హైకూలు
01 -పది రోజులు రోడ్డు మీద
రక్తమే కాని, మంచినీటి వాసన
ఆశ ఎండ మావియా ?
02 -అస్థవ్యస్థత అవహేళన నుంచి
రాజీ నాగరికం
రెండూ ఎక్కడున్నవి అక్కడే
03 -ప్రతి తరం
నాగరికతను నేర్చుకొంటుంది
లేకుంటే అందనంత ఎత్తున వుంటుంది
04 -అసలైన వాళ్ళు వదిలేసి వెళ్ళారు
వేలాది ఏళ్ళు గడిచి పోయాయి
వారి జన్యు సంపద వెనుదిరిగింది
05 -అంతులేని నరకులాట
తోచిన విధం గా పొగడ్తలు
చరిత్ర-అంతా బుకాయింపే
06 -అశ్లీలం,అవాస్తకత
విధి బాధిత చిన్నారులు
నెత్తుటితో తడిసిన చీలిక పేలికలు
07 -జాగ్రత్తగా మనం ఏడుస్తాం
గడిచిన గాధల ఆనవాళ్ళు
ఆశ ,ప్రేమ ఇక్కడే నిలిచి పోయాయి
08 -కామం ఇంద్రియాన్ని పట్టుకొంటుంది
సత్యాన్వేషణ లో శరీరగతమవుతుంది
వాటి అన్వేషణ అనంతం
09 -వాగ్దానాల వర్షం
శీఘ్రం గా తొందర్లోనే మరుపు
అయినా వాటినే పట్టుకు వేలాడటం
10 -చిన్న నా పగిలిన గుండె
నవ్వు పుట్టిస్తుంది విపరీతం గా
సూర్య కాంతి కీచు ధ్వని
ఈ హైకూలను ”hyku-you ”పేరిట ”Cindy Rosecrance అనే ఆమె రాసింది .ఆమె midwest లో montana నివాసి .నిజాన్ని నిర్భయం గా చురుక్కుమనేట్లు చెప్పే చేవ వుందామెకు .యుద్ధం ,స్నేహం ,ప్రేమ ,మరణాల పై భావాత్మక రచనలు …చేసిన మంచి రచయిత్రి .ఈమె కవితల్లో నవ్వు పుట్టించే తప్పుల తడక విషయాలే కాక దుఃఖ భారాన్ని కల్గించే విషాదమూ ఉంటుంది .అన్ని సహజ నిజాలే .
నాకు తోచిన రీతిలో వీటిని అనువదించి అందిస్తున్నాను .సూచనలుంటే తెలియ జేయండి .ఆ రచయిత్రిని పరిచయం చేయటానికే నేను చేసిన ప్రయత్నం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —16 -09 -11 .
baaagundi