ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —6
కంప్యుటర్ లింగ్విస్ట్ కు జీవితాని అంకితం చేసి పని చేస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు -భాషకు సామర్ధ్యం జోడించాలి .అని రంగాల్లో తెలుగుని వాడాలి అప్పుడే మనగలుగుతుంది మనది అవుతుంది పాలిసి మేటర్ గా తెలుగును అన్నిటా ఉపయోగించాలి .దీనికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి .ఏ లిపి లోనైనా తెల్గు చదువుకొనే ఆలోచనా చేశాం .ఇదే ”విశ్వ సంకేత మాలిక ”.తెలుగు పడ విశ్లేషిని ఏర్పాటయింది .సంక్లిష్ట రూపం లో వున్న తెలుగును సరళ తరం చేస్తున్నాం .ఈ ఏర్పాటు ఏ భారతీయ భాషకు లేదు .”తెలుగు పడ జనకం”తయారు చేశాం .తెలుగు రాణి వాళ్ళు కూడా తెలుగు పదం సృష్టించుకో వచ్చు .”తెలుగు పదవిభాగ నిధి ”తయారు చేశాం .రెండు లక్షల పదాలు ఇందులో వున్నాయి .ఇది పడ విశ్ల్షణ చేసే విధానం .”పడ సత్వ నిరోపనం ”వచ్చింది .సంధి విచ్చేదకం ,బహుభాషా నిఘంటువు లు తెచ్చాం.తెలుగు పర్యాయ పడ కోశం చేశాం .వీటి అన్నిటి ద్వారా యంత్రానువాదం చేయటానికి మార్గం తేలికయినది .దీనిపై ఇంకా కృషి చేస్తే పరిపూర్ణత సాధించ వచ్చు .పాణినీయం ఆధారం గానే అన్నీ జరుగుతున్నాయని హర్శధ్వానాలమధ్య తెలియ జేశారు .కంప్యుటర్ శక్తి అనంతం అన్నారు .బాలవ్యాకరనానికి అది వ్యాకరణం సృస్తిన్చాము అని ఇది ఒక అపూర్వ ప్రయోగం విప్లవం అన్నారు .ఉమమహేశావర రావు గారి ఉపన్యాసం ఆసాంతం ఆ కట్టు కొంది .పులకించిన ప్రతి నిధులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలియ జేయటం ఆ మహానుభావుని విజ్ఞానానికి ఘనమైన అభినందనం .
ప్రసిద్ధ పండితులు కవి ,రచయితఆచార్య శలాక రఘునాధ శర్మ -తెలుగు భాష లో మనము ,అమ్మ అనే రెండు పదాలు వుండటం అదృష్టం .అమ్మ అనే మాటలో సర్వ వాజ్మయం నిక్షిప్తమై వుంది అని గొప్ప భావాన్ని అందించారు .శ్రీ కాలనాధభట్ట వ్వీర భద్ర శాస్త్రి కాగితం వాడకం తగ్గి కంప్యుటర్ వాడకం హెచ్చటం గొప్ప మార్పు అని అభిప్రాయ పడ్డారు .64 కళలు .కాం సంపాదకులు శ్రీ పాలెపు కళాసాగర్ -తాము లలిత ,చిత్రకళలు ,నాటకం పైన మంచి సంచికలు తెచ్చామని ,చెప్పారు .రమణీయ ఫాంటు సృష్టి కర్త
శ్రీ అంబరీష ఉచితంగా తమ ఫాంటును ఆదిత్య ఫాంట్.కాం ద్వారా ప్న్దవచ్చునని తెలియ జేశారు .తన మేనమామ ప్రముఖ కవి విమర్శకులు స్వర్గీయ మిరియాల రామ కృష గారి ”ఇంచక్కటి తెలుగు వదలి -ఇంకో భాష ఎందుకురా –భలే తెలుగు బంగారం లాంటి తెలుగు ”కవితను చదివి ఉత్తేజితులను చేశారు .
సభా సమన్వయ కర్త శ్రీ కూచిభొట్ల ఆనంద్ చక్కని సమన్వయము చేసి అమ్రుతానందాన్ని పంచారు .తెలుగు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు .తెలుగు విశ్వ వ్యాప్తమై ,అంతర్జాలం తో అందర్నీ చేరి ,ప్రపంచం లోనే మొదటి స్థానం పొందుతుందని తెలుగు భాష చిరంజీవి అని ,విశ్వ భాష గ త్వరలోనే గుర్తింపు తెచ్చుకొంటుందనీ ఆశాభావం తో అందరి కరతాళ ధ్వనులు అందుకొన్నారు .సభలో ప్రతిస్పందనను తెలియ జేయమని కోరారు ”.ఈ సదస్సు అర్ధవంతమైన ,ప్రయోజన కరమైన ,ప్రయోగాత్మకమైన ప్రామాణిక మైనసదస్సు అనీ ఈ తరం వారికీ భవిష్యత్ తరాల వారికి అత్యంత అవసరమైన సభ అనీ ఇందులోపాల్గొన్న యువ సాంకేతిక నిపుణులు అభినందనీయులని తెలుగు చిరంజీవి అనే నమ్మకం కలిగించినందుకు అందరికి అభినందనలు”అని గబ్బిట దుర్గా ప్రసాద్ తమ ప్రతిస్పందన తెలియ జేయ గానే అందరూ ఆమోదం తెలిపారు .