎక్కువ పీడనం ,ఉష్ణోగ్రతల లో ఉత్ప్రేరకం సమక్షం లో సంయోగ పరిస్తే అమ్మోనియా ఏర్పడుతుందని తెలుసు .ఈ పద్ధతినే హేబెర్ ప్రాసెస్ అంటారు .దీన్ని కనిపెట్టిన వాడు హేబెర్ అనే జెర్మనీ శాస్త్ర వేత్త .ఆయన ఒక యూదు అంటె jew .గొప్ప శాస్త్రవేత్త గా పేరు .అమ్మోనియా తయారు తో కృత్రిమ ఎరువులు తయారై హరిత విప్లవానికి నాందిఅయాడు హేబెర్ .తర్వాత యుద్ధంలో శత్రునాశనానికి  విష వాయువులు కని పెట్టి ప్రయోగించాడు .సైన్యం లో అత్యున్నత పదవి పొంది యుద్ధ వ్యూహం లో ఆరితేరాడు .కానీ నాజీ ప్రభుత్వం ఏర్పడి హిట్లర్ అధికారానికి రాగానే యూదులందర్నీ ఏరి చంపేశాడు .పాపం హేబెర్ కూడా సర్వస్వం కోల్పోయి ,అనామకుడుగా ,అనాధగా మిగిలి పోయాడు .అతని జీవితం ఒక పాఠం మాత్రమే కాదు అందరికి గుణ పాఠం కూడా .ఎందుకు ,ఎలా ,ఏమిటీ అనుకుంటూ ,ఆ వివరాలు తెలుసు కొందాము .  ,
                              ముందే చెప్పినట్లు హేబెర్ బాష్ తో కలిసి అమ్మోనియా తయారు చేశాడు .దీనితో కృత్రిమ రసాయనిక ఎరువులు తయారయాయి .పంటలకు వర ప్రసాదం అయింది .పంటలు రెట్టింపు గా పండాయి. సశ్యవిప్లవ సాధనకు రాచ మార్గం ఏర్పడింది .మనం తినే అన్ని పదార్ధాలలో nitrogen వుంది .జనుము ,పిల్లి పెసర  మొదలైన మొక్కల వెళ్ళ మీద నైట్రోజెన్ స్థాపక శూక్ష్మ జీవులు౦టాయని చదువు కొన్నాం .హేబెర్ ఈ విషయాలను సూక్ష్మం గా పరిశోధించాడు .నైట్రోజెన్ వాడకం పెరిగితే అంతా మార్పే అని భావించాడు .ఆయనకు laboratory ,ఫ్యాక్టరీ ,యుద్ధ రంగాలు ఇష్టమైనవి . మార్పు తేవటం ,కొత్తది సృష్టించటం అతనికి చాలా ఇష్టం .అతను క్రూరుడు కాదు కానీ ,అతను మంచి విధేయుడు ,ఉదారుడు ,కష్టపడే వాడు ,సృజన కలవాడు .వీటన్నిటికి తగిన ప్రతిఫలాలను పొందాడు .
                         బెర్లిన్ లో piperonal అనే వాసన వేసే రాసాయననాన్ని కనిపెట్టాడు .1891 లో chemistry ,ఫిజిక్స్ ,philosophy  లలో డిగ్రీ సాధించాడు .physical chemistry నీ అధ్యనం చేశాడు .అప్పటికి జెర్మనీ లో వున్నా పదివేల మంది యూదులలో  హేబెర్ కూడా ఒకడు . ఆడవాళ్ళను అర్ధం చేసుకొనే మనస్తత్వం అతనికి లేదు .వారి విషయం లో అతని అభి ప్రాయం ఇలా వుంది
”women are like lovely butterflies to me .I admire their colours and glitter ,but i get no future ”.రంగుల సీతా కొక చిలుకలు  ఆడవాళ్ళు వారి పై మెరుగులే చూస్తాను అనే తత్త్వం ..బిస్మార్క్ అనే వాడట ”the german’s fear nothing but god ”germany     వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్మితే అమెరికన్లు సాంకేతిక విధానం పై ద్రుష్టి సారిస్తారు .  చివరికి germanlu
సాంకేతిక మిలిటరీ విధానాన్ని అనుసరించారు .సృజనకు విలువ నిచ్చారు .ఆయుధమే విజయానికి కారణం గా తెలుసు కొన్నారు .ప్రప్పంచాదిపత్యం కావాలంటే జెర్మనికి ,దాని అస్తిత్వానికి ఆయుధబలమే శరణ్యం అని తెలుసు కొన్నారు .జెర్మని దేశానికి జీవిత కాల సివిల్ సర్వీసు ప్రొఫెసర్ గా వున్నాడు హేబెర్ .అతని అమ్మోనియా ప్రాజెక్ట్ వల్ల దేశం లో ప్రతి వారికి తిండి దొరికింది .ఒక రకంగా అన్న దాత అయాడు .అందరిలోనూ ముఖ్యుడయ్యాడు .తాను జెర్మని లో అతి శక్తి సామర్ధ్యాలు కలవాడిని అన్నాడు .తాను పరిశ్రమలకే ఆద్యుడు .జెర్మని మిలటరీ విధానం లోను ,ఆర్ధిక విషయాలల లోను అగ్రగామి కావటానికి తానే కారకుడనని తనకు జెర్మని లో ప్రవేశార్హత లేని ప్రదేశం లేదని , చెప్పాడు కూడా …
                         హేబెర్ తీరు తెన్నులు చూసి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ”our entire much praised technological progress and civilization generally could be compare to an ax in the hand of pathological criminal ”అని హెచ్చరిన్న్చాడు ఇతను కనిపెట్టిన విష పదార్ధాలను గురించి తెలుసు కోని .
