అవినీతి వ్యతిరేక ఉద్యమం – అవినీతిని అంత మొందించే ప్రక్రియ

అవినీతి వ్యతిరేక ఉద్యమం

          -నిన్న అంటే 25  వ తేది గురువారం ఉయ్యూరు   రోటరీ క్లబ్ వారు తమ సమావేశం లో ”అవినీతి వ్యతిరేక ఉద్యమం ”పై ముఖ్య అతిధి గా వచ్చి  ప్రసంగించమని కోరారు .నేను మాట్లాడాను .రోటరియన్లు అందరు వున్నారు .వారి ముందు మాట్లాడే అరుదైన అవకాశం లభించింది .కే.సి.పీ .జనరల్ మేనేజర్ గారిచేత నాకు  సత్కారం చేయించారు .ఆ సందర్భం గా నేను మాట్లాడిన ప్రసంగా పాఠం మీతో పాటు సాహితీ బంధువు లందరికీ .

— ”అవినీతి ని ఆంగ్లం లో corruption  అంటారు .దీనికి నిఘంటువు లో చెడగొట్టు (spoil )కుళ్ల జేయు   (rotten ) ,దుర్మార్గమైన ,భ్రష్టమైన ,నీచమైన (base ) ,అవినీతి కరమైన ,లంచం ఇచ్చే (bribe )అనే అర్ధాలున్నాయి .పోతన గారి భాగవతం లో తండ్రి హిరణ్య కశిపుడు కుమారుడు ప్రహ్లాదుడిని  విష్ణువు ఎక్కడ వున్నాడు అని అడిగితే చెప్పిన పద్యం అందరికి తెలుసు .ప్రహ్లాదుడు విష్ణువు లేని చోటు లేదు అని చెప్పాడు ఆ పద్యం లో .దాన్ని కొంచెం మార్చి చెబితే అవినీతి లేని చోటు లేదు అని నాకు అనిపించి ,

పోతన గారికి క్క్షమాపణలు చెప్పుకొంటూ —”ఇందుగలదు ,అందు లేదు అని సందేహము వలదు వక్రి ఎందెందు వెదకి జూచిన అందందే కలదు మానవాగ్రణి వింటే ,కంటే ”అని నిస్సందేహం గా చెప్పవచు .

