శాస్త్ర వేత్త ఆర్థర్ సి..క్లార్క్

        శాస్త్ర వేత్త  ఆర్థర్ సి..క్లార్క్
—                     దాదాపు 900 రచనలు చేసిన ఆర్థర్ క్లార్క్ 1917 లో డిసెంబర్ 17 న జన్మించాడు . ఏడవ ఏడునుంచి శిలాజాల మీద ,డినోసార్స్,మీద FLYING   మీద  ద్రుష్టి నిలిపాడు .స్వంత TELESCOPE ను ,రాకెట్ ను తయారు చేశాడు .తండ్రి టెలిఫోన్ ,టెలిగ్రాఫ్ లలో పని చేశాడు .తల్లి ,సోదరుడు కూడా TELEGRAPHISTS పద్దెనిమిది ఏళ్ళ వయసు లోనే port ఆఫీసు లో పనిచేసి ,TRANSMITTER ,CRYSTAL RADIO సెట్ తయారు చేసిన  సృజన ఉన్న వాడు .అతని టీచర్స్ అతని పై మంచి ప్రభావం చూపించారు .కధలు బాగా చెప్పే నేర్పు వుండేది .బాబి పియర్స్ అతనికి ఫిజిక్స్ ,MATHS బోధించిన గురువు . .
డబ్బు లేక యూనివెర్సిటీ  .లో చదవ లేక పోయాడు .సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ,ఆ డిపార్ట్మెంట్ లో నే పని చేశాడు .18 ఏళ్ళ వయసు లో లండన్ చేరాడు .SPACE TRVEL మీద ,సైన్సు FICTION .మీద శ్రద్ధ చూపాడు . SPACESHIP తయారు చేయటం లో సాయ పడ్డాడు .ASTRONOMY మీద శ్రద్ధ పెరిగింది .CELESTIAL NAAVIGATION చదివాడు .ఇంతటి తో ఆగలేదు ELECTONICS లో శిక్షణ పొందాడు .”mORE TELEVISION WAVE FORMS ”అనే గొప్ప వ్యాసం రాసి అందరి ద్రుష్టి లో పడ్డాడు .GLIDE PATH అనే FICTION రాశాడు ..” principle of communication satillites ”మీద చాలా వివరణాత్మక         వ్యాసాలు  రాసి  ,ఆ  రంగం లో అభ్యుదయానికి   బాటలు   వేశాడు     .స్పేస్  fiction మీద preludes   రాశాడు .
                        ఫిజిక్స్ abstract అనే పత్రిక కు సహాయ సంపాదకుడై నాడు .humorous stories about psuedo science పేర చాలా కధలురాసి   అందర్నీ ఆకర్షించాడు .ఇవన్నీ  ”Tales from the white heart ”పేర ప్రచురితం .అయాయి .తాను రాసే వాటికి ఉద్యోగం అడ్డం గా వుందని భావించి పూర్తి కాలమ్ రచయిత అయాడు .స్పేస్ travel మీద శాశ్రీయ అవగాహనతో ”ఇంటర్ planetary ఫ్లైట్ ”పుస్తకాన్ని ,”An introduction to astronautics ”ను రాశాడు .ఈ రెండూ సామాన్యులకు ,ఆ రంగం లో అవగాహన కల్పించ టానికే రాశాడు .తర్వాత మొదటి సారి అమెరికా కు వెళ్ళాడు . తాను రాశిన ”The exploration of space ”పుస్తకాన్ని అమెరికా లో ప్రచ్రించాడు .1952  లో   newyork     radio   ,టి.వి.  ప్రొగ్రమ్మెస్ లో  పాల్గొన్నాడు .తనకున్న శాస్త్రీయ ఆవ గాహన తో ”The sands on Mars ” రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఈయన రాసిన ”స్పేస్ ఒడిస్సే ”అనే పుస్తకం( 2001 )యాభై సార్లు ముద్రణ పొంది మూడు మిలియన్ల కాపీలు అమ్ముడయి రికార్డు సృష్టించింది .
