శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3

                 శ్రావణ బెలగోల బేలూర్ హలేబేడు యాత్ర —-3
                                                     హలేబేడు  శ్రీ హొయసలేశ్వర స్వామి దేవాలయం
                    బేలూరు కు 16 కి.మీ. దూరం లోను ,హసన్ కు 31 కి.మీ.లోను ,మైసూర్ కు 149 కి.మీ.దూరం లోను హలేబేడు వుంది .బంతి పూల వనాలు రోజా , పూల చెట్లు ,బంగాళా దుంప పొలాలు చూడ ముచ్చటగా వుంటాయి pine aapple . పంట ఎక్కువ ఇది 12 .వ శతాబ్ది లో హోయసల రాజుల రాజధాని .ఇక్కడ్డి శివుని పేరు హోయశాలేస్వరుడు .నిర్మించిన శిల్పి కేతన మల్ల వర్మ  విష్ణు వర్ధన మహా రాజు కాలమ్ లో నిర్మాణం జరిగింది ..దీనికి ఆనుకొనే ,ఆయన భార్య శాంతలాదేవి రాణి నిర్మించిన దేవాలయమూ వుంది .ఈ దేవాలయాలకు ముందు చాలా విశాల మైన సరస్సు వుంది .సముద్రం లాగా పొంగి ప్రవహించే సరస్సు నుంచి ,ఆలయానికి ప్రవేశించాలి కనుక ద్వార సముద్రం అనే పేరు వచ్చింది ఈ వూరికి .ఇంతకీ  హలేబేడు ”అంటే ”నాశన మయిన నగరం” అని అర్ధం .14  వ శతాబ్దం  లో మాలికాఫార్ దీనిపైకి దండెత్తాడు .అయితె ఇక్కడి ప్రజలు ఇసుక  తో ఆలయం అంతా కప్పేసి కాపాడు కొన్నారట .హలేబేడు దేవాలయ శిల్ప సౌందర్యం నభూతో న భవిష్యతి గా వుంటుంది .భారతీయ ఆలయ శిల్ప నిర్మాణ కళ లో దీని ప్రత్యేకత ఇంక దేనికీ లేదు ..బేలూర్ దేవాలయం లో లోపలి శిల్ప సౌందర్యం అద్భుతం అని పిస్తే హలేబేడు దేవాలయం బాహ్య శిల్ప సౌందర్యానికి దర్పణం .విధానం అంతా బేలూర్ ఆలయం గానే వుంటుంది .అయితె ఎత్తైన ప్లాట్ ఫారం మీద అక్కడి లానే నిర్మించబడింది.ఇది ద్వికూట విమాన పధ్ధతి లో వుంది .అంటే ఇద్దరు మూల దేవతలుంటారు .అంటే రెండు శివ లింగాలుంటాయి .ఈ దేవాలయ సముదాయం కూడా ”chloritic chist ”. శిల తో నిర్మించారు .అంటే మెత్తగా సబ్బు లాగ వుంటుంది శీలా .విగ్రహం పూర్తి అవగానే ఇనుము లాగా గట్టి పడటం దీని ప్రత్యేకత .దీన్నే pot stone అని కూడా అంటారు . హోయసల శిల్ప కళా చాతుర్యం అంతా ఇక్కడ కని పిస్తుంది .ఇక్కడి రెండు శివ లింగాలు తూర్పు ముఖం గావుండి ,ప్రతి దానికి ప్రత్యెక మండపం కలిగి వుంటాయి .ఈ రెండు కలిసి బృహత్ ఆలయం గా ,విశాల మైన పండపం గా కనిపిస్తుంది .లోపల రాజులు ,రాణీలు ,అంతఃపుర జనం కూర్చొనే గల్లెరీ లున్నాయి .లోపల జరిగే కార్య క్రమాలను వారుహాయిగా వీక్షించ వచ్చు   రంగ మంటపాలున్నాయినాత్యం చేసేందుకు వీక్షించ  .చిన్న శివ లింగాలు వున్నాయి రెండు ఆలయాలలోను .నిత్య పూజ జరుగు తుంది .అయితె గాలి గోపురం లేదు .గర్భాలయాన్ని మంటపాన్ని కలిపే ప్రదేశాన్ని శుక నాసి అంటారు .దీని స్తంభాలన్నీ శిల్ప కళా శోభితం .పైన వివిధ శిల్ప శోభితమైన పై కప్పు వుంది .చూడ టానికి కళ్ళు చాలవు అని పిస్తాయి .అతి పెద్ద ,అతి చిన్న శిల్పాలను ఉంచటానికి తగిన ప్రదేశం వుంది .గోతిక్ ఆర్ట్ కు మించిన కళా వైభవం వుందని విశ్లేషకుల భావన .  ఇంగ్లీష్ లో చాలా వివరం గా ,వేగం గా ,ద్వార పాలకులైన నంది డుంతి విగ్రహాలు సకల కళా శోభితాలు .