శ్రీ గణేష్ చతుర్ధి —గణేష్ శ్రీ కృష్ణ
శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమే శ్రీ గణపతి .”గ”అంటే జ్ఞానం . ”ణ ” అంటే నిర్వాణం .”ఈశ” అంటే స్వామి .అంటే గణేశుడు జ్ఞాన ,నిర్వానాలకు స్వామి అని ardham .”హీరంభుడు ”అని కూడా ఆయనకు పేరు .అంటే ”వో !దీన రక్షకా “‘అని భావం .”ఏకదంతుడు ”అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి .ఆయన చెవులు చేటలు .అంటే చెడును చెరిగి వేస్తాయి .మంచిని మాత్రమే నిలుపుతాయి .విఘ్నాలను తొలగించి మనల్ని పరిశుద్ధులను చేస్తాడు అందుకే శూర్ప కర్ణుడు అని పేరు .అన్ని చెడు పనులకు నాలుక మూలం .అది బైట వుంటే ఇతరుల దోషాలను ఎంచు తాము .మనసు అనే జిహ్వాగ్రాన్ని మనవైపే తిప్పి ఉంచితే ,అంటే మన దోషాలను మనం తెలుసుకొంటే ,ముక్తి లభిస్తుంది అని పెద్దలంటారు .అందుకేగజాననుని జిహ్వాగ్రం కంఠం వైపుకు వుంది ,మనకు మార్గ దర్శనం గా కన్పిస్తుంది .
శ్రీ కృష్ణుడు ,గణేశుడు వేరు కాదు .అభిన్నులు .ఏక స్వభావులు .గణేశుడు పరశురాముడిని తన తుండం చేత బంధించి సర్వ బ్రహ్మాండ దర్శనం ,గోలోకం లో శ్రీ కృష్ణ పరమాత్మ దర్శనం చేయించితరింప జేశాడు అని బ్రహ్మ వైవశ్వత పురాణం లో గణేశ ఖండం లో వుంది .నిర్గుణ ,సద్గుణ బ్రహ్మాలకు అధిపతి కనుక ”గణాధిపతి ”అన్నారు .
”ఓం నమస్తే గణపతయే ,త్వమేవ కేవలం కర్తాసి ,త్వమేవ కేవలం హర్తాసి ,త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ”అని గణపతి అధర్వ శీర్ష కృతి తెలియ జేస్తోంది .
శ్రీ కృష్ణ ,శ్రీ గణేష్ లకు సంబంధించిన ఒక కధను గురించి తెలుసు కొందాం .ధర్మధ్వజుని కుమార్తె తులసి .ఆమె శ్రీమన్నారయనుడిని వివాహం చేసుకోవాలని భావిస్తుంది .ఒక రోజూ గణపతి కనిపిస్తే ”నువ్వు శ్రీ కృష్ణుని అవతారమే కదా నన్ను పెళ్లి చేసుకో ”అని వేడుకొంది .ఆయన ”వివాహం బంధ కారణం –నాకు ఆ కోరికే లేదు ”అని స్పష్టం గా చెప్పాడు .అప్పుడు తులసికి కోపం వచ్చి ”వివాహం వద్దు అంటున్న నీకు తప్పక వివాహం అవుతుంది ”అని శపించింది .గణపతికి కూడా కోపం వచ్చి ”అనవసరం గా నన్ను శపించావు కనుక రాక్షస భార్యవై జన్మిస్తావు .తర్వాత వృక్ష రూపం పొందుతావు ”అని ప్రతిశాపం ఇచ్చాడు .ఆమెకు పశ్చాత్తాపం కలిగి గానేషుని ప్రార్ధిస్తే ,”వృక్ష రూపం పొందినా ,లోకారాధ్యురాలవు అవుతావు .శ్రీ నారాయనార్ప దివ్య కుసుమం నువ్వు .నీ దళాలతో చేసిన పూజ ప్రజలకు ముక్తిని ప్రసాదిస్తుంది ”అని శాప విమోచన కల్గించాడు .
