పద్మ ప్రాభ్రుతకం భాణం –లో అలంకార సంపద –1
శూద్రక మహా కవి సంస్కృతం లో ”మ్రుత్చాకటికం ”(మట్టి బండి )అనే నాటకం రాశాడు .అది చాలా ప్రసిద్ధమైనది .అదే తెలుగులో ”వసంత సేన ”అనే సినిమా గా వచ్చింది .ఆ నాటకం లో వసంతసేన అనే వేశ్య పాత్రను అత్యద్భుతం గా తీర్చి దిద్దాడు .మన గురజాడ వారి ”కన్యాశుల్కం ”నాటకం లోని మధురవాణి నిని వసంతసేన తో పోలుస్తారు .ఆ శోద్రక మహా కవే ”పద్మ ప్రాభ్రుతకం అంటే ”తామర పువ్వు కానుక ”అనే భాణం కూడా రాశాడు .అన్ని భాణాల లో అది చాలా విశిష్ట మైంది .ఈ కవి క్రీస్తు పూర్వం రెండువందల ఏళ్ళ నాటి కవి .ఇంతకీ భాణం అంటే ఏమిటో తెలుసు కుందాం .సంస్కృత నాటకాలలో కధానాయకుడు పురాణపురుషుడు కాని ,ఉదాత్తపురుషుడు కాని అయి ఉంటాడు .అయితే రూపకం అనే పిలువబడే ప్రకరణం ,ప్రహసనం ,వీధీ ,భాణం లలో కధానాయకుడు మధ్యతరగతి వాడు.విషయం కూడా మధ్యతరగతికి చెందినది అయి వుంటుంది .సాంఘిక ఇతివృత్తం అన్న మాట భాణం లో ఒకే ఒక పాత్ర రంగస్థలం మీద కన్పిస్తుంది ..ఇతడే విటుడు .కదాఆయకుడు కాదు .కాని ,నాయకునికి ,నాయికకు మిత్రుడు ,సచివుడు లాంటి వాడు .ధూర్తుడు అని ముద్ర పడ్డ వాడు .శతుడు (shathudu ).కళా శాస్త్ర ప్రావీణ్యం వున్న వేశ్యాలోలుడు .అందచందాలున్న కొత్త నాయికలను ప్రేమించి,ప్రేమిమ్పజేసుకొనే వాడు .వీడినే ధీరలలితుడు అంటారు .ఇతని ప్రేయసిలందరూ సామాన్యలె .ఒకరకం గా చెప్పాలంటే ఈ విటుడు ఇవాల్టి మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అనిపిస్తాడు .అన్నిపాత్రల సంభాషణల్ని ,తన గొంతులో పలికించే నేర్పున్న వాడు .దీన్నే ”స్వర వ్యంజనం ”అంటారు .కనుక విటుడి అనుభవానికి హద్దులు వుండవు .రెచ్చిపోవటానికి హద్దులు లేని అవకాశాలు .అభినయానికి పుష్కలం గా సామగ్రి వుంటుంది .పరిమితి లేని నటన తో పండించ గలడు .శృంగారం పుష్కలం .ఆ రోజుల్లో భాణం ప్రక్రియ అందర్నీ ఆకర్షించింది,ఆహ్లాద పరిచేది .దీనిలో రసం కంటే రసాభాసం ఎక్కువ .రసాస్వాదన లో దగ్గరదారి ”భాణం ”అని విమర్శకుల అభిప్రాయం .భాణం లో సమకాలీన సాంఘిక జీవనం ప్రతిఫలించడం విశేషం .
