ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు —సమీక్ష –5
65 వ భారత స్వాతంత్ర్య దినోతవంసందర్భం గా 15 -08 -11 సోమవారం ఉదయం ఎస్.వి .ఎస్.కళ్యాణ మండప ప్రాంగణం లో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ జరిపారు .ఆ తర్వాత ”మా కొద్దీ తెల్ల దొరతనం ”అని జాతీయ స్ఫూర్తిని కలిగించిన తొలి జాతీయ కవి స్వర్గీయ ”గరిమెళ్ళ సత్యనారాయణ వేదిక ”పై స్వాతంత్ర్య దినోత్చవ సభ వైభవం గా జరిగింది .మూడవ రోజూ ,ఆఖరి రోజూ అయిన ఈ రోజూ ”జాతీయతా భావం -రచయితల పాత్ర ”అనే అంశం పై సభ జరిగి జాతీయ స్ఫూర్తిని కలిగించింది .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించినిర్వహించారు .అధ్యక్షోపన్యాసం లో రచయితల సభలు స్వాతంత్ర్య దినోత్చావం నాడు ముగియటం చారిత్రాత్మక మైన సన్ని వేశం అన్నారు .వందే మాతరం తో పాటు జాతీయ గీతాలను శ్రీమతి భూదేవి శ్రావ్యం గా ఆలాపించి దేశభక్తిని కలిగించారు .కొందరు కవులు ,గాయకులూ ప్రబోధ గీతాలను పాడిఉత్తేజం కల్గించారు . తమ అభిభాషణం లో శ్రీ బుద్ధ ప్రసాద్ -మహామహుల త్యాగ ఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నా స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు .ఆ తరం లోని కవులు గరిమెళ్ళ ,చిలకమర్తి ,గురజాడ ,రాయప్రోలు ,దామరాజు పుండరీకాక్షుడు తమ గీతాలతో జాతీయ చైతన్యం కల్గించారు .ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ప్రజల్ని జాతీయ ఉద్యమం వైపు నడిపాయి .మన తాలి రాజకీయ ఖైది గాడిచర్ల హరి సర్వోత్తమ రావు అని జ్ఞాపకం చేశారు .శ్రీ అరవిందుల జన్మ దినం నాడు స్వాతంత్ర్యం రావటం ఆనంద దాయకం .భారతీయ స్వాతంత్ర్య పోరాటం లో తెలుగు వారి పాత్ర గణనీయం .జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారు తెలుగు వారు అవటం మనకు గర్వ కారణం .ఆ నాటి ఉద్యమ ధ్యేయం మాతృభాష లో విద్యా బోధన .ఇప్పటికీ ఆ కోరిక తీరక పోవటం దురదృష్టం .మొదటి ప్రధాని నెహ్రు సాహిత్య వ్యాప్తికి అకాడెమీలు స్థాపించి తన దార్శనికతను నిరూపించారు .ఇవాళ అవన్నీ అంతరించాయి .వాటి పునరుద్ధరణ తక్షణ కర్తవ్యమ్ .సంస్కృతీ సంపదను పరి రక్షించు కోవాలి .సమాజాన్ని సమైక్య పరచాలి అన్న అ నాటి నాయకుల ,పాలకుల దూర దృష్టి ని ఇప్పటి వారు అలవరచు కోవాలి .రచయితలు విశ్వ జనీన దృక్పధం తో రచనలు చేయాలని ,విశ్వ శ్రేయస్సే ధ్యేయం కావాలని ఉద్వేగం గా ఉత్తేజం గా తమ ప్రసంగాన్ని ముగించి స్వాతంత్ర్య దినోత్చవ వేడుక రోజున గొప్ప స్ఫూర్తి కల్గించారు
