కుజ గ్రహ నివాసం

                                కుజ నివాసం
                      భూమి  మీద జనాభా పెరిగి పోతోంది .నివాసానికి తగిన స్థలం లేక జనం విల వల  లాడుతున్నారు .తగినంత ఆహారము దొరకటం లేదు .అందుకని వేరే గ్రహం మీద వుండే ఆవ కాశం కోసం శాస్త్రజ్ఞులు వెతుకు తున్నారు .అనేక ప్రయోగాలు చేసిన తరువాత మాన్నవులకు ఆవాస యోగ్యమైనది కుజ గ్రహమే నని నిర్ణయించారు .మనకు అక్కడ లభించే సౌకర్యాలేమిటి ?అక్కడ మానవ జీవతం దివ్యం గా సాగుతుందా ?అని అందరి అనుమానం .ఆ అనుమానాలు తీర్చే ప్రయత్నమే ఇది .
                            కుజ గ్రహ్హం లో అద్భత సుందర దృశ్యాలు కని పిస్తాయి .అక్కడి పర్వతాలు ఎవేరేస్ట్ పర్వ తానికంటే మూడు రెట్లు పెద్దవి .లోయలు అమెరికా లోని కాన్యోన్స్ లోయ కంటే మూడు రెట్లు లోతైనవి ,అయిదు రెట్లు పొడవైనవి విశాల మైన మంచు క్షేత్రాలున్నాయి .వేలాది కిలోమీటర్ ల పొడవైన వింత యైన ఎండి పోయిన నదీ గర్భాలున్నాయి .కుజు ని లోని గాలిలో తొంభై అయిదు శాతం caarbon dioxide  వుంటుంది .ఇది మానవుడు జీవిన్చాతానికేమాత్రము పనికి రాని వాయువు అని అందరికి తెలుసు .సముద్ర మట్టానికి దగ్గర లో వున్న వారు 150   మిల్లిరియం ల radiation  ను ఒక ఏడాది లో లోనవుతుంటారు .కుజునిలో గ్రావిటీ సున్నా .దీని వల్ల కండరాలు శిధిలమై పోతాయి .  అందుకే కుజుని పైకి అంతరిక్ష నౌకలు పంపేటప్పుడు నావికులకు ”micro gravity science ””
 పై మంచి అవగాహన కల్పిస్తారు .అక్కడి వాతావరణం immune system దెబ్బ  తింటుంది .అందుకని నౌకల్లో కృత్రిమ గ్రావిటీ ని కల్పిస్తారు .తోక చుక్కలు కుజున్ని తాకి నప్పుడు వెలువడే ధూళి మానవులకు ప్రమాదం కల్గిస్తుఅక్కడి క్రిములు వ్యోమ గామి ద్వారా భూమిని చేరి జబ్బులు వ్యాపించ వచ్చు .
—        కుజుని లో పగటి కాలమ్ ఇరవై నాలుగు గంటలు వుంటుంది .పగటి  వేడి –50 డిగ్రీలు నుంచి +10degreella వరకు వుంటుంది  .భుఉమిమీద ఆకర్ర్షణ శక్తి కుజుని పై దానికంటే రెండున్నర రెట్లు .చంద్రును గ్రావిటీ కంట కుజునిది సుమారు రెండున్నర రెట్లు . చంద్రుని లో వాతావరణం లేదు .అక్కడ రోజుకు 672 గంటలు . అయితెకుజులో తేమ వేడివుంటాయి .కనుక జీవులు బతికే  ఇక్కడి mఆవ కాశం ఉండ వచ్చు .కార్బోన్ dioxide ఎక్కువ కనుక గ్రీన్ హుసే వాయువుల ప్రమాదమూ ఎక్కువే .భూమి మీద ఉన్నట్లే.మూడు పాయింట్ ఏడుబిలియన్ సంవత్చరాల కిందటి  ”micro cosmic organism ”.. ఉండ వచ్చు .మార్స్ మీద compass పని చేయదు .కారణం అక్కడ అయస్కాంత శక్తి లేక పోవటమే .”celestial navigation ” విధానం లో దిశలను తెలుసు కొంటారు .అక్షంస రేఖాంశాలను నిర్నయిస్తాఉ .మార్స్ కు ధ్రువ తార అంటే పోల్ స్టార్ లేదు .ఫోబోస్ ,మరియు ,diemos   అనే asteroids దీని చుట్టూ తిరుగు తాయి .మార్స్ లో ఒక రోజూ అంటే 24 గంటల 39 నిమిషాల 6 సెకన్లు .ఇక్కడ సంవత్చారానికి 669  రోజులు .వీటిని sols అంటారు .ఇక్కడ మంచు భూమికి ఒక మేటర్ లోతున వుంటుంది .అమెరికా లోని కొలరాడో లో ఇంటికి ఒక వైపు వింటర్ (నార్త్ ) రెండో వైపు
 సుమ్మెర్  ( సౌత్ )  ఒకే కాల లో వుండి ఆశ్చర్యం కలిగిస్తాయి .అలాగే కుజునిలోఇలాగే వుండిఆశ్చర్యం కలిగిస్తాయి మార్స్ లో కూడా ఆగష్టు మధ్యలో కన్పిస్తాయి ఇక్కడి మంచు ను i    perma frost అనీ లేక ఫ్రోజెన్ mud అనీ అంటారు .
