”మో”హరించిన జ్ఞాపకాలు
వేగుంట మోహన ప్రసాద్ ఉయ్యూరు లో అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య మరియు చెరుకు రైతుల కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసకుని గా పనిచేసారు .అప్పటికే ఆయన కవిత్వపు హోరు ఆంద్ర దేశం అంతా నినదిస్తోంది .మాదాల కాశీ విశ్వేశ్వర రావు గారు ప్రిన్సిపాల్ గ పని చేస్తున్న కాలమ్ అని జ్ఞాపకం .పరుచూరి గోపాల కృష్ణ కూడా .కళాశాల ప్రారంభం లో వున్న తెలుగు లెక్చరర్ .ఇంటర్వ్యూ కువచ్చార్రు . నేను హాజరయాను తెలుగు పోస్ట్ కు .నాకు recommendation లేదు అప్పటికే నేను జిల్లా పరిషత్ లో సైన్సు టీచర్ గా పని చేస్తున్నాను అనే .. పిచ్చి బాబు కూడా చాలా తీవ్రం గా అన్ని కోణాల్లో నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు .గోపాల కృష్ణ తణుకు కాలేజి లో పని చేస్తూ వచ్చాడు .ఇంటర్వ్యూ సమయం లో ఖాళీ గ వున్నప్పుడు చాలా జోకులు పెల్చేవాడు .కధలు చెప్పే వాడు .ఇక్కడికి దగ్గరలో వున్న మేడూరు గ్రామస్తుడు .అనుభవం వుంది ,చాతుర్యం వుంది .అతను ఒక జోకు లాంటి నిజం చెప్పాడు .ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం .ఒక సారి ఒక ఆంగ్లేయుడు ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ని చూడ టానికి వచ్చాడట .అడుసుమిల్లి గోపాల క్రిష్నయ్య గారు అన్నీ దగ్గరుండి చూపిస్తున్నారట .పంచదార చాలా నాన్యం గా వుందని ఇంగ్లీష్ వాడు మెచ్చాదట .దానికి సమాధానం గా గోపాల క్రిష్నయ్య గారు ”సార్ !మా మేకు ఏం మేకు సార్ మీఇంగ్లీషు వాడి మీకే మేకు ”అన్నారట. .అంటే ,మా తయారు లో గొప్ప ఏముందండి ,మీ తయారే గొప్ప అని అర్ధం అలా మేకు బందీతో తెలుగు ఆంగ్లం కలిపి వాయిన్చాదట గోపాల క్రిష్నయ్య గారు ..ఇంగ్లీష్ వచ్చినా రాక పోయినా ఆయనకేమీ నష్టం లేదు . షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పి ఇక్కడి పారిశ్రామిక వికాసానికి ,రైతు అభ్యుదయానికీ ,కూలీల పనికి ఆర్ధిక రంగ పురోగతికి బాటలు వేసిన మహనీయుడు ..పరుచూరి చెప్పిన ఆ మాటలు విని కడుపుబ్బా నవ్వు కొన్నాం .పరుచురికి ,పిచ్చి బాబుకు పోస్ట్ లు వచ్చాయి .అదో గొప్ప అనుభవం .ఆ తర్వాత ఇక్కడ పని చేసిన కాలమ్ లో పరుచూరి కాలేజీ లో మంచి నాటకాలు రచించి ,విద్యార్ధులతో వేయించేవాడు .మా పెద్దబ్బాయి శాస్త్రి ఆయన శిష్యుడే .ఒక నాటకం లో ఆడ వేషం వేశాడు మా వాడు .ప్రైజ్ కూడా వచ్చింది .సందడి చేయటం పరుచూరి కి ఒక కళ .ఇక్కడినుంచే నెమ్మదిగా సినిమా కి వెళ్ళాడు అప్పటికే అన్న వెంకటేశ్వర రావు ఆ రంగం లో బాగా రాణిస్తున్నాడు .ఇద్దరు కలిసి పరుచూరి బ్రదర్స్ గా సిని ఫీల్డ్ ను చాలా కాలమ్ నుంచి దున్నేస్తున్నారు .పేరు ,ప్రతిష్ట ,డబ్బు దశకం ,అన్నీ బాగానే సంపాదించారు .గోపాల కృష్ణ ఈ కాలేజీ నుంచి వెళ్ళిన వాడే నని చెప్పటానికే ఇది అంతా .
