తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2

 తెల్ల కొక్కెర తెప్పం –పుస్తక సమీక్షా —2
         —————————————–”
డాక్టర్ వసంత్ రాసిన ”తెల్ల కొప్పెర తెప్పం ;;”కధా సంపుటి లోని కధలను గురించి తెలియ జేశాను కదా .ఇప్పుడు అందు లోని జాతీయాలు ,సామెతలు ,మాండలీక వైభవం గురించి వివ రిస్తాను .శేప్పేది శేప్పి శేప్పులా కొట్టి ,శిప్పలా బెల్లము పెడతాడు ముసిలోడు .”పగోన్ని పంచాంగము అడిగి నట్లు ”’కర్నాతకము   గుర్రమైతే తమిళ నాడు గాడిదే ”.”ఆలు పోయెరా గోవిందా –ఆలు పోయిన అనంత పురముల అన్నెము దొరికేర గోవిందా ”
”      ”పొద్దున్న పోయేది టీ అంగడి .పొద్దు మునిగ వంక పోయేది మందు అంగడి ..”కసువామి కాడ కుక్క  కసువు తినేలా ,పశువుని తిన్నిచ్చేలా ”తాను తినడు ఇతరులకు పెట్టడు అన్న అర్ధం లో వాడింది .
”తిరిసి తినేదానింటికి గింజల పులుసుకి పొతే గిద్ది పీక్కొని అమ్పించిందట ”అడుక్కొని తినే దానింటికి ఏదైనా పెట్టమని వెళ్తే గిన్నె లాక్కొని పంపించిందట .
”రాగ్గింజంత రెడ్దోడుంటే రాజ్యమే శేది పోతుంది ”రెడ్ల మీది ద్వేషాన్ని తెలియ జేసే సామెత మనం కూడా ”ఉల్లి పాయంత  కాపు వుంటే ఊరంతా చెడ గోద్తాడు ”
”శివుని పూజలా కరిడి దూరినట్లు ”  శివ పూజ చేస్తుంటే ఎలుగు బంటి అడ్డ మోచ్చినట్లు అనే భావం .అడ్డ మొచ్చి పని చెడ గొట్టే వాళ్ల గురించి అనే మాట .
”కారే మారే కట్టాలి పట్టా ,కాలకుండా పోనుకోవే బొండెం బిడ్డా ”ఒక జాన పద పాట
”ఎదురిల్లు పాడైతే ఎండిన కట్టెలు శ్హిక్కు తాయని ఎదురు శుశే కాలమ్ .అవతలీ  వాడి బాధ చూసి ఆనందించే వాడు .
”గౌనోల్ల శాద్యం ఎడూల్ల ఎల్లెలుపంత ”అంటే గౌడుల వ్యవసాయం ఎడ్ల వెడల్పు అనగా బాగా విస్తరించి వుంటుంది .”గోనోల్ల శేనులా పంట పండిందంటే ,పేదోళ్ళ ఇంటిలా గాదినిన్దినట్లే ”గౌడులు ఉదార స్వభావం వున్న వాళ్ళు అని తెలియ జేస్తోంది . వాళ్ల  చేనుల్లో పంట బాగా పండితే బీదా ,బిక్కి కి అన్నానికి కొదవ ఉండదని భరోసా .’
      ”మ్మన మెట్లా సంతకు పొతే మంచి సరుకునే ఏరి కొంటామో ,,ఆ దేవుడు కూడా అట్లే మంచోల్లని ముందర తీసుకొని పోతాడు ”.
      ”గువ్వ    ఇడిసి పోయిన గూడు లా వుంది ”
”తినేది ,కుడిసేది ,తిమ్మక్క ఇంట్లా -పోనుకోనేది లేశేది పాపక్క ఇంట్లా”  సత్రా  భోజనం మఠా నిద్ర అన్నట్లుంది .    ”
”ఉబిసో ఉబ్బెసో ఎపించుకొందాం ”పని అవాలంటే అవతలి వాడిని వుబ్బేసి లేక తిట్టి పని చేయించు కోవాలని భావం .
”బోరని వానలా వాన పడితే ధరణి పండుద్ది అంటా ”అంటే భరణి కార్తె లో వర్షం పడితే భూంమి బాగా పండుతుంది .
