శ్రీ కృష్ణ తత్త్వం
శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి .పగలు సప్తమి ,సాయంత్రం అష్టమి వుంటే ఆరోజు జరపటం అలవాటు .సోమ ,బుధ వారం వస్తే చాలా పవిత్రం అని భావిస్తారు .రేపు అంటే సోమ వారం కృష్ణాష్టమి అవటం మన అదృష్టం .ఆ రోజుల్లో అష్టమి తిది తో పాటు రోహిణీ నక్షత్రం కూడా కలిస్తే మహామహిమ గల పర్వ దినం అవుతుంది .శ్రీ వైష్ణవులకుభాద్రపద కృష్ణ పక్షం లో,అష్టమి ,నవమి తో కలిస్తే కృష్ణాష్టమి .రోహిణీ నక్షత్రం కలిస్తే కలియుగ వైకున్తమే నని పద్మ పురాణం లో వుంది .
శ్రీ కృష్ణ తత్త్వం శ్రీమద్భాగవతం లో వ్యాసుల వారు చక్కగా ఆవిష్కరించారు .బ్రహ్మ దేవుడు ఒకప్పుడు ”సృష్టి ఎలా చేయాలి ”అనే సందిగ్ధం లో పడ్డాడు ”.తప ,తప ”అని అశరీర వాణి విన్పించింది .తపస్సు చేశాడు .పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు .ఆత్మ తత్వాన్ని బోధించమని కోరాడు .శ్రీ హయగ్రీవ రూపం దాల్చి నాలుగు శ్లోకాలతో తత్వోపదేశం చేశాడు .అదే భాగవతం .దీనినే ”హయగ్రీవ బ్రహ్మ విద్య ”అంటారు .దీని విస్తరణ ,సారాంశమే భాగవత స్వరూపం .భాగవత తత్త్వం లో వేదాంతుల మాయా సిద్ధాంతం ,సాన్ఖ్యుల ప్రకృతి సిద్ధాంతం ,శైవుల శాక్తేయం ,మీమాంసకుల కర్మ మొదలైన వన్నీ భగవంతుని దివ్య లీలలలో సమన్వయ పరచటం జరిగిందిఅని పాశ్చాత్య పండితులు అభిప్రాయ పడ్డారు . శ్రీమద్భాగవతం భగవంతుని వాజ్మయ అవతారం అన్నారు శ్రీ రామ కృష్ణ పరమహంస .నారదీయం లో సకల వెద సారం వుంది అని ప్రముఖుల అభిప్రాయం .భగవత్ స్వరూప మైన ఈ ప్రపంచ సృష్టి రూపాన్ని వివరించేది ,అంటే భక్తుల ను గూర్చి వివరించేది భాగవతం అని విజ్ఞుల భావన .
శ్రీ కృష్ణుడు బ్రహ్మం యొక ఆనంద స్వరూపం .ఆయన లీల,మధురిమ వల్ల సృష్టి అంతా జరిగింది అని శ్రీ అరవిందుల అభిప్రాయం ”.నిత్య సత్యానంత అమర లీలయే ఆయన .వేణు గానం లో మానవుని లోని అజ్ఞాన మాయమైన క్రీదారూపాన్ని మార్చి ,దానిలో తన స్వీయ దివ్య ఆనందం యొక్క లీలా విలాసాన్ని నింపుతాడు .రాధ ,భగవంతుని విశుద్ధ ప్రేమ యొక్క మూర్తీ భావం .అదిసంపూర్ణం,సమగ్రం .–ఆత్మ ప్రదానానికి ,సంపూర్ణ నివేదనకు సంకేతం”అంటారు శ్రీ అరవిందులు .
” గోపా ”అంటే ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పాలించే వారు ”అని వారి భాషణం .వారిలో ఆధ్యాత్మిక అనుభవం వుంది .ప్రేమ ,భక్తి ,ఆత్మదానం గల అసాధారణ జీవులుగా భావిస్తారు గోపికలను .గోలోకం లో ప్రేమ ,సౌందర్యం,ఆనందం గల దివ్య ప్రపంచం ఆధ్యాత్మిక ప్రభలతో వెలుగుతుంది .గోపి ,గోప రూపాలైన ఆత్మలు ఆ ప్రభలను కాపాడుతాయి .రాధ ప్రాకృతిక ఆత్మ .కృష్ణుడు భగవదాత్మ .
ఒకప్పుడు ఇంద్రుని భార్య శచీదేవి విష్ణు లోకానికి వెళ్లి ఆయన తోడ పై కూర్చోవాలని కోరిక తెలిపింది .”నువ్వు భూలోకానికి వెళ్ళు .నేను కృష్ణుడు గా పుట్టి నీ కోరిక తీరుస్తాను .’అని చెప్పాడు .వ్రజ భూమి లో వ్రుషభానునికి ,కళావతి కి రాధ జన్మించింది .కృష్ణునికి ఆమె మేనత్త .కృష్ణుడు గో లోకం లో వున్నప్పుడు ”రాసము నుండి,ఆతనిప్రక్కనుండి ,పరిగెత్తింది ”అంటే ”రాసంబు నుండి పుట్టి హరి ఎదుట ధావనము చేసింది ”కనుక రాధ అయింది .రాధ శరీర రోమ కూపాలనుండి గోపికలు జన్మించారు .కృష్ణుడు అంటే సర్వం చేశే వాడు ,చిత్తాన్ని ఆకర్షించే వాడు .రాదా కృష్ణులు ప్రేమైక జీవులు .కృష్ణ వర్ణం” నీలం ”.సముద్రం ,ఆకాశం అనంతమైన నీల వర్ణం కలవి .అనతత్వానికి ప్రతీకయే నీల వర్ణం .వజ్రనీలం ఆతని తేజస్సు .
అవతారం పరిణామానికి ప్రతీక గా శ్రీ అరవిందులు భాష్యం చెప్పారు .జలం లో మాత్రమే సంచరించేది మత్యావతారం .ఉభాయచరం కూర్మావ తారం .భూచరం వరాహావతారం .పశు మానవ కలయికే నారశింహ అవతారం .పొట్టి మొదటి మానవుడే వామనావ తారం .అది భౌతికత ,లోపలి భగవత్ తత్త్వం వుండటం తో ప్రపంచాన్ని ఆక్రమిన్చేవాడు .రాజసిక .ర్రజషిక రూపం పరశు రాముడు .సాత్విక రూపమే శ్రీ రాముడు .శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక వికాసం యొక్క చివరి రూపం ”.సూపెర్ మైండ్” అంటే శ్రీ కృష్ణుడే .బుద్ధుడు నిర్వాణం ,విమోచనం కల్పిస్తాడు .ఉత్కృష్ట రాజ్యాన్ని భూమి పైకి తెచ్చి ,ప్రతిఘటించే వారిని సంహరించి ,లోపాల్ని సరిదిద్దే వాడే కల్కి అవతారం .ఈ విధం గా ఊర్ధ్వ క్రమం లో క్రమ పరిణామ దశలు కన్పిస్తాయి .శ్రీ క ఆనంద మయుడై ,ఆనంద దిశ గా నడిపే వాడే శ్రీ కృష్ణుడు .
”ఓం సచ్చిదానంద రూపాయ -క్రిష్ణాయాక్లిష్ట కర్మనే –నమో వేదాంత వేద్యాయ-గురవే బుద్ధి సాక్షినే ”
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -08 -11 .