ప్రపంచ తెలుగు రచయితల మహా సభల సమీక్ష
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో ,ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ ,మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం ,న్యు ధిల్లీ లోని సాహిత్య అకాడెమీ వారి సౌజన్యం తో ”ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు 13 -08 -11 నుండి 15 -08 -11 వరకు విజయవాడ లో జరిగాయి 13 వ తేదీ శనివారం ఉదయం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్ర ప్రాంగణం లో ”తెలుగు తల్లి ” విగ్రహాన్ని పద్మ భూషణ్ ,శ్రీ సి .నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించటం తో సభలు ప్రారంభమయి నాయి .ప్రారంభ సభా వేటూరి సుందర రామ మూర్తి సభా ప్రాంగణ వేదిక పై జరిగింది .”చరిత్ర ,సంస్కృతి ,సాంకేతికత -రేపటి అవసరాలు ”నేపధ్యం గా ఈ సభలను నిర్వహించారు .వేలాది ప్రతినిధులు ,తెలుగు భాషాభిమానులు పాల్గొని నిండుదనం తెచ్చారు .ఈ సభల గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు .ఆయన తన ప్రసంగం లో దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులందరికీ ధన్య వాదాలు తెలియ జేశారు .తన ఆరోగ్యం కంటే తెలుగు భాష ఆరోగ్యమే ముఖ్యం గా భావించి ,అనారోగ్యాన్ని లెక్క చేయకుండా నారాయణ రెడ్డి గారు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .అలాగే తెలుగు భాష కు తమ పత్రికలు, చానెళ్ళ ద్వారా విశేష కృషి చేస్తున్న ఈనాడు గ్రూప్ చైర్మన్ శ్రీ రామోజీ రావు ను అభినందించారు .తెలుగు భాష కోసం ,ఇంతమంది ఆవేదన చెంది పరితపించి భాషను కాపాడుకోవా టానికి వచ్చిన వారందరికీ ఆహ్వానం పలుకుతూ వారంతా సైనికులు లాగా పని చేయాలని కోరారు .పదిహేడు కోట్ల మంది మాతృభాష తెలుగు అనీ ,కాని దాని ప్రగతి ప్రశ్నార్ధ కం గా మారటం విచారకరమని ,దిశా నిర్దేశం లేకుండా పోయిందనీ ప్రపంచీకరణ లో తెలుగు ఉక్కిరిబిక్కిరి అయిపోయిందనీ ,ఈ సమయం లో మనం చైతన్య స్ఫూర్తిని కల్గించక పోతే భవిష్యత్తు మనల్ని క్షమించదనీ అన్నారు .రచయితలు అందరు బాగా ఆలోచించి దిశానిర్దేశం చేయాలని సూచించారు
— కార్యనిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లక్ష్య ప్రస్తావన చేశారు .2007 లో జరిగిన మొదటి సభలలో తెలుగు రచయితలన్దర్నీ ఒకే వేదిక మీదకు రప్పించటం లో కృత క్రుత్యులయామనీ ,తెలుగును తల్లిభాష గా చేసేందుకు మంచి ప్రయత్నం చేశామనీ ,చైతన్య యాత్రలు జరిపి తెలుగు కు ప్రాచీన హోదా సాధించామనీ ,ఆ తరువాత ముందుకు అడుగు వేయలేదని అన్నారు .తెలుగు సంస్కృతి తగ్గిపోయింది .రచయితలు దిశా నిర్దేశం చేయాలని,పాఠాశాలలో తప్పకుండా తెలుగును బోధించాలనీ ,రేపటి తరం సాంకేతికం గా పురోగమిస్తుందనీ ,దానికి తగ్గట్టు గా మనం తయారవాలనీ మన భాషను విశ్వ వ్యాప్తం చేయాలని దిశా నిర్దేశం చేశారు