                   కుజునిలో వెండి ,lanthanum ,cerium ,సోమరియం ,గల్లియం ,gadolium ,బంగారం ,palladium ,రుబీడియం ,platinum ,ర్హోదియం ,యూరోపెం మొదలైన విలువైన ఖనిజాలున్నాయి .భూమి నుంచి కుజునికి అక్కడి నుంచి భూమికి వస్తువులను త్రి భుజ విధానం లో వ్యాపారం చేయ వచ్చు  దీని విషయం లో జాన్ మిల్టన్ కవి కొత్త లోకాన్ని గురించి  రాసిన కవిత బలేగా వుంది చదవండి ”Witness ts new made world another heaven —From heaven gate not faarr founded in view –on the clear Hayaline ,the glaassie sea –Of amptitude almost immence with stars –Numerous and every starr perhaps a world –Of destined habitation .”
              అందుకని  మానవులకు మార్స్ రెండవ నివాస స్థానం అవాలని భావిస్తున్నారు .అందుకు అక్కడ ఏమి చేయాలి ?కొత్త సరిహద్దుల్ని ఏర్పాటు చేయాలి .లేక పొతే సాంకేతిక మైన స్తబ్ధత ఏర్పడు తుంది .ఇప్పటికే అభివృద్ధి రాటు తగ్గి పోయింది .అందుకు martian ingenunity కావాలి .దాని వల్ల సృజనాత్మకత పెరిగి ఏవి కావాలో వేటిని వదిలించుకోవాలో తలిసి అభి వృద్ధికి మార్గం తేలిక అవుతుంది .కుజున్ని రెడ్ ప్లానెట్ అంటారని మనకు తెలుసు . మాల్తుస్ చెప్పిన అంచనాలన్నీ తప్పినాయి .మానవులు ఉత్పత్తులను వ్యయం చేసే వారు మాత్రమే కాదు ,వనరులను సృజించే నేర్పు కూడా వున్న వారు .ఈ విషయం అతనికి అప్పటికి తెలీదు .దీనికి కొత్త సాంకేతికత శాస్త్రీయ జ్ఞానం తోడ్పడు తాయి .జనాభా పెరిగితే ఆక్రమణ రేట్ వేగవంతం అవుతుంది .
               భూమికి కుజుని కంటే మిగిలిన గ్రహాలూ చాలా దూరం లో వున్నాయి .ఇది అమెరికా నుంచి యూరప్ కు వున్న దూరానికి లక్ష రెట్లు దూరం లో  మార్స్  ఉంది .మార్స్ లో రవాణా చేయటం చాలా సులభం .అక్కడున్న కార్బోన్ డి oxide ను hydrogen తో కలిపి mithane ను తయారీ చేసి శక్తి గా వినియోగించవచ్చు నని శాస్త్రజ్ఞుల భావన .ఇవాళ ప్రపంచం క్లిష్ట పరిస్థితులలో వుంది .మన పాత సరిహద్దులు మూసుకు పోయాయి .సాంఘిక జడత్వం వచ్చేసింది .అభివృద్ధి నెమ్మదిలో నడుస్తోంది .ఇది చాలదు .ప్రభుత్వాలు inkaa  పూర్తిగా కళ్ళు తెరవటం లేదు .ద్రుష్టి పెట్ట లేక పోతున్నాయి.కుజ నివాసం కష్టమే .కాని తప్పదు .జండా అక్కడికి ఎత్తేయాల్సిందే తప్పదు ..ఇక్కడపప్పులు ఉడకటం లేదు .కొత్త బంగారు లోకం చూడాల్సిందే .దుకాణం పెట్టాల్సిందే .అక్కడికి చేరే వారికి అవసరమైన టెక్నాలజీ ని అందించాలి .శాస్త్రీయ దృక్పధాన్ని కల్గించాలి .సృజనాత్మకతను ప్రోత్చాహించాలి .స్వేచ్చ గా అలోచించి కొత్త పరికరాల రూప కల్పనకు వీలు కల్పించాలి .ఆ సాహస వంతులకు అండగా నిలవాలి ..కుజ గ్రహం జడత్వం వున్న మనుష్యులను కోరదు .అక్కడ నిరంతర అన్వేషణ తో ముందుకు సాగే వారికే స్థానం .ముసలి వారు  ముతక vaaru పనికి రారు .యువరక్తం పొంగి పొరలే నవ యువత కావాలని స్వాగతిస్తోంది కుజగ్ర్హం .గ్రహచారం బాగుండక  కుజ గ్రహానికి వెళ్ళద్దు .అక్కడి గ్రహ చారాన్ని మానవులకు అనుకూలం గా మార్చటానికి వెళ్ళాలి అక్కడి మంచును నీరుగా మార్చాలి .కార్బోన్ దిఒక్షిదె ను పంటలకు ఉపయోగించాలి .పరిశారమలను నెలకొల్పాలి .వున్న భూమి లో అనుకూల మైన పంట పండించాలి .భూమి నున్దిఅక్కడికి కావాల్సినవి దిగుమతి చేసుకొని ,అక్కడి పారిశ్రామిక వస్తువులను భూమికి ఎగుమతి చేయ వచ్చు .ఇది సాధ్య్యమాయే రోజూ త్వరలోనే రానుంది   అప్పుడు రెడ్ ప్లానెట్ అయిన కుజ గ్రహం మనకు రెడ్ కార్పెట్  welcome ఇస్తుంది                                                          
                                                                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –౨౭-07-11.camp–bengalur
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.