ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”

    ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”
           జూలై ముప్ఫై తేదిశని వారం సాయంత్రం  నీ దివ్యసుందర విగ్రహాన్ని దర్శించాలని నీ సన్నిధికి చేరాం సకుటుంబ సమేతం గా .మేత అంటే గుర్తుకొచ్చింది .మా మేత ను మేమే తెచ్చుకోన్నాం దారిలో మెయ్యటానికి .భక్తీ ఎంతున్నా  బలం కూడా కావాలిగా .లోపల ఆకలి గంటలు కొట్టు తుంటే నీ గుడి గంటలు ఎలా వాయిన్చగలం స్వామీ .మర్చిపోయా అసలు గంటలే మోగించే పనే లేకుండా చేశావు .సరే స్వామీ .అధికారుల మనస్సులో దూరి కొన్ని మంచి పనులు చేయిస్తున్నా వయ్యా .మా బోటి ముసలి వారికీ ,కాలు కన్ను లేని వికలాంగులకు ఉచితం గా శీఘ్రం గా దర్శన యోగం కలిగిస్తున్నావు .చాలా సంతోషం స్వామీ .అదిగో అలాంటి దర్శనమే నేను నా భార్య ప్రభావతి చేశాం.యాభై రూపాయల టికెట్టు తో మా అబ్బాయి శర్మ ,కోడలు ఇందిరా ,మనవడు శ్రీ హర్ష ,మానవ రాలు హర్షిత ,ఉయ్యూరు  నుంచి వచ్చి మాతో చేరిన మా నాలుగో వాడు వెంకట రమణ ,కోడలు మహేశ్వరి లోపల మా లైన్ లోనే కలిశారు .అందరం రెప్పలు అర్చకుండా నీ సన్నిధి ని  నిలిచాం .ఎక్కడో చీకటి గుహలో వున్నావేం స్వామీ ?ఎంతో ఆర్భాటం గా రంగ రంగ వైభవం గా కనిపిస్తావని ఎదురు చూశాం .ఏమిటో మరీ చిన్న వాడివి గా కనిపించావేమిటి ?నాకు మాత్రమే నేమో అనుకొన్నా.అందరూ అదే మాట .ఆభరణాలూ లేవు .దండల సంభారమూ లేదు .బోసి పోయావయ్యా .మనసుకు ఎందుకో సంతోషం కలగ లేదయ్యా .అయినా నీది కటాక్ష వీక్షణమో ,ఆనంద హేలో ,అనుగ్రహ మో,తెలుసు కొనే సమయం ఎక్కడ /నీ నామాలు అన్నీ కప్పేశాయి .ఏభావము గొచరం కాదు .అదేదో మేమే అనుభవించాలని నీ టైరు భావం ఏమో .ఒక్క క్షణం నీ సుందర మంద హాస ముఖారవిందాన్ని చూద్దామనే ఆశ తో వచ్చాం.కాని ఎక్కడ నిలువ నిస్తున్నారయ్యా ?ఒకటే తోపుడు .పడ ,పడ మని విసవిసలు ,రుస రుసలు .త్తోపులాతలు తోడ తోక్కిల్లు .ఎక్కడ కింద పడతామో నని భయం చిన్న గాయలయితే నీకేమీ పట్టాడు .పెద్ద వాటికే నువ్వు భరోసా .అది సరే అంత చీకటి గుయ్యారం లో వుంది ఈ సకల భువనాలను ఎలా ఎలుతున్నావయ్య ?ఏదో ఆరడుగుల అంద గాదివని రామ ,కృష్ణుల అవతారాల్లో నిన్ను పూజించాం .నీ వైభవాన్ని ,సుందర రూపాన్ని పోగిదాం.ఇప్పుడేముంది ?నామాలే కదా స్వామీ ?అదియాన్ దాసోహమే నీకు కావాల్సింది .అది సరే అసలు నీ విగ్రహం అంత చినడైన్దేమిటి సామీ ?maayaa ?మర్మమా ?లఘు ,శూక్ష్మ లఘు దర్శనాలిస్తున్నందున నువ్వు లఘువు అయావా ?కొండలనే మాయ చేసిన నాయకులు నీకేక్కడి తిప్పలు తెస్తున్నారో నని బాధ గా వుంది .స్వర్ణ మయం అంటాడొకడు ,అనంత స్వర్ణం అన్తాదిన్కోడు ,అక్కడున్న బంగారం కంటే విలువైన శాసన సంపద ఎవరికీ అక్కర్లేదు .నువ్వు ఇవన్నీ కావాలని కోరావా ?మా కోరిక ఇలా తీర్చుకొనే ఉపాయమే ఇది .పోయింది పోగా ఇంకా వచ్చి చేరుతూనే వుంది నీ దివాణం లోకి పెన్నిధి .,