                 1914  లో    germani  దేశంలతో యుద్ధం చేసింది .ఫ్రాన్సు  ఇంగ్లాండ్ లతో యుద్ధం చేసింది .వాళ్ళను జయించటం కష్టమైంది .కందకాలలో వున్న శత్రువులను తరిమి వేయటం కష్టమైంది .అప్పుడు dia nisidine chloro sulphate .ఉపయోగించారు  .ఏ ప్రభావం కలిగించ లేదు .ఇదే ప్రపంచం లో మొదటి వాయు   ప్రయోగం ..తర్వాత బెంజాల్ bromide గ్యాస్ ప్రయోగించాడు .శత్రువుల కళ్ళు మండాయి .తరువాత tear దీనినే zxylyl bromide  గ్యాస్ అంటారు .శత్రు సంహారం  జరిగి జెర్మని గెలిచింది ఇవన్నీ హేబెర్ సృష్టించినవే .”హేబెర్ was fascinated .his mind latched on to the problems of gas weaponry and did not let go for the rest of the war ..అంతా ఎదిగి పోయాడు ,అంతా ముఖ్యుడైనాడు యుద్ధ వ్యూహం లో .
                         క్రమం గా మిలిటరీ సలహా దారుడై నాడు .స్వయం గా యుద్ధ రంగం లో నిలిచాడు .మిలిటరీ జనరల్ గా ఆలోచించాడు .తన మేధా సంపత్తికి ,విధి నిర్వహణను జోడించాడు .చివరికి పర్ స్యన్ ఆఫీసర్ అయాడు .autocratic and and useless in his will to victory అని   పించుకొన్నాడు . మిలిటరీ వ్యవస్థ ను నిర్వహించే దశకు పెరిగాడు .ఒక సారి ఆయన ప్రయోగ శాలలో ఒక విద్యార్ధి ప్రయోగం చేస్తుంటే అనుకోకండా ఒక గ్యాస్ ఏర్పడి ఆ విద్యార్ధి చని పోయాడు .అప్పుడు హేబెర్ కు అర్ధమైంది గ్యాస్ వే అపోన్ ఎంతటి దారుణం చేయ గలదో .అదే క్లోరిన్ గ్యాస్ .దాన్ని ట్యాంకులలో ఎక్కువ పీడనం తో నింపి బెల్జియం సిటీ లోని ఎప్రేస్స్ లోని ట్రెంచ్ లో వున్న శత్రు శైనికు లపై ప్రయోగించాడు .వాళ్ళంతా ఊపిరి ఆడక దెబ్బకి ఠా . .దీనితో యుద్ధం లో విప్లవాత్మక మార్పు వచ్చింది .గ్యాస్ నుపయోగించి శత్రు శైన్యాన్ని చంప వచ్చు అతి తేలికగా .ఈ రోజునే డే అఫ్ cypress అంటారు ఇలాంటి ప్రయోగాలు భార్య క్లారా కు ఇష్టం లేదు .వద్దు అని వారించింది .మానవాళికి చేటు అని హెచ్చరించింది .మొండి హేబెర్ వినలేదు .చివరికి ఆమె పిస్టల్  తో కాల్చుకోని ఆత్మ హత్య చేసుకోంది .  గ్యాస్ వేఅపోన్ మీద విల్ఫ్రెడ్ ఓవెన్ అనే బ్రిటిష్ సైనికుడు ,కవి ఒక కవిత కూడా రాశాడు దాని దుష్పరిణామం మీద .తర్వాత అమెరికా hydrogen cyanide గ్యాస్ ను వాడింది .దీనినే pervertion of science  గా అందరు విమర్శించారు .అయితే దీన్ని ప్స్య్చోలూగికాల్ గా చూశాడు హేబెర్ .తేలిగ్గా తీసుకొన్నాడు .           .