”బంతి భోజనానికి ముందుండాల ,ఎదురు యాజ్యానికి ఎన కుండాల ””మా పక్క యా పొద్దు వడ్లకు   ,రెడ్లకు కొదవ లేదు .”అంటే ఎక్కడ చూసినా రెడ్లే కనిపిస్తారు .వడ్లు పండే పొలాలే కని పిస్తాయి
ఇలాంటివి సందర్భోచితం గా ప్రయోగించి కధా గమనానికి ,అర్ధం ,పరమార్ధం కల్పించారు రచయిత .ఇంకా ఎన్నో హోసూరు జాతీయాలు ,సామెతలు వుండి వుంటాయి వాటిని అన్నిటిని భద్రం  చేయాల్సిన అవసరం వుంది .హోసూరు తెలుగు ప్రజానీకం మీద ఈ బాధ్యత చాల వుంది .
                                                                 మాండ లీకాలు
  హోసూర్ మాండలీకాలు బాగున్నాయి .భాషా వేత్తలు ,సామాన్య జనం మర్చి పోయిన వాటిని వీళ్ళు చాల ధారాళం గా వాడుతున్నట్లు కన్పించింది .అందులో నాకు బాగా నచ్చిన పదం ”మొయిలు ”అంటే మేఘం ..ఇది కావ్యాలకే పరిమిత మయింది .కానీ ఇక్కడ ఎక్కువ గా వాడుతున్నారు నాకు ఎంతో ఆనందం కల్గింది .సువర్ణ సుందరి సినిమా లో ”ఏమో తటిల్లతిక మేమో ,మై మరపేమో ,మొయిలు రాజు దరిమురిసినదేమో ”  అన్న పాట జ్ఞాపకం వచ్చింది .దీన్ని ఇప్పటికీ వాడుతున్న హోసూర్ తెలుగు ప్రజకు వీర తాళ్ళు .                                                                                                                                                                                
                         రంగుల తొండను  బాపన తొన కత్తె అంటారు .మేడి పండ్లకు ఆత్తి పండ్లంటారు .మనము వాడతాం .ఇంద్ర ధనసు కు మరో ముద్దు  పేరు కాముని బిల్లు .అంటే కాముని విల్లు .మీజు అంటారు నీటిలో  ఈదటాన్ని . వగరును తొగరు అనటం కావ్యాలలో వుంది .కాలీ ఫ్లవర్ వీళ్ళకు పువ్వు కోసు .చిన్నరాలును రోలు   ను  కటాని అని పిలుస్తారు ..సాయంత్రాన్ని మాపు సారి అంటారు మాపు అంటే సాయం సమయమే .పందిరికి సప్పరం అంటారు .చలువ చప్పరం మనకు వాడుక లో వుంది చప్పరం సప్పరం అయింది .వంటిల్లు వీళ్ళకు మూలిల్లు .అర్ధవంత మైన మాటే .నట్టిల్లు అంటే ముందు ఇల్లు .నడిమింటి సంగమేశ్వర శాస్త్రి జ్ఞాపకం వస్తారు .ఊరేగింపుకు మెరగని అనటం మామూలు .పొలాన్ని మడి అంటారు .అందరు వాడేదే మాదిగే నాలు అంటే పొలం గట్లు .కొక్కెర అంటే కొంగ చిన్నయ సూరి గారి పంచతంత్రం లో చదివిన మాటే .మెట్ట ను శేను అని ,మాగాణిని కాన అనీ అంటారు .సన్నాయి కి కొలువు అనే మంచి పేరు వాడు తారు .పరక అంటే చీపిరి .మనం కూడా పరక కొట్టటం అంటాము .అంటే వూడవటం .కలంగిరి కాయ అంటే పుచ్చ కాయ .పంగల కర్రను కవలు కొమ్మ అంటారు .కవల అంటే జంట .రెండు కొమ్మలు కలిసింది మంచి మాట .పువ్విరిసి –గంగ రావి .కరిడి –ఎలుగు బంటి .మట్టిగాడు –చిరుత .సేండు –బంతీ .ఇది చెండు కు అపభ్రంశం .కేళిక –వీధి భాగవతం –కేళి అంటే భలే మంచి మాట .”మగువ తన కేళికా మందిరమునకు జనియెన్ ”అని చదువు కొన్నాం .కొబ్బరి కాయలకు భలే మంచి పేరుంది వీళ్ళకు ”ఎల నీరు కాయ ”అంటే లేత నీల్లున్న కాయలు అనే అర్ధం .మోచ్చులు –కత్తులు .ఇదీ కొంత మంది వాడే మాటే .పొంజు –కాగడా .కిరసనాయలు కు సీమ నూనె అని పేరు .దీన్ని అంతా వాడతారు .
జీతం–సంబలం .గర్భిణి –యాగిటి  urumunu గుడుగు అని మెరుపును మించు అని అంటారు .ఇవీ కావ్యాలలో కని పించే మాటలే .యెర్ర బడటం –కేమ్బారు   .–కెంపు అవటం   కెంపు అంటే ఎరుపే ..