జ్ఞాన పీథ పురస్కారగ్రహీత ,పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు .ఇతరదేశాలనుంచి ,ఇతరభాషా రచయితలు రావటం శుభ సూచకం అన్నారు .శాతవాహనుల కాలమ్ లోనే అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఏళ్ళ నాటికే తెలుగు భాష వున్నట్లు కరీం నగర్ జిల్లా కోటిలింగాల వద్ద లభించిన శాసనాలు ,నాణాలు వల్ల తెలుస్తోంది .మెదక్ జిల్లా కొండాపూర్ లో టంక శాల వుండేది .ప్రాకృత కావ్యం గాదా సప్తశతి లో పాడి ,కొట్టం ,చోద్యం వంటి తెలుగుపదాలున్నాయి .”సుందర తెలుంగు ”అని తమిలకవి సుబ్రహ్మణ్య భారతి ప్రశంసించిన భాష తెలుగు .విదేశీ యాత్రికుడు నికోలాకొంటీ విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించి అక్కడ తెలుగు అమలు అవుతున్న తీరును చూసి ముగ్దుదయాడు .ఇప్పుడు ప్రసారమాధ్యమాలలో ,ఆంగ్ల వాడకం పెరిగింది .తెలుగు మాధుర్యం వున్న అజంత భాష .గాంధీజీ రోజూ డైరీ రాసేవారు .తాను దాన్ని”గాన్దేయం”అన్న పేరుతొ తెలుగు చేశాననీ ,అందులో మహాత్ముడు ”మాతృభాషా తిరస్కారం -మాతృదేశ తిరస్కారమే ”అన్న మాట మనం గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు .ఆంగ్లకవి ఈట్స్ ప్రతినాగారకజాతి తన మాతృభాషలోనే మాట్లాడుతుందని తెలియజేశాడని ,భాషాపండితుడు హాల్డేన్ తెలుగుకు జీర్ణశక్తి ఎక్కువ అని ఇతరభాషా పదాలను తనలో చక్కగా ఇముడ్చుకోన్నదని మెచ్చినట్లు చెప్పారు .తెలుగును ప్రాధమిక స్థాయినుంచి పాతశాలల్లో బోధించాలని కోరారు .”మన మాత్రు భాష తెలుగు -మన రక్త ఘోష తెలుగు ”అని కవితాత్మికం గా చెప్పారు .రచయితలందరూ సామూహిక స్వరం తో ప్రభుత్వానికి అర్ధవంతమైన నివేదిక ఇచ్చి తోడ్పదవలసినడిగా కోరారు .
ఈనాడు గ్రూప చైర్మన్ శ్రీ రామోజీ రావు -ఈ సభల సందర్భం గా 126 మండి లబ్ధ ప్రతిస్తులైన రచయితల రచనలతో ప్రచురించబడినబృహత్ గ్రంధం ”తెలుగు పున్నమి ”ని ఆవిష్కరించారు .రామోజీ రావు తమ ఉపన్యాసం లో తెలుగు గడ్డ మీద పుట్టటం మన అదృష్టం .సంస్కృతి ,సంప్రదాయం ,జీవన విధానం ,కట్టుబాట్లకు భాష ప్రతిబింబం .మాతృభాష లో విద్యనేర్వటం తేలిక .సామాజికం గా ,ఆర్ధికం గా భాష ఉపయోగ పడాలి .సంస్కృతి తో భాష జీవకళ తో ఉట్టిపడుతుంది .నెహ్రు పండితుడు కోడా పాలనాభాష గా మాతృభాష వుండాలని కోరిన సంగతి గుర్తు చేశారు .యాస భాషకు బలం అన్నారు .జనభాష కావాలి .అవగాహన ,ప్రేమ ల వల్ల , భాష బలపడుతుంది నిజమైన భాప ప ల్లెల్లో నే వుంది .భాష ,సంస్క్రుతులే మన ఆస్తులని వాటిని జాగ్రత్త గా కాపాడుకోవాలని సూచించారు .తాము అందరు ఈ సభా లక్ష్యానికి పూర్తి మద్దతునిస్తామనీ తెలుగుభాష కొత్త పుంతలు తోక్కాలనీ నిర్దిష్ట కార్యాచరణ తో పధకాన్ని రూపొందించి ,అమలు జేసేందుకు రచయితలు కృషి చేయమని కోరారు . తర్వాత ”తెలుగు వెన్నెల ”సావనీర్ ఆవిష్కరణ జరిగింది
శాంతాబయోటేక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.యి .వర ప్రసాద రెడ్డి ప్రసంగిస్తూ ,ప్రాచీన భాషా హోదా నిలబెట్టుకోవాలి .జనాభాకు తెలుగు పాథకులకు నిష్పత్తి విలోమం గా వుండటం బాధాకరం .దృశ్యమాధ్యమ ప్రభావం వల్ల పుస్తక పథనం తగ్గిందని ,యువత కు అవసరమైన రచనలు చేసి వారిని తీర్చి దిద్దాలని కోరారు .ఆశావాదం వైపు వారిని మల్లించాలి .సెన్సేషన్ నుంచి పాజిటివ్ దృక్పధం లోకి మార్చాలి .ఆత్మస్థైర్యం కలిగించాలి .అంతస్చేతనాను మేల్కొల్పాలి .భాష నాశనం అయితే సంస్కృతి వినాశనం అవుతుంది .విద్యార్ధులు పుస్తకాలు చదివి గోష్టిలో పాల్గొనే టట్లు చేయాలి . ”తెలుగు అంటే ఆమని –నిరంతర సౌదామిని ”అని కవితాత్మకం గా ప్రసంగం ముగించారు .
