ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు –సమీక్క్ష —-7
ముగింపు సభకు ముందు జరిగిన సభలో స్టూడియో యెన్ .అధికారి శ్రీ సాంబశివ రావు–బిడ్డలు తెలుగు తల్లిని కాపాడు కొంటాం అని ఓదార్చే దయనీయ స్థితి రావటం శోచనీయం అన్నారు .ఇప్పుడుమనం ”బాధా ప్రయుక్త రాష్ట్రం ”లో వున్నాం.యాస భూషణమే నన్నారు ..ఒడిస్స లోని బరంపురం లో ఇటీవల తెలుగు మహాసభలను దిగ్విజం గా నిర్వహించిన శ్రీ పూడి పెద్ది సత్య నారాయణ -తమ రాష్ట్రం లో సమస్యల్ని తామే పరిష్కరించు కొంటున్నామని ,తెలియ జేశారు .గుంటూరు కు చెందిన శ్రీ పాపి రెడ్డి తమ అనుభవాలను వివరించారు .జర్నలిజం కళాశాల అధినేత ప్రముఖ పాత్రికేయులు శ్రీ సతీష్ చంద్ర తమ ప్రసంగం లో తెలుగు వారు తెలుగు తక్కువ వారు గా వుండటం బాధాకరం.భాష ఉత్పత్తి సంబంధాల మీద వృద్ధి చెందుతుంది .ఆలోచనా మాధ్యమం ఆంగ్లం గా వుంటే అసలైన తెలుగు రాదు .భాష ప్రజాస్వామీకరణ చెందాలి .గిడుగు రామ మూర్తి గారి తర్వాత భాషోద్యమం చేబట్టిన వారు లేక పోవటం విచారకరం .పామర జనులు వాడే పదాలను పత్రికలను స్వీకరించాలి అప్పుడే భాష పరిపుష్టం అవుతుందని సలహానిచ్చారు .సారం నుంచి భాష రూపం లోకి వస్తుంది .ఉద్యమాలు భాషనూ శాశిస్తాయి .తెలుగు తల్లి నడకను ఆపవద్దు అని కోరారు .అన్ని వర్గాల ప్రజలు మాట్లాడే పదాలు భాషలో చేర్చాలని సూచించారు .ప్రముఖ సిని విశ్లేషకులు శ్రీ పైడి పాల మాటాడుతూ తెలుగు సినిమా భాష ,మాట ,పాట ,పేర్లు తెలుగును భ్రస్టు పట్టిస్తున్నాయని ఆవేదన చెందారు .మేలు కంటే కీడు ఎక్కువ జరుగు తోంది .పాటల్లో ,మాటల్లో ఆశ్లీలాలు చోటు చేసుకోవటం హర్షణీయం కాదు .జాగ్రత్త పడక పొతే భాష తీవ్రమైన నష్టానికి లోను అవుతుందని హెచ్చరించారు .
ముగింపు సభ
ముగింపు సభకు శ్రీ పూర్ణచంద్ అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు .శ్రీ బుద్ధ ప్రసాద్ సభలో చేసిన తీర్మానలనుప్రవేశ పెట్టి చదివి విని పించారు .తెలుగు జాతి పునరుజ్జీవనం అట్టడుగు స్థానం నుంచి చేబట్టాలి .తెలుగు భాషా ,సంస్కృతి సభలు జరపాలి .తెలుగు లోనే అందరు మాట్లాడాలి,మాట్లాడించాలి .ప్రభుత్వం పై ప్రేరణాత్మక మైన ఒత్తిడి తేవాలి .తెలుగును కించ పరిచే వారిని తీవ్రం గా వ్యతి రేకించాలి .ప్రపంచం లోని వివిధ భాషల రచయితల కొస ”ప్రపంచ రచయితల సంఘం”ఏర్పరచాలి .వచ్చే నందన నామ సంవత్చారాన్ని ”తెలుగు భాషా సంవత్చరం ”గ ప్రకటించాలి .తెలుగును పాలనా భాష గా చేయాలి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాదేమిని ,అధికారభాషా సంఘాన్ని పునరుద్ధరించాలి .తెలుగు లో చదివిన వారికి ప్రోత్చాహకాలు అందించాలి .తెలుగు కు మంత్రిత్వ శాఖ ప్రత్యేకం గా వుండాలి .ఈ తీర్మానాలను సభ ఏకగ్రీవం గా కరతాళ ధ్వనులతో ఆమోదించింది .ఇవన్నీ నిర్దిష్ట కాల పరిమితి లో జరగాలని అందరు కోరారు .
