రెండవ ప్రపంచ తెలుగు రచయితల సభలు –4
రెండవ రోజూ మధ్యాహ్నం ”గిడుగు రామ మూర్తి వేదిక ”పై నాల్గవ సదస్సు ”మాత్రుభాషల మనుగడ ,మాండలీకాల వినియోగం ,తెలుగు భాష కు ప్రాచీన హోదా అనంతర చర్యలు-తెలుగు భాషోద్యమం ”చర్చనీయాంశాలు జరిగింది .నడుస్తున్న చరిత్ర సంపాదకులు శ్రీ సామల రమేష్ అధ్యక్షా స్థానం వహించగా ద్రావిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి శ్రీ గంగి శెట్టి లక్ష్మీ నారాయణ కీలక ప్రసంగం చేశారు .భాష పేరిట ఇంత గొప్ప పండుగ జరగటం చిరస్మరణీయం అన్నారు .చరిత్ర స్ఫూర్తి గతంకాదు గతి అని వివరించారు .అంటే నడిపించేది .ఒక ఉద్యమం గా ముందుకు సాగక పోతే భాషకు మనుగడ కష్టం అంటూ దిశా నిర్దేశం చేస్తూ ప్రసంగించి ఉత్తేజితుల్ని చేశారు .వారి సంభాషణ ఆద్యంతం స్ఫూర్తి దాయకం గా వుండి వక్తలకు ,ప్రతినిధులకు ,ఆనందం కల్గించింది .తర్వాత మాట్లాడిన డాక్టర్ ద్వా.నా.శాస్త్రి -భాషలో ఒత్తులు ,సున్నాలు తగ్గి పోవటం బాధగా వుంది అంటూ ,చానెళ్ళలో తెలుగు నేర్పెవారిని నియమించి భాష నేర్పించాలని సలహా ఇచ్చారు .తెలుగు లో చదివితే ఉద్యోగాలు రావు అన్నది భ్రమే నని ఇటీవలి కాలమ్ లో పోటీ పరీక్షలలో తెలుగు లో చదువుకొన్న వారే అగ్రస్తానాలు సంపాదించిన విషయం సోదాహరణం గా వివరించారు .డాక్టర్ వేలిమల సిమన్న –ప్రామాణిక భాష గురించి కృషి జరగాలని ,పాండిత్య దృష్టి తో కాకుండా శాస్త్రీయ దృష్టిని కూడా జోడించి నిఘంటు నిర్మాణం జరగాలని సూచన చేశారు .జిల్లా మాండలీక పదకోశాలు విస్తృతం గానే వస్తున్నాయి .”ఆంద్ర ప్రదేశ్ మాండలిక పడ కోశం ”రావాల్సిన అవసరం ఎంతైనా వుంది అన్నారు .ఆధునిక సాహిత్యానికి వ్యాకరణాలు రావాలి .ప్రతిభ పెరుగుతూనే వుంది .తెలుగును శాస్త్రీయ దృష్టి తో బోధించాలి .మాతృభాష పట్ల మక్కువ వున్న అధికారులను నియమిస్తే భాష అభివృద్ధి చెందుతుంది అన్న విలువైన సూచన చేశారు .డాక్టర్ బూదాటి వెంకటేశ్వర రావు -తమ ప్రసంగం లో రచయితలు స్వయం వ్యక్తిత్వాన్ని సాధించుకోవాలి,ఆత్మ గౌరవం హుందా తో పని చేయాలి వైవిధ్యాలు వైరుధ్యాలు కా కూడదు .సమన్వయ దృక్పధం అవసరం అని హితబోధ చేశారు .సుప్రసిద్ధ సాహితీ వేత్త డాక్టర్ యు.ఏ.అనంత మూర్తి తమ అభి భాషణం లో -సాంకేతికత స్థిరబిందువు కాదనీ ,నిన్నటి సాంకేతికత నేటికి మారిపోతోందని ,ప్రయత్నా లోపం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం సాధించు కోవాలని ,మేధ ,అభ్యాసం ,లక్ష్యం వుంటే అన్నీ సాధించ వచ్చు నని సండర్భ శుద్ధిగా సలహా నిచ్చారు .ఏది ఎందుకోసం ,ఎవరి కోసం రాస్తున్నామో రచయితలు ఆత్మ పరిశీలనతో రాయాలని కోరారు .భాషా దురభి మానం వదిలి భాషాభిమానం తో ముందడుగు వేయమన్నారు .