హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2

             హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి —-2
        ———————————————
                         హోసూరు తమిళ నాడు రాష్ట్రం లో కృష్ణ గిరి జిల్లా లో వుంది .దీనికి అయిదు కిలోమీటర్ల దూరం లోనే కర్నాటక సరిహద్దు వుంది .హోసూర్ జనాభా లక్ష మంది .అందులో తెలుగు వారు అరవై శాతం .అంతే షుమారు అరవై వేల మంది అన్న మాట .ఇక్కడ కన్నడ ఉర్దూ ,మళయాళ ,తమిళాలు లో  మాట్లాడే వారు కూడా వున్నారు .రాజ్యం తమిలులది .సంపర్కం కన్నడం .తెలుగు వారు అంతా ఇళ్ళల్లో తెలుగే మాట్లాడు తారు .కొందరు తెలుగు ,కన్నడం కలిపి మాట్లాడు తారు .హిందూ పురం లో లాగా అనిపిస్తుంది .తమిళం చాలా కాలమ్ వీళ్ళకు తెలియదు .తమిళం మాట్లాడే వారిని అంటరాని వారి గా భావించే వారు .దిగువ సీమకు చెందిన వాళ్ళు అని తమిలుల్ని ఈసడించే వారట .కానీ ఇవాళ సీన్ రివర్స్ అయింది .సుమారు పది హీను కిలో మీటర్ల పరిధి లో హోసూర్ వుంది .హోసూర్ తాలుకా కూడా .తాలూకా లోని మొత్తం జనాభా రెండు లక్షలు .ఒక్క హోసూర్ పట్టణం లోనే లక్ష జనాభా. .వర్షాధార పంటలే ఇక్కడ .రాగి బాగా పండుతుంది .బోరు బావులు తవ్వి సేద్యం చేస్తున్నారు ,.బావుల కింద వారి కొద్ది గా పండిస్తారు .కూర గాయాలు బాగా పండించి బెంగళూర్ ,తదితర ప్రదేశాలకు పంపుతారు ..ఇక్కడ గులాబి పూలు విపరీతం గ పూస్తాయి .ఇక్కడినుంచే ఎక్కడికైనా ఎగుమతి .జరుగు తుంది .వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది .తమిళ తెలుగు ,కన్నడ రాష్ట్ర బస్ లు ఇక్కడ కన్పిస్తాయి .సేలం ,చెన్నై కి ఇక్కడినుంచి వెళ్ళ వచ్చు .కుప్పం దగ్గరే .అలాగే రాయ వేలుర్ కూడా . ఎయిర్ conditioned సిటీ గా హోసూర్ ను భావిస్తారు ఏప్రిల్ మే నెలల్లో మాత్రం కొంచెం వుక్క పోస్తుందట . .

ముని రాజు , కృష్ణప్ప

                            1970 వరకు హోసూర్ లో పూర్తిగా తెలుగే వుండేది .సేలం వరకు తెలుగు తప్ప ఇంకోటి మాట్లాడే వారు కాదట .1970 లో  డి.ఏం .కే .అధికారం లోకి వచ్చింది .అప్పటినుంచి హోసూర్ తెలుగు వారి కస్టాలు ప్రారంభం అయాయి .తమిళాన్ని ఇక్కడ నిర్బంధం చేసింది .ఆ పార్టి భాషోన్మాదం తో తెలుగు ప్రజ అల్లాడి poyindi .వీరి  .వల్ల భయం ఏమిటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ పెరిగి పోయి ,తమిళ అస్తిత్వాన్ని దెబ్బ తీస్తారో నని .అందుకని చట్టాలన్నీ కఠిన తరం చేసింది .ఉక్కు పాదం తో తెలుగును అణగ  దొక్క టానికి అన్ని ప్రయత్నాలు చేసింది దానికి రంగు పూయటానికి హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టింది .అలాగే తెలుగు ”ఒళిగా”అంటె  quit తెలుగు  ఉద్యమం అన్న మాట. అప్పటి దాకా వెయ్యి తెలుగు స్చూల్స్ ఉండేవి  ..రిజిస్ట్రేషన్ తో సహా వ్యవహారం అంతా తెలుగు లోనే జరిగేది .ఇది కరుణానిధి కి కన్ను కుట్టింది .కరుణ పోయి అకారణం గా ఆకరుణఆవేశించింది  .పూర్తి అధికారం వుంది .పైన ఎదిరించే సాహసం ఎవరికి లేదు .కేంద్రం లో ఏ ప్రభుత్వం వున్నా ,బెదిరించి ,పోట్లాడి ,అలిగి నీలిగి  ,బెదిరించి ,అన్నీ సాధించుకొనే నేర్పు అతనిది .కక్కా లేక మింగా లేక పోతున్నాడు 1990  వరకు ఏమీ చెయ్య లేక పోయాడు కరుణ .అప్పటిదాకా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు   తెలుగు లోనే జరిగేవి .హోయసల రాజుల కాలమ్ నుంచి హోసూర్ వుంది హస వూరు హోసూర్ గా మారిందని అంటారు .