అలాగే వేగుంట మోహన ప్రసాద్ గారు ఇక్కడ పని చేసి ఇక్కడి నుంచే విజయవాడ సిద్ధార్ధ కాలేజీ కి ఆంగ్ల శాఖ అధిపతిగా వెళ్లి నట్లు జ్ఞాపకం .అక్కడినుంచే ఆయన సాహితీ ప్రస్తానం అనేక రూపులు దాల్చి ,లబ్ధ ప్రతిస్తూ లైనాడు .ఇక్కడ వుండగా నా మిత్రుడు ,ప్రముఖ సాహితీ విమర్శకుడు స్వర్గీయ టి.ఎల్. కాంతా రావు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్చోల్ లో మాతో పాటు పని చేశాడు .మోహన ప్రసాద్ కవిత్వం అంటే మహదానంద పడి పోయేవాడు .ఆ కవితలు చదివి విని పించి మమ్మల్ని మో వైపుకు ఆకర్షించే ప్రయత్నం చేశాడు .అప్పుడప్పుడు మో ను కలుస్తుండే వాళ్ళం .నేను పెద్ద గా మాట్లాడే వాణ్ని కాదు .కారణం ఆయన కవిత్వపు లోతు పాటులు నాకు తెలీవు .కాంతా రావు కు కొట్టిన పిండి .అప్పటికే రావు ఆంగ్ల కవులు ఫ్రెంచ్ ,కగ్ర్ర్మన్ కవుల కవితలన్నీ పుక్కిలి పట్టాడు .నేను ఇంకా ప్రవేశమే చేయని వాడిని .అతనితో పాటు నేను .ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాష్టారు రామ రావు ,జ్ఞానసుందరం ,కలిసే వాళ్ళం .మో కొంత గంభీరం గా వుండే వాడు .మూతి బిగించే వుండేది .ఉండాల్సిన కొలత కంటే రెండూ మూడు అంగుళాల పొట్టి చొక్కా వేసే వాడు .తమాషా గా వుండేది నాకు .చేతిలో అణు క్షణ అగ్నిహోత్రం..కాంతా రావు మాట్లాడు తుంటే వినటమే మా పని .అయితె ఆప్యాయం గా పలకరించే వాడు మో రాసిన చితి చింత కవిత కు అవార్డ్ వచ్చినపుడు కాంతా రావు సంబర పడి పోయాడు .ఆ పుస్తకం నాకు ఇచ్చి చదవ మన్నాడు .చాలా సార్లు ప్రయత్నించా .అందు లోకి నేను ప్రవేశించలేక పోయాను .నాకు అర్ధం కాదని తేలిపోయింది పుస్తకం తిరిగి ఇచ్చేశాను .కాంతా రావు ఆ పుస్తకం మీద చాలా గొప్పగా మాట్లాడే వాడు .వ్యాసాలు రాసిన జ్ఞాపకం .మో పెదిమలు కొంచెం మొద్దు గా వుంటాయి ఆయన కవిత్వ లక్షణం లాగా నేమో .తర్వాత కాంతా రావు కూడా విజయవాడ సిద్ధార్ధ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా చేరి ఇక్కడినుంచి వెళ్లి పోయాడు .అక్కడ మో తో మొదట్లో చాలా స్నేహం గానే వుండే వాడు .కాంతా రావు బోలా వాడు .అందరినీ నమ్మేస్తాడు .అది విజయవాడ .ఎన్ని రకాల మనుషులుంటారో తెలీని అమాయకత్వం లో కొంత కాలమ్ వున్నాడు .చివరికి blood is thicker than water అని తెలుసు కున్నానని కనిపించినపుడల్లా చెప్పే వాడు .అక్కడ సావాసా దోషం అతన్ని మృత్యువుకు అతి త్వరగా చేర్చటం జీర్ణించుకోలేని విషయం .