డాక్టర్ పాల పర్తి శ్యామలానంద ప్రసాద అవధాని ప్రాధమిక స్థాయి లోనే తెలుగు నేర్పాలి భాష నిరంతరం మారుతూనే వుంటుంది .అవసరమైన ఇతార భాషా పదాలను స్వీకరించి పరిపుష్టి కూర్చాలి .సహజమైన వాక్య నిర్మాణం చేయాలి .,దాన్ని వ్యాకరణం లో చేర్చాలి .తెలుగులో విస్తృతం గా మాట్లాడించాలి .తప్పులు దిద్దాలి .ప్రోత్చాహకాలు అందించాలి .అని మంచి సూచనలు చేశారు .శ్రీమతి సత్యవాణి -దేనికైనా భాషే మూలాధారమని ,దాని బోధనా ఆకర్షణీయం గా వుండాలని కోరారు .పత్రికా సంపాదకులు శ్రీ కొత్త పల్లి రవి బాబు మాట్లాడుతూ ,మాండలీకం వేరు ,భాష వేరు అనుకోరాదని ,డిగ్రీ స్థాయి వరకు తెలుగు లో బోధన వుండాలని,నిరంతరం భాషను ఉపయోగించాలని ,ఆఫ్రికన్ దేశాల భాషా స్వాతంత్ర్య ఉద్యమం అందరికి స్ఫూర్తి దాయకం కావాలి అన్నారు .ప్రసిద్ధరచయిత భాషోద్యమ నాయకులు శ్రీ కాలువ మల్లయ్య -తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవాలి ,ప్రైవేటు పాథ శాలల్లో కూడా తెలుగు నేర్పించటానికి తీవ్ర కృషి చేయాలని స్పష్ట మైన భాష విధానం కావాలని ,సూచన చేశారు .తర్వాత మాట్లాడిన డాక్టర్ గౌరి శంకర్ ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన తెలుగు వారిని అభినందిస్తూ ,పశ్చిమ బెంగాల్లో తెలుగు పుస్తకాలను ,అక్కడి బెంగాలే భాష లో నేర్పే ప్రయత్నాలు చేస్తున్నామని ,అయినా సఫలం కాలేక పోయామని ఆవేదన చెందారు .ఇక్కడి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల తెలుగు వారికి ఉచితం గ పుస్త కాలు అందించమని సలహానిచ్చారు .ధిల్లీ లో తెలుగును బాగానే నేర్చుకొంటున్నారు . గుజరాత్ లోని సూరత్ లో తెలుగు అభ్యాసం వుంది .మారిషస్ లో తెలుగును ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు నేర్చుకొంతున్నారని ,డిగ్రీ లో స్పెషల్ తెలుగు చదవటం హర్షదాయకం గా వుందని అన్నారు .మలేషియా లో తెలుగు వాడకం తగ్గి పోతోందని బాధ పడ్డారు . , డాక్టర్ సంగయ్య -అన్నమయ్య ఉపయోగించిన పదాల మీద పరిశోధన జరగాలి అని చెప్పారు .విజయవాడ లోని భవానీ పురం ,ముత్యాలం పాడు పేర్లు వచ్చిన చరిత్ర వివరించారు .పాత్యామ్శాలలో తెలుగు ఉపయోగాన్ని తెలియజేయాలన్న విలువైన సలహా నిచారు .తాతయ్యలు పాటలతో పద్యాలతో కధలతో చిన్నారులను తీర్చి దిద్దాలి అని చెప్పారు .కళాశాలల్లో తెలుగుకు ప్రాధాన్యం కావాలి అన్నారు .డాక్టర్ పీ.వి.సుబ్బారావు -ప్రపంచీకరణ వ్యామోహం లో మన భాషను మరచి పోవటం సిగ్గు చేటు .1969 లో తెల్లుగు మాధ్యమం లో చదివితే అయిదు మార్కులు అదనం గా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు అమలు జేయక పోవటం విచారకరం ,.అధికార భాషా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయమని డిమాండ్ చేశారు .