ప్రముఖ హిందీ రచయిత్రి,సంఘ సేవకురాలు శ్రీమతి ప్రతిభా రాయ్ -మనభాశాలను ,సంస్కృతినీ కాపాడుకొనే కొత్త ఉదయం నడుస్తూందని చెప్పారు .భాషలన్నిటిని గౌరవించాలి .మాతృభాషను మరువ రాదు అని ఉద్బోధించారు ..ప్రసిద్ధ బెంగాలి రచయిత శ్రీ ఇంద్ర naadh చౌదరి –స్వాతంత్ర్యం అంటే సాంఘికం గా అభి వృద్ధి చెందటమే . సాంఘిక స్వేచ్చ ,రాజకీయ స్వేచ్చ తో jatha కలవాలి .యువతరం మన ఆశా దీపం .వారిని మరిచి పోరాడు .తెలుగు రచయితలు చాల మండి తనకు తెలుసుననీ వారంతా గొప్ప జాతెయ భావం కలిగించారని గుర్తు చేశారు .కలకత్తా కు చెందిన ప్రముఖ సంస్కృత ఆచార్యులు శ్రీమతి ఉషా చౌదరి -తనకు ఈ సభలు చూస్తుంటే తెలుగు నేర్చుకోవాలని అనిపిస్తోందని,తెలుగు గొప్ప సంస్క్రుతీవిలసనం కల్గించిన భాష.అన్నారు .భారత అంటే సూర్యుడు ,ప్రకాశం ,జ్యోతి అనే అర్ధాలున్నాయి .ఆ వెలుగులు జాతి లో నింపాలి .రచనల లో ఆ ప్రకాశం కనిపించాలి,వికాసం కలిగించాలి ,పురోగమనానికి తోడ్పడాలని కోరారు .శాసనమండలి సభ్యులు శ్రీ అయిలాపురంవెంకయ్య తెలుగుభాష వికాసానికి ఈ సభలు తప్పక తోడ్పాడుతాయి అని ఆశాభావం ప్రకటించారు .శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ –మనది మహత్తర జాతి .అమెరికా అధ్యక్షులు ఒబామా కు మన గాన్దీజియే స్ఫూర్తి అని ఆయనే ఇటీవల తెలియ జేశారని చెప్పారు .గత అయిదు వేల ప్రపంచ చరిత్ర లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అయిదుగురు ప్రముఖుల్లో ముగ్గురు భారతీయులే అవటం మనకు గర్వ కారణం .ఆ ముగ్గురు శ్రీ కృష్ణుడు ,బుద్ధుడు మహాత్మా గాంధి అని భావ స్ఫోరకం గా తమ ప్రసంగాన్ని ముగించారు .వివిధ భాషా వేత్తలు ఈ సభలో ప్రసంగించి గొప్ప జాతీయ స్ఫూర్తిని కలిగించి చరితార్ధం చేశారు ,
ఈ సభ తర్వాత ఆరవ సదస్సు” సి.పీ.బ్రౌన్ వేదిక ”పై ”సాంకేతికం గా తెలుగు భాషాభివృద్ధి ”అనే అతి ముఖ్యమైన విషయం పై జరిగింది .ఇందులోని చర్చనీయ అంశాలు –”కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలతో తెలుగుభాష ,ఫాంట్లు ,ఉపకరణాలు లిపి వికాసం -ఆధునిక అవసరాలు ” సభా సమన్వయాన్ని అమెరికా లోని సిలికానాంధ్ర కు చెందిన మచిలీపట్నంకు చెందిన శ్రీ కూచిభొట్ల ఆనంద్ కావటం ఆనంద దాయకం గా వుంది .మొదటగా ”రమణీయ ”అనే ఉచిత తెల్లుగు ఫాంట్ ను శ్రీ లక్ష్మి ప్రసాద్ ఆవిష్కరించారు .ఇది చాల కీలకమైన సదస్సు .అందరి దృష్టీ దీనిమీదే వుంది .