           అవినీతిఎందుకు వస్తోంది అని ఆలోచిస్తే -ప్రభుత్వాల అసమర్ధత వల్ల అని సమాధానం .ప్రభుత్వ వ్యవస్థలలో సరైన అనుసంధానం తో కూడిన నిఘా ,పర్యవేక్షణ లేక  పోవటం వల్ల అవినీతి పెరుగు తోంది .చాలామంది medhaavula అంచనా ప్రకారం అవినీతి కూకటి వ్రేళ్ళు రాజకీయం లో వున్నాయి .అధికారం పేరిగినా కొద్దీ అవినీతి అదే దామాషా లో పెరుగు తుంది .అందుకే ఇంగ్లీష్ లో ”power corrupts ,absolute power corrupts absolutely ”అన్నారు .ఇంతకీ అవినీతిని నిర్వచించ గలమా ?విశ్లేషకులు ఇలా నిర్వచించారు ”.వ్యక్తీ తన స్వార్ధం కోసం,తన అధికారాన్ని దుర్వినియోగం చేయటమే అవినీతి ”.దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే అధికారమే అవినీతికి మూల స్థానం .లిబియాలో ,ఈజిప్ట్ లో .సూడాన్ లో మన రాష్ట్రం లో అవినీతి ఏరులై పారతానికి కారణం పుత్రప్రేమ .వారికోసం ఎంతటికైనా తెగించారు .చరిత్ర భ్రస్తులైనారు ముబారక్ ,గడాఫీ రాజశేఖర రెడ్డి అని మనకు అందరికి తెలుసు .కరుణానిధి కూతురు  కోసం మేనల్లుళ్ళ కోసం కక్కూర్తి పడి భంగపడ్డ విషయం రోజూ కధలు ,గాధలుగా వింటూనే వున్నాం .ప్రభుత్వ ధనాన్ని ,స్థలాలను ధారాదత్తం చేసి ,దోచుకొని అందలాలు ఎక్కి అన్ని సుఖాలు అందుకొన్నా వాళ్ళే వారంతా .
          పోలీసు వ్యవస్థ ,పౌర వ్యవస్థ లలో రాంకు పేరిగినా కొద్దీ అవినీతి అడ్డ గోలు గా పెరుగుతుందని విశ్లేషకుల వివరణ .దీనికి తోడు ఎన్నికలు వస్తే చాలు అవినీతి పండగే .ఎల్లలు దాటి అవినీతి అడ్డు ,ఆపు లేక అన్ని రకాల విశ్వ రూపం దాలుస్తుంది .డబ్బు ,అధికారం ,ప్రలోభం అన్నీ ఉపయోగించి ఎన్నికలలో గెలవటం సర్వ సాధారణం అయింది .వాడికే అధికారం దక్కుతోంది .అంటే అవినీతి నాయకుల్నే మనం ఎన్నుకొన్తున్నాము .మరి వాడు తాను ఖర్చు పెట్టిన దానికి వందల రెట్లు సంపాదించుకొనే వీళ్ళు అన్నీ చూసుకొంటాడు .అతి కొద్ది కాలమ్ లో అపర కుబెరుడై పోతున్నాడు .వాడి అధికారానికి దౌష్ట్యానికి ఎదురు లేదు .గట్టి రాజకీయ ,ఆర్ధిక oligarchy అంటే  కొద్దిమంది  వున్న ముఠా వల్ల అవినీతి పెరిగి పోతోంది అని పాల్ జాన్సన్ నిర్వచించాడు.అధికారులు ,నాయకులు తమ స్వంత పలుకుబడిని పెంచుకోవటానికి ,సబ్సిడీలు ,ఇతర వాణిజ్య సంస్థల నుంచి రక్షణ కోసం లాభం కోసం ఇచ్చే వన్నీ అవినీతి లో భాగమే .ఇవి రాజకీయం తో వ్రేళ్ళు గట్టి పడి ,మిగిలిన అన్ని చోట్లకు ప్రాకి ఇబ్బంది కలిగిస్తాయి .ఈ oligarchy  –రాజకీయ అవినీతి పరుల సంస్కృతిని పెంచుతుంది .న్యాయం ,చట్టం,పోలీసు వ్యవస్థ ,కోర్టులు వీటిని అన్నిటిని ప్రలోభపెట్టి ,ప్రభావితం చేస్తారు ఈ ముఠా.దీని వల్ల రావలసిన మంచి పరిణామాలు ఆలస్యమై పోతాయి ,లేక రాకుండా పోవనూ వచ్చు .
                                అవినీతిని అంత మొందించే ప్రక్రియ