                        అప్పటి దాకా మద్రాస్ రాష్ట్రం గా వున్న దీని పేరును తమిళనాడు గా 69 లో మార్చారు …మైసూర్ స్టేట్ ను 73  కర్నాటక గా మార్చారు .  భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచేసమయం
లో 1956   లో  పటాస్క్కర్ కమిటీ సర్వ్ చేసి హోసూరు ప్రజలు ఏ రాష్ట్రం లో కావాలంటే ఆ రాష్ట్రం లో ఉండ వచ్చునని రిపోర్ట్ ఇచ్చింది .అయితె ఆంద్ర రాష్ట్రం లో చేరి పోవాలని హోసూర్ ప్రజలకు పూర్తిగా వున్నా ఎవరు వుద్యమించలేదు .ఎవరికీ గట్టిగా విన్నపాలు చేయక పోవటం పాపం ఇప్పుడ వారు అనుభవించే కష్టాలకు కారణం అయింది .దీని పక్కనే వున్న దేన్కని కోట తాలూక కన్యా కుమారి జిల్లా అంతపెద్దది దాన్ని రెండు గా విభజించి హోసూర్ ,దేన్కని తాలూకా లను ఏర్పాటు చేశారు .దేన్కని అంటె తెన్కని అనేనేమో తెన్కని ప్రభువు నన్నే చోడుడు కుమార సంభవం  కావ్యం తెలుగు లో రాశాడ్డు .తెన్కనాదిత్య బిరుదు వుంది ఆయనకు .ప్రబంధాలకు మార్గ దర్శి అయాడు
డా వసంత్
తమిళ భాషా సమస్య చాపకింద నీరు లాగా ప్రవేశించింది .ఇది తెలుసు కొనే సరికే అంతా మించి పోయింది .అప్పటి దాకా తెలుగే అధికార భాష గా వుంది .ఇప్పుడు తమిళాన్ని ఇక్కడ అధికార బాష గా చేయటం పుండు మీద కారం చల్లి నట్లయింది ఈ మార్పును ఒప్పుకో లేదు .జీర్ణించుకో లేక పోయారు .ఇక్కడ తెలుగు సంఘాలు యాబ్భై ఏళ్ళ నుంచే వున్నాయి .అయినా చురుగ్గా పని చేయ లేక పోయాయని ఇప్పటి వారి భావన .. అప్పటి శాసన సభ్యులు కోదండ రామయ్య శక్తి వంచన లేకుండా తెలుగును రక్షించటానికి ప్రయత్నించారు .అప్పుడే  తమిళ నాడు లో తెలుగు భాషోద్యమ సంఘం ఏర్పడి పని చేస్తోంది .