కేంద్ర సాహిత్య అకాడెమి కార్యదర్శి శ్రీ అగ్రహారం కృష్ణ మూర్తి తాను తెలుగు దేశానికి చెందిన వాడినేనని కన్నడ ప్రాంతం లో వుండటం వల్ల తెలుగు మాట్లాడ లేనని తెలుగులో ప్రారంభించి ఆంగ్లం లో ప్రసంగించారు .కన్నడ ఆచయితలే ”తెలుగు తేట ”అని ప్రశంసించారని ,తెలుగుకు ,కన్నడానికి చాలా మంచి సంబంధాలున్నాయని అకాడమి తరఫున అన్ని భాషల రచయిత లను పాల్గొనే టట్లు చేశామని ,భాషే అన్నిటి కంటే గొప్పది అన్నారు .తెలుగు అంతర్జాతీయ కీర్తి పొందిన భాష . తెలుగు లోని అభ్యుదయ వాదం ఇతరభాష లను ప్రభావితం చేసిందని తెలియ జేశారు .,
ప్రసిద్ధ ఉర్దూ కవి ,ఇక్బాల్ పురస్కార గ్రహీత –శ్రీ షీన్ కాఫ్ నిజాం ధర్మార్ధ కామ మోక్షాలు లేని రచనలు పనికిరావు అన్నారు .”Poetic language is the inner language of the poet ”అని తెలియ జేశారు
సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ స్వర్గీయ ముక్కామల భూషణం గారి సి.డి .లను ఆవిష్కరించి ముక్కామల శత జయంతిసంవత్చరం లో ఇలా ఆవిష్కరించటం తన అదృష్టం అన్నారు .రచయితలు భాష కువెంనేముకలనీ ,ఈ సభల తర్వాత కూడా ఈ స్ఫూర్తి తో పని చేయాలని సూచించారు .తెలుగు కధానిలయం సంస్థాపకులు,ప్రసిద్ధ కధా రచయిత శ్రీ కాళీపట్నం రామా రావు -తెలుగు కలుషితం అవుతూండటం బాధాకరమని ,ప్రసారమాధ్యమాలు భాషా కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు .ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కే.శ్రీనివాస్ -తెలుగు నిఘంటువును ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని ,దీనికోసం ప్రత్యెక ,శాశ్వత వ్యవస్థ వుండాలని సూచించారు .
ఈ ప్రారంభ సభకు అతిధులను కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాక్టర్ జి .వి .పూర్ణ చంద్ వేదిక పైకి ఆహ్వానించారు అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బా రావు మాట్లాడుతూ ,మొదటి ప్రపంచ రచయితల సభలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయనీ ,ఇప్పటి సభలు అంతర్జాలం తో అనుసంధానం జరిగి ,తెలుగు విశ్వ వ్యాప్తమై వెలగాలన్న ఆకాంక్ష తో నిర్వహిస్తున్నామని తెలియ జేశారు .వేదిక పై పద్మ్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ,శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ,డి.ఏం.ఆర్.శేఖర్ ,డెట్రాయట్ నుంచి వచ్చినడాక్టర్ ముక్కామల అప్పా రావు ,శాసనమండలి సభ్యులు శ్రీ ఐలాపురం వెంకయ్య ,జోర్డాన్ నుంచి విచ్చేసిన శ్రీ రమేష్ ,శ్రీ ఇమ్మడిసేట్టి రాం కుమార్ వంటి ప్రముఖులు ఆసీనులై వేదికకు ,సభకు, నిండుదనం తెచ్చారు .
రేపటి మనుగడకు ,రేపటి పరిస్థితుల పై దృష్టి పెట్టి నిర్వహిస్తున ఈ సభలు ఉచ్చాహభారిత వాతావరణం లో ప్రారంభమై ,తెలుగు భాషా ,సంస్కృతి లను పరి రక్షించు కోవాలన తపన అందరిలోనూ కన్పించించి ,కర్తవ్య దీక్ష కు పూనుకోవాలి అన్న సందేశం ధ్వనించింది ,ప్రతిధ్వనించింది