అనుకోని అతిధి గా విచ్చేసిన లోక్ సత్తా అధినేత ,శాసన సభ్యులు శ్రీ జయ ప్రకాష్ నారాయణ -భాషను సజీవం గా ఉంచే ప్రయత్నం చేయాలి ,ఇరవై రెండు భాషల సమాఖ్య గా భారత దేశం ఇన్నేళ్ళుగా ఒకటిగా నిలిచి వుండటం గర్వ కారణం అన్నారు .తల్లిభాష వల్లనే బిడ్డ మేధస్సు వికశిస్తుంది .దీన్ని ప్రచారం చేసి అందర్నీ ఒప్పించాలి .భాషా పరిణామ రావాలి .మారుతున్న అవసరాలకు తగినట్లు భాష మారాలి .కన్యాశుల్కం అజరామరం కావ టానికి కారణం సజీవ భాషా ప్రయోగమే నని గుర్తు చేశారు .
హెచ్.ఏం.టి వి .అధినేత కే.రామచంద్ర మూర్తి –జిల్లా పత్రికలలో మాండలీకం బాగా వాడుతున్నారని ,ఇది శుభసూచకం అన్నారు .తెలుగు ,ఆంగ్లం ,అంతర్జాల భాషా ఈ మూడూ అవసరమే నని చెప్పారు .భాషా విస్తరణకు పర్యవేక్షణ వుండాలని సూచించారు .సాక్షి పత్రిక సంపాదకులు శ్రీ కల్లూరి భాస్కరం –కొత్త పదాలకు ప్రామాణికత సాధించాలని అన్నారు .ఆంద్ర ప్రభ సంపాదకులు శ్రీ విజయ బాబు –నూతన శకానికి ఈ సభలు దోహదం చేశాయి అని మెచ్చుకొన్నారు .పద్మశ్రీ తుర్లపాటి కుటుంబ రావు -భాషను ,సంస్కృతినివిచ్చిన్నం చేసే విధానం మంచిది కాదన్నారు .శ్రీ యలమంచిలి శివాజీ -అన్ని ప్రాంతాల రచయితలు ఒక చోట చేరిభాషను గురించి ఆలోచించటం మంచి సంప్రదాయం”.క్రాప్ హాలిడే ”అనే పదం మన రాష్ట్రం లో సంచలనం సృస్తిన్చాతమే కాదు ,ఆంగ్ల భాషలోచేరిందని తెలిపారు .
ఎమెస్కో అధినేత శ్రీ విజయ కుమార్ -సార్వ జనీన రచనలు చేయమని రచయితలకు హితవు పలికారు .”తూర్పున వెలుగు రేకలున్న కాలమ్ లోపశ్చిమాన చీకటి వుంది ”అన్న జర్మన్ రచయిత మాట మరువ రాదు అని గుర్తు చేశారు .ప్రముఖ బెంగాలి రచయిత శ్రీ ఇంద్ర నాద్ చౌదరి మాట్లాడుతూ భాష సాంఘిక అవసరం అన్నారు మాత్రు భాషే . . అభివృద్ధి కి సోపానం .ప్రభుత్వం కాదు ,ప్రజలే భాషను నిలబెట్ట గలరు .భాషలో కొత్త పదాలు చేరటం తప్పదు . పాశ్చాత్య అనుకరణ మంచిది కాదు .ఈ దేశ సంస్కృతిని నిలబెట్టుకోవాలి .జీవించటం ,తర్కించటం లో స్వేచ్చ అవసరం అని అన్నారు .శాసన మండలి సభ్యలు శ్రీ చిగురు పాటి వర ప్రసాద్ –ఇటీవలి కాలమ్ లో భేదాలు లేని రాష్ట్ర స్థాయి సమావేశామీ సభలే అవటం ఆదర్శ వంతం గా వుంది అని హర్హాన్ని ప్రకటించారు .ఓడిస్సా రచయిత్రి పద్మశ్రీ ప్రతిభారాయ్ భాషను వాడక పొతే ప్రమాదం అని హెచ్చరించారు .
