తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —1

        తెల్ల కొక్కెర తెప్పం –కదా సంకలనం –పుస్తక సమీక్ష —
            ——————————————————
                   ఈ నెల 18 వ తేది బెంగళూర్ నుంచి హోసూర్ వెల్లి నపుడు అక్కడి సాహితీ మిత్రులను కలిసిన వివరాలన్నీ మీకుఅంద జేశాను .అక్కడి యువకుడు ,ఉత్చాహ వంతుడు ,తెలుగు భాషా కార్య కర్త ,కవి ,కధకుడు అయిన డాక్టర్ యెన్ .వసంత్ గారు తన మొదటి కధా సంపుటి ”తెల్ల కొక్కెర తెప్పం ”నాకు బహూక రించారు ..దాన్ని వెంటనే చదివాను .ఇది హోసూర్ మాండలికం లో రాసిన కధా హారం .మాండలికాలు భాష కు జీవ నాడులు ..వాటిలో కాలా తీత మైన శబ్ద సంపద వుంటుంది .కాల క్రమేనా భాష పై అనేక శక్తుల ప్రభావం పని చేయటం వల్ల మాండలికాలు మరుగై పోతున్నాయి .అది గ్రహించిన రచయితలు ,చైతన్న్య వంతులై తమ ప్రాంత మాండలికాన్ని బ్రతికించు కొనే ఉద్దేశం తో మాండలికం లో కధా రచన ప్రారంభించారు .కవితా సంపుటులు తెస్తున్నారు .మామూలు వ్యాసాలు మాండలికం లో రాసి భాష అస్తిత్వాన్ని నిల బెట్టు తున్నారు .ఇలా వచ్చిన వే నామిని సుబ్రహ్మణ్యం రాయల సీమ మాండలికం లోను ,ఖదీర్ బాబు కధలు ,బార్బర్ కధలు ,మిట్టూరోడి  కధలు ,ముస్లిం మైనారిటీ కధలు ,తెలంగాణా మాండలికం లోను ,ఉత్తరాంధ్ర మాండలికం లోను వస్తున్న కధలు .వీటి నన్నిటిని పాథకులు ఆదరిస్తూనే వున్నారు .పత్రికలూ ప్రోత్చాహిస్తూనే వున్నాయి ..హోసూర్ ప్రాంతం లోని మాండలికం నేపధ్యం తో ,తన తల్లి గారు చెప్పినవిషయాలను భద్రపరచి ,స.వెం గారి ప్రోత్చాహం తో వసంత్ ఈ కధలు రాశారు. ఇది ఆయన ప్రధమ ప్రయత్నమని అంటున్నారు కాని ,ఒక చేయి తిరిగిన రచయిత రాసిన తీరుగా వుండటం డాక్టర్ గారి ప్రతిభకు నిదర్శనం  
                      ఇరవై కధలున్న ఈ సంపుటి కధల్ని హోసూర్ కధలు గా కూడా పిలుస్తున్నారు .ఈ పుస్తకాన్ని వసంత్ తన తేనే పలుకుల తెలుగమ్మతన తొలి మాటలతో పలకరించిన తన కన్నతల్లి
వెంకట లక్ష్మమ్మ గారికి అంకితమిచ్చి ,తల్లి రుణాన్ని ,తెలుగు భాషామ తల్లి రుణాన్ని తీర్చు కొన్నారు .ఇక్కడ తెలుగును రెండవ అధికార భాష గా చెయ్యాలనే ఉద్యమ స్ఫూర్తి కలవారు వసంత్ .అంతే కాదు తమ కళ్ళముందే తెలుగు మాట ,పాట పద్యం ఊర్ల పేర్లు ఆటలు కనుమరుగవటం తో తల్ల డిల్లి పోయారు .ఇక్కడి సామెతలు ,ఆచార వ్యవహారాలూ ,చిన్న నాటి జ్ఞాపకాలను కతలు గా మలచాలన్న  రమేష్ గారి హితం  బలం గా పనిచేసి కధలకు శ్రీ కారం చుట్టారు .