శ్రీ పమ్మి పావన్ కుమార్ భాష అంటే సాంఘిక వ్యవస్థ .నిఘంటు నిర్మాణానికి ఆధునిక సాంకేతికను ఉపయోగించుకోమని సలహా చెప్పారు .శ్రీ ముత్తేవి రవీంద్ర నద -తెలుగు భాషకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వున్న విషయాన్ని విపులీకరించారు .బుద్ధుని కాలమ్ లో తెలుగు వాడుకం లో వుండటం దాని ప్రాచీనత కు నిదర్శనం అన్నారు .సభాధ్యక్షులుడాక్టర్ సామల రమేష్ బాబు తెలుగును అభివృద్ధి చేసి mundu తరాలకు అందించే బాధ్యత మన అందరిది అని గుర్తు చేశారు ఇందుకు ప్రజలు ,ప్రభుత్వం రచయితలు సమష్టి గా చేతులు కలిపి ముందడుగు వేయాలని సూచించారు .సభలో పాల్గొన్న వక్తలందరికి శ్రీ లక్ష్మి ప్రసాద్ సత్కారం చేశారు .
సాయంత్రం కాశీనాధుని నాగేశ్వర రావు వేదికపై ”సాహిత్య పత్రికలు -రేపటి మనుగడ ”అనే విషయం పై అయిదవ సదస్సు జరిగింది .ముందుగా వివిధ ప్రముఖ రచయితలు రాసిన పడి పుస్తకాలను శ్రీ లక్ష్మి ప్రసాద్,శ్రీ బుద్ధ ప్రసాద్ లు ఆవిష్కరించారు .
వేదిక మీదకు వివిధ పత్రికా సంపాదకులను,చానెళ్ళ అధిపతులను బుద్ధ ప్రసాద్ ఆహ్వానించారు .ముందుగా ఆంద్ర ప్రభ సంపాదకులు శ్రీ విజయ బాబు తెలుగు నవనీత సమానం .కమ్మని అజంత భాష .అయిన నీలి నీడలు కమ్ముతునాయి విమర్శను సహృదయం తో స్వీకరించి ముందుకు సాగాలి .మేధావులు ,మహనీయులు ఇకనుంచైనా మౌనాన్ని వదిలి తమ కాలం అనే కరవాలానికి పని చెప్పి జాతిని ఉత్తేజితం చేయాలని అభిప్రాయ పడ్డారు .
యెన్.టి.వి .కి చెందిన శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు -మనుషుల లోని మానవత్వం మంట కలిపి ,మానసిక ఆందోళనకు గురి అవుతున్న వారికి స్థైర్యం కల్పించి ,మానసిక దౌర్బల్యాన్ని పోగొట్టాలని అమృతం లాంటి తెలుగును చిన్నారులకు నేర్పుతూ బ్భాషను దక్కించుకోవాలని ఉద్వేగం గా మాట్లాడారు .సురభి పత్రిక సమాదకులు శ్రీ రాజా శుక -తెలుగును కాపాడాల్సిన బాధ్యత తలి దండ్రుల మీదే ఎక్కువగా వుంది అనారు .నేటి విద్యల కోసం తెలుగును వదులు కోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు .చినుకు మాస పత్రిక సంపాదకులు శ్రీ నండూరి రాజా గోపాల్ సాహిత్య పత్రికలను ప్రజలు ,ప్రభుత్వమాదరించాలని ,ఉత్తమ విలువలతో ప్రబోధాత్మక రచనలు చేయమని రచయితలను కోరారు .పత్రికలకు ప్రాంతీయత ఆపాదించా వద్దు అని గట్టిగా చెప్పారు .భావ వీణా సంపాదకులు శ్రీ కల్లా కృష్ణా రావు రచన లోసత్తా వుంటే అన్ని కాలాలల లోను ఆదరణ ఉందన్నారు .నది మాస పత్రిక సంపాదకులు శ్రీ జలదంకి ప్రభాకర్ తమ పత్రిక అత్యంత విలువైన పారితోషికం తో రాబంద్ అ రచనను ప్రోత్చాహిస్తున్నామని తెలియ జేశారు .నెలవంక -నెమలీక సంపాదకులు శ్రీ వి .శ్రీ రాములు నేటి సమాజం లో ఉదాత్తత తో పత్రిక సేవ చేసే మహానీయులున్నారని ,దానిని సద్వినియోగ పరచుకొని మాత్రుభాశాభివ్రుద్ధికి కృషి చ్యాలని సూచన చేశారు .
