దివిసీమ గాంధి – మండలి రాజ గోపాల రావు

మహాత్మా గాంధి కృష్ణా జిల్లా దివి తాలుకా 1930 ప్రాంతం   లో పర్యటించినపుడు అక్కడి ప్రజలు బ్రహ్మ రధం పట్టి అరవై ఎడ్ల బండీలతో వూరేగించారుం . ఆ దృశ్యాన్ని తన తొమ్మిది ఏళ్ళ వయసు లో చూచే మహద్భాగ్యం తనకు కలిగింది అని ఉప్పొంగి పోయారు ఈ రోజూ అంటే ఆగస్ట్ ముప్ఫై వ తేదీన 91 వ సంవత్చరం లోకి ప్రవేశించిన శ్రీ మండలి రాజా గోపాల రావు గారు .వారితో నాకు పదేళ్ళ క్రితం పరిచయం అయింది .ఆ కాలమ్ లో శ్రీ సింహాద్రి వెంకటేశ్వర రావు గారు ”దివి సాహితీ మిత్రులు ”అనే సాహితీ సంస్థను స్థాపించి

ప్రతినెల ఒక సాహితీ సభ ను అవనిగడ్డ లో  నిర్వహిస్తుండే వారు

ఆడియో – ౧

. ఒకసారి ఏదో సభలో నా ప్రసంగం విని వారు నన్ను వారి సభలో ప్రసంగించమని కోరారు .ఆ సభలో మొదటి సారి శ్రోత గా విచ్చేశారు .రాజా గోపాల రావు గారు .ఆ సభలో నేను శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి కధ లను గురించి మాట్లాడిన గుర్తు .వారు చా

లా ఆనంద పడ్డారు .నన్ను అభినందించారు .ఆ తర్వాత నేను ఇంకో ఆరు సభల్లో అవనిగడ్డ    లో మాట్లాడాను . వారు దాదాపు అన్నిటికి వచ్చినన్ను  అభినందిస్తూ ఒక మాట అన్నారు ”మాస్టారు .మీరు మాట్లాడితేనే ఇక్కడి సభలకు వస్తున్నాను .మిగిలిన వాటికి నాకెందుకో వెళ్లాలని పించదు ”అని నన్ను ఆప్యాయం గా ,ఆత్మీయునిగా భావించి చెప్పారు .అప్పుడే వారి గురించి పూర్తిగా తెలుసు కొన్నాను .వారు రాసిన పుస్తకం ఒకటి నాకు ఇచ్చారు .అది చదివి నా భావం వారికి లేఖ లో రాశాను

ఆదియి -౨

.దానికి వారు సహృదయతతో తరచూ ఫోన్ లో సంభాషించే వారు ..ఈ మధ్య ఆరేడు సంవత్చారాలుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు లేవు .ఈ మధ్య నేను బెంగుళూర్ లో వున్నపుడు వారు ఇంటికి మా అబ్బాయి రమణ కు ఫోన్ చేసి నన్ను గురించి వివరాలు తెలుసుకోన్నారట .నేను ఉయ్యూరు వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు .తనకు తొంభై వెళ్లి ఈ నెల ముప్ఫై వ తేదీకి తొంభై ఒకటి వస్తుందని నన్ను చూడాలని తనకు వుందని ,కాని వయోభారం వల్ల రాలేక పోతున్నానని కాని ఎప్పుడో ఒకప్పుడు తప్పక వచ్చినన్ను  చూసి వెళ్తానని మొన్న అన్నారు 

 

ఆడియో -౩        .అప్పుడు నేను వారితో నేనే వారింటికి పులిగడ్డకు వారి జన్మ దినోత్చావం నాడు వచ్చి హాప్పీ బర్త్ డే చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని వారి తో ముఖాముఖి మాట్లాడుతానని చెప్పాను .అన్న మాట ప్రకారం ఇవాళ ఉదయం పులిగడ్డ వెళ్లి వారి ఇంటిలో వారిని దర్శించాను .పదేళ్ళ క్రితం ఎలా వున్నారో ఇప్పుడు అలాగే అదే ఆరోగ్యం తో వున్నట్లు కనిపించారు .దంపతులిద్దరూ ఎంతో ఆత్మీయం గా

ఆదరించి ,స్వీటు హాట్ ,పళ్ళు  టీ ఇచ్చి తమ అతిధి మర్యాదను చూపించారు .