                  హేబెర్ అమ్మోనియా మీద రాయల్టీ బాగా వచ్చేది హేబెర్ కు . లో 1918 లో జర్మనీ ఓడి పోయింది .యుద్ధ విమానాల వాడకం అవసర మైంది .మిరచ్లె వేఅపొంస్  సాధించటం లో నిమగ్న మైంది .నోబెల్ బహుమతి పొందాడు హేబెర్ .౧౯౩౨ ఎన్నికలలో నాజి పారి అధికారం లోకి వచ్చింది హిట్లేర్ తిరుగు లేని నాయకుడయ్యాడు .యూదులను నిర్దాక్షిణ్యంగా గా కాల్చి చంపేశాడు .పదవులన్నీ పోయాయి హేబెర్ కు .అస్తిత్వానికే ఎసరు వచ్చింది .జెర్మనీ నుంచి వ్ల్లిపోఎవారికి కొంత అవకాశం ఇచ్చారు .వెళ్ళే వాళ్ళందరికీ హేబెర్ సాయం చేశాడు .తాను ఎటు తేల్చుకో లేక పోయాడు .అమ్మోనియా అమ్మకం తగ్గి రాబడి బాగా తగ్గింది .సహాయం కోసం అందర్నీ యాచించాడు ఎవరు ముందుకు రాలేదు .
స్విర్జర్లాండ్ చేరాడు .క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు .శానిటోరియం లో చేరాడు  .తన భాగస్వామి బాష్ ను సహాయం చేయమని రాశాడు .వాడేమి పట్టి౦చు కోలేదు .కొత్త ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకొని వాడు మళ్ళీ సంపాదన మీద పడ్డాడు .1934 ౨౯  janavari న బాసెల్ లో చనిపోయాడు .ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త మక్ష్ ప్లాంక్ మాత్రమే అంత్యక్రియలకు హాజరైనాడు .జెర్మనీ పట్టించుకోలేదు .పేపర్ లో వార్త కూడా రాయ లేదు .మొదటి ప్రపంచ యుద్ధ కాలమ్ లో జెర్మని కి అత్యధికం గా సేవలందించిన వాళ్ళలో ప్రధముడు హేబెర్ .అలాంటి వాడికే ఇంతటి దుర్గతి .అతని బంధువులనందర్నీ గ్యాస్ చా౦బర్ లలో పెట్టి చంపేసింది నాజి ప్రభుత్వం .చివరికి విస్మృత శాస్త్ర వేత్త గా మిగిలి పోయాడు .అతని స్మ్రుతి చిహ్నం కూడా లేదు .
                   హేబర్ హీరో మరియు విలన్ .అయాడు .”german ,patriot ,a victim of naazi’s .A patron saint for guns and butter .he was the founder of the military industrial complex and the inventor of the chemistry through which the world now feeds itself ”ఇంతటి గొప్ప శాస్త్ర వేత్తకు ఇంతటి దుర్గతి ..ఆయన నిర్మించిన తూర్పు జెర్మని లోని Leuna -వేర్కే
ఆయన జీవిత సర్వస్వం .ఆ పేరు తీసేసింది నాజి ప్రభుత్వం .చివరి జీవిత కాలమ్ లో ప్రవాసి గా గడపవలసి వచ్చిది పాపం .1952  లోని   బెర్లిన్ లోని  . ”The fritz Haber institute of the Max plank society మాత్రమే మిగిలింది .
          celebration of a murderer –heber —father of gas war fare ” ani 1968  లో న్యువ శాస్త్ర వేత్తలు జర్మని లో జరుపు కొన్నారు
scientists could desclaim direct responsibility for theuse to which mankind  had put their disinterested discoveries .We feel compelled to tae a more active stand now ,because –nuclear power is fraught with infinity greater danger than were all the inventions of the past ”’అని ఫ్రాంక్ రిపోర్ట్ వచ్చింది .ఇదే కొత్త ఉద్యమం గా మారింది .
       సాంకేతిక శక్తిని the machine అన్నారు .గ్యాస్ weapons ను గ్యాస్ -troops అన్నారు . .శాస్తవేత్తలు సరాసరి యుద్ధ విధానాలలో పాల్గొన రాదు .తాము శోధించి సాధించిన విపత్కర ఆయుధాలు ,మాన వాళి వినాశకరం కా కుండా జాగ్రత్త పడాలి .లేకుంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అణు బాంబు యెంత మానవ విధ్వంసం చేసిందో గుర్తుంచు కోవాలి.
                                  మీ —గబ్బిటదుర్గా ప్రసాద్   —17 -07 -11 —క్యాంపు –బెంగళూర్ . .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.