శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర —2

శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర  —2
                                                   బేలూర్ చెన్న కేశవ స్వామి దేవాలయం
              శ్రావణ బెల్గోలా నుంచి బేలూర్ వచ్చాం .బెల్గోలా లో మెట్ల లెక్క తప్పు గా రాశాను .చంద్రా గిరి కొనండ యక్క తానికీ దిగ టానికీ పక్క పక్కనే వేరు వేరు గా మెట్లుంటాయి .తొక్కిసలాట లకు అవకాశం లేదు .ఈ రెండు దారుల్లోని మొత్తం మెట్లు 641 మాత్రమే 1282 అని పొరపాటుగా చెప్పాను .
బేలూర్ అనగానే శ్రీ రామ కృష్ణ పరమ హంస కొలువై వున్న పశ్చిమ బెంగాల్ లో కలకత్తా కు దగ్గర వున్న బేలూర్ అను కొంటారు చాలా మంది .కాదు .ఆది ఆధ్యాత్మిక సౌందర్య కేంద్రం .ఇది నేత్రానందాన్ని ఇచ్చే కళా సౌందర్య కేంద్రం .అక్కడ ముక్తి ,ఇక్కడ మనోల్లాసం లభిస్తాయి .బేలూర్ హసన్ కు 38ki బెంగళూర్ కు 222 కి .దూరం .తేల్లాని పూలతోవున్నబంగాళా దుంప పండే పొలాలతో ,బంతిపూల వనాలతో , చెట్లు కళకళ లాడుతూ దారి అంతా హరిత వనం లా కనిపిస్తుంది .
            ఇక్కడి దైవం చెన్న కేశవ స్వామి .వీళ్ళు విష్ణు టెంపుల్ అంటారు .చెన్న అంటే సుందరమైన అని అర్ధం .విష్ణు నామాలలో మొదటిదే కేశవ అనే నామం .స్వామికి ముక్కుకు ముక్కెర వుండటం విశేషం .స్త్రీత్వం  కన్నులు  తో కనిపిస్తూ  బహు సుందరునిగా ఉంటాడు .మోహినీ ఆవ తారం గా భావిస్తారు .ఇక్కడి శిల్ప సంపద వర్ణనా తీతం .కన్నుల పండువ .ప్రతి శూక్ష్మ విషయాన్ని శిల్పి మనో నేత్రం తో దర్శించి శిల్పించాడు .బేలూర్ అన గానే అమర శిల్పి జక్కన్న జ్ఞాపకం వస్తాడు .”ఈ నల్లని రాలలో ఏ కన్నులు  దాగెనో ,ఈ బండల మాటునా యే గుండెలు మొగెనో —పైన కఠిన manipin ,లోన వెన్నా  అనిపించును ,ఉలి అలికిడి తాక గానే గలగలా మని పొంగి poralunu ” అనే నారాయణ రెడ్డి గారి పాట చెవుల్లో రింగుమంటుంది .నాగేశ్వర రావు నటన అద్భుతం అని పిసుంది .ఇక్కడే కళా తపస్వి విశ్వ నాద్ ”శంకరా భరణం ”సినిమా లో మంజు భార్గవి నాట్యాన్ని చిత్రీక రించారు .ఎన్నో సినిమాలకు వేదికయింది .ఇవన్నీ ఒకసారి మనసు లో మెదిలాయి ఇప్పుడు దీని చారిత్రిక వైభవాన్ని తెలుసు కొందాం .గైడు ఇంగ్లీష్ లో చాలా బాగా వివరించాడు .ప్రతి శిల్పాన్ని దగ్గరుండి చూపించి అందులోని కళా సారాన్ని తేలిగ్గా చెప్పాడు .ప్రతి సూక్ష్మ విషయం వివరించాడు .
                    బేలూరు ను వేలా  అనే పురీ అనే వారు .క్రమంగా వేలూరు గా చివరికి బీలుర్ గా మారింది .హోయసల రాజులు దాదాపు మూడు వందల సంవత్చారాలు పాలించిన దేశం .హోయ -సాల ”అనే  రెండు మాటలు కలిసి హోయసల అయింది .అంటే అర్ధం” ! సాల ! కొట్టు ”..ఈ రాజ్య మూల పురుషుడు సాలుడు ఇక్కడ సింహాన్ని సంహరించాదట .అప్పటినుంచి వారి వంశం  నామం హోయసల అనగా సింహాన్ని ఒంటి చేతితో చంపినా వాడు అని మార్చుకొన్నారు ..వీరు దేవగిరికి చెందిన సేఉన యాదవుల కు చెందిన వారు .అవక్ర పరాక్రమంతో చాళుక్య ,చోళ పాన్ద్యులను ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించారు .
వీరిలో విష్ణు వర్ధన మహారాజు చాళుక్యులను ఓడించి సామ్రాజ్య సుస్థిరతకు బాట వేశాడు .ఆయన కాలమ్ లోనే కర్ణాటక రాజ్యం లో కనీ ,వినీ ఎరుగని రీతి లో దేవాలయాలను నిర్మించాడు .అందులో ఈ ముఖ్యమైనవి బేలూర్ లోని కేశవాలయం ,హలేబేడు లోని శివాలయం ..అప్పటి వరకు జైన మతాన్ని అవలంబించిన విష్ణు వర్ధనుడు ,వైష్ణవ మతాన్ని మతాన్ని స్వీకరించి ,తన ,ధర్మాన్ని విశ్వాసాన్ని తెలియ జేయటానికి వీటిని నిర్మిఇంచాడని శాశ నాలు తెలియ జేస్తున్నాయి .ఇంకో కధనం ప్రకారం చాళుక్యులను ఓడించిన విజయ గాధకు చిహ్నం గా నిర్మించాడని .తలకాడు లో చాలక్యుల పై విజయమే ఈ నిర్మాణానికి కారణం .ఆ కాలమ్ లో దేవాలయాలలు మతానికి ,న్యాయానికి ,ధనాగారానికి ,ఆధ్యాత్మిక జ్ఞాన బోధకు ,సంగీతా నాట్య కళలకు నిలయాలు ..హోయసల రాజులు కళా ,శిల్పకళ ,మతాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చారు .బేలూరు దేవాలయం ఏక కూట ,హలేబేడు లో ద్వికూటా  సోమనాధ పురం లో త్రికూట ఆలయాలు నిర్మింపజేశారు .హోయసల రాజులు 950 లో రాజ్య పాలకు లయారు .పదమూడవ శతాబ్దం లో కర్ణాటక అంతా వారి స్వాధీనం లోకి వచ్చింది హర్ష వర్ధనుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించటానికి ప్రయత్నిస్తే కుమారుడు రెండవ వీర భాల్లాలుడు ఆ కోర్కెను నెర వేర్చాడ్డు .చోలులను రాజ్యానికి తెచ్చి ”చోళ ప్రతిస్తాపనా చార్య ”అనీ .”దక్షిణ చక్ర వర్తి ”అనీ ”హోయసల చక్ర వర్తి అనీ ”అనీ బిరుదు పొందాడు .చివరికి హోయసల రాజ్యం విజయ నగర సామ్రాజ్యం అధీనం లోకి ,చివరికి ధిల్లీ సుల్తానుల చేతిలోకి జారి పోయింది
                                   రాజా విష్ణు వర్ధనుడు భగవద్ శ్రీ రామానుజ్జుల శిషుడు .ఈ ఆలయాల నిర్మాణం విష్ణు వర్ధనుని కాలమ్ లో మొదలై ,మూడవ నరసింహుని కాలమ్ లో పూర్తి అయాయి .మొత్తం103  సమ్వత్చరాలుపట్టింది నిర్మాణానికి .కర్ణాటక ,ద్రావిడ శిల్ప సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది .118   శిలా శాశనాలు కన్పించాయి ఈ ఆలయ నిర్మాణానికి వాడిన శిలను ”chloritic schist ”అంటారు తెలుగు లో సబ్బు శిల అనచ్చు .అంటే అంత  మెత్తగా ఉంటుందట .శిల్పం పూర్తి అవగానే చాలా గట్టి పది పోతుందట .అదీ దీని గొప్పతనం .అంతా మెత్త గా ఉండ బట్టే ఇంత సూక్ష్మ కళను ప్రదర్శించ గలిగారు .అంటే చెక్కే టప్పుడు మైనం లాగా ఒదిగి పోంది
.ఏ రూపం .,కావాలంటే ఆ రూపం పొందుతుంది శిల్పి చేతిలో .నగిషీ చెక్కటానికి బంగారం లాగా ప్రవర్తిస్తుంది .ఒక రకం గా ఇది శిలా బంగారం అన్న మాట ..ఈ ఆలయాలు ఎత్తైన పీఠం మీద ఉండేట్లు నిర్మించారు .అదో విశేషం  .మన ఆలయాలు నెల మట్టం గా వుంటాయి .అడుగు భాగాన ఏనుగులు ,వాటిపై సింహాలు ,వాటిపై అశ్వం మీద శైనికులు ఆలయం చుట్టూ చెక్కారు .ఏనుగు బలానికి ,సింహం ధైర్యానికి అశ్వం వేగానికి ప్రతీకలు .ఒక శిల్పానికి ,ఇంకో దానికి సంబంధం వుండదు .దేని కదే ముచ్చటగా వేరు వేరు భంగిమలలో కన్పించటం శిల్పుల ప్రతిభకు అద్దం పడుతుంది .అనేక లతలు ,పురాణ గాధలు ఆలయం అంతా బయటి వైపు కనిపిస్తాయి .ఆలయాన్ని ”జగతి ” వేదిక మీద నిర్మించారు .దీని వల్ల భక్తులు ప్రదక్షిణ చేయ టానికి ఏ మాత్రం ఇబ్బంది వుండదు .