ముక్కు దగ్గర అతి శూక్ష్మ రంద్రాలున్నాయి .అందు లో నుంచి సన్నని పుడక దూరిస్తే దూరి పోతుంది .అన్త్తటి సూక్ష్మ విషయాలపైన కూడా శ్రద్ధ పెట్టి చెక్కిన శిల్పాలవి .అనితర సాధ్యం అని పిస్తుంది .చూసి ఆనందించాలే కాని చెప్పి తే తెలిసేది కాదు .ఆ అనుభూతే వేరు మా గయుడు ఇంగ్లీష్ లో చాలా వివరం గా విశ్లేశానాత్మకం గా ,సూది గుచ్చి నట్లు మంచి శైలి లో వివరించి అనుభూతి చెందేట్లు చేశాడు .రెండు ఆలయాలకు వున్న భేదాలు స్పష్టం గా వివరించాడు .వీటికి మించిన శిల్ప కళ ప్రపంచం లో నే లేదు లేదు లేదు అని ఘంటా పధం గా చెప్పటం అందరికి గొప్ప ఆనందం కల్గించింది ;.ఇప్పటికి సగటున రోజూ కు కనీసం రెండు వేల మంది వీక్షకులు వస్తారట .ఇది un season .సీజన్లో లో కనీసం పది వేల మందికి తక్కువ కాకుండా దర్శిస్తారట  .కొద్ది రోజుల్లో ప్రపంచం లోనే గొప్ప యాత్రాస్థలం గా బేలూర్ హలేబేడు లు అవుతాయని విశ్వాశం గా చెప్పాడు .అలా కావాలని అందరం భావించాం.మంచి ప్రయాణ సౌకర్యం వుంది ,రోడ్లు బాగున్నాయి ,వసతి భోజన సౌకర్యాలు సంతృప్తికరం .
                         ఉత్తర ద్వారం నుంచి ఆలయం లోకి ప్రవేశించాలి .ఇంకా దక్షిణ ,తూర్పు ,పడమర ద్వారాలున్నాయి .స్తంభాలన్నీ lathe తో చిత్రిక పట్టి వుంటాయి .సూర్య విగ్రహం చాలా పెద్దది .జగతి ప్లాట్ ఫారం మీడే ఇదీ నిర్మించబడి ,ప్రదక్షిణ కు అనువుగా వుంటుంది .వెనుక భాగాన నల్ల రాతి తో చేసిన చాలా పెద్ద నంది విగ్రహం మనోహరం గా వుంది .ఇది దేశం లోని పెద్ద నంది విగ్రహాలలో మూడవది .లేపాఖి ,నంది అన్నిటికన్నా పెద్దది .అయితె ఈ నందీశ్వరుని వుచ్చ్వాష ,నిస్శ్వాసాలను చిత్రించిన తీరు పరమ ఆశ్చర్యం .దేనికి తోడూ నంది శరీరం పై మూపురం పై ,మెడపై చెక్కిన అందమైన ఆభరణాలు మువ్వలు ,గంటలు చూస్తె ఇంత పరమ కళా వైభవం తో ఇంకీక్కడా నంది విగ్రహం లేదని పించటం ఖాయం .అందుకనే శిల్ప కళ రీత్యా ఇదే ప్రపంచం లో అతి సుందర నంది విగ్రహం గా భావిస్తారు .అంటే ఇదే నెంబర్ one bull structure .చుట్టూ వున్న శిల్ప కళా శోభ బేలూర్ లానే వుంటుంది .శివుని  వివిధ భంగిమలు అంటే కామ దహనం ,పార్వతీ కల్యాణం ,గజాసుర సంహారం ,రావణుడు కైలాసాన్ని పైకేత్టటం ,వినాయక నృత్యం ,కుమారస్వామి సూర్యుడు ,,చుట్టూ చెక్కిన మదనికలు ,ఏనుగులు ,సింహాలు ,గుర్రాలు అన్నీ బేలూర్ లానే వున్నై .హోయసల దేవాలయాలన్నీ బయటి గోడలపై వుండే శిల్పాలకు ప్రసిద్ధి .
రెక్కల సొగసు తో వుండే గరుత్మన్తుడున్న గరుడా స్థంభం ఇక్కడ ప్రసిద్ధ మైనది .ఇక్కడి గరుడులు రాజు రాణి లకు రక్షణ బంట్లు .రెండవ వీర భాల్లాల రాజు అంగరక్షకుడు కురువ లక్ష్మణ విగ్రహం వుంది .భాల్లాలుని మరణం విని యితడు భార్య ,పిల్లలు ,మిగిలిన అంగ రక్షకులతో ఆత్మ బలిదానం చేసుకొని స్వామి భక్తిని ప్రకతిన్చుకోన్నాదట .ఈ కధప్రాచీన కన్నడ లిపి లో ఒక స్థంభం మీద చెక్కబడి వుంది .ఈ ఆలయానికి నైరుతి దిశ లో నక్షత్రాక్రుతి లోని అందమైన కేదారేశ్వర దేవాలయం వుంది .
