హోరెత్తిస్తున్న హోసూర్ తెలుగు ప్రజా వాణి ——1
——————————————–
హోసూర్ గురించి చాలా కాల0 గా వింటున్నాను .అక్కడి తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు నడుస్తున్న చరిత్ర మాస పత్రిక లో చదువుతున్నాను .అడపా దడాపా దాని సంపాదకులు ,ఆప్తులు డాక్టర్ సామల రమేష్ బాబు గారు కృష్ణా జిల్లా రచయితల సంఘం లో చేసే ప్రసంగాల ద్వారా కూడా తెలుస్తున్నాయి .సా.వెం .రమేష్ గారి రచనల ద్వారా చాలావిషయాలతెలిశాయి .
అక్కడ తెలుగు భాషను రక్షించుకోవటానికి వారు చేస్తున్న పోరాటాలు ,తెలుగు సంస్కృతిని కాపాడుకోవటానికి అవలంబిస్తున్న విధానాలు ,తమిళనాడు ప్రభుత్వం హోసూర్ తెలుగు వారికి చేస్తున్న అన్యాయం ,ఆ అన్యాయాన్ని సరిదిద్దటానికి వారు చేస్తున్న పోరాటం ,విని ,చదివి హోసూర్ చూడాలనే అభిప్రాయం మనసులో బలం గా నాటుకొంది .ప్రత్యక్షం గా అక్కడి విషయాలు తెలుసుకోవాలనిపించింది .ఎట్లాగు బెంగళూర్ లో వున్నాను కనుకా,ఇక్కడికి హోసూర్ బాగా దగ్గర కనుక వెళ్ళటానికి నిర్నయిన్చుకొని ఉయ్యూరు లోని మా అబ్బాయి రమణకు ఫోన్ చేసి రమేష్ బాబు గారికి ఫోన్ చేసి హోసూర్ లో ఆయనకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ అడిగి తెలుసు కోమని చెప్పాను .వాడు వెంటనే ఆయన నుంచి అక్కడి డాక్టర్ వసంత్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు .
ఈ నెల పద్దెనిమిదవ తేది సోమవారం ఉదయం బెంగళూర్ లో పదిగంటల కల్లా భోజనం చేసి మా అబ్బాయి శర్మ వాళ్ల ఇంటిను౦చి బయల్దేరాను .సిటీ బస్ ఎక్కి సిల్క్ బోర్డు దగ్గర దిగాను .ఇక్కడ సేనియర్ సిటిజెన్స్ కు కన్సెషన్ వుంది బస్సుల్లో .సిల్క్ బోర్డు దగ్గర తమిళనాడు బస్సు ఎక్కి హోసూర్ మధ్యాహ్నం పన్నెండున్నరకు చేరాను .బస్ స్టాండ్ నుంచి వసంత్ గారికి ఫోన్ చేసి హోసూర్ కు వచ్చిన విషయం చెప్పాను .ఆయనకు ముందుగా నేను ఫోన్ చెయ్యలేదు .ఇప్పుడే చేశాను .పాపం ఆయన ఎంతో బాధ గా తాను హోసూర్ కు ముప్ఫై కిలోమీటర్ల దూరం లోచిన్న తిరుపతి అనే ఒక పల్లె టూరిలో క్లినిక్ లో వున్నానని ,సాయంత్రం దాకా రాలేనని ,తన మిత్రుడు రఘునాధ రెడ్డి గారిని పంపిస్తున్నానని ,ఆయన అన్ని విషయాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు .రెడ్డి గారు నాకోసం వచ్చి నన్ను తన బండి మీద నంద్యాల నారాయణ రెడ్డి గారింటికి తీసుకొని వెళ్లి ,నా గురించి చెప్పి ,హోసూర్ లో జరిగే కార్య క్రమాలన్ని నాకు తెలియ జేయమని చెప్పారు .తాను మళ్లి వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళారు వీరు అగ్రిగోల్డ్ లో పని చేస్తూ ,మంచి సేవా కార్య కర్త గా పేరు తెచ్చుకొన్నారు .నారాయణ రెడ్డి గారు వ్యవసాయ దారులు యాభై అయిదేళ్ళ పైవారు .మంచి రచయిత .తమిళ కన్నడాలలో మంచి పట్టున్న వారు .ఏ రకమైన మెమొరాండం అయిన ఏ భాషలో నైనా రాయ గలరు .మంచి శైలి ,ఆవేశం ,తెలుగు ను రక్షించు కొనే తపన వున్న వారు .ఆయన రాసిన దంతా నాకు చదివి విని పించారు .అదంతా నేను వాయిస్ రికార్డర్ లో రికార్డు చేశాను .దాదాపు రెండు గంటలు ఇలా గడిపాము .భోజనం చెయ్యమన్నారు .చేసి వచ్చానని చెప్పాను .