వేగుంట అంటే నాకు ఎందుకో వాళ్ల నాన్న గారు వేగుంట కనక రామ బ్రహ్మం గారు జ్ఞాపకం వస్తారు .ఏలూరు దగ్గర వట్లూరు లో ఆయన ప్రతి ఏడు సభలు ,సమావేశాలు నిర్వహించి ,లబ్ధ ప్రతిస్తులైన వారి నందర్నీరప్పించి విందు భోజనాలు ,గోస్టులు ,చర్చలు జరుపుతుందే వారు .ఇవన్నీ పేపర్ లో చదివే వాడిని .అ సభలు దేని గురించో ,ఎవరెవరు వచ్చే వారో నాకు జ్ఞాపకం లేదు .అంటే మో కు కూడా తండ్రి వారసత్వం అబ్బి ఎప్పు డు పది మందితో వుండటం కని పించేది .బెజవాడ లో జరిగే ప్రముఖ సభలన్నిటికీ హాజరు వేయించుకొనే వారు .అవసరం వస్తేనే మాట్లాడే వారు .పత్రికల వాళ్ళందరికీ ఇష్టుడు .radio లో చాలా ప్రసంగాలు చేశారు .ఆయన చెబుతుంటే వినటం ఒక ఆనందం .మాట తడబడదు .ఎక్కడో మొదలు పెట్టి ఎకదికేక్కడికో తీసుకు పోతూ,యేవో శిఖరాలు ఎక్కిస్తూ ,అమాంతం గా లోయలోకి నెట్టేస్తూ ,చేయి పట్టుకొనినది నడి సంద్రం లో ఈదిస్తూ ,చేయి వదిలేసి ,భయపెడుతూ ,ఆటగా పాటగా సాగుతుంది ఆయన రాత అయినా ప్రసంగమైనా .ఎంతమంది కవులుకళా కారులు రచయితలు ఆయన ముని వెళ్ళ మధ్య ఉంటారో ఆశ్చర్యం వేస్తుంది ..ఆ ప్రవాహానికి ఒరవడికి ఉక్కిరి బిక్కిరి అవుతాం .తాను మాత్రం చిదానందం గా నే ఉంటాడు .ఇంతవరకు ఆయన కవిత్వం లో నాకు ఒక్కటి కూడా అర్ధం కాలేదంటే ఆశ్చర్యం లేదు .అది నా లోపమే .అందులో ప్రవేశించే ఓర్పు ,నేర్పు మనకు వుండాలి కాని ఆయనేం చేస్తాడు .అందుకనే నాకు అనిపిస్తుంది కన్యా శుల్కంలో గిరీశం తో గురజాడ అనిపించినట్లు ”algebra made difficult ”లాగానే పాపం మో కూడా కవిత్వాన్ని most difficult గా మార్చేశా డేమో నని . .
అతను విషాదాన్ని ప్రేమిచాడు .నిరీహలో మునిగి పోయాడు .రహస్తంత్రిని మీటి రసనాడుల్ని కదిలించాలను కొన్నాడు .అయితె అతని ఆవేశం ముందు అతని కవిత్వం ఒంకర్లు కొంకర్లు పోయింది .అలవి కాని గుర్రం అయిందేమో అనిపిస్తుంది .విషాద మోహనం మోహన విషాద మయింది .ప్రపంచాకవులు ,దేశీయ కవులు అతని ఆక్రమించుకొని ,నడిపించారు .ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి చేరు తాడో తెలీని నట్టడవి మార్గ గమనం అని పిస్తుంది .విశ్వ మానవ సంవేదనకు సంకేతం గా నిలబడాలన్న ఆకాంక్ష మో ది .అది ఎంతవరకు సాధించాడో తెలిసిన వాళ్ళు చెప్పాలి .తన కవితా త్న్త్రులతో జగతిని మేలు కొలిపే కవి తనమెదడు లోని తంత్రులే తెగి ,రక్తం గడ్డ కట్టి మెదడు స్తంభించిన అచేతన స్థితి లో కొన్ని గంటల కాలమ్ వున్నా డంటే అమితాస్చర్యం వేస్తుంది మెదడును కదిలించే కవిత్వం చెప్పిన వాడి మెదడు డెడ్ అయిందంటే విధి వైపరీత్యాన్ని ఏమను కోవాలి ?