ఆకాలానికి ఆధునికం గా మొదట రూపకం గా ”ధూర్త విట సంవాదం ”అనే భానాన్ని ఈశ్వర దత్తు అనే కవి సంస్కృతం లో రాశాడు .రెండవ భాణం వరరుచి కవి రాసిన ‘ఉభయాభి సారిక ‘
మూడవది శూద్రక కవి రాసిన ”పద్మ ప్రాభ్రుతక మ్ ”.నాల్గవ భాణంఈశ్వరదట్టు కుమారుడు సౌమిల్లకుడు రాసిన ‘పాద తాదితం ‘;.ఈ నాలుగింటినీ కలిపి ”చతుర్భాని ”అంటారు వీటిని తెలుగు లోకి ”ఆంద్ర చతుర్భాని ‘గా తేట తెల్లం గా ,కవిహృదయ విశ్లేశకం గా అనువదించిన వారు ప్రముఖ వాగ్గేయ కారులు ,ఆకాశవాణి పూర్వ సంచాలకులు ,కళాప్రపూర్ణ .శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .ఇవి ఆకాశవాణి ద్వారా ప్రసారం కూడా అయాయి .రసికజనులను అలరించాయి .వీటిలో శూద్రక మహ్హకవి రాసిన భాణం పద్మ ప్రాభ్రుతకం (తామరపువ్వు కానుక )లో మెరిసిన అలంకార సంపదనన్నెంతో ఆకర్షించింది .ఆ సంపదను నేను మాత్రమే అనుభవించే సంకుచిత బుద్ధి నాకు లేదు .కనుక ఆ సంపదను మీకూ పంచి ,నేనూ ఆనందాన్ని పొందుతున్నాను .అక్కడకడ పండిన మధుర హాస్యాన్ని అందిస్తున్నాను .
సంవత్చరం అనే విలాస పురుషుడికి చలికాలపు ముసలితనం లో సర్వమూ వుడిగిపోయాయత .అయితేనేమి హిమరసాయనం సేవించటం వల్ల మళ్ళీ వసంత కిశోరత్వం (చిన్న తనం )వచ్చిందట .రుతుపరం గా సంవత్చారాన్ని అద్భుతం గా ఆవిష్కరించాడు ఆలన్కారికం గా శూద్రక మహా కవి .అప్పుడున్న వసంత శోభ ఎలా వుందో తెలియజేస్తున్నాడు చూడండి .చివర్లు అలల్లాడుతుంటే చెట్లు నృత్యం చేస్తున్నట్లుందట .దానితో తీగలు ,పూలు పూసి యవ్వనాన్ని పొందాయత .తిలకం అనే చెట్టు శిరస్సు పై వున్న కోయిల కొత్తముడి గా ఉందట .కుందపుశ్పం మీద కూర్చున్న తుమ్మెద అందమైన స్త్రీ చూపు లాగా ఉందట .ఆకుపచ్చని తామర మొగ్గ అప్పుడే తల ఊపే కన్నె పిల్ల లాగా ఉందట .ఆమని (వసంతం )అనే కోడె (యువకుడు )గాలి వీస్తుంటే వలపు చెలగాటం లో అలసి చెమర్చిన జవరాలి (యవ్వనం లో వున్న )స్థనాల స్పర్శ సుఖం లాగా ఉందట .
ఇంకో చోట ”దేవదత్త తో సాంగత్యం అనే మధుపానికి (తుమ్మెద )పక్కనంజుడు కూరలాంటిది దానిచెల్లెలి పొత్తు ”అంటాడు .ఆ పరిసరాలు ,ఆ తాగుడు ,చీకుల నంజుడు భాషలో .వేరొక చోట ”మదనజ్వరం తేలికగా కనబడుతున్నా ,మహాచేడ్డబలమైనది అంటాడు .ఉజ్జయినీ నగరవైభావం చాలా కొత్తభాషలో చెప్పాడు .”వసుంధర (భూమి )అనే వధువుకి జంబూద్వీపం వదన కపోలం (చెక్కిలి )అయితే దానిమీద చిత్రలేఖనం గా అనిపించే అవంతి సుందరి ఈ ఉజ్జయిని అపర లక్ష్మీదేవి లా విరాజిల్లుతోంది .చాలా గొప్ప ఆవిష్కరణ ఇది .అలాగే అర్ధవంతమైన మాటల సంభాషానాన్ని ‘సరస్వతీ లతకు పూసిన వాక్ పుష్పాలు ”అనటం శూద్రక మహాకవికే చెల్లింది .
మరిన్ని విశేషాలు మరోసారి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —19 -10 -11 .