ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

    ఆంద్ర బిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
ఆయన్ను ఆంధ్ర బిర్లా ఎందుకంటే ఆయన పరిశ్రమలు సాధారణ పిన్ నుంచి రాకెట్ ఇంధనం  వరకు అన్నీ తయారుచేసే రక రకాల పరిశ్రమలు స్థాపించారు.
          సార్ధక నామదేయులు శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ .హరిశ్చంద్రుని లోని ,మనో నిబ్బరం ,నిష్ట ,నియమం ఆయన్ను గొప్ప పారిశ్రామిక వేత్తను చేశాయి .ఆయన కట్టు ,బొట్టు ,నడక ,నడత చూస్తె ఒక ఆదర్శ మూర్తి మనకు ప్రత్యక్ష మైనట్లున్తుంది .యెంత ఎదిగినా ఒదిగి వుండే స్వభావం ,తల ఎత్తుకొని నిలబడే విధానం ఆయన్ను అందరికీ ఆరాధ్యుడిని చేశాయి .పశ్చిమ గోదావరి జిల్లా కు ముఖ్యం గా తణుకు పట్టణానికి  భారత దేశ పటం లో ఒక గుర్తింపు స్థానాన్ని తెచ్చిన ఘనుడు ఆయన .ఆంద్ర దేశం లో పారిశ్రామిక విప్లవాన్ని స్వాగతించి ,దాని ద్వారా తణుకును తీర్చి దిద్దిన మేధావి ..విద్య ముఖ్యం కాదు ,వివేచనా ,ఆదర్శం ,శక్తి సామర్ధ్యం వుంటే అన్నిటా అగ్ర శ్రేణి లో ఉండవచ్చు నని రుజువు చేసిన వ్యాపార”భగీరధుడు” ‘ .విద్యా ,వైద్య రంగాలలో గణనీయ మైన సేవ లందించి ”ఆంధ్రా బిర్లా ”అని అప్యాయం గా అందరి ప్రశంశలు అందుకొన్న అవిశ్రాంత పధికుడు .,91 సంవత్చారాలు నిండు జేవనం గడిపి   నిన్ననే  కను మూసిన మాన వీయ మూర్తి శ్రీముళ్ళ పూడి  హరిశ్చంద్ర ప్రసాద్ ఇక లేరు .
              రాబోయే తరాలకు ఏమి కావాలో హరిశ్చంద్ర ప్రసాద్ గారికి తెలుసు .అందుకనే ”ఆంద్ర షుగర్స్ ”సంస్థను స్థాపించి దాన్ని శాఖోప శాఖలు గా విస్తరించారు .స్వాతత్ర్యం రావటానికి ముందే దీన్ని స్థాపించటం విశేషం .తణుకు లో రాకెట్ ఇంధనం తయారీ ని చేబట్టారు  .ఇది ఆధునిక పారిశ్రామిక రంగం లో కొత్త మలుపు .అక్క మాంబా  textiles ,ఆంద్ర పెట్రో chemicals ,హిందూ స్థాన allied chemicals ,స్థాపన లో ఆయన ద్రుష్టి యెంత విశాలమైనదో తెలుస్తుంది .ఆయన పారిశ్రామిక సేవలను విశాఖ పట్నం ,గుంటూరు లకూ విస్తరించారు .వ్యవసాయ రంగమే అన్నిటికి మూలం అన్న అభిప్రాయానికి చేదోడుగా పారిశ్రామీకరణ అవసరాని గుర్తించి అమలు చేసిన తొలి తరం పెద్దాయన ప్రసాద్ గారు అందుకనే ఆయన్ను అందరు ”పెద్దాయన ”అని ఆత్మీయం గా పిలుచుకొని భక్తీ ప్రదర్శిస్తారు .పరిశ్రమలు పట్టణాలకే పరిమితం కాకూడదని ,పల్లెలకు విస్తరింపజేసిన ముందు చూపు వారిది .కావాల్సిన యంత్రాలన్నిటిని  విదేశాలనుంచి తెప్పించారు .వెలగ పూడి రామ కృష్ణ గారి సలహా లతో ముందడుగు వేశారు .రామ కృష్ణ గారితో కలిసి అమెరికా ,జపాన్,యూరప్ దేశాలను సందర్శించి అవసరమైన పరిజ్ఞానాన్ని పొందారు .అక్కడి పరిశ్రమల పని తీరును పరిశీలించారు . 600 టన్నుల సామర్ధ్యం తో ప్రారంభమైన షుగర్ ఫ్యాక్టరీ ,నేడు 6000  టన్నుల సామర్ధ్యానికి చేరటం వారి నిరంతర కృషి ఫలితమే .
