శ్రీ రమణ వాణి

   శ్రీ రమణ వాణి
      —————
                    రామన్  అని పిలువ బడే శ్రీ రమణ మహర్షికి ఆ పేరు పెట్టింది ఆంద్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం దగ్గరలో జన్మించిన శ్రీ అ యల సోమయాజుల గణపతి శాస్త్రి గారు .వారినే వాశిష్ట గణపతి అని గణపతి ముని అని అంటారు .రమణ మహర్షి లోని  అనంత జ్ఞానాన్ని అర్ధం చేసుకొని శ్రీ రమణులు అని పిలవటం ప్రారంభించారు గణపతి ముని .రమణులు వీరిని గౌరవం గా ”నాయన గారూ”అని పిలిచే వారు .గణపతి ముని గొప్ప తపస్సంపన్నులు .వెద వేదాంగాలన్నీ క్షుణ్ణం గా చదివారు .వేదం లోని విషయాలు భారతం లో పాత్రల రూపం లో ఎలా చోటు చేసు కొన్నాయో వివరం గా పుస్తకం రాశారు .రమణ మహర్షి గొప్ప తనాన్ని లోకానికి అనేక ఉపన్యాసాల ద్వారా ,పుస్తకాల ద్వారా తెలియ జేశారు .ఎన్నో స్తోత్రాలు రాశారు .అమ్మ ఆయన నోట పలుకు తుందని ప్రతీతి .అలాగే ఆంద్ర దేశం లోని సూరి నాగమ్మ గారు రమణాశ్రమం లో వుండి ,శ్రీ రమణుల సేవలో పునీతురాలైనారు .ఆమె వ్రాసిన” రమణాశ్రమం ఉత్తరాలు ”చాలా ప్రాచుర్యం పొందాయని అందరికి తెలుసు .గుడిపాటి వెంకట చలం గారు అన్నీ వదిలి చివరికి రమణ మహర్షి చెంత చేరి జీవితం ధన్యం చేసుకోన్నారన్నది లోక విదితమే .చింతా దీక్షితులు శ్వాశ అంతా రమణ భగ వానే .ఇలా ఎందరెందరినో తన  అమృత వాక్కుల చేత ప్రభావితం చేశారు భగవాన్ రమణ మహర్షి .వారి ఉపదేశ సారాన్ని ఇప్పుడు తెలుసు కొందాం .
                       పురుషార్ధం అంటే పరమ పురుషున్ని అర్ధం చేసుకోవటమే .పురుష ప్రయత్నానికీ ఇదే అర్ధం .
భాగవతం లో జడ భరతుడిని గురించి చెబుతూ పోతన్న గారు  ”చంపగ .వచ్చిన వారి యందు ,కరవాలము నందు ,కాళి యందు ,ను అచ్యుత భావము వహించే ”అంటారు .అంటే దేని మీద ఆయనకు ద్వేషం ,ప్రేమ అనేవి లేవు .అంతా సమ భావనమే .ఇదే స్థితి ని శ్రీ రామ కృష్ణ పరమ హమ పొందారని విజ్ఞులు తెలియ జేశారు .
         వలలో చిక్కిన పక్షి ప్రాణ వాయువును నిరోధించి నట్లు మనం కూడా చేస్తే మనసు లోని చాంచల్యం  పోతుంది .దీనినే ”జాల పక్షి వద్రోధ సాధనం ”అన్నారు రమణ మహర్షి
  ప్రాణా యామం అంటే ప్రాణ శక్తిని ,మనస్సును ,సమన్వయము చేయటమే .”మనసా ప్రాణస్య ఈక్షణం –ఇతి ప్రాణా యామః ”అంటే మనసును ,ప్రాణం పైన పెట్టటమే .
మనసు ,ప్రాణం రెండు ఒకే వృక్షం యొక్క రెండు శాఖలే .
”హృదయ మేవ ప్రాణ ,మనసోరుత్పత్తి స్థానం   భవతి –హృద్యేవ ఆత్మ జ్యొథిహ్ ప్రకాశతే ”ప్రాణం ,మనసు  ఉత్పత్తి స్థానం ఆత్మజ్యోతి ప్రకాశించే హృదయమే .
  లయం అనే మాట తరుచు గా వాడుతాం .లయం అంటే తాత్కాలికం గా శాన్తిన్చాటమే .నిద్ర పోవటం లాంటిది .ప్రాణా యామం ద్వారా మనసు శాంతిన్చినా ,తాత్కాలికమే .ఆ స్థితి అయి పోగానే మనసు మళ్ళీ చంచలమవుతుంది ..అయితె జ్ఞానం ద్వారా పొందిన మనసు వాసనలను పొందదు. .స్థిరం గా వుంటుంది .అందుకే ”మనో నాశాయ మోక్షం ”అన్నారు .జాగృతి స్థితి లో మేలు కోని వున్నా ,మనసు బ్రహ్మ భావన పొందితే ఇంక గ్రహణ శక్తి వుండదు .
     ”ఆజ్యం పునః క్షీరో న భవతి ”నెయ్యి మళ్ళీ పాలు కాలేవు ..కావు కూడా .పండు మళ్ళీ కాయ  కాలేదు .అట్లాగే మరణిస్తే మళ్ళీ పుట్టదు .