ఆ తర్వాత జన్మలో తులసి శంఖచూడుడు అనే రాక్షసుని భార్య అయింది .శంఖ చూదుని ఆగడాలు భరించ లేక శివుడు అతన్ని త్రిశూలం తో సంహరించాడు .తన కలాంశ తో ఆమె తులసి వృక్ష రూపం పొంది అందరి ముక్తికీ కారకురాలు అయింది .అందుకే తులసి దళం తన పూజకు పనికి రాదనీ గణపతే చెప్పుకొన్నాడు .a వినాయక చవితి నాడు గనేశుని పూజకు తులసి దళాలు నిషిద్ధమయాయి .శ్రీ కృష్ణ గణేశులు అభిన్నులై లోకారాధ్యులైనారు .ఇప్పుడు శ్రీ కృష్ణ పరబ్రహ్మ తత్త్వం గురించి తెలుసు కొందాం .
గోలోకంమండలా కారం గా వుంటుంది .ప్రళయ సమయం లో శ్రీ కృష్ణుడు మాత్రమే శేషించి ఉంటాడు .మురళి ధరించి ,శ్రీ వత్చాన్కిట వక్షస్థలం పై కౌస్తుభం తో ప్రకాశిస్తూంటాడు .ఆయనే పరబ్రహ్మ .,పురుషోత్తముడు .ఎప్పుడూ ”కిషోర ”వయసు లోనే ఉంటాడు .గోపా వేష ధారియై ,గోపీ జనం తో పరివేష్టించి ఉంటాడు .పరిపూర్ణుడై ,సర్వ వ్యాపియై ప్రవర్తిస్తాడు .”సదారాసా మండల విహారి ”.సర్వ సిద్ధి స్వరూపుడు .సర్వ సిద్ధి ప్రదాత .ఆదిపురుషుడు ,అవ్యక్తుడు .
శ్రీ కృష్ణుని దక్షిణ పార్శ్వం నుంచి సత్వ రాజస్ ,తమోగుణాలు ,వాటి నుంచి మహస్సు ,అహంకారం ,పంచ భూతాలూ ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి .తరువాత నారాయణుడు జన్మించాడు .ఆయన భార్య లక్ష్మి దేవి .వామ పార్శ్వం నుంచి ”సదాశివుడు ”జన్మించాడు .పంచ ముఖాలు కలిగి దిశలే వస్త్రాలుగా ,సకల సిద్దేశ్వరునిగా,గురువులకే గురువు గా ఆయన ప్రవర్దిల్లాడు .ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు కూడా .శ్రీ కృష్ణ నాభి కమలం నుంచి మహా తపస్వి బ్రహ్మ ప్రభావించాడు .చతుర్ముఖాలతో ,కమండల ,జపమాలతో ,ప్రకాశించాడు .దేహధారులకు జన్మ దాత .సరస్వతీ వల్లభుదయాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ”పుట్టాడు .సర్వజీవులపై సమభావం కలవాడు .ధర్మ దేవుని వామ భాగం నుంచి ”మూర్తి ”అనే స్త్రీ జన్మించి యముని భార్య అయింది .శ్రీ కృష్ణుని ముఖం నుంచి వీణా పుస్తక దారిని ,షోడశ వర్ష కన్య సరస్వతి” జన్మించింది .శ్రీకృష్ణుని మనసు నుంచి ”శ్రీ మహాలక్ష్మి ‘,బుద్ధి నుంచి మూల ప్రకృతి ”ఈశ్వరి ”జన్మించారు .ఈశ్వరి ఏ సర్వ శక్తులకు మూలం .వేయి భుజాలతో ,భయంకరం గా దుర్గతి నాశిని ”దుర్గ ”భాసించింది .శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .శ్రీ కృష్ణుని జిహ్వాగ్రం నుంచి వేదమాత ”సావిత్రి ” ఉద్భవించింది .కృష్ణుని మనసున్నుంచి సమస్త ప్రాణులను మధించే మన్మధుడు ,అతని వామ భాగం నుంచి ”రతీదేవి ”జన్మించి భార్య అయింది .
శ్రీ కృష్ణ వీర్యం జలం లో పడి సహస్ర దైవ సంవత్చరాల తర్వాత గొప్ప అండం గా మారి ”విరాత్పురుషుడు ”జన్మించాడు .విశ్వానికి ఆయనే ఆధారం .చేవులనుండి మధుకైటభులు జన్మించి ,బ్రహ్మను మింగేయాలని ప్రయత్నిస్తే నారాయణుడు చక్రాయుధం తో సంహరించాడు .వాళ్ల కొవ్వు నుంచి ఈ పృథ్వి ఉత్పన్నమైంది అందుకే భూమికి ”మేదిని ”అని పేరు వచ్చింది .భూమి యొక్క అధిష్టాత్రి దేవి పేరు ”వసుంధర ”.శ్రీ కృష్ణ వామ భాగం నుంచి ,”రాధ ”జన్మించింది .ఆమె కూడా సదా ”కిషోర ”వయస్క .ఆమె రోమాలనుండిగోపికలు ,శ్రీ కృష్ణరోమాలనుంచి ”గోపాలురు ”జన్మించారు .వీరు రాదా క్రిష్ణులకు ”పార్శ్ర్శ్వదులు ”.వీరు రాధను ,కృష్ణుని పోలి వుంటారు .నిత్య యవ్వనులు .రాదా కృష్ణులు ప్రేమైక జీవులు .