         శ్రీ ప్రసాద్ ఫాఫ్సి ప్రెసిడెంట్ గా పని చేశారు .వాణిజ్య రంగ విస్తరణకు దారులు చూపారు .ఆయన సంస్థలలో ఉద్యోగులను తన స్వంత కుటుంబ సభ్యులను గా చూడటం గొప్ప విశేషం .ఖద్దరు  దుస్తులేధరించే వారు .పంచె ,లాల్చి ఖండువా  ధరిస్తారు .ముఖం మీద నిలువు బొట్టు తీర్చిదిద్ది  నట్లుంటుంది .కోటేరు తీసిన ముక్కు వారి ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని పిస్తుంది .యెంత గొప్ప పారిశ్రామిక వేత్త గా గుర్తింపు పొందినా  విలువలను అతి భద్రం గా కాపాడారు .సాధారణమైన ,హుందా అయిన జీవితాన్నే జీవించారు .వ్యవసాయం ఆధారం గా పరిశ్రమలు విస్తరించాలి అని వారి తాపత్రయం .సాటి పారిశ్రామిక వేత్తలు ఆయన్ను” భీష్మా చార్యులు ”గా గౌరవించే వారు .                             విద్యా రంగ వికాసానికీ ముళ్ళపూడి విశేష కృషి చేశారు .తణుకు లో polytechnic కళాశాల స్థాపించి వేలాది విద్యార్ధుల బంగారుభవిష్యత్తు   కు బాట వేశారు .ఆ కళాశాల అంటే ఆంద్ర దేశం లో గొప్ప పేరు .అక్కడ సీట్ రావటం మామూలు విషయం కాదు .అంతా పకడ్బంది నియమాలు .అక్కడ చదివి పాస్స్ అయితె ఎక్కడైనా కళ్ళకు అద్దు కోని ఉద్యోగం ఇచ్చేవారు .అక్కడి శిక్షణ కు గొప్ప పేరుండేది .సమర్ధులైన  అధ్యాపకులుండే వారు .కాకినాడ లో రంగ రాయ మెడికల్ కాలేజీ స్థాపనకు హరిశ్చంద్ర ప్రసాద్ విశేష కృషి సలిపారు .
          మెక్షికొ లో జరిగిన అంతర్జాతీయ షుగర్ industry సదస్సులో పాల్గొన్న ఘనత వారిది .ఆయనకు బెస్ట్ management అవార్డ్ వచ్చింది .ఉత్తమ పరిశోధనా పురస్కారం వారిని వరించింది .  నాగార్జున విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ నిచ్చింది .”చక్కర కళా ప్రపూర్ణ ”బిరుదును అనకా పల్లి చెరుకు పరిశోధనా సంస్థ ప్రదానం చేసింది .తణుకు లో అన్ని వసతులతో 172  పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు వైద్యాన్ని అందు బాటు లోకి తెచ్చారు .అక్కడే మంచి గ్రంధాలయమూ,నెలకొల్పారు .
           శ్రీ ప్రసాద్ రాజకీయాలలోనూ రాణించారు .తొమ్మిదేళ్ళు ఆంధ్రా కాంగ్రెస్ పార్టి సభ్యులుగా వున్నారు .1952 -55 కాలమ్ లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో విధాన మండలి సభ్యులు గా వున్నారు .రెండు సార్లు తణుకు నుంచి శాసన సభకు సభ్యుడు గా ఎన్నికయారు .అయిదేళ్ళు తణుకు మునిసిపల్ చైర్మన్ గా పని చేశారు .నందమూరి తారక రామా రావు ముఖ్య మంత్రి గా వున్నపుడు ఆయన ఆన్తరంగికులలో ఒకరు గా మెలిగారు .ఆంద్ర జ్యోతి పత్రికకు కొంత కాలమ్ డైరెక్టర్ గా వున్నారు . ఇన్ని రకాల సేవలందించి ,పారిశ్రామిక రంగ పురోగతికి సాక్షీభూతుడై ,”,పరిశ్రమల పితామహుడు ”గా పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ ప్రసాద్ చదువుకొన్నది ఎస్.ఎస్.ఎల్.సి .మాత్రమే నని తెలిస్తే ఆశ్చర్య పోతాం .
                           మీ  –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -09 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.