  ప్రాణాన్ని నిరోధిస్తే మనసు లయం అవుతుంది .మనో వృత్తిని నిరోధిస్తే మనసు వినాశం అవుతుంది .ప్రాణ నిరోధం తో లయమైన మనసు ,మళ్ళీ పని చేస్తూ వుంటుంది . .మనసు లోని వాసనల నాశనమే నిజమైన నాశనం .”లయ వినాశనే ఉభయ రోదనే –లయా గతం పునర్భవతి’నో మృతం ”’అన్నాడు గీతా చార్యుడు . మనో నాశ మోక్షం అమనస్క యోగం కావాలి .అలాంటి స్వ -ఆత్మ స్థితి లో ఉత్కృష్టమైన యోగికి ఇంక ఏ పనీ చేయాల్సిన అవసరం వుండదు .
     ”దృశ్య వారితం –చిత్త మాత్మనః –చిత్త దర్శనం -తత్వ దర్శనం ”మనసు అంతర్ముఖం చేసి ,ఆత్మ స్వరూపం లో ఉంచటమే చిత్ లేక తత్వ దర్శనం .
మనసు అంటే అంతఃకరణం .–కరణం అంటే పని ముట్టు ..అంటే మనసు మన లో వుండే లోపలి పని ముట్టు .కాళ్ళు ,చేతులు బయటి పని ముట్లు .”
”తెలియ బడు చున్న విశ్వంబు దృశ్య మగును –తెలివినై   సర్వమును కాంచు –దృక్కు నేను –మిగుల నా కంటే అన్యమేమియును లేదు –సత్యమిది –సర్వ వేదాంత సంగ్రహంబు ”అని సీతా రామాంజనేయ సంవాదం చెబుతున్నది ఇదే .
మనసు ,మనసు అని విచారణ చేస్తే ,చివరికి చేరేది మూల స్థాన మైన పరమేశ్వర స్థానమే .అంటే మనస్సు అనేదే లేని స్తానం .
పతంజలి మహర్షి ;యోగః ;  చిత్త వ్రుత్తి నిరోధః ”అన్నారు .చూచే వాడు ,చూసేది చూడ బడేది కలిస్తే త్రిపుటి అంటారు .జ్ఞాని అంటే కళ్ళున్న గుడ్డి వాడు .అంటే  కళ్ళు  వున్నా బయటి ప్రపంచ జ్ఞానం లేని వాడు .అంటే త్రిపుటి రాహిత్యం పొందిన వాడు .
ఇంగ్లీష్ లో నెవెర్ మైండ్ అంటారు అంటే పట్టించుకోక పోవటమే .దీన్నే మన వాళ్ళు ”నైవ మానసం ”అన్నారు .పట్టించుకోవటాన్ని విషయం అంటారు .పట్టించుకోక పొతే ఏమీ వుండదు .ఆలోచనా ప్రవ్రుత్తి నుండి ,మనసునుతన వైపుకు  మరల్చు కోవటమే .”ద్రుశ్యాను విద్ధ సంకల్ప సమాధి ”అన్నారు .అదే నెవెర్ మైండ్ .సహజం గా మనసు ప్రశాంతం గా నే వుంటుంది .దానిపై ఆలోచనలను కేంద్రీకరిస్తే సంసారం అవుతుంది .లేక పొతే ఏదీ లేదు .మనసు వాటి వెంట పరిగెత్తితే అశాంతి పరిగెత్తకుండా వుంటే పరమ శాంతి .అదే నిశ్చింత .ఇదే నైవ మానసం .నైవ మానసమే అమనస్క యోగం .
వృత్తులు రెండు రకాలు ఇదం వ్రుత్తి .,అహం వ్రుత్తి .ఇదం వ్రుత్తి అంటే ప్రాణాయామం ధ్యానం వల్ల నియమించ బడటం ..అహం వ్రుత్తి అంటే మనసు పై లగ్నం చేస్తేనే నశించేది .
”సత్తాయా చిత్ –చిత్త యామ్యహం ”అంటారు రమణ మహర్షి .సత్ నే చిత్ అంటారు .ఆ చిత్ అంటే ”నేను ”
దేహ ఉపాధి ధ్యాస వదిలేస్తే ఈశ్వర దర్శన మైన స్వ ఆత్మ స్వరూప దర్శనం లభిస్తుంది .అప్పుడే తాను ఈశ్వర స్వరూపుడు అవుతాడు .
 జీవస్తు దైవికః ””ఇక్కడ దైవిక అనే పదం శ్రీ రమణుల సృష్టే .దైవ గుణం తో వున్న జ్ఞానినే దైవికుడు అంటారు .దైవికః జీవః  అంటే సత్వ గుణ ప్రదానుడే దేవుడు .
”ఆహామపేతకం –మహాదిదంత పో రమణ వాణి దం” అహంకారాలు నాశన మైతే ,ఆత్మ స్వరూపం తెలిసిన జ్ఞానమే నిజమైన తపస్సు .  ”అని భగవాన్ శ్రీ రమణ మహర్షి అభి భాషణం
                         ముప్ఫై శ్లోకాలలో చక్కగా ఆత్మ దర్శనాన్ని ,పాడుకోవటానికి వీలుగా వున్న ఛందస్సులో సంస్కృతం లో ”ఉపదేశ సారం ”అనే పేరిట  అద్భతం గా చెప్పారు భగవాన్ శ్రీ రమణ మహర్షి
అందు లోని సారాన్ని శ్రీ ఏకాత్మ గారు మనోహరం గా ,సుబోధకం గా ఆవిష్కరించారు అందులో కొంత సార సంగ్రహం చేసి మీకు అందించాను . ..
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —21 -07 -11 .క్యాంపు –బెంగళూర్  .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.