               ఇందులోని వాన కోయిల ,చీమక్క దోమక్క ,కాకమ్మ గువ్వమ్మ ,బంగారు పేట కధలు పశు పక్షాదులను పాత్రలు గా చేసుకొని వాటిలోనూ సామాజిక నీతి ని చెప్పారు .ఇవి పంచ తంత్ర కధల్లా బాగా వున్నాయి .కొన్ని కధలు వాళ్ల పల్లె టూరి జ్ఞాపకాలను ,పెళ్ళిళ్ళను ,దేవుడి ఉత్చ వాలనుగురించి చెబితే ,భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచినపుడు ఇక్కడి హోసూర్ ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రం లో కలపమని గోల చేసినా పట్టించు కోని ఆంద్ర వాళ్ల చేతకాని తనాన్ని గురించి ,ఇంకొన్ని భాషా సమస్య ,సెజ్ ల వ్యాప్తితో వచ్చిన పెను ముప్పు ,జీవన సరళిలో వచ్చిన మార్పు ,మళ్ళీ వాటిని కాపాడు కోవటానికి   ,పిన్నలు ,పెద్దలు చేసిన పోరాటం గురించి వున్నాయి .దారి తప్పిన యువకుల్ని ఉపాయం తో గాడిలో పెట్టిన కదా ,ఉపాయం తో అపాయం తప్పించిన పెద్దమ్మ కధ చెప్పటం లో అలాగే పల్లె బతుకులు శిధిల మాయే తీరు కొండ కోనా యేరు వూరు గురించిన తీయని జ్ఞాపకాలన్నే కల గలిపిన పుస్తకం ఇది .చాలా ఆవేదనతో ,అనుభవంతో అడుగడుగునా తన మాండలీకానికి పట్టం కడుతూ ,అందర్నీ చదివిన్చేట్లు చేసిన కధలివి .మంచి ప్రయత్నం .దీనిని చూసి ఈప్రయత్నానికి   సంబర పడి ,గుర్తించి వసంత్ గారికి ఆగస్ట్ ఏడవ తేది హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో  సంమానిస్తూ , అవార్డ్ ప్రదానం చేస్తున్నారు . .వారికి మనఃపూర్వక అభినందనలు .తొలి ప్రయత్నం తో మంచి గుర్తింపు లభించింది .
                  ఏటి గడ్డ కధలో తన పల్లె లోని చిన్న నాటి అనుభవాలను గుది  గుచ్చి . ఆ చల్ల గాలి ,తోట దొడ్డి యేరు నీరు ,ఆట పాట గువ్వల గుసగుసలు గాలి రాయబారాలు ఇంకెక్కడా దొరకవని ఒక్క తన పల్లె లోనే వున్నాయని సంబర పడ్డారు . తన బాబాయి అంటే పిన్నప్ప పెళ్లి జ్ఞాపకాలను ,తీరును కళ్ళకు కట్టినట్లు వర్ణించారు పిన్నయ్య పెళ్లి కతలో .తెల్ల కొక్కెర  తెప్పం అంటే తెల్ల కొంగల సమూహం  అవి నీటి మీద వాలితే ఒక తెప్ప లాగా కని పించటం .చిన్న నాడుఏడాదిలో కొన్ని రోజులు ఎక్కడి నుంచో కొంగలు వచ్చి వాళ్ల వూరి చెరువు లో దిగి బండ రాయి మీద చేరితే ఒక తెల్ల తెప్ప లాగా కని పించింది రచయితకు .కొంగలు యెగిరి పోగానేతెప్పం   కూడా పోయిన్దనుకొనే అమాయక పిల్లగాడు .పాలేరు వివరించి చెబితే తెలిసింది .