”ఆట కదరా శివా ”అని శివ సాన్నిధ్యం లో నిరంతరం సంచరించే తనికెళ్ళ భరణి కి మో ఆప్తుడు ఎలా అయాడా అని నాకు తీరని సందేహం .అంతేకాక తన పేరిట ఇచ్చే మొదటి పురస్కారం మోకు అందివ్వటం మరీ విడ్డురం .ఇద్దరి జన్మ సంస్కారాలకు అవి తీపి గురుతులు .అనిర్వచనీయ స్నేహ ,సోశీల్యాలకు హారతులు .
కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయం లో అనువాదకుడు గా పనిచేసి నిజంగా తెలుగు సాహితీ లోకానికి అమూల్య సేవ లందించాడు మో .రావి శాస్త్రి కదల ను ఆంగ్లం లోకి అనువదించటానికి పడిన శ్రమ ,తీసుకొన్న శ్రద్ధ ,ఎంపిక చేసుకొన్నా విశిష్ట వ్యక్తుల తీరు చూస్తె ఆయన perfection కు యెంత విలువ నిస్తాడో నాకు అర్ధమయింది .ఆ పుస్తకాన్ని అమెరికా లో మేము వుండగా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారునాకు పంపించారు .అప్పుడే చదివాను .చాలా గొప్ప అనువాదం .రావి శాస్త్రి గారి తెలుగు అంతా అందులో దిగుమతియింది .ఆశ్చర్యం కలిగించింది .మో ఇంకా ఏయే అను వాదాలు చేశారో తెలీదు కాని ఏది చేసినా ఆయన ముద్ర వుండటం ఖాయం .
కృష్ణ జిల్లా రచయితల సంఘం ద్రావిడ విశ్వ విద్యాలయం సంయుక్తం గా నిర్వహించిన అనేక కార్య క్రమాల్లో మోహన ప్రసాద్ వచ్చి ,మౌన ప్రేక్షకుని గా వుండే వారు ఆయన రాక కోసం అభిమానులు ఎదురు చూసే వారు ..ఆయన రాక నిండుదనం తెచ్చేది .తన దేహాని పరోపకారం కోసం అవయవ దానం చేసిన మానవీయ మూర్తి .మో ను నిర్వచించటం కష్టం .అనిర్వచనీయం ఆయన కవిత్వం ,వ్యక్తిత్వం .మో అంటే మోహన కవిత్వం లో ముంచే వాడు .మో అంటే మొగమాటం లేని వాడు .మో అంటే మొద్దు నిద్ర వదిలిన్చేవాడు .మూక కవిత్వాన్ని పక్కకు నెట్టి ,ప్రత్యేకతకు ముందు నిలిచేవాడు ,.మో కవితకు పదార్ధ నిఘంటువు అవసరం.దాన్ని రూపొందించే కృషి లో మో అభిమానులు ముందు నిలవాలి . మో ఒక్కడే ఒక కవితా శిఖరం .దాని పైకి పాకాలంటే గుండె ధైర్యం కావాలి ప్రతిభ కావాలి ,అనుభూతి చెందే హృదయం కావాలి .లేకుంటే అదొక సంక్లిష్ట కల్లోల కాసారమే .దిగిన కొద్దీ లోతు ,ఊపిరి సలపని ఉత్కాన్త ,వేదన ,సంవేదన ,విషాద నిషాద భరిత ఆక్రోశం ,ఆవేదన అంతు చిక్కని శోధన
నాకు తెలుగు సాహిత్యం లోముగ్గురు విలక్షనులు కనిపిస్తున్నారు .ఒకరు కదా రచయిత త్రిపుర ,రెండు నవలా రచయిత వడ్డెర చండీ దాసు ,మూడు modern కవి మో ..ముగ్గురూ ముగ్గురేఅర్ధం కారు .అర్ధం చేసుకో కుండా ఉండలేము . అర్ధం అయినట్లు నటించను లేము ..
మీ — — గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు –04 -08 -11
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
https://sarasabharati.wordpress.com
“ఒకరు కదా రచయిత త్రిపుర ,రెండు నవలా రచయిత వడ్డెర చండీ దాసు ,మూడు modern కవి మో ..ముగ్గురూ ముగ్గురేఅర్ధం కారు .అర్ధం చేసుకో కుండా ఉండలేము . అర్ధం అయినట్లు నటించను లేము ..”
నాణ్యమయిన, నిజాయితీ ఉన్న అబ్సర్వేషను 🙂
త్రిపురగారు కవి కూడా.