         ఒక దేశం ,ఒక ప్రాంతం అని ,ఒక మతం ,ఒక విశ్వాసమనీ ఏమీ లేదు .అందరు నీలో వారి వారి దేవతలను దర్శిస్తున్నారు .అందుకే ముజ్జగాల దొరవైనావు .విభావానికీ ,విధానానికీ కొదవ లేదు .నీకు ఏది కావాలన్నా సమ కూర్చే సంపన్నులున్నారు .సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకొనే వదాన్యులున్నారు .సేవా భావం తో సేవిస్తున్న లక్షలాది జనం వున్నారు .నీ గుది ఇక్కడ మాత్రమే పరిమితం కాదు .దాదాపు అన్ని దేశాల్లో నిన్ను వెలయింప జేసుకొన్నారు .పూజాదికాలతో ,భక్తీ ప్రపత్తులతో ,నిన్ను అనుక్షణం కొలుస్తున్నారు .కోరికలు నీకు నివేదించి ,సాఫల్యం పొందుతున్నారు .ఏ మూడింటికో నిన్ను లేపి అన్నీ నీకు నివేదించి దర్శన ప్రాప్తి కల్గిస్తున్నారు .మళ్ళీ అర్ధ రాత్రి దాకా నీకు విశ్రాంతి లేదు .ఎప్పుడు నిద్రిస్తావో ,ఎప్పుడు మేల్కొంతావో తెలీదు .సకల భువన రాక్షకుడికి నిద్రేమిటి?భోజన ,భాజనాలేమిటి .నీ కోసమా ఇవన్నీ ,కాదు మా కోసం .అన్నీ చూస్తూనే ఉంటావు .ఏమీ తెలీనట్లున్తావు .అంతా మునిగే దాకా కళ్ళు తెర్వ్వు .ఇలా అయితె ఎలా గయ్యా బాబూ?
           నీ దర్శనం చేసి విశ్రాంతి కోసం గడులున్నాఎమో నని ఇంటర్నెట్ లో వెతుకు తుంటే మూడు నెలల దాకా ఖాళీ లేవు అని తక్కున సమాధానం వస్తుంది .నిజమే ననుకొని నమ్మితే మునిగి పోవామే .తెలిసిన వాడినో ,బలిసిన వాడినో ,ఆశ్రయిస్తే అయిదు నిమిషాల్లో గది హుజూర్ అంతు ముందు నిలుచుంటుంది .నీకే పంగ నామాలు పెట్టె ఘనులు కో కొల్లలు నీ కొండ మీద .అడుగడుగునా ఏదో దగా ,మోసం .ఎలా భరిస్తున్నావు మహాను భావా /నీ దర్శనం చేసిన వారందరికీ ఉచితం గా చిన్న గోలీ కాయ సైజు లడ్డు ప్రసాదం గా ఇస్తున్నారు .బాగుంది .అందరికీ నీ లడ్డు ఉచితం గా అందుతోందని సంబర పడ్డాను .సామీ !అందులో పచ్చి సెనగ పిండి ఇంత పంచదార తప్ప ఏమీ లేదు .నువ్వు తినవుగానీకేమీతెలుస్తుంది దాని రుచి?
           ఎన్ని చూసుకోవాలి కొండపై నువ్వు ?బస్సులు ,వ్వతి సిబ్బంది ,సంబారాలు ,వసతి గృహాలు ,వాటి నిర్వహణ ,ప్రసాదాలు ,వినియోగం ,పూజలు ,పునస్కారాలు ,నిత్యకళ్యాణం పచ్చత్రనాలు ,ఉత్చవాలు ,వేడుకలు ,అడుగడుగు దండాలు ,ఆపదలు తీర్చటాలు ,హుండీ డబ్బులు ,దానికి కంటికి రెప్ప లా కాపాడు కోవతాలు ,లెక్కింపులో వెయ్యి కళ్ళ నిఘా వున్న తస్క్రులున్తూనే వుండటం ,అధికారులు ,వారికి రాచ మర్యాదలు ,మంత్రులు ,గవర్నర్లు దేశ విదేశీ ప్రముఖులు ,స్టార్లు ,సినిమా స్టార్లు ,వీళ్ళందరికీ సంతృప్తి పరచే ఏర్పాట్లు పాపం ఇవన్నే నువ్వు చూసు కో లేవని పాలక మండలిని ఏర్పాటు చేస్తే .అది నీకు శత గోపం పెట్టె స్తోంది .