కొంగలు బండ మీద వాలటం వల్ల తెప్పగా కనిపించిందని ,కొంగలు యెగిరి పోగానే బండ అక్కడే వుందని తెలుసుకొన్నాడు ”కొన్ని సమాశారాలు ఒగరు సెప్పి తెలుసుకొనే దాని కన్నా ,మనము నేరుగా సూసి అర్తము శేషు కొంటె ఆ ఆనందమే వేరు గౌడూ ”అని మన్చి హిత బోధ చేశాడు జర గప్ప ఈ కద పేరే కధా సంపుటానికి పేరు అయింది .పల్లె టూరి అమాయ కత్వం ప్రకృతి సొగసు ,పక్షుల స్వైర విహారం ,నేత్రానందమైన అనుభూతి పల్లె సొగసులు వున్న కధలకు ఈ పేరు సహజం గా వుంది ., .నీడ నీళ్ళు కద లో అమాయకం గా ఒక చిన్నోడు మంచినీళ్ళు దోసిళ్ళలో తాగుతుంటే చెట్టు మీది చిన్న తొండ పిల్ల ఆ దోసితి నీటిలో పడి కడుపు లోకి పోయిందని ,మనో వ్యాధి తో చిక్కి శల్యమైన వాడి భయాన్ని పక్క వూరి మంత్ర గాడిని రప్పించి ,దోకులకు  మందిచ్చి ,కక్కించి ,తాను పట్టి తెచ్చిన తొండ పిల్లను అందు లో వేసి బయటకు వచ్చేసిందనినమ్మకం   కలిగించి వాణ్ని మామూలు మనిషిని చేసిన పెద్దమ్మ తెలివి తేటలను బయట పెట్టిన కద .ఆద్యంతం సరదా గా సాగుతుంది ..
                        ఊళ్ళోని పంటను చెట్టు కాయలను అర్ధ రాత్రి ఊళ్ళోని కొందరి  సాయం తో దొంగలు కాజేస్తుంటే అది కొరివి దెయ్యాల పని అనుకొనే అమాయక జనం కళ్ళునుతెరిపించి  ప్రత్యక్షం గా చూపించిన గౌడు కధే కొరివి దయ్యాలు .దొంగ గా ,తాగు బోతూ గా మారిన ఒక యువకుడిని వాడి, తండ్రి మార్చమని కోరటం తో వూరి పెద్ద గౌడు  వాన రాయ సామి వుత్చావం లో లో ఉపాయంగా మార్చి ,మళ్ళీ మామూలు మనిషిని చేసిన కద .వాన కోసం వాన రాయ స్వామిని పూజించటం పల్లె టూరి పధ్ధతి .తెలుగు భాష ను దూరం చేసే పనులు తమిళ ప్రభుత్వమూ ,తమిళ అది కారులు చేస్తుంటే వూరు కో లేక మాస్టారు సహాయం తో పిన్నా పెద్ద కుర్రాళ్ళు అంతా కలిసి పోరాడి తెలుగుకు మళ్ళీ మంచి రోజులు తెచ్చిన కదే మా వూరు .గుమ్మయ్య మొడుగు అంటే గుమ్మయ్య మడుగుఅని అర్ధం .ఈ కధలో ఆ మడుగు చుట్టూ వున్న faunaa ,floraa లను అత్యద్భుతం గా వర్ణించారు ,వాళ్ళమ్మ  వండే పిండి వంటల లిస్టు కూడా బాగుంటుంది నోరు ఊరిస్తూ .ఇంత అందమైన మడుగు పరిశ్రామల పేరిట వ్యర్ధ పదార్ధాలు తమిళ తంబుల మేడలలోని మురికి నీరు ,చేరి వాతావరణ కాలుష్యం ,జల.వాయు కాలుష్యం ఏర్పడి జన జీవనం దుర్భర మైంది .ఎవరు తమిళుల ను ఎదిరించే సాహసం చేయ లేక పోయారు .భరిస్తూ వూరు కొన్నారు .