     లోపల కళా సంపద తో విలసిల్లె స్తంభాలు న్నాయి .గోడలలో గాలి వెలుతురూ ,లోపలి రావా టానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కారు .విష్ణు వర్ధన మహారాజు ,అతని రాణి శాంతలా దేవి విగ్రహాలను కమనీయం గా చెక్కారు .లోపల గర్భాలయం వుంది .రంగ మంటపం లో ఆలయ నాట్య కట్టెలు నృత్యం చేసే వారు .మొత్తం మీద 28   ventilator  నారశింహ ,ఆంజనేయ విగ్రహాలు రమణీయం గా వున్నాయి .వీరి ఇలవేలుపు నృశింహ స్వామి .అందుకని అన్ని వైపులా ప్రహ్లాద వరడుడిని ,హిరణ్య కశిప సంహారాన్ని కళా త్మకం గా చెక్కారు . ఆలయం లోని విమానం కాల క్రమం లోద్వంశం అయింది .శ్రీ కృష్ణ దేవరాయలు గోపర నిర్మాణం చేశాడు . రాతి రధం వుత్చావాలలో ఉపయోగిస్తారు . .
                       ఆలయం వెలుపల గోడల పై 644   ఏనుగులు   చెక్కారు  చిన్నగా ముచ్చటగా వుంటాయి .తూర్పున వున్న ద్వారం వద్ద రతీ మన్మధుల విగ్రహాలు అతి సుందరం గా వున్నాయి .లోపల నారశింహ స్స్తంభం వుంది .ఇది బాల్ bearingu ల మీద చక్క గా తిరుగు తుంది ..ఆ నాదే baall bearing   విధానం అమల్లో ఉందన్న మాట .లోపల వున్న నలభై ఎనిమిది శిల్ప కళా వైభవం తో ఉన్న రాతి స్తంభాలున్నాయి .వాటి సౌందర్యం వర్ణనా తీతమే .మండపం పై కప్పు మీద కూడా గొప్పప కళా వైభవం దర్శన మిస్తుంది .ఒక దేవేంద్ర సభలో వున్న అనుభూతి కలుగు తుంది .ఈ శిల్పాలు వ్వులితో కొన్ని lathe యంత్రాల మీద కొన్ని నగిషీలు చెక్కారు .ఈ స్తంభాల మీద 42 సాల భంజికలు అంటే మదనికలు  వివిధ భంగిమలతో మనసును దోచేస్తాయి .వీరినే శిలా బాలికలు అంటారు బయట చెక్కిన దర్పణ సుందరి శిల్పం ,భస్మ మోహిని ,లోపలి స్థంభ భట్టాలికా శిల్పాలు శిల్పి ఊహలకు ప్రతిబింబాలు .గజాసురున్ని శివుడు సంహారించే దృశ్యం ,గరుడుని రెక్కలు ,రూపం ,వామనావ తారం ,కైలాసాన్ని పెకలించే రావణుడు ,దుర్గా దేవి ,మహిసాసుర మర్దనం ,వరాహ అవతారం ,,భైరవ  రూపం లోని శివుడు ,సూర్య దేవుడు ,రధం ,కళా చాతుర్యానికి పరా కాస్ట .ఇంత సుందరం గా ,ఇంత సున్నితమైన చెక్కడం ప్రపంచం లో లేనే లేదు .హాట్స్ ఆఫ్ to జక్కనా చార్యా ,ఆయన కుమారుడు ,వారికి సహకరించిన ఇతర స్థాపతులకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద సాల మహారాజు సింహాన్ని చంపే శిల్పం మనోహరం .ఇదే హోయసల రాజ్య చిహ్నం .