తన జీవితం గురించి చెప్పమని నేను అడిగాను .తాను పులిగడ్డ లోనే జన్మించానని ,తాము కాపు కులస్తులమని తమ కుటుంబానికి తాతల తరం లో మూడు వేల ఎకరాల సుక్షేత్రమైన పొలం ఉండేదని ,అయితె దివి సీమలో కాలువలు సాగు కోసం త్ర్వ్వినప్పుడు దాదాపు పొలాలన్నీ దానిలో పోయాయని ముంపుకు గురి అయి కొంత నష్టం జరిగిందని ,తండ్రుల కాలమ్ లో దాదాపు ఏమీ మిగల లేదని .తమ తరం లో అనుభవించటానికి అసలు సెంటు భూమి కూడా లేదని శిస్తు కట్టే పరిస్థితి లేదని నవ్వుతు చెప్పారు .పిత్రార్జితం అయిన స్థలం లో ఒక  రేకుల షెడ్డు వేసుకొని వారు వుంటున్నారుయెనభైఒక యేళ్ళున్న భార్య గారితో .ఆనాడు బస్తా ఓడలు రెండు రూపాయలే నని కాని శిస్తు మాత్రం ఎనిమిది నుంచి పడి రూపాయలున్దేదని శిస్తు కట్టటానికి మూడు లేక నాలుగు బస్తాలు అమ్మితే కాని కట్ట లేక పోఎవారమని ,కట్టక పొతే బ్రిటిష్ ప్రభుత్వం జప్తులు చేసేదని దాంతో కూడా పొలాలు అన్నీ హారతి కర్పూరం అ

యాయని ఆవేదన తో చెప్పారు .

.తన తొమ్మిదవ ఏట గాంధీజీ ని చూసే భాగ్యం కలిగిందని ,ఆ ప్రభావం తన మీద బాగా వుందని అప్పటినుంచి ఖద్దరు కడుతూనే వున్నానని చెప్పారు .గ్గోసి పోసి ఖద్దరు పంచ,ఖద్దరు లాల్చి ,పైన అంచు ఖద్దరు ఖండువా ఇదీ వారి వస్త్ర ధారణ .అంతా తెల్లని తెలుపే .మీసం .జుట్టు తెలుపు .వారి మాట స్వచ్చమైనది ,మనసు స్వచ్చం ,వేశం స్వచ్చం ,హృదయం స్వచ్చం .నుదుట యెర్రని కుంకుమ బొట్టు .వారిని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించ బుద్ధి కలుగుతుంది .ఆ కళ్ళల్లో కాంతి ,వెలుగు,చిరునవ్వు మనకు వారిపై గౌరవభావం ఏర్పడుతుంది .సాకా హారమే తన ఆరోగ్య రహస్యం అన్నారు .గాంధీజీ చెప్పినట్లు తనకు ”సత్యమేవ జయతే ”అనేదే మంత్రమని ,తన బలం సత్యమేనని ,సత్యానికి మించింది లేదని ,తాను ఎప్పుడు అసత్యం చెప్పలేదని ,లేని దానికోసం ఆరాటం లేదని ,ఉన్నదానితో సంతృప్తి పొందటమే తన జీవితం అ

ని చెప్పారు .

