సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం

   సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్చవం
                   ఈ రోజూమాజీ  రాష్ట్రపతి ,జగద్విఖ్యాత మహా తత్వ వేత్త  రాజనీతిజ్ఞుడు ,ఆదర్శ ఆచార్యుడు ,విశిష్ట దౌత్య వేత్త  -సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 129  వ జయంతి .దీనినే భారత దేశం ”గురుపూజోత్చావం ”గా జరుపుకొంటూ ,ఆ మహనీయుని కి కృతజ్ఞతలను తెలుపుతోంది ”.Platonoc kingdom ”కు రాజైన రాష్ట్ర పతి ఆయన .సర్వ మత రహస్యాలను ఆకళింపు చేసికొనిన వ్యక్తిత్వం .మనసును వశ పరచుకొనే ,మూర్తిమత్వం భారతీయత ఉట్టిపడే స్వచ్చమైన సాంప్రదాయక  వస్త్ర   దారణ ,సంభాషణ ,సర్వ వేదాంత రహస్యాలు నాలుక చివర వుండే అత్యంత మేధో సంపత్తి వారిది .వారి సంభాషణం గంగానదీ ప్రవాహమే .మహా నియంత ,రష్యా అధినేత స్టాలిన్ హృదయాన్ని దోచుకొన్న మనీషి .తాను చేసిన తప్పులను రాదా కృష్ణన్ ఎదుట ఒప్పుకొని ,ఆ నియంత పశ్చాత్తాప పడ్డాడంటే ,ఆయన వ్యక్తిత్వం యెంత గొప్పదో తెలుస్తోంది .”ప్రొఫెసర్ ”అని స్టాలిన్ వీరిని గౌరవం గా పిలిచే వాడు .”త్వరలోనే తత్వ వేత్తలు రాజ్యాధి కారులు అవుతారు ”అని ఆయన తో చెప్పి భవిష్యత్తును ఊహించాడు స్టాలిన్ . .
               రాదా కృష్ణన్ వాగ్ధాటి అమోఘం .బ్బ్రిటిష్ ప్రధాని anthoni eden  రాదా కృష్ణన్ వచో వైభవం స్వయం చూసి ”మా దేశం లో రాదా కృష్ణన్ లాగా ఆంగ్లం లో అనర్గళం గా మాట్లాడే వారు ఒకరో ,ఇద్దరో వుంటారు ..దున్నిన నాగేటి చాలులో చెంగు చెంగున ఎగిరే కుందేలు పిల్ల లా ఆయన మాట్లాడుతుంటే ,కాళ్ళు తడ బడే పసిపిల్ల   వాడిలా వుంది నా పరిస్థితి”అని నిర్మోహ మాటం గా చెప్పి సర్వేపల్లి వాక్ చాతుర్యాన్ని మెచ్చాడు .రాజ్యసభలో ఆయన ఇచ్చినరూలింగ్స్   అన్నీ ఆదర్శ ప్రాయమైనవే నని విజ్ఞుల అభిప్రాయం .ఆయన అనే వారు ”సంప్రదాయాన్ని విచ్చిన్నం చేస్తే ఇక ముందు అంతా. విచ్చిన్నమే సాంప్రదాయం అవుతుంది ”.
ఆయన లో హాస్య ప్రియత్వం బాగా వుండేది .ఒకసారి భూపేష్ గుప్తా అనే కమ్యునిస్ట్ సభ్యుడు ”ఒక సమయోచిత ప్రశ్న వేస్తాను ”అన్నాడట .దానికి రాధాకృష్ణన్ ”మొదటి సారిగా సమయోచిత ప్రశ్న వేస్తున్నారట వినండి ”అని చమత్కరించారు .యోగ విద్య పై సభలో అంతా మాట్లాడుతుంటే ”ఒక అరగంట మాట్లాడ కుండా వుంటే అదే యోగం ”అని చురక వేశారు .ఒక సారి ప్రధాని నెహ్రు లోక్ సభలో మాత్రమే ఆమోదించబడిన బిలును”పార్లమెంట్ ఆమోదించింది ”అన్నాడు .వెంటనే సర్వేపల్లి ”’పండిత్జీ    !పార్లమెంట్ అంటే లోక్సభా ,రాజ్య సభ కలిసి”అనిఅనగానే  నాలిక కరచుకొని నవ్వేశాడు పండిట్ నెహ్రు .ఉపరాష్ట్రపతి రాజ్య సభ చైర్మన్ గా వ్యవహరిస్తారని మనకు తెలుసు కదా .
              గాంధీ జి కి సర్వేపల్లి   అంటే గురుభావం .ఆయనకు ఈయనంటే విపరీతమైన అభిమానం .తాను భగవద్గీతకు వ్యాఖ్యానం రాసి గాంధిగారికి  అంకితం ఇచ్చారు .అప్పుడు మహాత్ముడు ”నేను మీ అర్జునున్ని .మీరు నా శ్రీ కృష్ణులు ”అన్నారు .ఒకసారి గాంధీని కూడాఆట  పట్టించారు .”ఆవు పాలు తాగటం అంటే మాంసం తినటమే”అన్నాడు గాంధి ఒక సందర్భం లో .ప్రక్కనే వున్న రాదా కృష్ణ పండితుడు ”అయితె తల్లి పాలు తాగిన వాడు నర మాంసం తిన్నట్లేనా “”?అని చమత్కరిస్తే బోసి నవ్వుల బాపు కూడా ముసి ముసి నవ్వులు నవ్వాడట .