                 మనకున్న న్యాయ,చట్ట సంస్థలు అన్ని కలిసి అవినీతికి వ్యతిరేకం గా పోరాడాలి ”.స్వతంత్రమైన అవినీతి నిరోధక వ్యవస్థ ”ఏర్పడాలి .ఈ వ్యవస్థ అవినీతి బడాబాబుల భారతం పట్టాలి ..ఇది స్వతంత్ర సంస్థ గా,విస్తృతమైన అధికారాలతో వుండాలి .ఇందులో రాజకీయ లొసుగులు ఉండరాదు .యెంత పెద్ద రాజకీయ నాయకుదినైనా ,ఆర్ధిక .పారిశ్రామిక వేత్తనైనా విచారించి శిక్షించే అధికారం ఈ సంస్థకు వుండాలి .దీనికి విశేషమైనాక్ విచాక్షనాదికారం వుండాలి .అత్యున్నత స్థాయి లో వున్న వ్యక్తులను విచారించటానికి రాష్ట్రపతి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా చేయాలి .దీనికి ప్రభుత్వమే తగిన సిబ్బందిని ,బడ్జెట్ ను ఇవ్వాలి .అవినీతి పరులను జైల్లో పెట్టేంత వరకు వీరికి పూర్తి అధికారాలు లభించాలి .ఇలా చేస్తే రాజకీయ ఒత్తిడి చాలా భాగం తగ్గి పోతుంది .ఇప్పుడున్న చట్టాలు ,వాటి వినియోగం ,అవినీతి సామ్రాట్టుల జోలికి రాష్ట్రపతి కాని ప్రధాని కాని వెళ్ళే వెసులు బాటు లేదు .అందుకే స్వతంత్ర వ్యవస్థ అవసరం .వారిని chaallenge  చేసే దమ్ము కూడా వుండటం లేదు .ఇది మరీ విచారకరం .
              ఈ స్వతంత్ర వ్యవస్థ ప్రభుత్వ పబ్లిక్ రంగ సర్వీసెస్ తో ఏకీకృతమై పని చేయాలి .పబ్లిక్ సంస్థలలో అవినీతి నిర్మూలిస్తే ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగు తుంది .విశ్వాసము కూడా పెరుగుతుంది .ప్రజా ప్రయోజనాల కోసం దాతలనుంచి విరాళాలు సేకరించి,మళ్ళీ వారికి ఇంకో విధం గా లబ్ది చేకూర్చటం అవినీతి లో ఒక భాగమే .వ్యవస్థలో ,విధాన నిర్ణయాలలో సంస్క్రరణ రూపం లో ఇవన్నీ రావాలి .దీనికి రాజకీయం గా గొప్ప నిష్ఠ వుండాలి .దీని తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం దేశం లో అత్యున్నత వ్యక్తిత్వం ,గట్టి రాజకీయ ధృఢ నిశ్చయం వున్న మహోన్నతులను తయారు చేయటం యెట్లా అని .మంచి పౌరవ్యవస్థ వల్ల నే ఇది సాధ్యం .ప్రస్సారమాధ్యమాలు ,సివిల్ సేర్వసులు రాజకీయం గా లోతులు తరచి సమాచారాన్ని ప్రాలకు అందించి జాగృతం చేయాలి కేవలం watch dogs గా వుంటే చాలదు .అవినీతిని అంతం చేసే అధికారులకు వ్యవస్థలకు పూర్తిమద్దతును   మీడియా ఇవ్వాలి .కుళ్ళిన రాజకీయ వ్యవస్థను ,దాని ప్రభావంతో దెబ్బతిన్న ఇతర వ్యవస్థలను చక్కదిద్దే కార్యక్రమం ప్రజాసహకారం తో చేయాలి .ఇదంతా స్వచ్చమైన పరిపాలన వల్లనే సాధ్యం అని అందరు గ్రహించాల్సిన ముఖ్య విషయం .
               పౌర సమాజానికీ ,దేశానికీ ,ప్రైవేటు సెక్టారు కు చక్కని సమతూకాన్ని అంటే balance ను సమకూర్చ గలిగింది సమర్ధవంతమైన ప్రభుత్వాలే . విధానాలు ప్రకటించటం లో వున్న శ్రద్ధప్రభుత్వాలకు  అమలు చేయటం లో లేదు .అక్కడికొచ్చే సరికి చిత్త శుద్ధి తగ్గి పోతోంది .ఇదే ఇన్ని అనర్ధాలకు కారణం .మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ వుంది ,స్వేచ్చాయుత మీడియా వుంది .కనుక స్వచ్చమైన ,నీతి వస్న్తులైన ,సమర్ధులైన వారిని వీటి లో నియమిస్తే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది ,తమ బాధ్యతను నెరవేర్చే టందుకు సిద్ధ పడతారు .ఇవి మనం చేయలేక పోతే మనం ”నైతికం గా అవినీతి పరులం ”అయినట్లే అని భావించాలి .దీన్నే morally corrupt అంటారు .ఇది మనందరి బాధ్యత .ఆత్మ విశ్వాసం తో ,చేతలతో ముందడుగు వెయ్యాలి .పారదర్శకత అన్నిటా వుండాలి .లోకాయుక్త ,లోకపాల్ మనకు వున్నా ,వాటికి ప్రత్యేకమైన enforcement అధికారాలు లేవు .నామ మాత్రమే అవి    .