            రామా రావు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు చేబట్టిన నిత్యాన్న దాన పధకం మహా భేషుగ్గా నడుస్తోంది .శ్రీ వారి ప్రసాదం గా కళ్ళ కద్దుకొని తింటున్నారు .దాని నిర్వహణా బాగుంది .దాన్ని ఇప్పుడు ఇంకా విస్తరించి గొప్ప సేవ చేయిస్తునావు .నీ కొండపై ఆకలితో ఒక్కరు ఉండ కూడదను కొన్నావా స్వామీ ?అందరికి ఉచిత భోజనమా ?ప్రపంచం లో ఇది ఎక్కడైనా సాధ్యమా ?ఇక్కడ అది సాధ్యమయింది .అన్న పూర్నా దేవి ఇక్కడ కొలువైంది .భక్తుల కోరికలు నువ్వు తీరుస్తుంటే ఆకలి ఆమె తీరుస్తోంది .అవును ఆమె నీ సోదరే కదా ?కొత్తగా వేగ్నేశ రాజు గారు ‘నిరతాన్న దానానికి సకల సదుపాయాయాలతో కట్టించిన ”తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దాన భవనం ”రాజు గారి భక్తీ ప్రపత్తులకు నిదర్శనం .ఒకే సారి ౫౦౦౦మన్ది భోజనం చేసే ఏర్పాట్లు బహు భేషుగ్గా వున్నాయి .ఎంతో సేవా భావం తో అక్కడ అన్న దాన కార్యక్రమం పవిత్రం గా జరుగు తోంది .భోజన సమయం లో విని పించే వేదోచ్చారణ ,ఆరన పూర్నాస్తకం వీనుల విందే కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఎరుక కలిగిస్తోంది .అన్నాన్ని నినదించ వద్దు ,అన్నాని పారేయవద్దు అని చెప్పే ఉపనిషద్ వాక్యాలు కర్తవ్య బోధ చేస్తున్నాయి .అదే భోజనం బయట వందరూపాయలు పెట్టినా లభించదు .శుచి ,శుభ్రం గా అక్కడి వారు మర్యాదగా ,గౌరవం గా ప్రవర్తించి ,అడిగి అడిగి ,మరీ తినిపిస్తున్నారు .నీ దర్శనం చేసిన వెంటనే నీ ఆలయానికి ప్రక్కనే ఇది వుండటం భక్తుల అదృష్టం .ఉత్తరాది వారికీ కావలసిన పదార్ధాలు అంటే రొట్టె చపాతి పూరీ వగైరాలు పెట్టె విధానమూ ఏర్పాటు చేసి వారినీ సంతృప్తి పరుస్తున్నావు .అయితె స్వామీ .ఒక్క మాట చెప్ప కుండా ఉండలేను .భోజనం కొంత అరవ వాసన వేస్తోంది .ఇంకా పూర్తి తెలుగు భోజనం అని పించటం లేదు .కాస్త కనికరించి తెలుగు రుచులు కలిగించు .ఇప్పుడు పెట్టె భోజనం బానే వున్నా రుచి లేదు .సారీ సామీ రుచి అంటే ఉప్పు కాదు .తినటానికి హితవు గా లేక పోవటమే .దాన్ని కాస్త పర్యవేక్షించి ఆంధ్రా భోజనమందించి ,ఆస్వాదిన్చేట్లు చెయ్యి స్వామీ .రేపటి బ్రహ్మోత్చావాలకు షడ్రసోపేతమైన భోజనం అందిస్తామని నిన్ను పాలించే సారీ నీ గుడిని పాలించే అధికారులు అంటున్నారు .చాలా సంతోషం .అప్పుడు నీను చెప్పింది కూడా గుర్తు చెయ్యి అన్న దాటా .
         నీ ఆలయ శోభ చూసే సమయం ,నీ ఆలయం లో శిల్ప కళా సౌందర్యాని దర్శించే భాగ్యం తగ్గి పోతోంది-నీ దర్శనపు తొందరలో .అవన్నే చూపించటానికి నీ ప్రచార సాధనం టి.వి వుంది గా .అందు లో చూసి తరించాల్సిందే .పూర్వం చక్రపొంగలి పులిహోర దద్ధోజనం ,వడ ప్రసాదాలున్దేవి .కొనుక్కోవటానికి దొరికేవి .ఇప్పుడవన్నీ ఎత్తేశారు పాపం ఒక లడ్డు తో నిన్ను సరి పుచ్చుతున్నారు .
            ఎంతో ఖర్చుతో నాద నీరాజనాన్ని సాయంత్రం పూట ఏర్పాటు చేస్తున్నారు .కాని అక్కడ కూర్చుని ఆస్వాదించే రసజ్ఞులు వెళ్ళ మీద లెక్క పెట్టినంత కూడా వుండటం లేదు .ఇది చాలా బాధాకరం గా వుంది స్వామీ .ఆరు ఏళ్ళ తర్వాత మళ్ళీ నీ దివ్య దర్శనం చేయించావు .నీ కళ్ళతో నిన్ను చూపించావు .కృతజ్ఞులం .లోపాలుంటాయి .సరి చేసు కోని ముందుకు సాగుదాం .జై శ్రీ వేంకటేశ .నమో నమో శ్రీ వేంకటేశ
           మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -08 -11 .

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

1 Response to ఏడు కొండల పై అయిదడుగుల అంద గాడు”

  1. మీ వ్యాసం చాల బాగుంది . నాకు రాయటం బద్ధకం .అందుకే ఎక్కువ రాయలేక పోతున్నా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.