పారిశ్రామిక ప్రగతి తెచ్చిన ప్రమాదం ఇది .దసరా పది రోజుల వుత్చావాన్ని ”జం సవారీ ”కడలో బాగా వివరించారు .నాకు తెలిసి నంతవరకు మేము హిందూ పురం లో వుండగా ”జంబు సవారి ”అని దసరా పండుగను చేయటం జ్ఞాపకం వచ్చింది .విజయ దశమి నాడు వాహనాలలో కార్లలో బస్సుల్లో సాయంత్రం అందరు డబ్బు ఖర్చు లేకుండా ఊరంతా ఫ్రీ గా తిరిగే వారు .మేమప్పుడు పిల్లలం .జంబు సవారి అని తెగ సంబర పడే వాళ్ళం .బస్సుల్లో సుగూరు ఆంజనేయ స్వామి గుడికి ఫ్రీ గా వెల్లి వచ్చే వాళ్ళం .ఆ జంబు సవారే ఇక్కడ జం సవారి అయిందని పిస్తోంది .అమ్మాయి ,అల్లుడు ఇద్దరు ఉద్యోగాల్లో ఉండి ,డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకు తుంటే తండ్రి మారప్ప ఉపాయం ఆలోచించి తన వూరిలో జరిగే పరస అంటే దేవుడి పండుగకు బలవంతం మీద ఒప్పించి ,రప్పించి ,వాళ్ల మనస్సుల్లో మార్పు తెప్పించి ,సంసారసౌఖ్యాన్నిఅర్ధం చేసుకోనేట్లు రాసిన కధే ”పరస ”బాగా రాస్శారు .
                    చిన్నతనం లో చిరు తప్పు చేస్తే ,దానిని మహాత్ముల బోధనా తో సరిదిద్దు కోని మళ్ళీ ఆ తప్పు చేయకుండా అందరి క్షేమం కోసం పాటు పడుతూ ,తన యావత్ ఆస్తిని ఆఅశ్రమానికి రాసిచ్చి ,అందులోనే స్వామి సేవ చేస్తూ ,జీవితాన్ని పందిన్చుకోంది పెద్దమ్మ .అయితెకొన్నేళ్ళకు   ఎవరో వచ్చి చిన్నప్పుడు ఆమె చేసిన తప్పును జ్ఞాపకం చేసి ఆశ్రమ వాసులకు చెబితే అప్పటిదాకా  నిప్పులా  చూసిన వాళ్ళు ఆమెను దూరం చేశారు .భరించ లేక వేరే వూరు వెల్లి అక్కడా సమాజ హితం గా బతుకు తూ చని పోయింది .అక్కడి ప్రజా అంతా ఆమెను దేవతలాగా భావించి అంత్య క్రియలను అత్యంత వైభవం గా జరిపారు .ఇక్కడి ఆశ్రమ వాస్లు వెల్లి చూసి తమ తప్పిదం తెలుసు కొన్నారు .ఈ కధే ”పెద్ద మనసు పెద్దమ్మ ”మనిషి చనిపోతే జనం యెంత ఎక్కువ గా వస్తే వాళ్ళు స్వర్గానికి పోతారని పెద్దమ్మ అంటూ వుండేది .అదే నిజ మయింది .
              సెజ్ ల పేర భూములు పోగొట్టుకొని చిన్నా ,చితక రైతులు రోడ్ మీద పడిన కధే ‘ఆపత్తు ”.తన సర్వం తన తొందర వల్ల ,కొడుకు వ్యసనాల వల్ల పో గోట్టుకొన్న గౌడు చివరికి తన కర్మ మిగిలిన రైతులకు కలగ కూడదని ,రైతులన్దర్నీ సమీకరించి ,ప్రభుత్వాన్ని నిలదీసి ,అధికార్లను ఒప్పించి మార్పు తెప్పించాడు .మంది కలిస్తే సమాస్యా విడి పోతుంది .అని తెలియ జెప్పారు .