          హలీబేడు లో పార్శ్వ నాద మందిరం వుంది .శిల్పకళకు పరాకాష్ట గా దీని నిర్మాణం ఉంటుందట .14 అడుగుల పార్శ్వ నాద విగ్రహం చూడ ముచ్చట  గా ఉంటుందట  .ఆయన శిరస్సుపై ఏడు తలల పాము చెక్కబడి వుంటుంది .అలాగే శాంతి నాద స్వామి ,ఆది నాద స్వామి అనే జైన తీర్ధంకరుల దేవాలయాలు ఇక్కడ వున్నాయట .మేము ఇవేవీ చూడ లేదు .
అలాగే శేషశాయను డైన రంగనాధ స్వామి దేవాలయం కళా శోభితం గా ఉంటుందట ఆయన బొడ్డు లోనుంచి ఉద్భవించిన బ్రహ్మ ,ఆది దేవియిన లక్ష్మి విగ్రహాలతో శోభస్కర మైన ఆలయం.మేము చూడ లేదు .
ఇంతటి శిల్ప కళా శోభితమైన ,అరుదైన హోయసల రాజుల కళావైదగ్ధ్యాన్ని  ,అమరశిల్పి జక్కనా చార్య ,,ఆయన కుమారుడు అపర మయబ్రహ్మ అయిన దంకనా చార్యుడు ల  మనోహర కళా సృష్టికి జేజేలు .ఈ శిల్పాలను దర్శించటానికి మామూలు  నేత్రం కాదు మనో నేత్రం వుండాలి ,చూసింది మననం చేసుకొనే ఓపిక వుండాలి మెచ్చే సంస్కారం కావాలి .శిల్పి ఎభావంతో చేక్కాడో తెలుసుకొనే నేర్పున్డాలి .వీటిని అన్నిటిని అనుభవించి అనుభూతి చెందే హృదయం కావాలి .వీటికి మించి ,తీరిక గా చూసే సమయమూ కావాలి .అప్పుడు ఒక కళా క్షేత్రాన్ని దర్శించిన చిరంతనానుభావం తో మనసు పరవళ్ళు తొక్కుతుంది .కొద్ది సమయం లోనే ఇంతటి అనుభూతిని పొందాం’ఏ పూర్వ జన్మల సుక్రుతమో ?  జన్మ ధన్య మైంది.i.ఇంకో విషయం వింటే మరీ ముక్కు మీద వేలు వేసుకో కుండా ఉండలేము .హౌరా ! అనుకోకుండా ఉండలేము .అదేమిటి అంటే ఈ ఆలయాలలోని శిల్పాలను చక్కగా వెతి కవి విడదీసి పక్కన పెట్టి మళ్ళీ ఇలాగీ ఈ బృహత్ ఆలయాలను పునర్నిర్మించ వచ్చునట .అంటే ఫ్రేము   ఫ్రేమే ల మీద శిల్పాలు చెక్కి అమర్చారన్న మాట .ఫ్రమే కనుక తీసేసి మళ్ళీ ఇంకో చోట బిగించు కో వచ్చు .ఎక్కడా అతికిన్చినట్లుండదు .కాని దేని కడిగా విడి విడి గా వున్నట్లు అనిపించదు .ఇదీ ఆ మహా శిల్పుల నిర్మాణ చాతుర్యం .అపర బ్రాహ్మలు సృష్టికే ప్రతి సృష్టి చేశారు మరో మయులు వారందరూ
                         దాదాపు అయిదున్నర గంటలకు మళ్ళీ బస్ ఎక్కి రాత్రి ఎనిమిదిన్నరకు బెంగళూర్ చేరాను .మజేస్తిక్ బస్ స్టాండ్ లో బస్ ఎక్కి మార్త హళ్లి కి తోమ్మిదిమ్బావుకు చేరాను .మా అబ్బాయి శర్మ కార్ లో వచ్చి ,ఇంటికి మునే కోలాల కు తీసుకొని వెళ్ళాడు .
                                   కే.ఎస్.టి.డి  ఆఫీసు లోకర్ణాటక రాష్ట్రం గురించి   రాసిన మాట నాకు నిజమని పించింది ”One state but many worlds ”
                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —27 -07 -11 .క్యాంపు –బెంగళూర్ .

This slideshow requires JavaScript.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు, రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.