తొలి ప్రసంగం లో సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ హర్ష వర్ధన్ తెలుగును మృత భాష గా కాకుండా ,అమృత భాష గా చేయమని సూచించారు .సమన్వయ కర్త శ్రీ ఆనంద్ –తెలుగుకు ప్రపంచ హోదా సాధించాలి .మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాని వాడుకోవాలి .నేడు అంతర్జాలం మానవ నాగారకతను అధికం గాప్రభావితం చేస్తోంది .హారీ పోట్టర్ పుస్తక రచయిత్రి అంతర్జాలం తోనే అంతట్టి ప్రాముఖ్యం పొందింది .తొలి ఇంటర్నెట్ సదస్సు హైదరాబాద్ లో జరిపాం.ఇప్పుడు ”ఈ” పుస్తకాలు విరివిగా వస్తున్నాయి .సిలికాన్ వాలీ కాలిఫోర్నియా లో సెప్టెంబర్ లో ఒక అంతర్జాతీయ ఇంటర్నెట్ సదస్సు నిర్వహించ బోతున్నాం .లక్షలాది పుస్తకాలను నిక్షిప్తం చేసుకొనే పరికరం వచ్చింది ఇది చదువుకోను వచ్చు కావాలంటే చదివి వినిపించుకోనేట్లు చేసుకో వచ్చు .త్వరలో ఆరు అందమైన తెలుగుఫాంట్లు తెస్తున్నాం .అంతర్జాలాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగు భాషకు అంతర్జాతీయ హోదా సాధించటమే మన ధ్యేయం .తెలుగు కొద్ది రోజుల్లో విశ్వ భాష అవుతుంది అని చాలా నిర్దుష్టం గా విశ్వాసం గా ప్రసంగించి ఈ సభ ఆలోచనకు సార్ధకత తెచ్చారు .
తరువాత ప్రసంగించిన శ్రీ అమరనాధ రెడ్డి తెలుగు స్పెల్లింగ్ చెక్కర్ ,ఎడిటర్ ,బ్రౌజర్ లను విడుదల చేసినట్లు తెలియ జేశారు .ఇంటర్నెట్ లో మార్పులకు యూనికోడ్ కన్సార్టియం ఏర్పాటు చేసి ,ఎక్కువ మంది తెలుగు వారు అందులో ఉండేట్లు చేస్తున్నామని చెప్పారు .కృష్ణా విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి శ్రీ మైనేని కేశవా దుర్గా ప్రసాద్ -ఆధునిక సాంకేతికత్వంతో తెలుగు పురోగమిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు .శ్రీ వీవెన్ దృశ్య మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రసంగించారు విండోస్ విస్టా తో మన కంప్యూటర్ లో తెలుగు రాసుకో వచ్చు.mobiles
లో కూడా తెలుగు రాసే అవకాశం వచ్చింది .పుస్తకం చదివి వినిపించే ఏర్పాటు వచ్చింది ‘.ఈ ‘పత్రికలు చాలావున్నాయి .వాటిలో వ్యాసాలు రాయ వచ్చు .”బహుళ భాషా నిఘంటువు” వస్తోంది .మూడు వందలకు పైగా తెలుగు బ్లాగులు వున్నాయి .సాహిత్యం ,రచ్చబండ బ్లాగులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి .”పద్య సుబోధకం ”వుంది ” .గురూజీ ”అనే సెర్చింగ్ బ్లాగ్ ద్వారా ఏవిషయాన్ని అయినా క్షణాల్లో పొందవచ్చు .ఇవన్నీ ఉచిత సేవలే .తెలుగు లోనే కంప్యుటర్ వస్తోంది దీన్నే ”స్థానికీ కరణం ”అంటారు .అన్ని కంప్యూటర్లు అర్ధం చేసు కొనే ఫాంట్ త్వరలో రాబోతోంది .పుస్తకాలని ఈ పుస్తకాలుగా మార్చి అమ్ముకో వచ్చు .ఆన్ డిమాండ్ తో పుస్తకాలుముద్రించుకోవచ్చు అని” కంప్యుటర్ ,అంతర్జాలం ”అనే అంశం మీద సాదికారికం గా .వివరనాత్మకం గా సుబోధకం గా ప్రసంగించి అభినందనలు అందుకొన్నారు .