మన ప్రాంతం లో సంస్కృతం అంటే దేవ భాష మాత్రమే కాదు బూతు అని కూడా అని అర్ధం వున్న సంగతి అందరికి తెలిసిందే .దీన్నే మనం పన్నెండో నెంబర్ భాష అంటాం  .పిట్టన్నకు సంస్కృతం నేర్చుకొంటే గౌరవం పెరుగు త్తుందని భావించి జిట్టన్న మాట విని పక్క వూరికి పోయి అక్కడ అమ్మ లక్కలు తిట్టు కొనే బూతులు చాటుగా విని వాళ్ల కళ్ళలో పడి దెబ్బలు తిన్నాడు సరదా గా సాగే కద ”.రచయిత సెన్స్ అఫ్ హుమౌర్ కి మచ్చు తునక” .సముస్క్రుతము ”కద
                     పంచాయితీ ఎన్నికల్లో గెలవా టానికి అన్ని పాట్లు పడతాడు శీనప్ప   .చివరికి గెలిచాడు .తెలుగు లో ప్రమాణ స్వీకారం చేస్తానంటే అది కారి ఒప్పుకో లేదు .ఇంకేమి వుంది ?తెలుగు లంతా సమాయత్త మినారు .అన్ని పంచాయితీ అధ్యక్షులుకలిసి నడిచారు .ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు .ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల కోరిక మన్నించింది .అందరు ఒకే సారి వారి ఊళ్లలో తెలుగు లో ప్రమాణ స్వీకారం చేసిన కధే ”తల వర ”అంతే పంచాయితీ అధ్యక్షుడు .దాన్ని తిర గేస్తే వర తల విశిష్ట మైన తల .హెడ్ మాస్టర్ లాగా .అంటే గ్రామానికి ముఖ్యడు .
            ఈ ప్రాంతపు సాహితీ వేత్త ,కవి ,రచయిత నంద్యాల నారాయణ రెడ్డి   గారి కి ఆంధ్రలు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ సరిగా తెలుగు వాళ్ళను పట్టించు కో లేదని .ఆ కోపం ఇప్పటి దాక వుంది .ఆ అసహనాన్ని వీలైనప్పుడల్లా ఆయన ప్రదర్శిస్తారు .ఇక్కడ ఏ కార్య క్రమం జరిగిన ఆయనే ముందుంటారు .మంచి సలహాలనిస్తారు …అర్జీలు రాస్తారు .తెలుగే కాదు తమిళ ,కన్నడాలలోను మాట్లాడ గలరు ,రాయ గలరు .వారి కోప తాపాలను తమాషా గా తెలియ జేసే కధే ”ఆంధ్రా వొళ్ళ శేతలా అయితిండా ?.బాగా చెప్పారు రచయిత .చక్కని హాస్యము పండించారు నారాయణ తాత ,నాయినమ్మ సంభాషణలలో .
             ఒక వాన కోయిల అక్కను ఆవ మాన పరిచి అక్క తనకు అన్య్యాయం చేసిందని గుడ్డి గా నమ్మి అక్కనే కాళ్ళతో తన్ని బయట పడేస్తే బండ రాయి తగిలి అక్క చని పోయింది .తాగినమైకం దిగి తప్పు తెలుసు కోని విల విలా ఏడుస్తూ అక్క కోసం దేశం అంతా ”ఆక-ఆక ”అని పిలుసు గాలిస్తోందట ..వాన కోయిల హోసూర్ ప్రాంతం లో దుక్కులు దున్నే టప్పుడు కని పించే పిట్ట అది ఆకా -ఆకా అని కూస్తుందట .దీన్ని ఆధారంగా చాలా కమ్మటి నీతి బోధక మైన కద చెప్పటం వసంత్ గారి భావుకతకు  అద్దం పాడు తుంది .తొందర పాటు అనర్ధం అని నీతి .