                      లండన్ కు మళ్ళీ చేరాడు క్లార్క్ .ఒకే సమయం లో చాలా ప్రాజెక్ట్స్ చేబట్టి విజయ వంతం గా ముగించాడు .”Childhood ”s end ”పుస్తకం రాశాడు .అదే సమయం లో ”Expedition to Earth ”రాసి ఆశ్చర్య పరిచాడు .1953 లోమళ్ళీ అమెరికా వెళ్ళాడు  ఫ్లోరిడా లో diving నేర్చుకొన్నాడు . పెళ్లి చేసుకొన్నాడు కాని ఆరు నెలల్లో పెదాకులు .,విడాకులు ..ఎప్పటికి అప్పుడు కొత్తది ”నేర్చుకోవాలనే తపన .అందిన దానితో తృప్తి పడ లేదు .తర్వాత ద్రుష్టి అంతా ఇప్పుడు సముద్ర యానం మీద పడింది .1956 లో సింహళం లో స్థిర పదాలని పించింది .”The fortunes of paradise
రాశాడు .”Deep range ,dolphin island ,imperial earth ”అనే fiction  పుస్తకాలు రాశాడు ఇరవై ఏళ్ళు శ్రీలంక లో నే వున్నాడు . అక్కడి tax సమస్యల వల్ల లంకను ఆరు నెలలకు ఒక సారి వదిలి విదేశాలకు వెళ్ళే వాడు .తర్వాత  ,బ్రిటిష్ పోరాసత్వము పొంది ,లంక లో ఇల్లు కొనుక్కున్నాడు .ఒక దేశ పౌరిడిగా వుంటూ  ,వేరొక దేశం లో స్థిర నివాసం పొందిన ఘనుడు క్లార్క్ .లంక లో residential స్టేటస్ పొందాడు .1976 లో లంక ప్రభుత్వం ”the  clerk act ‘  ‘తెచ్చింది ‘  ఇతరదేశీయులు లంక లో స్వంత ఇంటిలో వుంటే పన్ను కట్టక్కర లేదు అని సారాంశం ..ఇది ఆయన కోసమే చేసినా ,చాలా మందికి ప్రయోజనం కలిగింది .తెచ్చింది ..residential గెస్ట్ గా మొదట గుర్తింపు పొందిన వాడు క్లార్క్ .
                   ప్లే బాయ్ లాంటి పత్రికలకు రాస్తూనే వున్నాడు .”A fall of moon dust ”అనే సీరియల్ రాశాడు .శ్రీ లంక సముద్రం లో మునిగి ఈత కొడుతుంటే రెండు లోయలు ,చాలా వెండి నాణాలు కని పించాయి /.తన యాత్రను ”indian ocean treasure ”గా రాశాడు .తరువాత ” the treasure of the great reef ”అనే రెండవ పుస్తకమూ రాశాడు .1962 లో gummam తగిలి రక్తం గడ్డ కట్టి పక్షవాతం వచ్చింది పాపం .అయినా రచన మాన లేదు ‘ తర్వాత ఓల్డ్ polio జబ్బు చేసింది .”The ghost from the grand banks ,the hammer of god ,garden of Rama ,Rama revealed ”పుస్తకాలు అంత వ్యాధి లోను రాసి తన వ్యాధిని రాతతో జయించే పని చేశాడు .ఎన్నో విశ్వ విద్యాలయాలాకు వెళ్లి అద్భుతమైన ఉపన్యాసాలతో విద్యార్ధులను ,శాస్త్రీయ అవగాహన పొందేట్లు స్ఫూర్తి నిచ్చాడు .స్వంత తెలివి తేటలతో సృజన తో ,పరిశోధన తో ,అరుదైన రచనల తో ప్రభావితం చేసి ఆదర్శ ప్రాయుడైన శాస్త్ర వేత్త గా నిలిచాడు ,ప్రజా హృదయం గెలిచాడు అర్హర్ సి,క్లార్క్ .ధన్య జీవి .సకల కళా ప్రవీణుడు .
                               మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -07 -11 –క్యాంపు –బెంగళూర్    . –
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.