శ్శ్రీ వెంకట రాం -ఈ పుస్తకాలపై పూర్తి వివరణ ఇచ్చారు.డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో 23 వేల తెలుగు పుస్తకాలు వున్నాయి . మై డాక్యుమెంట్ లో వీటిని దాచుకో వచ్చు .యూనివేర్సాల్.ది.ఎల్.లో 14 వేల పుస్తకాలను వాడుకో వచ్చు .పీ.ది.ఎఫ్ .లో వాటిని దాచుకో వచ్చు .యాభై దాకా యూనిఫైడ్ కోడ్ లున్నాయి .వెబ్ మొబైల్ లో పత్రికలు చదువుకోవచ్చు . ”విద్యానిధి .ఆర్.ఆర్గ్ లో తెలుగు సిద్ధాంత గ్రందాలున్నాయి .”telugu thesis .కం లో అన్ని పరిశోధక గ్రంధాలు లభిస్తాయి .”గూ రీడర్ ”ద్వారా గూగుల్ నెట్ లోని పుస్తకాలు అనే దొరుకు తాయి .ఇతరులకు పుస్తకాలు ఇచ్చి సహాయపదేట్లు చేయ గలుగు తున్నాం .అయితే తెలుగు పుస్తకాలకు డిజిటల్ రైట్స్ మేనేజిమేన్త్స్ వచ్చేట్లు చేయాలి అని సవివరనాత్మకం గా ప్రసంగించారు .
వీకీ పీడియా ను గురించి శ్రీ కిరణ్ మాట్లాడారు .దాన్ని చదవమనీ అందులో రాసి పరిపుష్టి కల్గించమని కోరారు .నలభై వేల పదాలతో నిఘంటువు ఉందనీ ,అందరు సహకరిస్తే దాన్ని ఇంక పెద్ద నిఘంటువు గ చేయ వచ్చునని తెలిపారు .ఇది ఒక మహా విజ్ఞాన సర్వస్వం అని వీకీ ని గురించి చెప్పారు
ఇంతవరకు సాంకేతికం గా జరిగిన సభ విజయవాడ లోక్ సభ సభ్యులు శ్రీ లగడపాటి రాజా గోపాల్ రావటం తో సందడి తో నిండింది .ఆయన తెలుగు మీద మమకారం పెంచుకోవాలని సూచించారు .ఆదరణ పొందాలి తెలుగు అని ఆశించారు .తెలుగు ప్రాధాన్యత ను అందరు గుర్తించాలి ”భారత్తేయత బంధం –తెలుగు అనుబంధం ”అని ,;”భరత మాత పుత్రులలో ఘన పుత్రం తెలుగు ”అని కవిత్వం చదివి అలరించారు .తెలుగుభాష ప్రతి ఇంట ప్రతినోట పలికే టట్లు చేద్దాం అని ఆవేశం గా అన్నారు .లగడపాటిని బుద్ధప్రసాద్ తెలుగుకు ప్రాచీన హోదా నిధులను విడుదల చేయించ వలసిందిగా అభ్యర్ధించగాఆయన సానుకూలం గా స్పందించారు .
లిపి రూపశిల్పి శ్రీ శివరావు తెలుగు భాషకు ఒకే కీ బోర్డు వుండాలని ,అక్షరాని సుందరతరం చేయాలని ,ఏ అక్షరాన్ని తీసివేయ రాదనీ కోరారు మలేషియా కు చెందిన శ్రీ మునిరత్నం నాయుడు -1975 లో ”అంతర్జాతీయ తెలుగు సంస్థ” ఏర్పడిందని,దానికి కారకులు మాజీ విద్యామంత్రి స్వర్గీయ మండలి కృష్ణా రావు గారు అని గుర్తు చేశారు .చైనా జెర్మని ఫ్రాన్సు దేశాల్లో కంప్యూటర్లు ఆయా భాషల్లోనే వున్నాయని ,మనం కూడా తెలుగు కంప్యుటర్ తయారు చేసు కోవాలని మంచి సూచన చేశారు .