కావ్య సమీక్ష సంపాదకులు శ్రీ మోడు రాజేశ్వర రావు -కేవలం సమీక్షల కోసమే తాము పత్రికను నడుపు తున్నామని ,సద్వినియోగం చేసుకోమని భాషను భావి తరాలకు అందించేది అమ్మ అని అందుకే మాత్రు భాష అంటే అమ్మ సేవే అన్నారు .శ్రీ ది .వి ఆర్..నరసింహారావు -ఒక రూపాన్ని పద్యం ద్వారా చెప్పగల భాష మనది అని పద్యాత్మక వివరణ నిచ్చారు .భావ తరంగిణి సంపాదకులు శ్రీ భవిష్య -సాహిత్య పత్రికల మనుగడ ప్రశ్నార్ధకం కావటం శోచనీయం ,సహృదయులు అండగా నిలవాలని భావ ప్రకటన చేశారు చివరిగా మాట్లాడిన శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ -నేటి సమాజ దుస్థితిని కొన్ని శతాబ్దాల క్రిందటే ఊహించి శేషప్ప శతకం రాశాడని ,పద్యాన్ని చినప్పతినుంచే పిల్లలకు నేర్పితే తేలిగ్గా అలవడుతుందని చక్కని సూచన చేయటం తో సభా తన ప్రాచుర్యాన్ని నింపుకొన్నది .పాల్గొన్న ప్రముఖులు అందరికి ,శ్రీమతి నన్నపనేని రాజకుమారి శ్రీ బుద్ధ ప్రసాద్ ,లక్ష్మి ప్రసాద్ లు సముచిత సత్కారం చేసి కృతజ్ఞతలు తెలియ జేశారు .
ఈ నాటి చివరి సభా” కొమర్రాజు లక్ష్మణ రావు ” వేదిక పై సాహిత్య సంస్థల ప్రతినిధుల సమావేశం గా జరిగింది .ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ బి.హనుమా రెడ్డి -ప్రజలకు ప్రభుత్వానికి సాహిత్య సంస్థలు వారధి గా పని చేస్తున్నాయి .అన్నారు .గజల్ శ్రీనివాస్ కమ్మని గజల్లు పడి సందేశం అందించారు .కడప జిల్లా అధ్యక్షులు శ్రీ జింకా సుబ్రహ్మణ్యం ,చిత్తూర్ కు చెందిన శ్రీ టంగుటూరి మెహబూబ్ ,పశ్చిమ గోదావరి కి చెందిన శ్రీ నున్న అన్జారావు ,కృష్ణా కు చెందిన శ్రీమతి కోకా విమల కుమారి తమ జిల్లాలలో జరిగే కార్యక్రమాలను తెలియ జేశారు .యువభారతి అధినేత శ్రీ మాడభూషి అనంతా చార్యులు తమ సంస్థ చేసే సేవలను వివరిస్తూ ,తాము నిర్వహించే కార్యక్రమాలలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వారంతా తెలుగు లోనే మాట్లాడు తారని హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .తెలుగు రధం సంపాదకులు శ్రీ కొంపెల్ల శర్మ సంస్థలో సభ్యత్వం ముఖ్యం కాదు ,సభ్యతా పూర్వక కార్యక్రమాలు ముఖ్యం సంస్థలు చేసే సత్కారాలను అర్హులైన వారికే చేయాలని కాలోచితమైన సలహానిచ్చారు .
జనసాహితికి చెందిన శ్రీ దివి కుమార్ ఆంగ్ల భాషకు దాసోహం కావద్దని అయితే విశాల దృక్పధం కలిగి వుండాలని కోరారు .గుంటూరు జిల్లా కు చెందిన శ్రీ జానీ బాష తెలుగు వారు ఖచ్చితం గా తెలుగు లోనే సంతకం చేయాలని,మార్పు మనతోనే ప్రారంభం కావాలని సముచిత సూచన చెసిఆదర్శమ్ వైపుకు దృష్టి ని మరల్చారు .
అనంతరం ప్రముఖ కవి రచించిన ”కవిత్వం ఒక సామాజిక స్వప్నం”అనే కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది .
రాత్రి ఏడు గంటలకు స్వర్గీయ” వేగుంట మోహన ప్రసాద్ వేదిక ”పై ప్రతినిధుల కవి సమ్మేళనం డాక్టర్ శ్రీమతి రేజీనా గారి ఆధ్వర్యం లో కమనీయం గా అర్ధ రాత్రి వరకు జరిగింది .సమాజ హితమైన రచనలు చేసి కవులంతా తమ కర్తవ్యాన్ని నెర వేర్చి సమాజాన్ని జాగృతం చేశారు .
రెండవ రోజూ సభలు అత్యంత నిబద్ధత తో నిర్మాణాత్మక మైన సూచనలతో దిశా నిర్దేశం గా జరిగి అందరికి ఆనందాన్ని పంచాయి