             సర్వే పల్లి ఇతరులతోసంభాశిస్తుంటే   ఒక్కొక్క సారి ”మౌన వ్యాఖ్యాన దక్షిణా మూర్తి ‘లాగా ,ఇంకొక సారి ,నిమిషానికి రెండొందల పదాల వేగం గా ,ఎక్కడా తడబాటు లేకుండా ,వియద్గంగా ప్రవాహం గా వుంటుంది .మంచి ఉదాత్త ,అనుదాత్తాలతో ,భావ సంజ్న లతో మహా వేగం గా జాలు వారుతుంది .బ్రిటిష్ మేధావులు ,మహా వక్తలు ,తత్వ వేత్తలు ,ఆయన వేదాంత సంభాషణా గరిమకు ముగ్ధులై తాముమళ్ళీఆ ప్లేటో ,అరిస్టాటిల్ కాలమ్ లో వున్నామా అని సంభ్రమం ప్రకటించే వారట .అందుకే వారు ”The return of Plato ”అని సగౌరవం గా భావించే వారు .విజ్ఞాన ఖని ,మేధో నిధి ,రాదా కృష్ణన్ .”Radha krishnan  fought true war of independence at the academic flora of the rulers ”.అని కీర్తింప బడిన చాతుర్యం సర్వే పల్లి పండితునిది  .
        శాస్త్ర ,మత ,వేదాంతాల త్రివేణీ సంగమమే సర్వే పల్లి పండితుడు .భినత్వం లో ఏకత్వ దర్శన ఆయన అభిమతం . అప్పటి దాకా భిన్న దృక్పదాలతో వున్న సైన్సు కు ,మతానికి చక్కని స్నేహ సేతువును నిర్మించిన ఘనత ఆయనది .ఒక సారి ఆయన్ను నోబెల్ బహుమతికి  nominate చేయటానికి అంగీకారం తెలియ జేయమని కోరారు .అప్పుడు ఆ మహా తత్వ వేత్త”Do you want to buy peace (shanti ),I hold dear,in exchange for the profits from the sale of an ingrediant for weapons of destruction ”?అని నిర్మోహ మాటం గా తిరస్కరించిన ఉత్తమ సంస్కారి .
    వినయమే ఆయన భూషణం .విద్యార్ధులకు ఆయన ఇచ్చిన సందేశం ”The  philosopher;s laboratory   is life as it lived and the product of the work in it ,is the marga pointing to the goal of oneness ” .వసుధైక   కుటుమ్బాకం అనేది ఆయనకు నచ్చిన భావం .ఆయన రాష్ట్ర పతి గా వున్న కాలమ్ లో రాష్ట్రపతి భవనం ఒక దేవాలయం గా వుండేది .దేశ విదేశాలనుంచి mahonnatulu,తత్వ వేత్తలు ,జ్ఞానులు వారిని సందర్శించి ప్రభా  వితులవుతూండే వారు . అత్యున్నత విలువలకు ప్రాధాన్యత నిచ్చిన మహోన్నత వ్యక్తీ రాదా కృష్ణన్ .మన తెలుగు వాడు అని గర్వ పడే వాళ్ళం .ఆయన పాలనను ” he established the precedent of independent action by the president disowning the dummification of the post ”.అని గర్వం గా చెప్పుకొనే వారు .రబ్బర్ స్టాంప్ ప్రసిడెంట్ గా ఆయన వ్యవహరించలేదు .ఆ స్థానానికి విలువ ,పేరు ,హుందా ను తెచ్చారు .ఆయన కాలమ్ లో చాలా సార్లు ప్రదానికీ  ,కాబినెట్ మంత్రులకు ,రాష్ట్ర పతికి వున్న విశేష అధికారాన్ని ,తుది మాట రాష్ట్ర పతిదే ననిగుర్తు చేస్తూ . చెప్పాల్సిన సందర్భాలు వచ్చాయి .తన విదుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధి గా నమ్మి పరిఆలించిన రాష్ట్ర పతి శ్రీ సర్వే పల్లి రాదా కృష్ణన్ . .ఆంద్ర ప్రదేశ్ లోని చిత్తూర్జిల్లా కాళహస్తి లోయువ  ఉపాధ్యాయునిగాప్రారంభమైన ఆయన జీవితం సర్వోత్క్రుస్త రాష్ట్ర పతి పదవి తో పరిపూర్ణమై ,ఆదర్శ వంతమై శ్రేష్టమై పూజనీయమైంది . వారి జన్మ దిన మైన ఈ రోజూ న గురు పూజోత్చావ సందర్భం గా  ఉపాధ్యాయులందరికి శుభా కాంక్షలు .సర్వే పల్లి సర్వ ఉత్కృష్ట  జీవితం అందరికి ఆదర్శ ప్రాయం కావాలని ,ఈ దేశ భవిష్యత్తును తీర్చి దిద్దే గురుతర బాధ్యత వారిపైన వుందని గుర్తు చేస్తూ –సెలవ్ —
               మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –05 -09 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.