 ఈ విషయాలను అన్నిటిని చాలా ఏళ్ళ క్రితమే మన ఉయ్యూరు నివాసి ,అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ముప్ఫై ఏళ్ళకు పైగా సేవలందించిన ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక శాస్త్రవేత్త ,ప్రస్తుతం అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో లో ఉంటున్న శ్రీ ఆరిక పూడి ప్రేమ్చంద్ తన గ్రంధాలలో విపులం గా చర్చించి దిశా నిర్దేశం   చేశారు  .ప్రభుత్వాలు వాటిని అధ్యనం చేసి తీరు మార్చుకో క పోతే సంక్షోభం తప్పదు   .                        ఇప్పుడు కరెంట్ టాపిక్ ”జన లోక్ పాల్ ‘సాంఘిక సేవా లో జీవితాన్ని పండించుకొని ,నిస్వార్ధ సేవ చేస్తున్న శ్రీ అన్నా హజారే అవినీతి తీరు తెన్నులు చూసి విసుగు చెంది దానికి వ్యతిరేకం గా పోరాడుతూ జన లోక్ పాల్ బిల్లు కోసం నిరశన దీక్ష చేస్తున్నారు .ఆ నాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇలాగే ఉద్యమించి రెండవ స్వాతంత్ర సంగ్రామం చేసి ప్రజా పాలన తెచ్చారు .మళ్లి ఇప్పుడు హజారే కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు .ప్రభుత్వం మీన మేషాలు లేక్కిస్తోంది .పది ర్రోజులైంది ఆయన ఆరోగ్యం దెబ్బతిన కుండా ,ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా స్పందించాలి ఆయన చేస్తున్న ఉద్యమమే ”India against corruption ”.(I.A.C.).వ్యక్తిత్వం  ,సచ్చీలం  ,నిజాయితీ వున్న వారినే పరిపాలకులు గా ఉంచాలన్నది ఆయన అభిప్రాయమే కాదు భారతదేశ ప్రజాభిప్రాయం కూడా .
            అవినీతి మూడు దశల్లో వుంటుంది అని ఒక విశ్లేషణ .దేవుడిని నాకు అది కావాలి ఇది కావాలి అవి ఇస్తే నీకు అది చేయిస్తా ఇది చేయిస్తా అని కోరుకోవటం తోనే మొదలి స్థాయి అవినీతి ప్రారంభం అన్నాడు ఒకాయన నిజమే .దేవుణ్ణి మనం అవినీతి లోకి లాగుతున్నాం .రెండోస్తాయి లంచం ఇవ్వటం ,పుచ్చుకోవటం .మూడో లెవెల్ లో మంత్రులస్తాయి అవినీతి ఇంతకీ అవినీతికి కారణాలు ఏమిటో తెలుసా ?మనమీద మనకు నమ్మకం లేక పోవటం ,మానవత్వపు విలువలు దూరమవటం ,త్యాగభావం లేక పోవటం ,సేవా నిరతి తగ్గటం ,స్వార్ధం పెరగటం ,అభద్రతా భావం .అభద్రతా బ్భావం తో డబ్బే ప్రధాన శక్తి అని భావించి దానికోసం అవినీతి రొంపిలో దిగటం .అత్యున్నత స్థాయిలో వున్న వాళ్ళు రోల్ మోడల్స్ గా లేక పోవటం మానకు చాలా నష్టం కలిగిస్తోంది .గాంధి నెహ్రు ,పటేల్ రాజెన్ బాబు  సర్వేపల్లి ,ప్రకాశం ,లాల్బహదూర్ శాస్త్రి వంటి మహామహుల  తర్వాత ఒక అబ్దుల్ కలామే మనకు ఆడర్శపురుషుడి గా కన్పిస్తున్నారు .మిగతా వారి గురించి మనం నేర్చుకోవాల్సిన్దేమి లేదు .అదీ దేశానికి దౌర్భాగ్యం .వున్న వారంతా రోల్డ్ గోల్డ్ వంటి వారే అవటం జాతి చేసుకొన్న దురదృష్టం .అవినీతి తగ్గ టానికి ప్రజల్లో ఆత్మ స్థైర్యం ,అవగాహన పెంచాలి .యువతకు బాధ్యతలు అప్పగించాలి .వారింకి మార్గ దర్శకత్వం చేయాలి .వారి శక్తిని తక్కువ అంచనా వెయ రాదు .ఇవాళ ప్రపంచం అంతా జరుగుతున్న అవినీతి పోరాటం ,అవినీతి ప్రభుత్వాలను గద్దె దించటం లో యువకులు నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయం గా,ఆదర్శవంతం గా ఉంది .