.                   హోసూర్ ప్రజలు జై తెలుగు తల్లి అని ఉద్యమం ప్రారంభించారు .ఇక్కడి బోసు బజార్ లో ని మిత్రబృందం మొదటి సారిగా ఉద్యమించింది .వీరికి ఘంటసాల మిత్ర బృందం తోడైంది .,నంద్యాల నారాయణ రెడ్డి గారి ప్రోద్బలం తో తెలుగు  ప్రజ లు అంతా  సంఘటిత మయారు .తెలుగు భాషోద్యమ నాయకులు సామల రమేష్ బాబు గారు ,సా.వెం .రమేష్ గారు వీరికి అండ గా నిలిచారు .వారిద్దరూ ఇక్కడికి వచ్చి మార్గ నిర్దేశం చేశారు .వీరికి ఆత్మ స్థైర్యాన్ని ,ధైర్యాని కల్గించి వెన్ను తట్టి ,అండగా నిలిచారు .దీనికి ఇక్క్కడి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు ,కైవారం తాతయ్య గారు ,ప్రేరణ నిచ్చారు .స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు .”దూషించు వారి -నయ భాషిన్చి –ప్రేమతో భూషించావే  మనసా  ”అన్న తాతయ్య గారి గీతం వీరికి భగవద్గీతే అయింది .కర్తవ్యమ్ బోధ పడి ముందడుగు వేశారు .ఇక మడమ తిప్ప లేదు .ఇలా అయిదు వైపులా నుంచి ప్రోత్చాహం లభించి కదం తొక్కారు ఇక్కడి తెలుగు ప్రజ ..తర్వాత 2001 లో  కృష్ణ గిరి జిల్లా తెలుగు రచయితల సంఘం ఏర్పడింది .ఇది మరీ వూతాన్ని ఇచ్చింది .దీన్ని వీళ్ళు ముద్దుగా కృష్ణ రసం అన్నారు .సంక్షిప్త పరచి …ప్రతి నెల మొదటి ఆది వారం అందరు సమావేశం అవుతారు ..తర్వాత కోదండ రామయ్య ఆంద్ర సంస్కృతి సమితి భవనం లో సమావేశాలు జరుగు తాయి .రచయితల సంఘం వారం లో మూడు రోజులు పర్యటించి ,సమస్యలను తెలుసు కొంటారు .ఆదివారం సమావేశం లో చర్చించి పరిష్కారాలను కనుగొంటారు .సామల రమేష్ బాబు ,స.వెం రమేష్ గార్లు వీరికి పరమ ఆత్మీయులై నారు .వారిద్దరిని సంప్రదించ కుండా ఏ కార్యక్రమం జరపరు .
                           తమిళ ప్రభుత్వ తెలుగు వ్యతిరేకత వల విద్యార్ధులు తెలుగు స్కూల్ లలో చేరటం తగ్గింది ..దీన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు .అందుకే ప్రతి సంవత్చరం మే ,జూన్ నెలల్లో ఇంటింటికి తిరిగి తెలుగు స్చూల్లలో విద్యార్ధులను చేర్పించటానికి శాయ శక్తులా కృషి చేస్తున్నారు .వీరి ప్రయత్నాలు ఫలించి ,తలిదండ్రులు తెలుగు స్చూల్స్ లో చేర్పిస్తున్నారు క్రమంగా తమిళ బడులన్ని తెలుగు బడులు  గా మారాయి .చీకటిని తిట్టుకుంటూ కూర్చోటం కంటే చిరు  దీపం వెలిగిస్తే అంతా కాంతి ఏ కదా .ఫెబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ”తెలుగు మాత్రు   భాషా దినోత్చవం ”వైభవం గా జరుపు తారు .అంతా కలిసి బాన్నేర్లు పట్టుకొని గ్రామాల్లో ప్రచార యాత్ర చేసి వుత్చాహం కల్గిస్తారు .ప్రతి ఉగాది పండుగ నాడు బోస్ బజారు నుంచి వూరు ఊరంతా ఉగాది శుభా కాంక్షల బాన్నేర్లు ,flexeelu ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని తెస్తారు .అచ్చమైన తెలుగు పండుగ కదా ఉగాది .అందుక అంతటి సంబరాలు నిర్వహించటం .ఆగస్ట్ లో గిడుగు రామ మూర్తి జయంతిని వ్యావహారిక భాష దినోత్చవం గా నిర్వహిస్తారు .నవంబెర్ లో తెలుగు భాషకు ఎన లేని సేవ చేసి ,అనేక గ్రంధాలను ప్రచ్రించిన ప్రాతస్మరనీయుడు సి .పీ .బ్రౌన్  జయంతి జరిపి ఆయన భాషా సేవను గుర్తుకు తెచ్చుకుంటారు .స్ఫూర్తిని పొందుతారు .విద్యార్ధులకు వేమన పద్యాలపై పోటీలను నిర్వహిస్తారు .ఇక్కడి బస్తి యువక సంఘం ఆధ్వర్యం లో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించి కవితా సంకలనం తెస్తారు .