మత్రికులతిఒన్ మాత్రమే పాస్స్ అయిన గోపాల రావు గారు ఆంగ్లం లో మంచి ప్రవేశం పొందారు .చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతారు ,రాస్తారు .తుతిఒన్ చెప్పి జీవితం కొంత కాలమ్ గడిపారు .తరువాత రెవిన్యూ లో ఉద్యోగం పొందారు .అందులో రెండు ప్రోమోశాన్లు పొంది అవనిగడ్డ లోనలభై ఏళ్ళ క్రితం  రిటైర్ అయారు .క్విట్ ఇండియా ఉద్యమం లో తాను పాల్గోన్నాని తన అనుభవాన్ని తెలిపారు .అవని గడ్డ లో రెవిన్యూ కార్యాలయం ముందు ఆ నాటి ఇంగ్లీష్ రెవిన్యూ ఆఫీసర్ ఎదుట త్రివర్ణ పతాకం చేతబట్టి ”If you do not quit India ,I will crush you ”అని  బిగ్గరగా అరిచానని ,అందరు తన్ను ఆశ్చర్యం తో చూశారని ,తనను అర్రెస్ట్ చేయిస్తానని దొర ఆదేశం జారీ చేస్తుంటే,తన వాళ్ళు తన్ను బలవంతం గా ఇంటికి తీసుకొని వెళ్లారట .అయితె ఏ క్షణం

లోనైనా అర్రెస్ట్ వారంట్ జారీ చేసే ఆవ కాశం వుందని తన తండ్రి ,కుటుంబం చెప్పగా తాను అజ్ఞాతం లో కి వెళ్లానని ,అలా ఒక సంవత్చరం under ground   లో ఉన్నాననీ ,చెప్పారు . అయితె వూరు వదిలి వెళ్లలేదని పొలాల్లో వున్న ఇళ్ళలో వుంటూ స్థానాలు మారుస్తూ ఎవ్వరికీ కనపడ కుండా గడిపానని .పాలేళ్ళు తాను ఎక్కడ వున్నానో
తెలుసుకొని భోజనాన్ని రహస్యం గా తెచ్చే వారని అన్నారు .

స్వాతంత్ర్యం పొందిన తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేశారని ,అదే తనకు ఆధారం అనీ అన్నారు .రెవిన్యూ లో పనిచేస్తూ ఆస్తి కూడ పెట్టుకోని ఆదర్శ ఉద్యోగి గోపాల రావు గారు . ధర్మమే మార్గం గా ,అహింసే పరమావధిగా ,షోచమే విధిగా ,జీవితాన్ని పండించు కొంటున్నారు .

ఎక్కడ కాంగ్రెస్ సభలు జరిగినా తాను వెల్లెవాడినని ,దాదాపు ఎక్కువ భాగం న

డిచే వెల్లెవాడినని ,సామాన్య జీవితమే తనకు ఇస్తామని చెప్పారు .అవనిగడ్డలో చిరువోలు రాదా కృష్ణ మూర్తి గారు అనే బ్రాహ్మణుడు ఖద్దరు దుకాణం నడుపుతూందే వారనీ ,వారే తనకు ఆదర్శమని ,ఆయన గురువు అనీ ,ఆయన షాప్ లొం అందరు కలిసి దేశ విషయాలు చర్చిన్చుకోనీ వారమని సభలకు ఏర్పాట్లు తామే చేశే వారమని అన్నారు .ప్రకాశం ,పట్టాభి ,కాకాని ,బ్రహ్మయ్య లతో చాలా గొప్ప పరిచయాలుండే వని ,తాను ఎప్పుడు కార్య కర్తగానే వున్నానని చెప్పారు .చంద్ర రాజేశ్వర రావు ,సనకా బుచ్చి కోటయ్య ,సుం దరయ్య లతో పరిచయం వుందని ఇక్కడ అన్ని భావాల వారు వృద్ధి చెందారని తెలిపారు .