ముగింపు సభకు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంద్ర ప్రదేశ్ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ శ్రీగ్రంధి భవానీ ప్రసాద్ తమ సందేశం లో తెలుగు తనం అన్నిటా వర్దిల్లాల్ని ,భాషను తక్కువ చేసి మాట్లాడ రాదనీ ,తెలుగు చిరంజీవి అవటం తధ్యం అనీ ,సంక్షోభాలను నివారించేది భాషేనని ,ఇక్కడి ఈ స్పందన ప్రపంచాన్ని కదిలిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు .సామాన్యుని కోసం రచనలు చేయమని సూచించారు .సమస్యలను ప్రతిబింబించే రచనలు రావాలని ,తెలుగు అజరామర మైన భాష అని ఆశావహం గా తమ ప్రసంగాన్ని ముగించారు .
మైసూర్ లోని భారతీయ భాషా కేంద్రం అధిపతి శ్రీ ప్రభాకర్ -భాషాభి వృద్ధి ఒక పధకం గా ప్రభుత్వం చే బట్టాలి అని కోరారు .శ్రీ గోళ్ళ నారాయణ రావు -అక్షర రధం క్షేమంగా గమ్యస్థానం చేరుతుందని,కొత్త తెలుగు పలుకుబడులతో తెలుగు పరి పుష్టం అవుతుందని ఆశించారు .శ్రీ రసమయి రామా రావు -సదస్సున్ను జయప్రదం చేసిన అందరకు కృతజ్ఞతలు తెలియ జేశారు .ఇంతమంది ప్రముఖులు వేదిక నలంకరించి సుసంపన్నం చేసి నందుకు కార్యవర్గం కృతజ్ఞతలు తెలియ జేసింది
కార్య వర్గ సభ్యులకు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదు గా జ్ఞాపికలు ,తెలుగు పున్నమి పుస్తకాన్ని అందించి ,శాలువాలతో సత్కరించారు .వాలన్తీర్లందరికి జ్ఞాపికలు అందజేసి ,వారి సేవలను ప్రస్తుతించారు .
మూడు రోజుల పాటు తెలుగు భాషా యజ్ఞం గా ,తెలుగింటి పెళ్లి వేడుక గా ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా సభలు దిగ్విజమయాయి .నిబద్ధత ,సమయ పాలన విస్తృతమైన ఏర్పాట్లు చేసి క్రుతక్రుత్యులయారు .సర్వశ్రీ గుత్తికొండ సుబ్బా రావు ,జి.వి .పూర్ణచంద్ ,మండలి బుద్ధప్రసాద్ ,యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లు సభలను విజయవంతం గా ఆశావహం గా నిర్వహించి నందుకు అందరి ప్రశంశలను అందుకొన్నారు .తెలుగు భాష చిరంజీవి అవుతుందని ,విశ్వ భాష గ వర్ధిల్లుతుందని ,విశ్వ వ్యాప్తం అవుతుందని ఈ సభలు పూర్తి ఆశాభావంను అందరి లోను కల్గించాయి
ఈ మూడు రోజులు సాయంత్రం వేళల్లో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం లో సాంస్కృతిక కార్య క్రమాలను నిర్వహించి కళా సరస్వతికి నీరానాలన్దించారు .శ్రీ గరిక పాటి నరసింహారావు గారి అష్టావధానం ,తెలుగు ప్రశస్తి నృత్య రూపకం ,ఆచంట బాలాజీ నాయుడు గారిమయసభ ,శ్రీ చందు భాస్కర రావు గారి హరికధా ,”తెలుగు భాష నాడు ,నేడు నృత్య రూపకం ,శ్రీ చేగొండి సత్యనారాయణ మూర్తి గారి ”ఆంద్ర ‘ పద్య కవితా వైభవం” ,శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారి ”దేశ భక్త ”ఏక పాత్రాభినయం ,పానుగంటి వారి ”స్వభాష ”ప్రహసనం ”జయహో కృష్ణ దేవ రాయ ”నృత్య రూపకం,శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారి ”వేమన ”పద్య నాటకం ప్రేక్షకులను మధురానుభూతిని కల్గించి చిరస్మరణీయం చేశాయి .
http://turupumukka.blogspot.com/2011/08/blog-post_17.html