                 2004  లో  ”తెలుగు వాణి ”పత్రిక నెల కొల్పి ఉత్చాహ వంతులైన యువ రచయితలతో కవితలు ,హోసూర్ మాండలికం లో కధలు ,వ్యాసాలు రాయిస్తున్నారు .ఇది ఎందరికో మంచి వేదిక అయింది .వారి సృజనకు గొప్ప అవకాశం లభించింది ,..బోధనా ,పరిశోధనా ధ్యేయం గా వాణి తన  బాణీ ని చాటు తోంది ..దీనికి తోడు ”తల్లి భాష ” మాస పత్రిక ఇక్కడితెలుగులా మనో భావాలను కవిత ,కధ పాట పద్యం ,మాండలికం ద్వారా  ప్రతి బిమ్బించేట్లు  చేస్తోంది .
                         హోసూర్ లో జరుగు తున్న ఈ వైవిధ్యభరిత  కార్యక్రమాలను చూసిన రాయ వెల్లూర్ తెలుగు ప్రజానీకం తాము ,తమ పిల్లలు తెలుగు నేర్చుకున్తామని ,నేర్పే ఏర్పాటు చేయమని వీరిని కోరారు .వీరికి మంచి ఉత్చాహం లభించింది .తమ ప్రయత్నాలు ప్రక్క ప్రదేశాలకు విస్తరిస్తున్నందున కుసంబర పడ్డారు ..అయితె వారికి నేర్పాలంటే సు స్సిక్షుతులు అయిన కార్య కర్తలు కావాలి .వారికి తెలుగు ఎలా నేర్పాలో తెలియాలి ..అందుకని దగ్గర లో వున్న కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయాన్ని ఆశ్రయించారు .వారు రేసౌర్సే పెర్సొన్స్ కు శిక్షణ నిచ్చారు కస్తూరి విశ్వనాధం ,పరిమి రామ నరసింహం వంటి వుద్దండులుకదిలి వచ్చి యువకులకు మంచి శిక్షణ నిచ్చి తీర్చి దిద్దారు .వెల్లూర్ జిల్లా లోని 120 గ్రామాల నుండి గ్రామానికి కనీసం ముప్ఫై మంది వరకు వచ్చి నేర్చుకొన్నారు .తెలుగు లో ప్రావీణ్యం పొందారు .నల్లూరు గ్రామం లో ఏడు రోజుల పాటు శిబిరం నిర్వహించారు .స్త్రీలు విశేషం గా పాల్గొని ,తాము ,ఏమీ ,వెనుక బడ లేదని నిరూపించారు …దీని ప్రభావం బాగా వుంది .తమిళ విద్యార్ధులు తెలుగు కవితలు రాసి తెలుగు వారినే ఆశ్చర్య పడేట్లు చేశారు కృషి వుంటే మనుషులు రుషులవు తారు ,మహా పురుషు లవు   తారు అన్న దానికి ఇది నిదర్శనం .ఈ ఖర్చును అజంతా వాచ్ కంపెని వారు ,ఇతర వదాన్యులైన దాతలు భరించి ఒక గొప్ప సామాజిక మార్పుకు దోహద పడ్డారు .వారందరూ అభినంద నీయులు .ఈ విజయం అంతా హోసూరు లోని తెలుగు సంస్థ కు ,దాని నిర్వాహకులకు దక్కు తుంది
                             మరిన్ని హోసూరు విషయాలు ఇంకో సారి .
                              మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -07 -11 . క్యాంపు —బెంగళూర్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.