శ్రీ కృష్ణ గుహ్య ప్రదేశం నుంచి కుబేరుడు ,భూత ప్రేత ,పిశాచాదులు ,కుడి కంటి నుంచి ప్రమద గణాలు ,ఎడమ కంటి నుంచి ”ఈశానుడు ”పుట్టారు .బ్రహ్మ దేవుడు శ్రీ క్రిష్ణానుగ్రహం తో విశ్వ సృష్టి చేశాడు .బ్రహ్మ నాభి నుంచి ”విశ్వకర్మ ”అష్టవసువులు ,,మనసు నుంచి సనకస ,సనందన ,సనాతన సంత్కుమారులు ,ముఖం నుంచి ”స్వయంభు మనువు ”,లలాటం నుంచి ఏకాదశ రుద్రులు ,ప్రభవించారు .అనావృస్టి చివర ”నారదుడు ”పుట్టాడు .పుట్టగానే నీరు ను లోకానికి ఇచ్చాడు కనుక నారదుడు అని పిలువ బడ్డాడు .నారం అంటే నీరు ,జ్ఞానం అని అర్ధాలు .రెండూ ,ఆయనకు వర్తిస్తాయి .బ్రహ్మ కంఠం నుంచి పుట్టిన వారే ”నరదులు ”అంటే నరులు ..ఇలా శ్రీ కృష్ణ పరబ్రహ్మ తన నుంచి అఖిల ప్రపంచాన్ని సృష్టించి ,పరిపాలించి ,తన లోనే లయం చేస్తాడు అని ”బ్రహ్మ వైవర్త పురాణం –శ్రీ కృష్ణ ఖండం ”లో చెప్పబడింది .కృష్ణ అంటే ”సర్వ చరాచర కొటులలో ఆత్మ అయిన వాడు ”అనీ ,ఆదివాచకం అనీ అర్ధం .అంటే సర్వులకు ఆయనే ఆది పురుషుడు .
శ్రీ కృష్ణ ,శ్రీ గణేశ జయంతులు ఒక్క రోజూ తేడాతో దాదాపు ఒకే నెలలో వచ్చినట్లే .సెప్టెంబర్ ఒకటి వినాయక చవితి కనుక .ఆ మహానుభావులను స్మరించి ,అర్చించి జన్మ సాఫల్యం చేసుకొందాం .సిద్ధి ,బుద్ధులను ప్రసాదించే వాడు గనాదీశుడైతే ”శరశ్చంద్ర ప్రభువు ”అయిన శ్రీ కృష్ణుడు భారత భూమి పై అవతరించి ,ధర్మ సంస్థాపన చేసి ,గీతామృతాన్ని పంచి ,భక్తీ జ్ఞాన ,వైరాగ్యాలను తేటతెల్లం చేసి ,ప్రేమను కురిపించి ,అందరి హృదయాలను ఆకర్షించి ,స్మరణ మాత్రం గా ముక్తి ప్రదాత అయాడు .అందుకే స్వామి త్యాగీశానంద ,ఆ మహానుభావుడిని ,పురాణ పురుషుడిని పూర్ణావతార స్వరూపుడిని ”The first teacher in the historry of the world to discover and proclaim the grand truth of love for love’s sake and duty for duty sake ”.”అంటే ప్రేమ ప్రేమ కొరకు ,విధి కర్తవ్య నిర్వహణకు అనే సత్యాన్ని ప్రపంచ చరిత్ర లో మొదట గ్రహించి ,ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు శ్రీ కృష్ణుడు ”అని చాటి చెప్పిన దేశికుడు .అందుకే ”కృష్ణం వందే జగద్గురుం ”.
వినాయక చవితి శుభాకాంక్షలను సాహితీ బంధువులందరికీ తెలియ జేస్తూ సెలవ్ .
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ .—31 -08 -11