దేశం లో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగు తోంది కదా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితె అవినీతి వెళ్ళు పాతుకొని పోయిందనీ ,దాన్ని రూపు మాపటం ఎవరి వల్ల కాదని

అంతగా దేశం భ్రస్టు పట్టి పోయిందని ఆవేదన చెందారు .యే ఆదర్శం తో స్వాతంత్ర్యాన్ని పొందామో దానికి వ్యతిరేకం గా జరుగుతూన్డటం బాధాకరమని బాధ పడ్డారు .ఆదర్శం అనేది లేక పోవటం జాతికి పట్టిన పట్టిన చీడ అన్నారు .దాన్ని పొందక పొతే జాతికి భవిష్యత్తు లేదు అని గట్టిగా చెప్పారు .యువకులకు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా అని అడుగగా ,యువశక్తిని తక్కువ అంచనా వెయ రాదనీ ,దాన్ని వ్యవస్తీకరిస్తే దేశానికి బలం జీవంకలుగు తాయి   అన్నారు .అవినీతి లేని సమాజం ఏర్పడటానికి అందరు సహకరించాలన్నారు .ఆ రోజూ కోసం తానూ ఎదురు చూస్తున్నాను అని చెప్పారు .

 

 

తన భార్య తనకు ద్బందువే నని తనకు జీవిత భాగ స్వామి అవటం తాను చేసు కొన్న పుణ్యమేనని ఆనందం గా చెప్పారు .ఆమెను ”ఏమండీ !గోపాల రావు గారు ఆదర్శం ,ఆదర్శం అంటూ ఏమీ పెద్దగా సంపాదించలేదు ,మంచి ఇల్లు కట్టలేదు ,రేకుల షెడ్ లో కాపురం ఇంట్లో ఆదినికమైన వసతులు లేవు .మీకు బాధ గా లేదా ?”అని నేను అడిగితె ఆ దొడ్డ ఇల్లాలు ”నాకు వారి మీద ఏమీ కోపం లేదు .వారు యెంత సంపాదిస్తే దానితోనే జీవితాన్ని గడపటం నేర్చుకోన్నాం .పిల్లలందరికీ మంచి చదువులే చెప్పించాము .అందరు చక్కగా అభివృద్ధి చెందారు .ఇదంతా మా వారి మంచితనం వల్లనే .మాకు అతిగా కోరికలు లేక పోవటమే మా ఆఅనన్దానికి కారణం ”అని స్పష్టం గా చెప్పారు .”మీరు గోపాల రావు గారి భార్య గా గర్వ పడుతున్నారా ,సంతృప్తి తో వున్నారా ?”అని అడిగితె తాను పూర్తి సంతృప్తి తో వున్నానని ,అది లేదు ఇది లేదు అనే ఆరాటం తమ కుటుంబం లో లేదని ఇప్పటికి గోపాలరావు గారి తమ్ముడి కుటుంబం ,తమ పిల్లలు అందరు గోపాల రావు గారి కుటుంబం గానే ప్రవర్తిస్తున్నామని గోపాల రావు గారి మాటే అందరికి శిరో దార్యం గా భావించటం తమ పిల్లల గొప్పతనం అనీ అ

న్నారు .ఉమ్మడి కుటుంబ భావన తమ బలం అన్నారు .

ఆ ఆదర్శ దంపతులకు శుభాకాంక్షలు అందజేసి ముకుళిత హస్తాలతో నమస్సు లందించి ,వారి వద్ద శెలవు తీసుకొని వారికి ”మా అక్కయ్య -అనురాగ కవితా సంపుటిని ”అందజేసి ,ఇంటికి బయల్దేరాను .మా కుటుంబం కల కాలమ్ సుఖ సంతోషాలతో

వర్ధిల్లాలని ఆ వృద్ధ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా శీర్వదించి నాకు వీడ్కోలు చెప్పారు .ఈ

అనుభవం నాకు చిరస్మరణీయం గా వుంది .

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

1 Response to దివిసీమ గాంధి – మండలి రాజ గోపాల రావు

  1. bondalapati అంటున్నారు:

    మా ఊరి పక్క ఊరు లో ఉన్న ఈ పెద్దాయన పేరు కూడా నాకు తెలియదు. మంచితనం ఉన్న వారందరికీ పేరు ఉండనవసరం లేదు అనటానికి ఈయనే ఒక నిలువెత్తు ఉదాహరణ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.