3
దాదాపు వెయ్యిమంది ప్రతినిధులతో ,విశిష్ట అతిదులైన విదేశీ ప్రముఖులు ,ఆచార్య వర్యులు ,గౌరవ అతిదులైన అధికార ప్రముఖులతో,ఆత్మీయ అతిదులైన పత్రికారంగా ప్రముఖులతో ,చేయూతనిస్తున్న వదాన్యులతో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు రంగ రంగ వైభవం గా ప్రారంభమై ,తెలుగు దేశం లో వివిధ రంగాలలో ప్రముఖులైన మహనీయుల చిత్రపటాల ఫ్లెక్షే లతో ,రంగు రంగుల బ్యానర్లతో విజయవాడ పట్టణం అంతా తెలుగు పండుగ వాతావరణం నెలకొని శోభాయమానం గా వుంది .
కార్యకర్తలు ఉత్చాహం గా పని చేస్తూ ఏ అసౌకర్యము జరుగకుండా తోడ్పడుతున్నారు .జ్ఞాన పీత పురస్కార గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి స్వగృహం లో వారి చిత్రపటాలు ,పుస్తకాలు ,జ్ఞాపికలుప్రదర్శించటం సముచితం గా వుంది .పురావస్తు శాఖ ఏర్పరచిన నాణాల ,వస్తువుల చిత్ర ప్రదర్శన అందరిని ఆకర్షించింది .ముందుగా కేంద్ర సాహిత్య అకాడెమి ప్రతినిధి ,ప్రముఖ కన్నడ రచయిత ఆచార్య ఎస్.ఎల్.బైరప్ప స్ఫూర్తివంతమం గా ప్రసంగిస్తూ కన్నడ ప్రభుత్వం తమ భాషకు అన్నిరకాల సహాయం చేస్తోందని ,కర్ణాటక లోని ”భాషా భారతి ”అనే సంస్థ అనువాద సాహిత్యానికి వెన్నెముకగా నిలిచి ప్రోత్చాహిస్తోందని ,అదే విధం గా ఆంద్ర దేశం లోను ప్రభుత్వం తెలుగు భాషకు సేవ చేయాలని హితవు పలికారు .ప్రెస్ అకాడెమి అధ్యక్షులు శ్రీ టి.సురేంద్ర -పత్రికావిలేకరులకు శిక్షణ నివాలని సూచించగా ,స్వర్ణాంధ్ర పాతిక సంపాదకులు శ్రీ కే.ఎస్ .తిలక్ -తెలుగు పత్రికల యాజమాన్యాలన్ని కలిసి ఇలాంటి సభలు నిర్వహించాలని కోరారు
రెండవ రోజూ 14 -08 -11 ఆదివారం ఉదయం సాహితీ ప్రముఖులతో ఎస్.వి.ఎస్.కళ్యాణ మండపం లో ”సాహిత్యం,సాహిత్యానువాదాలు ,-ప్రచురణ రంగం ”అనే అంశం మీద మూడవ సదస్సు” గుర్రం జాషువా వేదిక ” పై జరిగింది .శ్రీ టి.శోభనాద్రి అతిధులను వేదికపై కిఆహ్వానిన్చాగా ,ఏ.బి.యెన్.ఆంద్ర జ్యోతి బ్యూరో చీఫ్ శ్రీ ఏ.కృష్ణా రావు సమన్వయము చేశారు .ముప్ఫై మందికి పైగా సాహితీ వేత్తలు పాల్గొని మంచి సూచనలు చేశారు .శ్రీ కృష్ణా రావు –నేడు పత్రికల లో పనిచేసే వారికి సాహిత్య పరిజ్ఞానం తక్కువ గ వుందని ,నిజానికి పత్రికలే సాహిత్య వ్యాప్తి అధికం గా చేస్తున్నాయని చెప్పారు .తెలుగు అకాడెమి సంచాలకులు శ్రీ యాదగిరి పదిహేను కోట్ల రూపాయల వ్యయం తో అకాడెమి అనేక ప్రోత్చాహక కార్యక్రమాలు నిర్వహిస్తోందని,తాము నడుపుతున్న ”తెలుగ్గు ”మాస పత్రికకు విలువైన రచనలు రాసి పంపమని కోరారు .ఇతర రాష్ట్రాల లోని తెలుగు వారికి బోధనాశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ,తెలుగు నిఘంటువును డిజిటలైజ్ చేస్తున్నట్లు చెప్పారు .ఫెలోషిప్పులను ఏర్పరిచి ప్రోత్చాహిస్తున్నట్లు తెలిపారు .ప్రముఖ కవి డాక్టర్ శిఖామణి -స్వతంత్రప్రతిపత్తి గల అనువాద వ్యవస్థ ఏర్పడాలని ,రచయితల సహకార సంఘాలు అవసరమని సూచించారు .ప్రముఖ రచయిత ,నటుడు శ్రీ గొల్లపూడి మారుతీ రావు తమ అభిభాషణం లో గొప్ప రచన ఆలోచన ను ప్రోది చేయాలి ,ఆవేశాన్ని కాదుఅన్నారు .ఇజాలు లేని నిజం చెప్పే రచనలు రాయమని రచయితలను కోరారు .ప్రముఖ విమర్శకులు శ్రీ కడియాల రాజా రామ మోహన రాయ్ –రచనలో జీవన వైవిధ్యంచూపాలి,దేశ భాషలను పరి పుష్టి చేసుకొంటూ సాహిత్యం ముందుకు వెళ్ళాలి అని సూచించిన సుబోద్ సర్కార్ మాటలు మరువరదన్నారు .యువకులు బాగానే చదువుతున్నారానీ ,బాగానే రాస్తున్నారని ఆందోళన చెందాల్సిన పని లేదని అంటూ ,మాండలీకాలు భాషకు అడ్డు కాదు అని చెప్పారు . ప్రముఖ కవి ,రచయిత శ్రీ విహారి -రచయితలకు పత్రికలు తగిన పారితోషికాలు ఇవ్వాలని తెలియ జేశారు .ఆకాశవాణి మాజీ సంచాలకులు డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు ”తెలుగు నేర్చుకుందాం ”అనే శీర్షికను పత్రికలు నిర్వహించాలని సూచన చేస్తూ ముఖ్యం గా చిన్న బాల శిక్ష ను తయారు చేయాల్సిన అవసరం వుందని తెలియ జేహారు .
ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కే.బి.లక్ష్మి -యువత కోసం ప్రత్యెక సదస్సు నిర్వహించాలి ,అనువాదకుల పానెల్ రావాలి ,చక్కని తెలుగు పదాల సృష్టి జరగాలి బాలల ,యువకుల కోసం పత్రికలు ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలి,సంప్రదాయాన్ని నిలబెట్టే రచనలు రావాలి అని చెప్పారు రవీంద్రుడు తెలుగు సంభాషణ విని ”ఇది తెలుగా -సంగీతమా ?”అని ఆశ్చర్య పోయారని ,అంతటి కమ్మని ,మధురమైన సంగీత ప్రధానమైన భాష తెలుగు అని వివరించారు .అనతరం మాట్లాడిన డాక్టర్ రావి రంగా రావు -ఆంగ్లం లోకి అనువాదం ఆయె సాఫ్ట్ వేర్ ను యువ ఇంజినీర్లు తయారు చేయా లని సూచన చేశారు .సాహిత్యానికి మూల్యాంకన స్కేలె వుండాలని అభిప్రాయ పడ్డారు .అంతర్జాలాన్ని రచయితలు బాగా ఉపయోగించుకోవాలని అనారు .డాక్టర్ బాబీ వర్ధన్ -భాషే శ్వాస అంటూ పత్రికలు సామాన్య జనం వాడే పదాలను ఉపయోగించాలి అన్నారు .హాస్యావధాని డాక్టర్ శంకర నారాయణ చలోక్తులతో,సభారంజనం చేసి,ప్రతి నోట తెలుగు వినిపించాలనితెలుగంటే వెలుగే నని గుర్తు చేశారు .డాక్టర్ వెన్నా వల్లభ రావు ,డాక్టర్ వి.కృష్ణ కుమారి లు తెలుగు కోసం ప్రచార ఉద్యమం కావాలని కోరారు .అనంతరం మాట్లాడిన డాక్టర్ గుమ్మా సాంబ శివ రావు -సాహిత్య బోధన ఒక అంశం గా బోధించాలని ,రచయితలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ,సూచించారు .డాక్టర్ రాపాక ఎకామ్బరాచార్యులు -పత్రికల లో ”కళా సాహిత్య విజ్ఞాన వేదిక ‘నిర్వహించాలన్నారు .ప్రముఖ రచయిత శ్రీ కస్తూరి మురళీ కృష్ణ -పాథక హృదయాలను తాకే రచనలు రావాలని ఆశించారు .డాక్టర్ జయ కుమారరాజు తెలుగు భాష కోసం కృషి చేసిన ప్రాతస్మరనీయుడు సి.పీ.బ్రౌన్ పేరిట పురస్కారం ఏర్పాటు చేయాలని క్రిస్టియన్ సాహిత్యాన్ని కూడా గుర్తించి ప్రాదాన్యతనిచ్చి ,పురస్కారాలు అందించాలని కోరారు .గిరిజన సంస్కృతిని ,సాహిత్యాని పరి రక్షించామనిశ్రీ భాను నాయక సూచించారు .ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ బాలి -మంచి గుండ్రని ఫాంట్ ను ముద్రణకు వాడాలని, లిపి మీద మరింత శ్రద్ధ చూపాలని విలువైన సలహా ఇచ్చారు .శ్లజాడల రాసి రాసి గుత్తి చంద్రశేఖర రెడ్డి ,శంకరస్వామి ,చిత్రకారుడు టి.వి ,డాక్టర్ లావణ్య ,డాక్టర్ టి .రంగస్వామి ,శ్రీమతి ఝాన్సి కే.లక్ష్మి కుమారి ,చలన చిత్ర విశ్లేషకులు శ్రీ జి .ఎస్ రామా రావు ,శ్రీ వేదాంతం రాజా గోపాల చక్ర వర్తి ,మున్నగు ప్రముఖులు తమ అమూల్య సూచనలు అంద జేశారు .యువకులు అధిక సంఖ్య లో పాల్గొనటం ఈ సభల ప్రత్యేకత ,మంచి పరిణామం .ఈ స్ఫూర్తి తో ”ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”ఏర్పడితే బాగుంటుంది అని సూచించిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు జాన్సన్ చోరగుడి మాట ఆలోచించదగినది .