               చెన్న కేశవ స్వామినే విజయ నారాయణుడు అంటారు .1117  లో దీన్నిప్రతిష్టించారు .నాలుగు హస్తాలాతో శంకు ,చక్ర గద ,పద్మాలతో పరమ మనోహరం గా దర్శనం ఇస్తాడు .ముందే చెప్పినట్లు ముక్కుకు ముక్కేర్ తో బాటు తలలో పువ్వులు కూడా వుండటం ప్రత్యేకత .ఇదే మోహినీ అవతారం .విగ్రహం పై భాగాన చుట్టూ దశావతారాలు అతి సూక్ష్మం గా చెక్కబడి విష్ణువు అనంతత్వాన్ని సూచిస్తుంది .దీనినే” ప్రభావలి” అంటారు .
                    ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన ”కప్పే చెన్నగ రాయా ”విగ్రహాన్ని రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది .దీన్నే కప్పు చెన్న  కేశవ ఆలయం అంటారు .దీనిలో గణపతి ,సరస్వతి ,లక్ష్మి నాయన ,చామున్దేశ్వారి ,వేణుగోపాల విగ్రహాలు వున్నాయి ..ప్రసిద్ధ శిల్పి జక్కనా చార్యుడు తన స్వగ్రామం కైదల నుంచి ఇక్కడికి వచ్చాడు .అతని కుమారుడు దంకనా చార్యుడు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వచ్చాడు .ఒకరికొకరు తెలియదు .జక్కన చెన్న కేశవ విగ్రహం చెక్కాడు  .కొడుకు ఆ శిల్పం లో  లోపం ఉందన్నాడు .లేదని వాదించాడు తండ్రి .లోపం చూపిస్తే కుడి చేయి నరుక్కున్తానని శపథం చేశాడు . విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించారు . .గంధం అంతా యిట్టె ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం ఆర లేదు .అక్కడ ఒక ఖాళీ కనిపించింది .అందులో ప్రాణం తో వున్న k కప్ప బయట పడింది .ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు ..అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు .దేవుడు కలలో కన్పించి స్వగ్రామ రమ్మన్నాడట .తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞా గా చెన్న కేశవ ఆలయాన్ని కట్టారు .జక్కన చేయి మళ్ళీ తిరిగి వచ్చిందట ..
              చెన్న కేశవ ఆలయం కు పడమర వీర నారాయణ  ,దక్షిణాన సౌమ్యనాయకి దేవాలయం ,ఆండాళ్ దేవాలయం వున్నాయి .ఆలయం బయట  నలభై రెండడుగుల గ్రావిటీ పిల్లర్ వుంది   ,అన్నిటినీ తట్టుకొని చరిత్రకు సాక్షి గా నిలబడి వుంది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .
                 అతి సున్నితమైన శిల్ప చాతుర్యానికి బేలూర్ దేవాలయం సజీవ సాక్షి .జీవితం లో తప్పక అందరు చూదాల్సినదే .ఒక్క రోజూ చాలదు .శిల్ప రహస్యం ,శిల్పి చాతుర్యం ,శిల్పి ఉహా త్మక్త అర్ధం చేసు కోవాలంటే రోజులు పడుతుంది .పరమ కళా వైభవం తో విలసిల్లె ఈ శిల్ప సంపదను గురించి ఎంతో కాలమ్ గా వినటమే కాని ఇప్పుడే ప్రత్యక్షం గా చూసి ,అనుభవించాను .నేను చూసింది ,తెలుసు కొన్న దానిలో వెయ్యో వంతు కూడామీకు విడమర్చి చెప్పి ఉండనని నా నమ్మకం .నాతొ పాటు ఆ కళా జగత్తు లో విహరించిన మీకు ధన్య వాదాలు  .ఇక్కడి కళా సౌందర్యాన్ని అనుభవించి మయూర హోటల్ లో భోజనం చేసి ఇక్కడికి 22   కి మే ,దూరం లో వున్న హలేబెడుకు ఒక అరగంటలో చేరాము .శ్రావణ బెలగోల ,బేలూర్ ,హలేబేడు కలిసి త్రిభుజం లాగా వుంటుంది .అందుకే దీన్ని triangular trip అంటారు .
హలేబేడు లోని హోయశాలేస్వర దేవాలయం గురించి తరువాత రెలియ జేస్తాను .
                                    మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ .–26 -07 -11 .క్యాంపు–bengaalu

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

2 Responses to శ్రావణ బెల్గోల,బేలూర్ హలేబేడు యాత్ర —2

  1. Sree says:

    బేలూరు చూడాలనిపిస్తుంది మీ టపా చూసాక.

Leave a Reply to Sree Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.