               కోలారు ప్రాంతం లో బంగారు గనులున్నాయని అందరికి తెల్లుసు ..బాల రాజు అనే రాజు  ఏడవ రానికి కడుపు వచ్చింది /బిడ్డ పుడితే  రాజ్యానికి అరిష్టం అని మిగిలిన రాణులు , భావించి ఆమెను చంపాలని రాణుల ఆలోచన తెలుసుకొనిబంగారమ్మ  రాణీ వాసం వదిలి అడవి చేరింది  అక్కడ ప్రసవించింది .కొడుకుని ఒకా బావురుపిల్లికిబిడ్డ ను పెంచే బాధ్యత అప్పగించి చని పోయింది .ఒక రోజూ రాజు చంద్ర చూదేశ్వర స్వామి దర్శనానికి రాణులతో వచ్చాడు .అక్కడకొడుకుని  చూస్సాడు .అందరు వాడికి రాజా కళ వుందని భావించారు .అపుడు బావురు పిల్లి నిజం చెప్పింది రాజైన బాల రాజుకు  బంగా రమ్మ గొప్ప తనాన్ని తెలుసు కోని వారంతా చేసిన తప్పు తెలుసు కొన్నారు .కొడుకును స్వీకరించాడు రాజు .బంగారమ్మ చేసిన త్యాగానికి ముగ్ధుడై ఆమె పేర బంగారు పేట కట్టించాడు .కోలారు సీమ లో వున్డిది బెంగాల్లుర్ నుంచి మద్రాస్ వెళ్ళే రైల్ దారిలో ఈ వూరు కనిపిస్తుంది .తర తరాలు గా వస్తున్న కధకు శాశ్వత రూపం ఇచ్చి బంగారు కద తయారు చేశారు సంపెంగ పూవుల వంటి గుబాళింపుతో సంపత్ .
యెంత బల శాలి అయినా ఒక్కడు ఏమి చేయలేదు .కలిసి వుంటే కలదు సుఖం .అని తెలియ జెప్పిన కధే ”చీమక్క -దోమక్క ”అలానే  ”కాకమ్మ గువ్వమ్మ ”కధలో బద్ధకం పనికి రాదనీ ,శ్రమించి పనిచేస్తే సౌఖ్యం అని తెలియ జెప్పారు .సోంబేరి తనం కొంప మీదికి తెస్తుంది .చివరి కద ”ఎల్లమ్మ తెలివి ;;”.ఎల్లమ్మ కొడుకులు వూళ్ళో లేరని తెలిసి దొంగలు ఆమె ఇంటికి చేరి దోచుకోవటానికి సిద్ధమైనారు .ఎల్లమ్మ తెలివైనది పరిస్థితి అర్ధం చేసు కోని తన కొడుకులు ఇంట్లూనే తలో చోటా వున్నట్లు బిల్డ్ అప్  ఇచ్చి ,పేరు పేరునా వాళ్ళని పిలుస్తూ ,గొంతు మార్చి వాళ్ళే సమాధానం చెబుతున్నట్లు సమాధానం ఇస్తూ దొంగల్ని బెదిరించి పారి పోయేట్లు చేసింది .అపాయాన్ని ఉపాయం తో తప్పించింది తెలివి గల ఎల్లామ్మ .
ఈ విధం గా ఇరవై కధల్లో వైవిధ్యం వుంది .సామాజిక బాధ్యత వుంది .పల్లె సొగసుల పట్ల ఆరాధనా భావం వుంది .తెలుగు భాషకు జరుగు తున్న అపకారంవుంది ,దాన్నించి కాపాడు కొనే ఆలోచన వుంది ,మాండలీకానికి మహర్దశ పట్టించిన విధానం వుంది .కమ్మని కధలు ,కమ కమ్మని శైలి ,నిండు కావేరి లాంటి స్వత్చత వుంది .ఎక్కడా ఆవేశ కావేశాలు ,చంపు ,నరుకు లేవు .ఆలోచన వుంది .దానికి తగ్గ ఆచరణ మార్గం వుంది .కధలో మాండలికాలు బయటి వాళ్లకు అర్ధం కావేమో నని ప్రతి కద చివర వాటికి వాడుక లోని  అర్ధాలు ఇవ్వటం బాగుంది .
            ఇప్పటి దాక  కధా ,దాని సంవిధానం  మాత్రమే  చెప్పాను .అందులోని సామెతలు జాతీయాలు ,మాండలికం లోని సొగసులు తరువాత తెలియ జేస్తాను
                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -౦.అలానే 7 -11 –క్యాంపు–బెంగళూర్ .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.