రెండు సార్లు కాఫీ ఇచ్చారు .ఇంతలో క్క్రిష్ణప్ప గారు వచ్చారు .ఆయన స్వతహాగా కన్నడిగులు.అయినా తెలుగు భాషోద్యమానికి తీవ్రం గా కృషి చేస్తున్నారు .కాసేపటికి మునిరాజు వచ్చారు .యువకుడు ,కవి ,కధా రచయిత .పత్రికలలో ఆయన రాసినవి పడుతుంటాయి .చివరగా డాక్టర్ వసంత్ చేరారు .అందరం సరదాగా కబుర్లు చెప్పుకొన్నాం .వసంత్ గారు మంచి కార్య దీక్షా పరులు .యువకుడు .సాయంత్రం ఆయన ఇంటిదగ్గర క్లినిక్ లో వుంటారు .”తెల్ల కొక్కెర తెప్పం ”అనే కధా సంపుటి వెలువరించారు ..దీనికి ఆగస్ట్ ఏడవ తేదిన వారికి హైదరాబాద్ లో తెలుగు విశ్వ విద్యాలయం లో సన్మానం ,పురస్కారం వున్నట్లు చెప్పారు .ఆ సమయం లో సా.వెం .రమేష్ గారు వీరితో ఫోన్ చేసి మాట్లాడారు నాతో కూడా ఫోన్ లో రమేష్ గారు మాట్లాడారు .ఆయన రచనలు చదవటమే కాని ప్రత్యక్షం గా చూడ లేదు .ఆయన నిరంతర సంచారి .ఎప్పుడు ఏదో ప్రదేశానికి వెళ్లి అక్కడి తెలుగు వారి భాషా విషయాలు పరిశోధించి వ్యాసాలు రాస్తుంటారు .ప్రళయ కావేరి అనే వారి కధా సంపుటికి అవార్డు వచ్చింది .నాతొ చాల ఆత్మీయం గా మాట్లాడారు .ఉయ్యూరు ,ఆ పరిసర ప్రాంతాలు తెలుసు నని ,చెప్పారు .ఇక్కడి ఈ మిత్ర బృందానికి ఆయన గొప్ప ప్రేరణ .అలాగే రమేష్ బాబు గారు .వాళ్లిద్దరే స్ఫూర్తి ప్రదాతలు గా నిండు మనసుతో అందరు చెప్పారు .ఇలాంటి మిత్రులకు ఇంకో యాభై మంది సుశిక్షుతులైన కార్య కర్తలు తోడ్పడుతూ ,చాలా కార్య క్రమాల్ని దిగ్విజం గా జరపటం విశేషం .మంచి అనుభూతి పొందాను .ఇక్కడికి రావటం నాకు చాలా ఉపయోగ పడింది ..అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ,ఫోటోలు దిగి ,వసంత గారి కారు లో మునిరాజు గారితో కలిసి హోటల్ కువెళ్ళి టిఫిన్ చేసి ,రాత్రి ఏడు గంటలకు బస్ ఎక్కి తొమ్మిదింటికి బెంగళూర్ చేరాను అక్కడి విషయాలన్నీ నారాయణ రెడ్డి గారు చెప్పిన వివరాలు మీకు వివరం గా తెలియ జేస్తాను .మంచి మిత్రబృందాన్ని ,సేవా నిరతుల్ని ,భాషాభి మానుల్ని ,భాషోద్యమ కార్య కర్తల్ని ,అకున్తిత దీక్షా దక్షుల్ని ,అంకిత భావం తో ,ప్రతి ఫలా పేక్ష లేకుండా ,తమ అమూల్య సమయాన్ని ,ధనాన్ని తెలుగును నిలబెట్ట టానికి కృషి చేస్తున్న నిత్కృషీ వాళుల్ని చూసిన ఆనందం మనసు నిండా నింపుకొని ఇంటికి సంతృప్తిగా చేరాను .వారి మర్యాద ,మన్నన ,పెద్దరికం ,కలుపుగోలు తనం నన్ను బాగా ఆకర్షించాయి మేమున్న మార్త హళ్లి కి హోసూర్ సుమారు నలభై కిలో మీటర్లు .వెళ్లి తిరిగి రావా టానికి సుమారు వందరూపాయలవుతుంది .
హోసూరు కృష్ణా గిరి జిల్లా లో వుంది-తమిళనాడు నాడు లో .అయిదు కిలో మీటర్ల లో కర్నాటక సరిహద్దు .దీపావళికి బెంగళూర్ వాళ్ళంతా హోసూర్ వెళ్లి టపాకాయలు కొనుక్కుంటారు .చవక .అవి తమిళనాడు లోని శివ కాశి నుంచి వస్తాయ.పెద్ద ఊరే లక్ష జనాభా .అందులో అరవై వేలమంది తెలుగు వారే .ఇక్కడి శాసన సభ్యుడు తెలుగు వారే ..అయినా భాషా వివక్షతకు ఇక్కడి తెలుగు వారు ,కన్నడిగులు ,మలయాళీలు ,ఇబ్బంది పడుతున్నారు .ఇవన్నీ వివరం గా మళ్ళీ రాస్తాను
మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ —20 -07 -11 —-క్యాంపు —బెంగళూర్ .