          ఉత్పత్తి సృష్టించటం లో మానవత్వపు విలువలను మంట బెట్ట రాదు .ఆధ్యాత్మికతను దానికి జోడించాలి .మనం విశ్వ పౌరులం అన్న భావన చాలా ముఖ్యం .పవిత్ర వ్యక్తిత్వాన్ని అందరు పెంచుకోవాలి .జీవితాన్ని ,తమ భాషా ,సంస్కృతులను ప్రేమించాలి .మన వారసత్వం లోని మానవతా విలువలను భద్రం గా కాపాడు కోవాలిఅప్పుడు చెడు మార్గం వైపు అడుగు పడదు .ప్రభుత్వం కూడా ”gross domestic happiness ”మీద ద్రుష్టి పెట్టాలి కాని ”gross domestic product ” మీద కాదు అని చ్చేప్పిన వారి మాట పాటించాలి .అలాగే ”prosperity has meaning when there is happiness and common welfare built into the system ”అని సమాజ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు శిరోధార్యం గా భావించాలి .అవినీతి సామ్రాజ్యాలను కూకటి వేళ్ళతో పెకలించి ,ఆ దోచిన సంపదను జాతి పరం చేయాలి .అన్నా హజారేకు మద్దతు అంటే వూరికే గొంతు కలపటం కాదు .ఒక సమర్ధవంతమైన నీతి ,పౌరబాధ్యత ,సమాజ సేవ నిజాయితీ  వున్న మంచి వ్యక్తిని అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రధానిని చేయాలి .అపుడే హజారే కన్న కలలు నిజం అవుతాయి .ఇప్పటి బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని కావటానికి తగిన అన్ని అర్హతలు వున్న వాడు అని నాకు అనిపిస్తోంది .ఆ దిశ గా రాజకీయ పక్షాలు ,ప్రజా కలిసి అడుగు వేస్తె ఆ నాటి జనతా ప్రభుత్వం లా   మేలు చేసే మరో మంచి ప్రభుత్వం వస్తుంది .
              ప్రజాకవి కాలోజి నారాయణ రావు ఎప్పుడు ”private wrong can be drowned in a cup of wine ,but for public wrong ,it requires rivers of blood ”అన్న మాటల్ని చెబుతూ వుండే వారట .అందుకే ఆయన ప్రజాకవి అయారు .మన మాజీ రాష్ట్ర పతీ అబ్దుల్ కలాం ”’నా కంటే నాదేశం మహోన్నతమైనది అనే భావం నా దేశ నాయకులకు ,నాదేశ ప్రజానీకానికి వారి గుండెల్లో బాగా నాటుకోనేట్లు చెయ్యి ”అని ప్రతి రోజూ రాత్రి నిద్రించాటానికి ముందు భగవంతుని ప్రార్దిస్తారట .మనం కూడా అలా చేస్తే యెంత బాగుండు? భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రేమే కోర్ట్ ”Even god cannot help this country .God is silent spectator .The centre and state governments have become non functunal ”అని 2008  లో చెప్పింది అంటే యెంత దౌర్భాగ్య స్థితి లో మనం ఉన్నామో   తెలుస్తోంది .ఈ విపత్కర పరిస్థితినుంచి ,ఈ అవినీతి జాడ్యం నుంచి మన దేశం బయట పడి ఆదర్శవంతం గా నిలవాలని కోరుకొంటూ ,ఆశిస్తూ ,సెలవ్ ”
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -08 -11.
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు. Bookmark the permalink.

3 Responses to అవినీతి వ్యతిరేక ఉద్యమం – అవినీతిని అంత మొందించే ప్రక్రియ

 1. bhupatiraju vihang says:

  nic

 2. TILAK says:

  chala baga chepparu……kani meeru intha baga cheppina kooda reply itchinavallu okkarey…deeniki karanam ee roju lalo vellaki ee matalu nachhadam ledu kanukey……meeru chala baga chepparu…..

 3. venkatesh says:

  chala baga chepparu……kani meeru intha baga cheppina kooda reply itchinavallu okkarey…deeniki karanam ee roju lalo vellaki ee matalu nachhadam ledu kanukey……meeru chala baga chepparu…..
  జవాబు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.