తమిళులు –కొంగోళ్ళు …ఒగ్గట్టు –ఐక మత్యం  –ఒక కట్టు గా వుండటం .కట్టు గట్టు అయింది .ఆశ –ఆపెకారము .–అంటే ఆపేక్ష .గోరటి గువ్వ –గోరింక .మాను కుంకే గువ్వ –వడ్రంగి పిట్ట .మాను అంటే చెట్టు చెట్టును ముక్కుతో తొలి చేది .జమ్సరి –విజయ దశమి .పన్యారం –ప్రసాదం .మసలకు –తెల్ల వారు జామున మసలు వేళ అని వాడతారు .తిరిసి తినడం –అడుక్కొని తినటం .”తిరిపెమునకు ఇద్దరాల్లా గంగ విడువు పార్వతి చాలున్ ”అని శ్రీనాధుని చాటు   వు .కిర్లి కిర్లి  ———— –పడి పడి   నవ్వటం ఏడవటం .
దూర్లు –చాడీలు –దూరటం అంటే తిట్టటం .గాసి –కష్టం –గాసిలి అని వాడటం తెలుసు .తిక్కన పద బంధం .ఆరట్లు –బాతా ఖానీ –తడుసు కోనేకి –ఆగ టానికి .తడవు అంటే ఆలస్యం చేయటం.సంబళము –జీతం .ఇది వినని మాటే మనకు .ఎండ్లేలుగు –వెన్నెల .అంటే ఎండ లాంటి వెలుగు –లేక వెండి వెలుగు .పుట్టి –గంప .నీళ్ళ పై ప్రయాణించే గుండ్రని ది పుట్టి మునిగింది అంతా అయిపొయింది అని అర్ధం .రాతి గువ్వలు –గబ్బిలాలు .వాటి ఆవాస స్థానం వల్ల వచ్చిన్ అ పేరు .రణ వంతులు –రాబందులు –పీక్కు తినేవి అనే భావమేమో .చీటీగ –దోమ -..ఇదీ వినని మాటే నాకు .సోగుడు –మంచు .ఈ మాట  కావ్యాలలో ఉందేమో .గొన్ని పులుగు –లద్దె పురుగు –పులుగు అంటే పక్షి అని సాధారణం గా అనుకొంటాము .ఇక్కడ పురుగు కు కూడా అన్వయించింది .
      పునాది–తలాడి .బోకలు –పెంకులు .ఇదీ వింత మాటే . . రెయ్యి –అర్ధ రాత్రి -సగం రేయి –సగం రాత్రి
ఇంక వాక్య నిర్మాణం లో ఎలాంటి మార్పులున్నాయో చూద్దాం .ఎపుడు అనేది యెబుడు అయింది .రాతో రాత్రి –రాత్రికి రాత్రికి   కోడి కూసే జాము –తొందరలో కోడి గూజాము .అయింది .జంబు సవారి స్పీడు లో జెంసరి  ఇచ్చి విడి చేస్తే –అయిన్దోచ్చు .ఇచ్చి-విడిచేస్తేc  –ఇచ్చిడిస్తే  అయింది చే వ్రాలు చేవ రాలు గా  మారింది అలాగే తిట్టు పదం దూట్టడికే –తూత్తేలికే అయుండచ్చు .నవ్వుతు నవ్వుతు కాస్తా ”నాగ నగతా ”గా మారింది .
               ఇన్ని చక్కని సామెతలు జాతీయాలను ,అర్ధ వంతమైన మాండాలి కాన్ని   తన కధల్లో నింపి వాటికి ,కావ్య  గౌరవాన్ని తెచ్చిపెట్టి , ,వారి జీవన విధానానికి హోసూరు కు ,అక్కడి తెలుగు ప్రజలకు తెలుగు భాషకు తెలుగు తల్లికి నీరాజనం గా అందించిన డాక్టర్ వసంత్ గారిని మనసారా అభినందిస్తూ ,మరిన్ని రచనలు వారి నుండి రావాలని కోరుకొంటూ ,వస్తాయనిఆశిస్తూ ,,మిగిలిన బ్రాహ్మణ వైశ్య ,కుమ్మరి కమ్మరి మ్మోదలైన వృత్తుల వారి జీవన విధానాలను కధలుగా రాసి ,,రాసి పోయాలని కోరుతూ    ,సెలవ్  .
                        మీ  — గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -07 -11 .క్యాంపు —బెంగళూర్  .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.